చిత్రం: స్వయంవరం (1999) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: భువనచంద్ర (All) నటీనటులు: వేణు తొట్టెంపూడి, లయ దర్శకత్వం: కె.విజయ భాస్కర్ నిర్మాత: వెంకట శ్యామ్ ప్రసాద్ విడుదల తేది: 22.04.1999
Songs List:
కీరవాణి రాగంలో పాట సాహిత్యం
చిత్రం: స్వయంవరం (1999) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: భువనచంద్ర గానం: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఉహాలతో వనికిందొక అధరం గాలిలోన తేలిపోవు రాజహంసవు నీవంటా నిన్ను తాకి పొంగిపోవు నీలి మబ్బుని నేనంటా వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా మెరుపులా మైమరుపులా జత చేరగా రావా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఉహాలతో వనికిందొక అధరం మంచువెన్నెల స్నానమాడిన మల్లె పందిరిలో వలపు వాకిట వేచి నిలిచిన వయసు పల్లకిలో ఏకాంత సేవకు ఉర్రూతలూగిన శృంగార శిల్పానివా కళ్యాణ రాముని కౌగిట్లో వదిగిన బంగారు పుష్పానివా పంచుకో ప్రియతమా ప్రేమనే ప్రేమగా తీయగా తీయ తీయగా తమకానివై ప్రేమా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఉహాలతో వనికిందొక అధరం కదనసీమకు కాలు దువ్విన గడుసు మన్మధుడా కౌగిలింతల కాటువేయకు చిలిపి చందురుడా వేవేల సొగసులు వెచ్చంగ పొదిగిన వయ్యారి ముందుండగా మందార పెదవుల గంధాలు తీయక అయ్యారే ఉండేదెలా అందుకో అధరమే హాయిగా ఏకమై ఘాటుగా అలవాటుగా తెరచాటుగా భామా కీరవాణి రాగంలో - పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఉహాలతో - వనికిందొక అధరం గాలిలోన తేలిపోవు - రాజహంసవు నీవంటా నిన్ను తాకి పొంగిపోవు - నీలి మబ్బుని నేనంటా వానలా వచ్చి వరదలా పొంగు - ప్రేమవే నీవా మెరుపులా మైమరుపులా - జత చేరగా రావా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఉహాలతో వనికిందొక అధరం
వినవె చెలి పాట సాహిత్యం
చిత్రం: స్వయంవరం (1999) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: భువనచంద్ర గానం: సోను నిగమ్, బి.అరుందతి వినవె చెలి
పికాసో చిత్రమా పాట సాహిత్యం
చిత్రం: స్వయంవరం (1999) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్ నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్ పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామా నీ నీలి కురుల కిరణాలు సోకి వసి వాడె చందమామ ఏ దివ్య వరమో అది నీ కంఠస్వరమై ఏ వింటి శరమో అది నీ కంటి వశమై అంగాంగాన శృంగారాన్ని సింగారించగా అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించదా ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామణి ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాలా నీ కులుకు చూసి నా గుండెలోన రగిలిందే విరహా జ్వాలా నీ చూపు తగిలి ఇక నేనుండగలనా నా బాధ తెలిసి జత రావేమె లలనా నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా నీలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించనా ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగా లోకాలన్ని నిన్నూ నన్ను దీవించేయవా ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే నిండు జాబిలి నీ కౌగిళి లేక తీరేదెట్టా తీపి ఆకలి పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్ నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్ పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
మరల తెలుపన పాట సాహిత్యం
చిత్రం: స్వయంవరం (1999) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: భువనచంద్ర గానం: చిత్ర మరల తెలుపన ప్రియ..మరల తెలుపన మరల తెలుపన ప్రియ..మరల తెలుపన ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని కనుపాపులో నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని మరల తెలుపన ప్రియ..మరల తెలుపన విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని ఆణువణువూ అల్లుకున్న అంతు లేని విరహాలని ఆణువణువూ అల్లుకున్న అంతు లేని విరహాలని నిదుర పోనీ కన్నులలో పవళించు ఆశలని చెప్పలేక చేత కాక మనసు పడే తడబాటుని మరల తెలుపన ప్రియ..మరల తెలుపన నిన్న లేని భావమేదో కనులు తెరిచి కలయ చూసి నిన్న లేని భావమేదో కనులు తెరిచి కలయ చూసి మాట రాని మౌనమేదో పెదవి మీద ఒదిగి పోయే మాట రాని మౌనమేదో పెదవి మీద ఒదిగి పోయే ఒక క్షణమే ఆవేదన మరు క్షణమే ఆరాధన తెలియ రాక తెలుప లేక మనసు పడే మధుర భాద మరల తెలుపన ప్రియ..మరల తెలుపన మరల తెలుపన ప్రియ..మరల తెలుపన
పెళ్లి చేసుకోరా పాట సాహిత్యం
చిత్రం: స్వయంవరం (1999) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: భువనచంద్ర గానం: మనో పెళ్లి చేసుకోరా
ఎరరారోయ్ పాట సాహిత్యం
చిత్రం: స్వయంవరం (1999) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: భువనచంద్ర గానం: సురేష్ పీటర్స్ ఎరరారోయ్