చిత్రం: వసంత కోకిల (1982)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్. పి.బాలు
నటీనటులు: కమల్ హాసన్, శ్రీదేవి, సిల్క్ స్మిత
దర్శకత్వం: బాలు మహేంద్ర
నిర్మాతలు: యస్. వెంకట సుబ్బారావు, కె.రామకోటయ్య
విడుదల తేది: 1982
కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో లాలి లాలో జోలాలిలో
మోసం తెలియని లోకం మనదీ
తీయగ సాగే రాగం మనదీ
ఎందుకు కలిపాడో బొమ్మలను నడిపే వాడెవడో
నీకూ నాకూ సరిజోడని కలలోనైనా విడరాదనీ
కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో లాలి లాలో జోలాలిలో
కారడవులలో కనిపించావూ
నా మనసేమో కదిలించావూ
గుడిలో పూజారై నా హృదయం నీకై పరిచాను
ఈ అనుబంధం ఏ జన్మదీ ఉంటే చాలు నీ సన్నిధి
కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా
లాలి లాలో జోలాలిలో లాలి లాలో జోలాలిలో
(సినిమా చివరిలో వచ్చే మూడవ చరణం)
ఎవరికి ఎవరో ఎదురవుతారూ
మనసూ మనసూ ముడిపెడతారూ
ఎందుకు వస్తారో కాదనీ ఎందుకు పోతారో
బ్రతుకే రైలుగా సాగేనటా నీతో నువ్వే మిగిలేవటా
కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా
లాలిజో జోలాలిజో లాలిజో జోలాలిజో