Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Vasu (2002)




చిత్రం: వాసు (2002)
సంగీతం:  హారీస్ జైరాజ్ 
నటీనటులు: వెంకటేష్  , భూమిక చావ్లా
దర్శకత్వం: ఏ. కరుణాకరన్
నిర్మాత: కె.యస్. రామారావు
విడుదల తేది: 10.04.2002



Songs List:



నమ్మవే అమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: వాసు (2002)
సంగీతం:  హారీస్ జైరాజ్ 
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాఘవేంద్ర, చిత్ర

నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి
ఇలాంటి హాయి మొదటిసారి  సొంతమై
నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి
ఇలాంటి హాయి మొదటిసారి  సొంతమై
హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి
నిన్నొదిలిరాను అంది నన్ను మరచిపోయి
దేహమంత మారిపోయే చేయిగా
కాలమంత కాలుతోంది తీయగా
మాయమైన ఆ క్షణాన్ని వెతుకుతోంది చిలిపిగానె

నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి
ఇలాంటి హాయి మొదటిసారి  సొంతమై
నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి
ఇలాంటి హాయి మొదటిసారి  సొంతమై
హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి
నిన్నొదిలిరాను అంది నన్ను మరచిపోయి

చరణం: 1
ఓ సారి చెయ్యేస్తే ఇలా కళ్ళుమూసి ఒళ్ళు మరచిపోతే
నువు గనుక నేనయితే నువ్వే చెప్పగలవు ఏమి జరిగనంటే
ఇలాగ వేలుతాకి అలాగ సోలిపోతే
నువ్వేమిటౌదువో మరింత ముందుకొస్తే
తుఫాను కాకముందు చిటుక్కు చినుకు ముద్దు
ఇలాగె మన గుండెల్లోన ఆవిర్లు రేపి పోదా

నమ్మవే అమ్మాయి
హే చాలులే బడాయి కవిత్వమా అబ్బాయి
కబుర్లతోనే కాలమంతా గడపకోయి
ఇంతకన్న హాయి కావాలా ఆకతాయి
అందించగలను చేతిలోన చేయి

చరణం: 2
హో ఇన్నాళ్లు ఈ గాలి ఇలా పాడలేదు ఇంతచిలిపి లాలి
ఇంకేమి కావాలి సరే వెళ్ళు కలలలోకి తేలి తేలి
ఇవాళ నుంచి నేను పూలైన ముట్టుకోను
నీ లేత చేతి స్పర్శ కందిపోవునేమో
మరైతె ఇంక నేను ఎలాగ తట్టుకోను
నీ వరస చూస్తే ఇంక నువ్వు నన్నైన తాకవేమో
చాలులే బడాయి 

హో హో హో హో       
నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి
ఇలాంటి హాయి మొదటిసారి  సొంతమై
హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి
నిన్నొదిలిరాను అంది నన్ను మరచిపోయి
దేహమంత మారిపోయే చేయిగా
కాలమంత కాలుతోంది తీయగా
మాయమైన ఆ క్షణాన్ని వెతుకుతోంది చిలిపిగానె

నమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి
ఇలాంటి హాయి మొదటిసారి  సొంతమై
హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి
నిన్నొదిలిరాను అంది నన్ను మరచిపోయి
లేనిపోని మైకమింక మానుకో
చేరువైన నన్ను కాస్త చేరుకో
లేకపోతే కోపమొచ్చి మాయమౌత చూసుకోర





పాటకు ప్రాణం పల్లవి ఐతే పాట సాహిత్యం

 
చిత్రం: వాసు (2002)
సంగీతం:  హారీస్ జైరాజ్ 
సాహిత్యం: పోతుల రవికిరణ్ 
గానం: కె కె (కృష్ణ కుమార్ కున్నత్), స్వర్ణలత

పాటకు ప్రాణం పల్లవి ఐతే  
ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా 
ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా

పాటకు ప్రాణం పల్లవి ఐతే  
ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా 
ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా

బ బహామ, ఎవరేమనుకున్నా వినదీ ప్రేమా
బ బహామ, ఎదురేమవుతున్నా కనదీ ప్రేమా
బ బహామ, కనులే తెరిచున్నా కల ఈ ప్రేమా
బ బహామ, నిదురే రాకున్నా నిజమో ప్రేమా... 
ఓ... చెలీ... సఖీ... ప్రియా యూ లౌమీ నౌ
నౌ ఫర్ ఎవర్  ప్రియా... నన్నే	

పాటకు ప్రాణం పల్లవి ఐతే  
ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా 
ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా

చరణం: 1
ఓ... వయసాగక నిను కలచిన నను మరచిన 
పదే పదే పరాకులే
ఓ... నీ ఆశలు నీ ధ్యాసలు చిగురించగా 
అదే అదే ఇదాయెలే
ప్రేమించే మనసుందే ప్రేమంటే తెలుసందే
అది ప్రేమించిందో ఏమో నిన్నే ఐ లవ్ యు అంటుందే
నువ్వంటే చాలా ఇష్టం లవ్వుంటే ఎంతో ఇష్టం
ఇన్నాళ్ళూ నాలో నాకే తెలియని ఆనందాలా ప్రేమే ఇష్టం

పాటకు ప్రాణం పల్లవి ఐతే  
ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా 
ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా

చరణం: 2
ఓ... ఆనుకున్నదే నిజమైనది ఎదురైనది 
ఇలా  ఇలా  ఈ వేళలో
ఓ... అనుకోకులే అలవాటులో పొరపాటుగ
అలా అలా నీ తీరులో
నా వెంటే నీవుంటే నీడల్లే తోడుంటే
పెదవిప్పాలన్నా చెప్పాలన్నా కిస్సే మిస్సౌనేమో
కుట్టిందే తేనెటీగా పుట్టిందే తీపి బెంగా
కిల్లాడి ఈడే ఆడీ పాడీ కోడై కూసిందేమో బాబూ
పాపకు పా పా  పాపప పా పా

పాటకు ప్రాణం పల్లవి ఐతే  
ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేమికుడేలే
ఓ ఓ ఓ ఓ ప్రేమికుడేలే

బ బహామ, ఎవరేమనుకున్నా వినదీ ప్రేమా
బ బహామ, ఎదురేమవుతున్నా కనదీ ప్రేమా
బ బహామ, కనులే తెరిచున్నా కల ఈ ప్రేమా
బ బహామ, నిదురే రాకున్నా నిజమో ప్రేమా... 
ఓ... చెలీ... సఖీ... ప్రియా యూ లౌమీ నౌ
నౌ ఫర్ ఎవర్  ప్రియా... నన్నే	

పాటకు ప్రాణం పల్లవి ఐతే  
ఓ ఓ ఓ ఓ పల్లవి అయితే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా 
ఓ ఓ ఓ ఓ ప్రేయసి కాదా



స్పోర్టివ్ బోయ్స్ పాట సాహిత్యం

 
చిత్రం: వాసు (2002)
సంగీతం:  హారీస్ జైరాజ్ 
సాహిత్యం: సాహితి
గానం: కె కె (కృష్ణ కుమార్ కున్నత్), స్వర్ణలత , టిప్పు , 

సోనారే... సోనారే... సున్ సున్ సోనారే (2)

కోరస్: సోనారే... ఏ ఓహో... 
సోనారే... ఏయ్... ఏయ్... ఏయ్... ఓహో

స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్ యూతే హేపీనెస్
డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్ ఎంజాయ్ ఆల్ ది డేస్
స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్ యూతే హేపీనెస్
డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్ ఎంజాయ్ ఆల్ ది డేస్
మన యూత్ మేధస్సుకు ఆకాశమే సరిహద్దూ
మన జర్నీ ఏనాడు ఆపదు ఏ చెక్ పోస్టూ...

చరణం: 1
రెయిన్బోని సెట్ చేసి వాలిబాల్ ఆడేద్దాం
సూర్యుణ్ణే ఓ స్టైకర్ చేసి కారమ్స్ ఆడేద్దాం
శాటిలైట్ రెక్కలపై తూగుటూయలూగేద్దాం
కోయిలతోనే పోటాపోటీకి కీ బోర్డ్  వాయిద్దాం
మన శక్తికి సాటిలేదని లోకానికి చాటిచెప్పరా
పాకిస్తాన్ బోర్డర్ లో చెడుగుడునే ఆడేయ్ రా
ఐ.రా.స. సభలోనే జనగణమన పాడెయ్ రా
సోనారే...

స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్ యూతే హేపీనెస్
డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్ ఎంజాయ్ ఆల్ ది డేస్

చరణం: 2
ఓ మామ... ఓ మామ...ఓ మామ  సయ్యె
ఓ మామ... ఓ మామ...ఓ మామ  సయ్యె...ఓయే...
డై సబ్మిట్ పవరెట్టీ డే, నైట్ శ్రమ చేస్తే
ఎవరెస్టయినా మన పాదాల కిందకి వస్తుంది
డేరింగ్ మైండ్ గురిపెట్టి
కెర్ ఫుల్ గా నువు అడుగేస్తే
విక్టరీ తప్పక ఏదో నాడు తలుపే తడుతుంది
మన కండలో బలము ఉన్నది
బుర్రలో యమ తెలివివున్నది
ఈ రెండూ ఒకటైతే ఎదిరింకా ఏముందే 
ఏదైనా సాధిస్తాం ఇదిగో మా చాలెంజ్ 

స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్ యూతే హేపీనెస్
డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్ ఎంజాయ్ ఆల్ ది డేస్
మన యూత్ మేధస్సుకు ఆకాశమే సరిహద్దూ
మన జర్నీ ఏనాడు ఆపదు ఏ చెక్ పోస్టూ...
స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్ యూతే హేపీనెస్
డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్ ఎంజాయ్ ఆల్ ది డేస్

సోనారే... ఏయ్... ఏయ్... ఏయ్... ఓహో
సోనారే... ఏయ్... ఏయ్... ఏయ్... ఓహో
సోనారే.... సోనారే....సున్ సున్ సోనారే





పాడనా తీయగా కమ్మని ఒకపాట పాట సాహిత్యం

 
చిత్రం: వాసు (2002)
సంగీతం:  హారీస్ జైరాజ్ 
సాహిత్యం: పోతుల రవికిరణ్ 
గానం: యస్. పి. బాలు

నీ జ్నాపకాలే నన్నే తరిమేనే 
నీ కోసం నేనే పాటై మిగిలానే 
చెలియా  చెలియా ఓ చెలియా 

పాడనా తీయగా కమ్మని ఒకపాట
పాటగా బతకనా మీ అందరినోట
ఆరాధనే అమృత వర్షం అనుకున్నా
ఆవేదనే హాలాహలమై పడుతున్నా 
నా గానమాగదులే ఇక నా గానమాగదులే                               

పాడనా తీయగా కమ్మని ఒకపాట
పాటగా బతకనా మీ అందరినోట

చరణం: 1
గుండెల్లో ప్రేమకే...
గుండెల్లో ప్రేమకే గుడి కట్టేవేళలో
తనువంత పులకింతే
వయసంతా గిలిగింతే
ప్రేమించే ప్రతిమనిషి ఇది పొందే అనుభూతే
అనురాగాల సారం జీవితమనుకుంటే
అనుబంధాల తీరం ఆనందాలుంటే
ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేలే 
ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేలే 

పాడనా తీయగా కమ్మని ఒకపాట
పాటగా బతకనా మీ అందరినోట

చరణం: 2
ఆకాశం అంచులో... 
ఆకాశం అంచులో  ఆవేశం చేరితే
అభిమానం కలిగెనులే
అపురూపం అయ్యెనులే 
కలనైనా నిజమైనా కనులెదుటే ఉన్నాలే
కలువకు చంద్రుడు దూరం ఓ నేస్తమా 
వెన్నెలకురిసే వేసే ఆ బంధం
ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే 
ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే 

పాడనా తీయగా కమ్మని ఒకపాట
పాటగా బతకనా మీ అందరినోట
ఆరాధనే అమృత వర్షం అనుకున్నా
ఆవేదనే హాలాహలమై పడుతున్నా 
నా గానమాగదులే ఇక నా గానమాగదులే                        



ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా పాట సాహిత్యం

 
చిత్రం: వాసు (2002)
సంగీతం:  హారీస్ జైరాజ్ 
సాహిత్యం: పోతుల రవికిరణ్ 
గానం: దేవన్ ఏకాంబరం

చుచ్చూరు  చుచ్చూరు చుచ్చూరు  (4)

చిరె చీ చీ, చిరె చీ చీ
ప్రియా ఓహ కనిపించావులే ప్రియా 
చూపించాలి నీవులే  నాపై దయా...
తొలిప్రేమాయలే ప్రియా 
నాలో కంటి పాపకే నీవే లయా
ఎదురైన అందమా ఎదలోని భావమా
మనసైన ముత్యమా సొగసైన రూపమా
పదహారు ప్రాయమా పరువాలు భారమా
అధరాలు మదురమా అరుదైన హృదయమా

ఓహొ హొ 
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా 
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా 
కలలో భామా కలిగే ప్రేమా ప్రియా ఓహ

చుచ్చూరు  చుచ్చూరు చుచ్చూరు  (4)

చిరె చీ చీ, చిరె చీ చీ  ప్రియా...

చరణం: 1
తొలి కలయిక ఒక వరమో
ప్రతి కదలిక కలవరమో
అణువనువున పరిమళమో
అడుగడుగున  పరవశమో
ఏదైనా ఏమైనా నువ్వేలే నా ప్రాణం
ఔనంటూ కాదంటావా
లేదంటూ తోడొస్తావా
నాకోసం ప్రియా ఓహ...

కనిపించావులే ప్రియా 
చూపించాలి నీవులే  నాపై దయా
తొలిప్రేమాయలే ప్రియా 
నాలో కంటి పాపకే నీవే లయా

చరణం: 2
ఎదురుగ నువు నిలబడితే ఎదరసనస మొదలైతే
మదనుడు కధ మొదలెడితే అడుగులు తడబడి పడితే
చిరునామా తెలిసిందే నాప్రేమా ఆహొ విరిసిందే
ఆకాశం అంచుల్లోనే ఆనందం చేరిందేమో
ఊహల్లో ప్రియా... ఓహ...

కనిపించావులే ప్రియా 
చూపించాలి నీవులే  నాపై దయా
తొలిప్రేమాయలే ప్రియా 
నాలో కంటి పాపకే నీవే లయా
ఎదురైన అందమా ఎదలోని భావమా
మనసైన ముత్యమా సొగసైన రూపమా
పదహారు ప్రాయమా పరువాలు భారమా
అధరాలు మదురమా అరుదైన హృదయమా

ఓహొ హొ 
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా 
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా
కలలో భామా కలిగే ప్రేమా ప్రియా




వాలే వాలే పొద్దులా పాట సాహిత్యం

 
చిత్రం: వాసు (2002)
సంగీతం:  హారీస్ జైరాజ్ 
సాహిత్యం: పోతుల రవికిరణ్ 
గానం: చిత్ర  , కార్తీక్ 

వాలే వాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా
వాలే వాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా
లేనే లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా
పుట్టుమచ్చే చూడనా...
పుట్టుమచ్చే చూడనా తొలి ముద్దే దానికి పెట్టనా
పట్టుకుంటే జారనా మరి ముట్టుకుంటే కందనా
మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పిందే....ఓయ్...

వాలే వాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా
లేనే లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా

చరణం: 1
ఎన్ని అందాలో ఎన్నెన్ని అందాలో
కౌగిలించి ముద్దులిస్తే కలలా ఉందిలే
ఎన్ని అందాలో ఎన్నెన్ని అందాలో
కౌగిలించి ముద్దులిస్తే కలలా ఉందిలే
ఎన్ని బంధాలో ఎన్నెన్ని బంధాలో
గుండెకేసి హత్తుకుంటే అలలా ఉందిలే
ఇన్నాళ్లు ఈ ప్రేమంతా ఏమయిందిలే
ఇవ్వళే చెప్పేసావు ఎట్టా ఎట్టా ఎట్టెట్టా

వాలే వాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా
లేనే లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా
పుట్టుమచ్చే చూడనా...
పుట్టుమచ్చే చూడనా తొలి ముద్దే దానికి పెట్టనా
పట్టుకుంటే జారనా మరి ముట్టుకుంటే కందనా
హోయ్ మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పిందే

చరణం: 2
ఒంపు సొంపుల్తొ ఈ ఒంటి భాదల్తో
చీరంటే నవ్వేస్తుంటే సిగ్గువుతుందిలే....ఏ ఏ  ఏయ్
ఒంపు సొంపుల్తొ ఈ ఒంటి భాదల్తో
చీరంటే నవ్వేస్తుంటే సిగ్గువుతుందిలే....ఏ ఏ  ఏయ్
కంటి సైగల్తో నీ కొంటె చేష్టల్తో
కవ్వించి  రమ్మంటుంటే మతి పోతుందిలే
ఎన్నాళ్ళు మోయాలయ్యె పొంగే పొంగులే
నీ సాయం కావాలయ్యే  ఎట్టా ఎట్టా ఎట్టెట్టా...

వాలే వాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా
లేనే లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా
పుట్టుమచ్చే చూడనా...
పుట్టుమచ్చే చూడనా తొలి ముద్దే దానికి పెట్టనా
పట్టుకుంటే జారనా మరి ముట్టుకుంటే కందనా
ఓ మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పిందే

వాలే వాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా
లేనే లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా


Most Recent

Default