చిత్రం: వేటగాడు (1979) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: యన్.టి.రామారావు, శ్రీదేవి దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాతలు: యమ్.అర్జున రాజు, కె.శివరామ రాజు విడుదల తేది: 05.07.1979
Songs List:
ఆకు చాటు పిందె తడిసే పాట సాహిత్యం
చిత్రం: వేటగాడు (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి గానం: పి. సుశీల, యస్.పి.బాలు ఆకు చాటు పిందె తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకు చాటు పిందె తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది ముద్దిచ్చీ ఓ చినుకు ముత్యమైపోతుంటే అహ అహ అహ అహ చిగురాకు పాదాల సిరిమువ్వలవుతుంటే అహ అహ అహ అహ ఓ చినుకు నిను తాకి తడి ఆరిపోతుంటే ఓ చినుకు నిను తాకి తడి ఆరిపోతుంటే ఓ చినుకు నీ మెడలో నగలాగ నవ్వుతుంటే!! నీ మాట విని మబ్బు మెరిసే అహా... జడి వానలే కురిసీ కురిసీ వళ్ళు తడిసీ వెల్లీ విరిసీ చిలిపి చినుకుల్లో తల దాచుకోవాలి అహ అహ అహ అహ అహ అహ ఆకు చాటు పిందె తడిసే కొమ్మచాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది మై మరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే అహ అహ అహ అహ ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే అహ అహ అహ అహ ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే అహా నీ పాట విని మెరుపులోచ్చీ అహా నీ విరిపూలే ముడుపులిచ్చీ చలిని పెంచీ చెలిమి పంచీ తలలు వెచ్చంగా తడి ఆర్చుకోవాలి అహ అహ అహ అహ అహ అహ ఆకు చాటు పిందె తడిసే అహ అహ అహ అహ కొమ్మచాటు పువ్వు తడిసే అహ అహ అహ అహ ఆకు చాటు పిందె తడిసే కొమ్మచాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది
బంగారు బాతు గుడ్డు పాట సాహిత్యం
చిత్రం: వేటగాడు (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి గానం: పి. సుశీల, యస్.పి.బాలు బంగారు బాతు గుడ్డు బందారు చెక్కెర లడ్డు బంగారు బాతు గుడ్డు బందారు చెక్కెర లడ్డు సై అనవే నా సరసకు రావే సై అనవే నా సరసకు రావే చెక్కెర తునక కిక్కురుమనక పక్కకు వస్తే చేరుస్తా నే వడ్డు నా లడ్డు గాడిద గుడ్డు బంగారు బాతు గుడ్డు బందారు చెక్కెర లడ్డు తీగ నడుములో రాగమున్నది పాల సొగసులో మీగడున్నది వయసు వరదలా పొంగుతున్నది మనసు మరకలా అంటూ ఉన్నది తుంటరి గుంటా హా హా హా వంటరి గుంటే తుంటరి గుంటా వంటరి గుంటే వంటికి మంచిది కదీపోద్దు లడ్డు నా లడ్డు గాడిద గుడ్డు అబ్బాయ్ ఒళ్ళు ఎలా ఉన్నది అమ్మాయ్ వాటం తెలియకున్నది అబ్బాయ్ ఒళ్ళు ఎలా ఉన్నది అమ్మాయ్ వాటం తెలియకున్నది చెయ్యి తగిలినా చంపపగిలినా తడిమి చూసుకొని పడతావయ్యో రోడ్డు ఓ గీడ్డు గాడిద గుడ్డు బంగారు బాతు గుడ్డు షటప్ బందారు చెక్కెర లడ్డు షటప్ కస్సుమన్నదీ గడుచు చిన్నది కిస్సు కిస్సనీ అడుగు తున్నది పగటి చుక్కలా బెరుకుతున్నది పడుచు డిక్కులా ఎదుటే ఉన్నది లకుముకి పిట్టా కుర్రు కుహూ తికమక పెడితే అహా లకుముకి పిట్టా తికమక పెడితే చిటపట దుమ్ము దులిపేస్తాలే లడ్డు నా లడ్డు గాడిద గుడ్డు హాల్లో మిస్టర్ అడవిరాముడు అల్లరి పెట్టె డ్రైవర్ రాముడు హాల్లో మిస్టర్ అడవిరాముడు అల్లరి పెట్టె డ్రైవర్ రాముడు దాటకపోతే పోతది రాఖీ పిల్లతో లాఠీ చూపిస్తాలే చూడు ఓ జిడ్డు గాడిద గుడ్డు బంగారు బాతు గుడ్డు షటప్ బందారు చెక్కెర లడ్డు షటప్ సై అనవే నా సరసకు రావే సై అనవే నా సరసకు రావే చెక్కెర తునక కిక్కురుమనక పక్కకు వస్తే చేరుస్తా నే వడ్డు డ్డు డ్డు డ్డు గాడిద గుడ్డు
పుట్టింటోళ్ళు తరిమేశారు పాట సాహిత్యం
చిత్రం: వేటగాడు (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు పట్టుమని పదారేళ్ళురా నా సామి కట్టుకుంటే మూడే ముళ్ళురా పట్టుమని పదారేళ్ళురా నా సామి కట్టుకుంటే మూడే ముళ్ళురా అయ్యోపాపం పాపయమ్మ టింగురంగా బంగారమ్మ అయ్యోపాపం పాపయమ్మ టింగురంగా బంగారమ్మ అటు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి కట్టుకథలు చెప్పమాకులే ఆఁ అటు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి కట్టుకథలు చెప్పమాకులే పుట్టింటోళ్ళు తరిమేశారు అయ్యోపాపం పాపయమ్మ కట్టుకున్నోడు వదిలేశాడు టింగురంగా బంగారమ్మ హా గడపదాటిననాడె కడప చేరాను తలకుపోసిన్నాడే తలుపు తీశాను వలపులన్ని కలిపి వంట చేసుంచాను ఇంటి కొస్తే సామి వడ్డించుకుంటాను వడ్డించుకుంటాను అమ్మతోడు ఆదివారం నాడు అన్నమైనా అంటుకోను నేను ఓయబ్బో అమ్మతోడు ఆదివారం నాడు అన్నమైనా అంటుకోను నేను అమ్మమ్మతోడు అర్ధరాతిరి ముద్దుకైనా ముట్టుకోను అమ్మమ్మతోడు అర్ధరాతిరి ముద్దుకైనా ముట్టుకోను ముద్దుకైనా ముట్టుకోను పుట్టింటోళ్ళు తరిమేసారు అయ్యోపాపం పాపయమ్మ కట్టుకున్నోడు వదిలేసాడు టింగురంగా బంగారమ్మ గజ్జెలున్నన్నాళ్ళు ఘల్లుమంటుంటాను రంగమున్నన్నాళ్ళు రంగేసుంకుంటాను తోడు దొరికిన్నాడు గూడు కట్టుకుంటాను నీ మీద ఒట్టు నువ్వే అ... నువ్వే మొగుడనుకుంటాను నువ్వే మొగుడనుకుంటాను అమ్మతల్లి ఆషాఢమాసం అందులోను ముందుంది మూఢం ఓ హోహో అమ్మతల్లి ఆషాఢమాసం అందులోను ముందుంది మూఢం అమ్మబాబోయ్ కాలేను నీతోడు నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ అమ్మబాబోయ్ కాలేను నీతోడు నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ పుట్టింటోళ్ళు తరిమేశారు హాఁ కట్టుకున్నోడు వదిలేశాడు అయ్యోపాపం పాపయమ్మ టింగురంగా బంగారమ్మ
జాబిలితో చెప్పనా... పాట సాహిత్యం
చిత్రం: వేటగాడు (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి గానం: పి. సుశీల, యస్.పి.బాలు జాబిలితో చెప్పనా... జాబిలితో చెప్పనా... జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా... జాబిలితో చెప్పనా... జాబిలితో చెప్పనా... జామురాతిరి కలలోన నీవు రేపిన అలజడి చెప్పనా రాజా... తుమ్మెదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు చుక్కలు చూడని చీకటిలో దిక్కుల కలవని విరహాలు తుమ్మెదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు చుక్కలు చూడని చీకటిలో దిక్కుల కలవని విరహాలు చూపులలో చలి చుర చురలూ ఆ చలి తీరని బిర బిరలూ అన్నీ ఆవిరి పెడుతుంటే నన్నే అల్లరి పెడుతున్నావని చెప్పనా... ఆఁ చెప్పనా... ఆఁ చెప్పనా... జాబిలితో చెప్పనా... జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా... జాబిలితో చెప్పనా... జామురాతిరి కలలోన నీవు రేపిన అలజడి చెప్పనా రాజా... గొంతులు దాటిన గుండెలలో కోయిల పాడని గీతాలు సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు గొంతులు దాటిన గుండెలలో కోయిల పాడని గీతాలు సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు కాగిత కాదని పున్నమలు వెన్నెల వీణల సరిగమలు పేరంటానికి రమ్మంటే పెళ్ళికి పెద్దవు నీవే లెమ్మని చెప్పనా... ఆఁ చెప్పనా... ఆఁ చెప్పనా... జాబిలితో చెప్పనా... జామురాతిరి కలలోన నీవు రేపిన అలజడి చెప్పనా రాజా... జాబిలితో చెప్పనా... జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా... రాజా రోజా రాజా రోజా రాజా
కొండమీన చందమామా పాట సాహిత్యం
చిత్రం: వేటగాడు (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి గానం: పి. సుశీల, యస్.పి.బాలు కొయిలాలో... కొయిలాలో... కొండమీన చందమామా కోనలోన కోయభామ కొండమీన చందమామా కోనలోన కోయభామ పక పక లాడింది నా పట్టు తప్పింది పక పక లాడింది నా పట్టు తప్పింది దీని ముక్కుకు తాడెయ్య బలే చెక్కిలి గిలి దీనందం చుక్కలు మొక్కెయ్య ఈ చక్కని చుక్కే నా సొంతం కొండమీన చందమామా కోనలోన కోయభామ కొండమీన చందమామా కోనలోన కోయభామ తొంగి చూశాడు నా కొంగు లాగాడు తొంగి చూశాడు నా కొంగు లాగాడు ఓహొ వీడి ముక్కుకు తాడెయ్య బలే చెక్కిలి గిలి వీడందం ఓ చుక్కల పక్కెయ్య ఈ దక్కిన దిక్కే నా సొంతం కొండమీన చందమామా కోనలోన కోయభామ ఎండల్లో వానలాగే ఎంటవస్తాను కొండల్లో కోనలాగే జంటగుంటాను ఆ మూడు ముల్లేసి ఈ ముద్దు చెల్లిస్తా ఆ మూడు ముల్లేసి ఈ ముద్దు చెల్లిస్తా ఐదు ప్రాణాల అందం హారతిస్తాను ఏడూ జన్మాల బంధం హారమేస్తాను ఐదు ప్రాణాల అందం హారతిస్తాను ఏడూ జన్మాల బంధం హారమేస్తాను ఈ ముద్దు చెల్లిస్తే ఆ హద్దు చెరిపేస్తా ఈ ముద్దు చెల్లిస్తే ఆ హద్దు చెరిపేస్తా దీని ముక్కుకు తాడెయ్య బలే చెక్కిలి గిలి దీనందం చుక్కలు మొక్కెయ్య ఈ చక్కని చుక్కే నా సొంతం కొండమీన చందమామా కోనలోన కోయభామ కొండమీన చందమామా కోనలోన కోయభామ ఏరంటి నిన్ను చూసి వెల్లువవుతాను వరదల్లే పొంగుతుంటే వంతెనేస్తాను ఎన్నెట్లో గోదారి కౌగిట్లో పొంగిస్తా ఎన్నెట్లో గోదారి కౌగిట్లో పొంగిస్తా ఆకాశ మైతెనువు చుక్క నవుతాను అందాల జాబిలైతే పక్కనుంటాను ఆకాశ మైతెనువు చుక్క నవుతాను అందాల జాబిలైతే పక్కనుంటాను మల్లెల్లో ఇల్లేసి మనసంతా ఇచ్చేస్తా మల్లెల్లో ఇల్లేసి మనసంతా ఇచ్చేస్తా దీని ముక్కుకు తాడెయ్య బలే చెక్కిలి గిలి దీనందం చుక్కలు మొక్కెయ్య ఈ చక్కని చుక్కే నా సొంతం కొండమీన చందమామా కోనలోన కోయభామ పక పక లాడింది నా పట్టు తప్పింది తొంగి చూశాడు నా కొంగు లాగాడు హొ వీడి ముక్కుకు తాడెయ్య బలే చెక్కిలి గిలి వీడందం ఓ చుక్కల పక్కెయ్య ఈ దక్కిన దిక్కే నా సొంతం కొండమీన చందమామా కోనలోన కోయభామ కొండమీన చందమామా కోనలోన కోయభామ కొయిలాలో...
ఓసోసి పిల్ల కోడి పెట్టా పాట సాహిత్యం
చిత్రం: వేటగాడు (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి గానం: పి. సుశీల, యస్.పి.బాలు ఒసోస్ ఓర్ని కూతకొచ్చింది పిట్ట ఓసోసి పిల్ల కోడి పెట్టా నా వయ్యారి పావురాయి పిట్ట ఓసోసి పిల్ల కోడి పెట్టా నా వయ్యారి పావురాయి పిట్ట నువ్వు సందకాడ సన్నజాజులెట్టా నేను సంతకాడ నీకు కన్నుగొట్ట నువ్వు సందెకాడ సన్నజాజులెట్టా నేను సంతకాడ నీకు కన్నుగొట్ట ఒసోస్ ఓర్ని పొగరు మీదుంది గిత్త ఓరోరి పుట్ట తేని పట్టా నా కన్నె ఈడు నీకు తోడు పెట్టా ఓరోరి పుట్ట తేని పట్టా నా కన్నె ఈడు నీకు తోడు పెట్టా నేను సందెకాడ సన్నజాజులెట్టా నువ్వు సంతకాడ నాకు కన్నుగొట్ట నేను సందెకాడ సన్నజాజులెట్టా నువ్వు సంతకాడ నాకు కన్నుగొట్ట చరణం: 1 అయ్యో నీ సోకు చీకటింటా దీపమెట్టా నీ చూపు గుండెలోన గంట కొట్ట వయసుల్లో వసపిట్టా నసపెట్టా మనసుల్లో వలపిట్టా జతకట్టా తైతక్కలాడాల నువ్విట్టా నేనిట్టా ఆహ కైపెక్కి పోవాల ఆ చెట్టు ఈ పుట్ట హోయ్ నీకు ముద్దు మీద ముద్దు నేను పెట్టా అది చుసినోళ్ళు కన్ను కుట్ట అయ్యబాబోయ్ ఇదేంటి నేను సందెకాడ సన్నజాజులెట్టా నువ్వు సంతకాడ నాకు కన్నుగొట్ట ఓసోసి పిల్ల కోడి పెట్టా నా వయ్యారి పావురాయి పిట్ట నేను సందెకాడ సన్నజాజులెట్టా నువ్వు సంతకాడ నాకు కన్నుగొట్ట చరణం: 2 హాయ్ మల్లెపూల పిల్లగాలి మంట పెట్టా హా జంట వలపు జుంటే తేనే వంటపట్టా ఆ మాట వింటే మనసులోన గంట కొట్టా గుటకలోని పులకరింత కొంగు పట్టా వేడెక్కి పోవాల నువ్విట్టా నేనిట్టా డీడిక్కీ లాడాల ఇట్టా ఇట్టిట్టా హో నేను ముద్దు మీద ముద్దు నీకు పెట్టా అది చూసినోళ్ళు కన్ను కుట్ట మళ్ళీ ఇదేంటి నేను సందెకాడ సన్నజాజులెట్టా నువ్వు సంతకాడ నాకు కన్నుగొట్ట ఓసోసి పిల్ల కోడి పెట్టా నా వయ్యారి పావురాయి పిట్ట నేను సందెకాడ సన్నజాజులెట్టా నువ్వు సంతకాడ నాకు కన్నుగొట్ట నువ్వు సందెకాడ సన్నజాజులెట్టా నేను సంతకాడ నీకు కన్నుగొట్ట
ఇది పువ్వులు పూయని తోట పాట సాహిత్యం
చిత్రం: వేటగాడు (1979) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి గానం: యస్.జానకి ఓ...ఓ...ఓ...ఓ... ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట పగిలిన నాగుండెలలో పగిలిన నాగుండెలలో రగులుతున్న రాగం ఈ పాటా... ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట చరణం: 1 పువ్వులకే నవ్వులు నేర్పిన ప్రేమతోట ఇది ఒక నాడు చిగురించన మోడులకు నిదురించని గుండెలలో చితిపేర్చిన వల్లకాడు ఈ నాడు కట్టుకున్న తాళి కోసం కన్న బిడ్డ రోజా కోసం కట్టుకున్న తాళి కోసం కన్న బిడ్డ రోజా కోసం ఇక్కడే...కదులుతూంది వ్యధతో ఒక ప్రాణం ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట చరణం: 2 శీలానికి కాలం మూడి కాలానికి ఖర్మం కాలీ న్యాయానికి గాయం తగిలీ గాయంలో గేయం రగిలి నెత్తురులో దీపం వెలిగే వెలుతురుకే శాపం తగిలే ఇది మాతృహృదయమే మృత్యు నిలయమై ఎగసిన విలయ తరంగం మది రుద్రవీణ నిర్విద్రగానమున పలికే మరణమృదంగం అందుకే... పలుకుతుంది శ్లోకం నా శోకం ఇది పువ్వులు పూయని తోట ఏ ప్రేమకు నోచని కోట