Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Teen Maar (2011)





చిత్రం: తీన్‌మార్ (2011)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: పవన్ కళ్యాణ్ , త్రిష , కృతి కర్బంద
దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ
నిర్మాత: బండ్ల గణేష్
విడుదల తేది: 14.04.2011



Songs List:



ఆలె బాలే ఆలె బాలే తీన్‌మారేలే పాట సాహిత్యం

 
చిత్రం: తీన్‌మార్ (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: హేమచంద్ర, శ్రావణభార్గవి

ఆలె బాలే ఆలె బాలే తీన్‌మారేలే
ఆలె బాలే ఆలె బాలే ధూమ్‌ధామేలే
అర్థంలేని పరదాలు పీకి పారేద్దాం
పీకల్లోతు ఫ్రీడమ్‌లో మునిగి తేలేద్దాం
గుండెలోపలి భారం ఇవ్వాళ దించుకుందాం
కళ్లగంతలు తీసి కొత్తలోకం చూద్దాం
ఎందుకీ మొహమాటం చాలు చాలు అందాం
హాయి దారుల్లో సాగిపోదాం
మనలా మనమున్న చోట సంతోషమంతా శివతాండవాడుతుందే


ఆలె బాలే ఆలె బాలే దుమ్ము రేపాలే
ఆలె బాలే ఆలె బాలే కెవ్వు కేకేలే
ఈగోలన్నీ స్విచ్ఛాఫ్ చేసి పెట్టేద్దాం
సంతోషాలే గుప్పిట్లో పట్టి దాచేద్దాం
గూగుల్ అంతా వెతికి సరదాల జాడ పడదాం
అల్లరల్లరి చేసి యూట్యూబ్‌లోన పెడదాం
రెండు మనసుల ఫీలింగ్సు ప్రింటు తీసుకుందాం
దాచుకోకుండా ఓపెనైపోదాం
మన ఇద్దరి మధ్యనున్న పంతాల అడ్డుగోడల్ని పగలకొడదాం


ఆలె బాలే ఆలె బాలే పిచ్చ హ్యాపీలే
ఆలె బాలే ఆలె బాలే రచ్చరచ్చేలే
చూసేవాళ్లు ఈ జాతరేంటనడగాలే
నవ్వేవాళ్లు మరి నవ్వుకున్న ఫరవాలే
నచ్చినట్టే ఉందాం ఇక తోచినట్టే చేద్దాం
వేల ఆనందాలు సంచుల్లో నింపుకుందాం
స్పీడు మీద ఉన్నాం ఎవడాపుతాడో చూద్దాం
దారికడ్డొస్తే లాగి తన్నేద్దాం
మనలా ఎవరుండలేరు అని వల్లకాదు
అని బల్లగుద్ది చెబుదాం



బార్బీ బొమ్మకి చెల్లెలివా పాట సాహిత్యం

 
చిత్రం: తీన్‌మార్ (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: బెన్నీ దయాల్ , సుచిత్ర

ఓహో బస్తీదొరసానీ మస్తుగా ముస్తాబయ్యింది
గుండె చిటపట మంటూ నీకే డయలే చేసిందే 

వారేవా ధీరుడు నువ్వేరా
బలారేవీరుడు నువ్వేరా
చూపుల్తోనే చున్నినే లగే జాదూ నువ్వేరా

బార్బీ బొమ్మకి చెల్లెలివా 
బాబోయ్ ప్రపంచ సుందరివా
బాడీ మూడు రేపి బంతాటే అడుతున్నదే
బాడీ మూడు రేపి బంతాటే అడుతున్నదే

వారేవా బస్తీ దొరసాని 
థోడా ముస్తాబయ్యింది 
గుండె చిటపట మంటూ నీకే డయలే చేసిందే 

బార్బీ బొమ్మకి చెల్లెలివా 
బాబోయ్ ప్రపంచ సుందరివా
బాడీ మూడు రేపి బంతాటే అడుతున్నదే

కోరుకున్నవి చేయిదాటిపోతే వెళ్ళిపోనిలే 
బాధ పడ్డం బెంగ పడిపోవడం మనకి రాదసలే
మగాడ నచ్చిన మొనగాడ నీకాడ ఏదో ఉన్నదిరా 
చూపుల్తోనే చున్నినే లాగే జాదూ నువ్వేరా
నాకు నచ్చినవి ఎక్కడెక్కడున్న వాలిపోతాలే
కింద పడ్డం లేచి దూసుకెళ్లడం మనకి మాములే 
ఎదిగిన బంగరు బాతురా ఇది నీకే దొరికెన రా 

వారేవా బస్తీ దొరసాని 
థోడా ముస్తాబయ్యింది 
గుండె చిటపట మంటూ నీకే డయలే చేసిందే 

గోకులంలో లేని సీత కోసం గోల మనకేలా 
కన్ను కొడితే రాధాలెంత మందో ట్రెండ్ మారిందే

వారేవా మాయా మసిన్చద్ర 
నీలో ఆ పొగరే నచ్చింద్ర 
నిన్నే చూసి బోడీలోనే బ్లాస్టింగ్ అవుతుందిరా
వెళ్ళిపోయిన రైలు బండి కోసం వేచి చూడాలా 
ఈల కొడితే మిస్సు బస్సులెన్నో  క్యూలె కడతాయే
పిట పిట బాటిల్ నేనురా ఎత్తేయ్ తొందరగా 

వారేవా బస్తీ దొరసాని 
థోడా ముస్తాబయ్యింది 
గుండె చిటపట మంటూ నీకే డయలే చేసిందే 




చిగురు బోణియ పాట సాహిత్యం

 
చిత్రం: తీన్‌మార్ (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: విశ్వా
గానం: విశ్వా

చిగురు బోణియ వలపు తేనియ జింకలేయు 
చొక్కరీలు తస్సదీయా 
మెరుపు మారియా తుళ్లేటి తానియా లల్లీ లకుముకులన్నీ మోగె మామామీయా
జలుగు జూలియా చెంగావి చెల్సియా చొరవ చూపి చేరువైతే చాంగు ఛెయ్య
సృజన సింథియ జులాయొలీవియా 
కళ్ళతోటి గిల్లు కూడా సో కు లవ్యా
దిట్టంగా పట్టేయ్ నా గుట్టంతా కొట్టేయ్ 
నా చుట్టంలా జట్టేయ్ బేబీ 
చేజిక్కి నా చుంబీన షాంపేనూ పొంగిన తెైతక్క రింగీల బేబీ
మగువ మారియా రిహన రోసియా చింగు ఛాంగు జింగు బ్యాంగు చిందులెయ్య

సుహన సిసీలియా బహన బూలియా సడేమీయా హడావిడికి తాళమేయ




గెలుపు తలుపులే పాట సాహిత్యం

 
చిత్రం: తీన్‌మార్ (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రెహమాన్
గానం: శ్రీరామచంద్ర

గెలుపు తలుపులే తీసే ఆకాశమే 
నేడు నాకోసమే
అడుగు మెరుపులా మారే ఆనందమే వీడదీబంధమే
ఎటువైపుకు వెళుతున్నా వెలుగుల్నే చూస్తున్నా
మెరిసావే రంగుల్లోనా
కలతీరే సమయాన అల నేనై లేస్తున్నా 
అనుకుందే చేసేస్తున్నా
దారులన్ని  నాతో పాటుగా 
ఊయలూగి పాటేపాడగా 
నను వీడి కదలదు కాల మొక క్షణమైనా 

గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నాకోసమే

ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే 
ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరెలే 
సందేహమేది లేదుగా 
సంతోషమంత నాదిగా
చుక్కల్లో చేరి చూపగా
ఉప్పొంగుతున్న హోరుగా 
చిందేసి పాదమాడగా 
దిక్కుల్ని మీటి వీణగా
చలరేగి కదిలెను గాలి తరగలె పైన 

గెలుపు తలుపులే తీసే ఆకాశమే
నేడు నాకోసమే

అలుపేరాదు అంటూ కొలిచా నింగి అంచులనే 
జగమే ఏలుకుంటూ పరిచా కోటికాంతులే 
ఇవ్వాళ గుండెలో ఇలా 
చల్లారిపోని శ్వాసలా 
కమ్మేసుకుంది నీ కల 
ఇన్నాళ్ళు లేని లోటులా 
తెల్లారిపోని రేయిలా 
నన్నళ్లుకుంటే నువ్విలా 
నను నేను గెలిచిన ఒంటరిగ నిలిచానే 

గెలుపు తలుపులే తీసే ఆకాశమే
నేడు నాకోసమే




శ్రీ గంగా నీలాంటి పాట సాహిత్యం

 
చిత్రం: తీన్‌మార్ (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
గానం: హేమచంద్ర, శ్రీవర్ధిని, బృందం

జై బోలో
శంకర మహారాజ్‌కీ
బోలో కాశీవిశ్వనాథ్‌కి
హర హర హర హర మహదేవ్ 

శ్రీ గంగా నీలాంటి మనసీయవే
జన్మంతా నీ బాట నడిపించవే
శివపూజను... శివపూజను కరుణించవే
ప్రియసేవలో తరియించు వరమియ్యవే
కాశీ వాసా సాంబశివ కాచే తండ్రి మహదేవా
పొంగే గంగే నీ చలవ కరుణకు లేదే ఏ కొదవ
మదిలో కోరిక తీరే మార్గం కావా

జై బోలో శంకర మహారాజ్‌కి
హర హర మహాదేవ్
జగమేలు శివశంకరా...
జగమేలు శివశంకరా
నువ్వుంటే మాకింక భయమేందిరా
ఎద నిండుగా నువ్వుండగా
చిరునవ్వులన్నీ మావేరా
నీ కంటిచూపు చిటికేస్తే చాలు
కలగన్న మాట నిజమైపోతదిరా

చరణం: 1
నిప్పు నీరు రెంటినీ...
నిప్పు నీరు రెంటినీ జతగా నిలిపావుగా
విడ్డూరం చూపావుగా నీ లీలతో
నెలవంకకు తోడుగా వెలుగై నువ్వుండగా
అమావాస్య లేదుగా కలలో ఇలలో
నీవే దైవం ఊపిరికి నీదే భారం ఎన్నటికీ
ఆలోచనలో నీ ఉనికి ఆశాదీపం రేపటికి
నీ దయ పొందిన పుణ్యం మాదైపోనీ

సనిపని సరి సనిపని సరి మపనిసా
సనిపని సరి సనిపని సరి మపనిసా
రిసనిస రిమ రిసనిస రిమ పనిసరి 
రిసనిస రిమ రిసనిస రిమ పనిసరి 
సరిసని దనిపమ గమనిప మగరినిసా
సరిసని దనిపమ గమనిప మగరినిసా

చరణం: 2
ఆరాధించే తొందర...
ఆరాధించే తొందర ఆగే వీల్లేదురా
మారేడై మనసుందిరా నీ ముందర
నీ చల్లని నీడలో నెలవుంటే చాలురా
అభయంగా ఇయ్యరా అడిగే ఆసరా
వీచే గాలే సాక్ష్యమట నింగి నేలే సాక్ష్యమట
ఆత్మాదేహం ఒక్కటిగా నీలా రూపం దాల్చెనట
ప్రణవం నువ్వై ప్రాణం పొందెను ప్రేమ




వయ్యారాల జాబిల్లి పాట సాహిత్యం

 
చిత్రం: తీన్‌మార్ (2011)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రెహ్మాన్
గానం: కారుణ్య

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి
గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళి పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నది వలె కదిలా నిలబడక
కలలను వదిలా నిను వెతక
వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే
అడుగే జతను అడిగినదే
అలలై తపన తడిపినదే

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి
గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళి పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నీ పరిచయమే ఓ పరవశమై
జగాలు మెరిసెనులే...
నా ఎద గుడిలో నీ అలికిడిని
పదాలు పలుకవులే...
ఆణువణువూ చెలిమి కొరకు
అడుగడుగు చెలికి గొడుగు
ఇదివరకు గుండె లయకు
తెలియదులే ఇంత పరుగు
వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే

వయ్యారాల జాబిల్లి ఓణి కట్టి
గుండెల్లోన చేరావే గంటే కొట్టి
ఆ నండూరి వారెంకి మళ్ళి పుట్టి
కవ్వింతల్లో ముంచావే కళ్ళే మీటి

నీ ప్రతి తలపు నాకొక గెలుపై
శుభాలు తొణికెనులే
నీ శృతి తెలిపే కోయిల పిలుపే
తధాస్తు పలికెనులే
గగనములా విరిసి మెరిసి
పవనములా మురిసి మురిసి
నిను కలిసే క్షణము తలచి
అలుపు అనే పదము మరచి

వయసే వరస మార్చినదే
మనసే మధువు చిలికినదే

Most Recent

Default