Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Venky (2004)




చిత్రం: వెంకీ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: రవితేజ , స్నేహ
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాత: అట్లూరి పూర్ణచంద్రరావు
విడుదల తేది: 26.03.2004



Songs List:



మార్ మార్ పాట సాహిత్యం

 
చిత్రం: వెంకీ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం:  దేవి శ్రీ ప్రసాద్, మాణిక్కా వినాయగమ్, శ్రీలేఖ పార్ధసారధి

హే మారే మారే మారే మారే మారే మారే
మారే మారే  మారే  మారే  మారే

హేయ్ మార్  మార్ మార్  మార్ మార్ పిల్లా మార్
జోర్ జోర్ జోర్ జోర్  జంబయి రో జోర్

కో: జోర్ జోర్ జోర్ జోర్  జంబయి రో జోర్

హే యార్ యార్ యార్ యార్ ఖానా తయ్యార్
మోర్  మోర్  మోర్ మోర్  కావాలా మోర్

కో: మోర్ మోర్ మోర్ మోర్  కావాలా మోర్

ఆకొక్కలిస్తవా    కోరస్: హొవ్వాయే
అత్తర్లే పూస్తవా  కోరస్: హొవ్వాయే
సందేళ్ళవస్తవా  కోరస్: హొవ్వాయే
సరదాలే చేస్తవా కోరస్: హొవ్వాయే

యమహొ నా జాంగ్రీ మస్తుందిరే
మార్ మార్ మార్ గోల్ మాలేరే
గుడివాడ సందులో గుంటూరు గొందులో
తొక్కుడు బిళ్లాడదాం రావే పోరీ
హే ఒంగోలు గిత్తలా పల్నాటి పుంజులా
పైపైన పడకురో హొరా హోరీ

హేయ్ మార్  మార్ మార్  మార్ మార్ పిల్లా మార్
జోర్ జోర్ జోర్ జోర్  జంబయి రో జోర్

అటో గంటా ఇటో గంటా కన్నుకొట్టుకుంటు నిన్ను చూసుకుంటా
ఇలా వెంట భలేగుంటా చలే పుట్టు కొంటూ పట్టుకొంటే జంటా
హే... అబ్బో నీ అబ్బోరే నీ అందం సబ్బోరే
అత్తర్లా నాక్కొంచెం రుద్దేసెయ్ రే
అయ్యారే హంగోరే సయ్యాన సంగోరే
వయ్యారి జాతర్లే జరిపించొరే
ఏయ్... మాటల్లో మరదలా పొద్దేజారే
మార్ మార్ మార్ ముద్దుమారే
రోజూ వస్తుంటవు నోరే ఊరిస్తవూ
తీరా నే పూలు తెస్తే తిరిగి చూడవు
ఏయ్... కనపడితే కదలవు నా కొంగే వొదలవు
పడుచు పళ్ళ పరుశురామ చిలకే నువ్వు

ఏయ్ బిలాలిస్తడే మడత పెడతడే మసాలేస్తడే
అలా వస్తది ఇలా చూస్తది టలాయిస్తది
అబ్బ సుబ్బర సొగ్గాడే అంబలగిరి గిజిగాడే
సిగ్గులోరి మొగ్గలాగ ముడుచుకొంటదే

ఇదేనంటా నీతో తంటా ఇలా పట్టపగలే చుట్టుకోకు చుట్ట
ఒసేయ్ పిట్టా పూలబుట్టా నిన్ను పట్టకుండ యిడిసేది ఎట్టా
హేయ్... నవ్వుంటే చాంగోరే నా పైట చెంగోరే
ఏకంగా చుక్కల్లో ఎగిరిందోరే
హే నీ ఒళ్ళే బంగారే నిలువెల్లా బంగోరే
నా ఒళ్లో పడిపోతే తలకిందులే
మాపట్లో మాపల మంచిక్కారే
మార్ మార్ మార్ మజా మారే
హా ఈయేల సెగలకు నాకడ్డు తగలకు
నా వేడి చల్లారక జారేపోకు
గడియైన  వొదలకు కొంగైనా ఇడవకు
తెల్లార్లు నువ్వింక నిదరే పోకు

మార్ మార్  మార్  మర్ మార్  మర్ మర్ మర్
హేయ్ మార్  మార్ మార్  మార్ మార్ పిల్లా మార్
జోర్ జోర్ జోర్ జోర్  జంబయి రో జోర్





హే గోంగూర తోటకాడ పాట సాహిత్యం

 
చిత్రం: వెంకీ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం:  శ్రీరామ్, మాలతి

హే గోంగూర తోటకాడ కాపుకాశా
హే కోడి కూసె వేళదాక ఎదురు చూశా
హే గోంగూర తోటకాడ కాపుకాశా
హే కోడి కూసె వేళదాక ఎదురు చూశా
అంతలోనే  పెరిగిపోయె ముద్దుఆశా
నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశా
కోరుకున్న దోరకన్నె గోరుముద్దలెప్పుడమ్మో
ఓరి పిల్లడా తలగడా మల్లెపూలజల్లెడా
నువ్వు నాకు నచ్చినావు అందగాడా
ఓసి అమ్మడు గుమ్మడూ అంత నచ్చినప్పుడు
దాచమాకు ఉట్టిమీద పాలమీగడ

హే గోంగూర తోటకాడ కాపుకాశా
ఆఁ కోడి కూసె వేళదాక ఎదురు చూశా

చరణం: 1
హే రా రమ్మనీ కన్నుకొట్టగా కొంగునే చుట్టుకోనా
నా కమ్మని కన్నె కౌగిలింత కానుకివ్వనా
ఛీ పొమ్మని నన్ను ఊరికే నెట్టినా  వదులుతానా
నీ తియ్యని చెంపగిల్లకుండ ఉండగలనా
ఏయ్ గువ్వా గోరింకలాటకే
పోదాము రావా గుమ్మ గుమ్మళ్ల గూటకే ఏయ్
చుమ్మా చుమ్మాల ముద్దుకే సందేళరావే గున్నా మావిళ్ల తోటకే
ఓరి పిల్లడా మల్లుడా ఇంటికొస్తే అల్లుడా
కంది సేను పక్క నిన్ను కలుసుకోనా
ఓసి అమ్మడూ గుమ్మడూ పొద్దువాలినప్పుడు
పెరటిలోన గిలక పట్టె మంచెమెయ్యనా

గోంగూర తోటకాడ కాపుకాశా
కొక్కొ రోక్కో కోడి కుసే వేళదాక ఎదురు చూశా

చరణం: 2
ఓ నీ చెక్కిలి బుగ్గ చుక్కనై చక్కగా నొక్కుకోనా
ఆ పక్కగా నిన్ను కొమ్మ చాటు కెత్తుకెళ్ళనా
హే నా కొప్పులో నిన్ను ముద్ద బంతి పువ్వులా పెట్టుకోనా
మా గొప్పగా నీకు ఏకదాటి ముద్దులెట్టనా
ఏయ్ కయ్యా కయ్యాల పిల్లవే కమ్మేసుకొంటె తియ్యా తియ్యని బిళ్ళవే హే
ఏయ్ మువ్వా గోపాలకృష్ణుడే నా గుమ్మ సోకు ఉంగా ఉంగాలకొచ్చనే హై హై
ఓసి అమ్మడూ గుమ్మడూ గుప్పెడంటే గుప్పెడు
నడుపువొంపు చూసుకోనే రోజు ఎప్పుడూ
ఓ ఓ పిల్లగా చల్లగా అల్లమల్లె గిల్లగా
పైట చెంగు జారి పోయే నాకు ఇప్పుడూ


హే గోంగూర తోటకాడ కాపుకాశా
హ హ కోడి కూసె వేళదాక ఎదురు చూశా
అంతలోనే  పెరిగిపోయె ముద్దుఆశా
నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశా
కోరుకున్న దోరకన్నె గోరుముద్దలెప్పుడమ్మో
ఆ పిల్లడా తలగడా మల్లెపూలజల్లెడా
నువ్వు నాకు నచ్చినావు అందగాడా
ఓసి అమ్మడు గుమ్మడూ అంత నచ్చినప్పుడు
దాచమాకు ఉట్టిమీద పాలమీగడ



హేయ్ సిలకేమో సీకాకులం పాట సాహిత్యం

 
చిత్రం: వెంకీ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం:  పాల్గట్ శ్రీరామ్, దేవి శ్రీ ప్రసాద్, మాలతి

హేయ్ సిలకేమో సీకాకులం  అరె కులుకేమో మల్కీపురం
హేయ్ సిలకేమో సీకాకులం కులుకేమో మల్కీపురం
సొగసేమో ఇశాపట్నం జగదాంబ జంక్షన్ర్రో
అరె పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయ్ పురం
నుడుమేమో గరం గరం భీమలి బీచేరో
ఇది టెక్కలి టెక్కుల్దిరో మహ బొబ్బిలి నిక్కుల్దిరో
కుర్రకారుకి సర్రని కిర్రెక్కించే కిర్లంపూడి సరుకేరో
మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది హే
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేహేయ్

హేయ్ సిలకేమో సీకాకులం అరె కులుకేమో మల్కీపురం

అరె ఏ ఏ ఏ వన్నె చుస్తే పాలంగడి ఒళ్ళు చూస్తె పూలంగడి
బుగ్గ చూస్తే భోగాపురం బూరెల కావడి
దీని జెబ్బ చుస్తే పర్లాకిమిడి కొబ్బరి చలిమిడి
అరె ఏ ఏ పూసపాటి పుంజుకోడి రోసమొస్తే అబ్బాడీ
ముందు ఎనక నోట్లో వున్న ముప్పై పళ్ళూడి అబ్బో
అపోజిసనైపోతాది అప్పుడే పిండి పిండి
ఓసి నా రాజమండ్రీ పలకదోర జాంపళ్ళ బండీ
పూల పండక్కి వచ్చి పాలవెట్టి చుక్కల్లో పక్కేసి లాగిస్తా నా బండి
మాస్ తోపెట్టు కుంటే మడతడి పోద్ది అద్దీ
ఒంట్లో ఒక్కో నరం మెలికడి పోద్ది ఏయ్

హేయ్ సిలకేమో సీకాకులం అరె కులుకేమో మల్కీపురం

అరె ఏ ఏ ఉన్నోళ్లు లేనోళ్ళని మనిషిలోన తేడాలు
ఉన్నదాక వేటే మానవు టక్కరి తోడేళ్ళు వాటి
ఆటలింక కట్టించుకుంటే బతకరు పేదోళ్ళు
అరె హా యాయ్ యాయ్ ముందు  మరి ఈ సంగతి తెలుసుకొని పెద్దోళ్ళు
లోటు ఇంక సరిచేయకుంటే నా బోటి కుర్రాళ్ళు ఇట్టా
వీధికెక్కి పెట్టక తప్పదు వీపులు దంపుళ్ళు
నువ్వు సేనానివయ్యో సిమ్మాచలం సింహానివయ్యో
నీకు ఎదురేదిరయ్యా ఎదుటి వాడి మేలుని కోరే మనిషివి నువ్వేరో
మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది హేయ్
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేయ్
మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది అరె
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేయ్ హే

హేయ్ సిలకేమో సీకాకులం అరె కులుకేమో మల్కీపురం
హే సిలకేమో సీకాకులం కులుకేమో మల్కీపురం
సొగసేమో ఇశాపట్నం జగదాంబ జంక్షన్ర్రో
అరె పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయ్ పురం
నుడుమేమో గరం గరం భీమలి బీచేరో
ఇది టెక్కలి టెక్కుల్దిరో మహ బొబ్బిలి నిక్కుల్దిరో
కుర్రకారుకి సర్రని కిర్రెక్కించే కిర్లంపూడి సరుకేరో
మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది హేయ్
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేహేయ్





ఓ మనసా పాట సాహిత్యం

 
చిత్రం: వెంకీ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం:  సుమంగళి, వేణు

ఓ మనసా ఓ మనసా నీ చూపే మత్తెక్కించే కొంటె వయసా
ఓ మనసా ఓ మనసా నీ నీడే నన్నే గిచ్చే నీకు తెలుసా
నా కలే నిజం చేయవా ఈ క్షణాలలో
ఆ నిజం నిరూపించనా నా పెదాలతో
చెలీ చెలీ సుఖాలనీ ఇలాగే సాగనీ

ఓ మనసా ఓ మనసా నీ చూపే మత్తెక్కించే కొంటె వయసా
ఓ మనసా ఓ మనసా నువ్వంటే నేనేనని నీకు తెలుసా

చరణం: 1
హో ఎగసే అలల జడిలో ఎదలో ఏదో గుస గుసా
మదిలో మధుర స్వరమే పలికే ఏదో పదనిసా
లయలో హొయలు మెలివేస్తూ నిను కదిలే నదిలా కలవాలి
లతలా చేయి పెనవేస్తూ నను నేనే నీలో కలపాలి
మరీ మరీ మనోహరీ సుఖాల వేళ చెరు నా కౌగిలీ
ఓ మనసా

చరణం: 2
హో మెరిసే నీలి కడలై కురుల నిన్నే దాచనా
చిదిరే లేత నుదురే పాల నురుగై తాకనా
మనసే కోరు మధువులకే ఇక మనకో చోటే వెదకాలి
ఒకటై చేరు తనువులకేమరి మనమో దారి చుపాలి
ప్రియా ప్రియా పెదాలిలా తపించిపోయే నీకే చెందాలనీ
ఓ మనసా




అనగనగా కధలా పాట సాహిత్యం

 
చిత్రం: వెంకీ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం:  కార్తీక్ , సుమంగళి

హొయ్ అనగనగా కధలా ఆ నిన్నకు సెలవిస్తే
అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే
లోకాన చీకటిని తిడుతూనే వుంటామా
ఓ చిన్న దీపాన్ని వెలిగించుకోలేమా
ఆ వెలుగులకి తొలి చిరునామా
అది ఒకటే... చిరునవ్వేనమ్మా


కో: హేలా...హేలాల జాబిలి కంటికి కన్నీళ్ళా...
హేలా హేలాల వెన్నెల కురవాలా
హొయ్.... బాధలో...కన్నులే... కందినంత మాత్రానా
పోయిన కాలము పొందలేముగా
రేగిన గాయమే ఆరనంత మాత్రాన
కాలమే సాగక ఆగిపోదుగా
అరె ఈ నేల ఆకాశం వుందే మనకోసం
వందేళ్ల సంతోషం అంతా మన సొంతం
ఈ సరదాలు ఆనందాలు అలలయ్యేలా అల్లరి చేద్దాం

కో: హేలా హేలాల హేలే లాలాల హేలా హేలాల హేలే లాలాలా
ఎందుకో ఏమిటో ఎంత మందిలో వున్నా
నా ఎద నీ జతే కోరుతుందిగా
ఒంటరి దారిలో నాకు తోడు వైనావే
ఎన్నడూ నీడగా వెంట వుండవా

కో: అరె కలలే నిజమైనాయి కనులే ఒకటయ్యి
కలిపేస్తూ నీ చెయ్యి అడుగే చిందెయ్యి

మన స్నేహాలు సావాసాలు కలకాలాలకు కధ కావాలి
కో: హేలా హేలాల హేలే లాలాల హేలా హేలాల హేలే లాలాలా



అందాల చుక్కల లేడి పాట సాహిత్యం

 
చిత్రం: వెంకీ (2004)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం:  కల్పన ,  మల్లికార్జున్

హే అందాల చుక్కల లేడి నా తీపి చక్కెరకేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లోకలిసిందా
శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం
కురిపిస్తే చేయిస్తా గుళ్ళో అభిషేకం
తన మౌనం అయిపోతే త్వరలో అంగీకారం
తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువు పుట్టావని
ఐ లవ్ యూ ఓ శ్రావణి  నా తోనే నువు వుంటావని

హే అందాల చుక్కల లేడి నా తీపి చక్కెరకేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లోకలిసిందా

చరణం: 1
ఏయ్ ముత్యంలాంటీ నీ నవ్వు మొత్తం అంతా నాకివ్వు
బంగారంతో చేయిస్తా జడ పువ్వూ
నిగ నిగ మెరిసే నీ తనువు సొగసరి కానుక నా కివ్వు
పువ్వులతోనే పుజిస్తా అణువణువూ
అరె సీతాకాలం మంచుల్లో ఒళ్లంటుందే జివ్వూ
ఎండాకాలం ముంజల్లే ఓ తియ్యని ముద్దివ్వూ
అరె వానాకాలం వరదల్లే ముంచేస్తుందే లవ్వూ
కాలాలన్నీ కరిగేలా నీ కౌగిలి వరమివ్వు

ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువు పుట్టావని
ఐ లవ్ యూ ఓ శ్రావణి  నా తోనే నువు వుంటావని

హే అందాల చుక్కల లేడి నా తీపి చక్కెరకేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లోకలిసిందా

చరణం: 2
స్వర్గంలోనే పెళ్ళిళ్ళు అవుతాయంటూ పెద్దోళ్ళూ
చెప్పిన మాటే వినివుంటే నీ చెవ్వూ
ముగ్గులు పెట్టి వాకిళ్ళు ముంగిట వేసి పందిళ్ళూ
అందరికింక శుభలేఖలనే పంచివ్వూ
రేపంటూ మరి మాపంటూ ఇక పెట్టోద్దే గడువూ
నూరేళ్ళూ నిను పరిపాలించే పదవే రాసివ్వూ
మొత్తం నీపై పెట్టేశానే నా ఆశలు బరువూ
గట్టే నన్ను ఎక్కిస్తానని హామీ అందివ్వూ

ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువు పుట్టావని
ఐ లవ్ యూ ఓ శ్రావణి  నా తోనే నువు వుంటావని

హే అందాల చుక్కల లేడి నా తీపి చక్కెరకేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లోకలిసిందా
శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం
కురిపిస్తే చేయిస్తా గుళ్ళో అభిషేకం
తన మౌనం అయిపోతే త్వరలో అంగీకారం
తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువు  పుట్టావని
ఐ లవ్ యూ ఓ శ్రావణి  నా తోనే నువు వుంటావని

Most Recent

Default