Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vaana (2008)




చిత్రం: వాన (2008)
సంగీతం: కమలాకర్
నటీనటులు: వినయ్ రాయ్, మీరా చోప్రా
దర్శకత్వం: యమ్.ఎస్. రాజు, శ్రీకాంత్ బుల్లా
నిర్మాత: యమ్.ఎస్. రాజు
విడుదల తేది: 15.01.2007



Songs List:



ఆకాశ గంగా పాట సాహిత్యం

 
చిత్రం: వాన (2008)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్

ఆకాశ గంగా దూకావె పెంకితనంగా ఆకాశ గంగా
జల జల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా
ఆకాశ గంగా దూకావె పెంకితనంగా ఆకాశ గంగా

కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తియ్యంగ కసిరావే
కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తియ్యంగ కసిరావే
చిటపటలాడి వెలసిన వాన
మెరుపుల దాడి కనుమరుగైనా
నా గుండె లయలో విన్నా నీ అలికిడీ...

ఆకాశ గంగా దూకావె పెంకితనంగా ఆకాశ గంగా

ఈ పూట వినకున్నా నాపాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా
ఈ పూట వినకున్నా నాపాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా
మనసుని నీతో పంపిస్తున్నా
నీ ప్రతి మలుపూ తెలుపవె అన్నా
ఆ జాడలన్నీ వెతికి నిన్ను చేరనా

ఆకాశ గంగా దూకావె పెంకితనంగాఆకాశ గంగా
జల జల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా...
ఆకాశ గంగా దూకావె పెంకితనంగా ఆకాశ గంగా




ఢోలారే ధుమారం దేఖోరే పాట సాహిత్యం

 
చిత్రం: వాన (2008)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రంజిత్

ఢోలారే ధుమారం దేఖోరే
అరే అరే అనరే బాపురే
ఝూమోరే ఝమాఝం నాచోరే
హుర్రే హుర్రే అనదా ఊపిరే
అరె పిల్లగాలి పలికిందా సన్నాయి పాటలా
అరె కళ్ళలోన కులికిందా హరివిల్లు నేడిలా
కింద మీద చూడనంటు సందడేదొ ఆగనంటు
బొంగరాల గింగిరాల చందనాలు రేగు వేళ
ఢోలారే ధుమారం దేఖోరే
అరే అరే అనరే బాపురే

మనింటిలో వేడుక విన్నంతటా హంగామా
కళ్యాణమే చూడగ ఖంగారు కలిగిద్దామా
జగాలకే చాటుగా జువ్వల్ని ఎగరేద్దామా
చుట్టాలుగా చేరగా చుక్కల్ని దిగమందామా
ఈవాళే రావాలి పగలే ఇలా
రంగేళి రేగాలి నలువైపులా
నింగి నేల ఏకమైన రంగ రంగ వైభవాన
ఛంగు ఛంగు ఛంగుమంటు చిందులాట సాగువేళ

ఢోలారే ధుమారం దేఖోరే
అరే అరే అనరే బాపురే

పొద్దెక్కినా లేవక బజ్జోకుమా పాపాయి
నెత్తెక్కి తొక్కేతనం అత్తింటిలో ఆపేయి
కుర్రాళ్ళతో దీటుగ కుంగ్ఫులవీ మానేయి
ఎన్నాళ్ళే ఈ వాలకం ఇల్లలుగా అడుగెయ్యి
అమ్మయ్యి లోకాన్నే అమ్మాయివై
తీరంత మార్చాలి ఆరిందవై
పిల్లతాను నీ బడాయి చెల్లదింక ఆకతాయి
అల్లరంత ఇక్కడొదిలి పల్లకీని చేరువేళ
ఢోలారే ధుమారం దేఖోరే
అరే అరే అనరే బాపురే




మువ్వంటే మైనా పాట సాహిత్యం

 
చిత్రం: వాన (2008)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున్, గోపికా పూర్ణిమ (హమ్మింగ్)

మువ్వంటే మైనా





సిరిమల్లె వానా పాట సాహిత్యం

 
చిత్రం: వాన (2008)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, రంజిత్

(ఈ పాట యొక్క ట్యూన్  చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్ని అందించిన  బల్లెమ్మ బుల్లోడు (1972) సినిమాలోని కురిసింది వాన నా గుండెలోన పాట యొక్క ట్యూన్ )

సిరిమల్లె వానా పడుతోంది లోన కనిపించదే కంటికి
వడగళ్ళ వానా ఉరిమింది వీణా వినిపించదే జంటకి
తడిసే తరుణాన గొడుగై నే లేనా సిరిమల్లే

సిరిమల్లె వానా పడుతోంది లోన కనిపించదే కంటికి

చరణం: 1
వల అనుకోనా వలపనుకోనా కలిపిన ఈ బంధం
వలదనుకున్నా వరమనుకున్నా తమరికి నే సొంతం
చినుకై వచ్చావే వరదై ముంచావే సిరిమల్లే

సిరిమల్లె వానా పడుతోంది లోన కనిపించదే కంటికి

చరణం: 2
చిలిపిగా ఆడి చెలిమికి ఓడి గెలిచా నీ పైనా
తగువుకి చేరి తలపుగ మారి నిలిచా నీ లోనా
మనసే ఈ వింతా మునుపే చూసిందా సిరిమల్లే

సిరిమల్లె వానా పడుతోంది లోన కనిపించదే కంటికి
వడగళ్ళ వానా ఉరిమింది వీణా వినిపించదే జంటకి



ఉన్నట్టా లేనట్టా పాట సాహిత్యం

 
చిత్రం: వాన (2008)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రంజిత్

ఉన్నట్టా లేనట్టా



ఆకాశ గంగా (Sad Version) పాట సాహిత్యం

 
ఆకాశ గంగా (Sad Version)

చిత్రం: వాన (2008)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్

ఆకాశ గంగా దూకావె పెంకితనంగా ఆకాశ గంగా
జల జల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా
ఆకాశ గంగా దూకావె పెంకితనంగా ఆకాశ గంగా




ఎదుట నిలిచింది చూడు పాట సాహిత్యం

 
చిత్రం: వాన (2008)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరిచిపోయా మాయలో... 
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా

ఎదుట నిలిచింది చూడు

చరణం: 1
నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి?
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ?
ఔనో కాదో  అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం...
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా !!

ఎదుట నిలిచింది చూడు

చరణం: 2
నిన్నే చేరుకోలేకా ఎటెళ్ళిందో నా లేఖ
వినేవారు లేకా విసుక్కుంది నా కేకా
నీదో  కాదో  వ్రాసున్న చిరునామా
ఉందో  లేదో ఆ చోట నా ప్రేమా...
వరం లాంటి శాపమేదో సొంతమైందిలా...

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరిచిపోయా మాయలో... 
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా

ఎదుట నిలిచింది చూడు





వెంట పడుతుంది చూడు పాట సాహిత్యం

 
చిత్రం: వాన (2007)
సంగీతం: కమలాకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

వెంట పడుతుంది చూడు కనపడని మంట ఏదో
బదులు అడిగింది నేడు వినపడని విన్నపమేదో
మది మునిగిపోయే మత్తులో
మధురమైన యాతనేదో బయట పడదిలా ఓ...
వెంట పడుతుంది చూడు

Most Recent

Default