Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Yamagola (1977)




చిత్రం: యమగోల (1977)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: యన్.టి.రామారావు, జయప్రద
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాత: యస్.వెంకటరత్నం
విడుదల తేది: 21.10.1977

(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో పాటలు రాసిన సినిమాలు:
1.యమగోల (1977)
2. మల్లెపువ్వు (1978)
3. విజయ (1979)
4. బొమ్మాబొరుసే జీవితం (1979)
5. చెయ్యెత్తి జై కొట్టు (1979)
6. జూదగాడు (1979)
7. మామా అల్లుళ్ళ సవాల్ (1980) 
8. మంగళ గౌరి (1980) 
ఈ ఎనిమిది సినిమాలలో వీరిద్దరి పేర్లు కనిపిస్తాయి )






Songs List:



ఓలమ్మీ తిక్క రేగిందా పాట సాహిత్యం

 
చిత్రం: యమగోల (1977)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి
పందిరేసి చిందులేసిందా
ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి పిల్ల చిచ్చురేపి
రెచ్చగొట్టిందా కొత్త పిచ్చి పట్టిందా 

గాలికురక కన్నెపిల్ల కన్ను చెదిరిందా
మూరతక్కువ చీర నీకు నిలవనంటుందా
పక్కపలక ఉడుకు నీలో అలిసిపోయిందా
ముట్టుకుంటె ముద్దులయ్యె పట్టుకుంటె జారిపోయె
సిగ్గు వలపు మొగ్గలేసిందా 

రంగు తేలి గిత్త పొగరు రంకె వేసిందా
గంగడోలు తాకితేనే కాలు చూపిందా
కోడె వయసు రొమ్ము విరిచి కొమ్ము విసిరిందా
పట్ట పగలే చుక్క పొడిచె పంటచేను
గట్టు మీద బంతిపూల పక్కవేసిందా

పక్కకొస్తే పడుచునెందుకు అలుసు చేస్తావు
చల్లకొచ్చి ముంత ఎందుకు దచుకుంటావు
వలపులోన కలుపు తీస్తే పదును చూస్తావు
ఆరుబయట అందమంత ఆరబోసి కస్సుమంటు
కన్నెమోజు కట్టు తప్పిందా





చిలక కొట్టుడు కొడితే.. పాట సాహిత్యం

 
చిత్రం: యమగోల (1977)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
చిలక కొట్టుడు కొడితే.. చిన్నదానా..
పలక మారి పోతావే పడుచుదానా
హా...చిలక కొట్టుడు కొడితే.. చిన్నదానా..
పలక మారి పోతావే పడుచుదానా..

అహ .. రాటుతేలిపోయావు.. నీటుగాడా .. అహహహ
రాటి తేలిపోయావు నీటుగాడా..
నీ నాటు సరసం చాలులే పోటుగాడా

హేయ్ చిలక కొట్టుడు కొడితే.. చిన్నదానా..
పలక మారి పోతావే పడుచుదానా

చరణం: 1
మాపటేళా ఆకలేసి ..హా..మంచెకాడ కౌగిలిస్తే..హా..
అబ్బా.. నీ సోకుమాడా..అబ్బో.. ఓయబ్బో..
దబ్బపండంటిదానా .. అమ్మో.. ఓలమ్మో..
జబ్బాల నునుపు చూడ వేడెక్కి ..డీడిక్కి అంటుందిలే... 

అమ్మమ్మ.. అల్లిబిల్లి తీగలల్లే.. అల్లుకుంటే.. ఝల్లుమంటే..
ఊరి పొలిమేరకాడా.. అయ్యో..ఓరయ్యో..
ఊరించుకళ్ళలోనా.. అమ్మో.. ఓలమ్మో..

కవ్వించు నీలి నీడ.. కైపెక్కి.. తైతక్కలాడిందిలే..ఏ.. ఏ ...
అహహహా.. చిలక కొట్టుడు కొడితే.. చిన్నదనా..
పలక మారి పోతావే పడుచుదానా..
అహ ..రాటుతేలిపోయావు.. నీటుగాడా
నీ నాటు సరసం చాలులే పోటుగాడా

చరణం: 2
వలపు వాగు పొంగుతుంటే..హా.. వాడి చూపు వంతెనేసి.. హో..
వలపు వాగు పొంగుతుంటే..హా.. వాడి చూపు వంతెనేసి.. హో..
సపంగి చెట్టు కాడా.. అయ్యో.. ఓరయ్యో..
ఒంపుల్ల సొంపులాడ .. అమ్మో.. ఓలమ్మో..
చెంపల్లో కెంపులన్ని.. ముద్దిచ్చి.. మూటగట్టుకో
అరెరెరె.. కోరికంతా కోక చుట్టి.. కొంగులోనా పొంగు దాచి
కోరికంతా కోక చుట్టి.. కొంగులోనా పొంగు దాచి
ముంత మామిడి గున్న.. అమ్మో.. ఓలమ్మో
రమణీ ముద్దుల గుమ్మ .. అమ్మో.. అమ్మమ్మో
విరబూసి నవ్వింది.. నవ్వులన్ని పువ్వులెట్టుకో.. ఓ ఓ ఓ.. హోయ్

హాయ్..చిలక కొట్టుడు కొడితే.. చిన్నదానా..
పలక మారి పోతావే పడుచుదానా
అహ ..రాటుతేలిపోయావు.. నీటుగాడా
నీ నాటు సరసం చాలులే పోటుగాడా




ఆడవే అందాల సురభామిని పాట సాహిత్యం

 

చిత్రం: యమగోల (1977)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ఆడవే అందాల సురభామిని
ఆడవే అందాల సురభామిని .. పాడవే కళలన్నీ ఒకటేననీ..
ఆడవే అందాల సురభామిని
గానమేదైనా స్వరములొక్కటే..
పనిపస నిసనిగ నిపమగ మపగస మగసని సగని
నాట్యమేదైనా నడక ఒక్కటే .. భాష ఏదైనా భావమొక్కటే ..
అన్ని కళల పరమార్థమొక్కటే .. అందరినీ రంజింపజేయుటే..

ఆ.ఆ.. ఆడవే అందాల సురభామిని...

చరణం: 1
ఓహో రంభా... సకల కళానికురంభా
రాళ్ళనైనా మురిపించే జాణవట.. అందానికి రాణివట
ఏదీ.. నీ హావభావ విన్యాసం
ఏదీ.. నీ నాట్యకళాచాతుర్యం

ఆఆఆ... ఆఆఆ ... ఆఆఆఆఆఆ

అరువది నాలుగు కళలందు మేటిని 
అమరనాథునికి ప్రియ వధూతిని
అరువది నాలుగు కళలందు మేటిని 
అమరనాథునికి ప్రియ వధూతిని

సరసాలలో.. ఈ సురశాలలో 
సరసాలలో.. ఈ సురశాలలో
సాటిలేని శృంగార వాసిని 

నిత్యనూతన రాగ స్రవంతిని.. 
రసవంతిని జయ జయవంతిని 
రసవంతిని.. జయ జయవంతిని

చరణం: 2
ఆడవే అందాల సురభామిని 
పాడవే కళలన్నీ ఒకటేననీ
ఆడవే అందాల సురభామిని
ఓహో ఊర్వశీ.. అపురూప సౌందర్య రాశి
ఏదీ..  నీ నయన మనోహర నవరస లాస్యం
ఏదీ..  నీ త్రిభువన మోహన రూప విలాసం
మదనుని పిలుపే నా నాదము
స్మర కదన శాస్త్రమే నా వేదము
మదనుని పిలుపే నా నాదము 
స్మర కదన శాస్త్రమే నా వేదము
కనువిందుగా .. కరగని పొందుగా
కోటి స్వర్గాలు చూపించు నా స్నేహము

అంతులేని శృంగార పిపాసిని
రతరాల మీ ప్రేయసిని... చారుకేశిని..

చరణం: 3
ఆడవే అందాల సురభామిని
పాడవే కళలన్నీ ఒకటేననీ
ఆడవే అందాల సురభామిని

ఓహో మేనకా!.. మదన మయూఖా
సాగించు నీ రాసలీలా.. చూపించు శృంగార హేలా  
సాగించు నీ రాసలీలా
నగవులతో మేని బిగువులతో...
నగవులతో మేని బిగువులతో.. 
వగలొలికించు వయ్యారి నెరజాణను
ఏ చోట తాకినా... ఏ గోట మీటినా
మధువులొలికించు మరులు చిలికించు

మధురమైన రసవీణను
రతిరాజ కళా ప్రవీణను... సారంగలోచనను..

ఆడవే అందాల సురభామిని
పాడవే కళలన్నీ ఒకటేననీ
ఆడవే అందాల సురభామిని 





గుడివాడ ఎల్లాను పాట సాహిత్యం

 
చిత్రం: యమగోల (1977)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి 
గానం: పి.సుశీల

గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూసాను
ఏడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు
సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు

కమ్మని పాట చక్కని ఆట కావాలంటారు కొందరు బుద్దిగ ఉంటారు
కసి కసిగా హా కొందరు నన్ను పాడమంటారు పచ్చిగ ఆడమంటారు
నచ్చారంటె జై కొడతారు నచ్చకపోతే చీ కొడతారు
పిచ్చి పిచ్చిగా పైపడతారు దుమ్ము కాస్తా దులిపేస్తారు
పోకిరోళ్ళు యమ పోజుగాళ్ళు
ఓ యబ్బో పోకిరోళ్ళు యమ పోజుగాళ్ళు
గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
చిత్తూరు పుట్టూరు ఎన్నెన్నో చూసాను 

బందరులోనా అందరిలోనా రంభవి అన్నాడు ఒకడు రావే అన్నాడు
వైజాకు బాబు చేసాడు డాబు రేటెంతన్నాడు ఆటకు రేటెంతన్నాడు
కాకినాడలో గల్లంతాయె తిరపతి లోనా పరపతి పోయే
అన్రై మెప్పు పొందాలంటె దేవుడైకైన తరం కాదు
ఆ యముడికైనా తరం కాదు
గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అమ్మమ్మో గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
ఒంగోలు వరంగల్లు ఎన్నెన్నో చూసాను




సమరానికి నేడే ప్రారంభం... పాట సాహిత్యం

 
చిత్రం: యమగోల (1977)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: యస్.పి. బాలు

పల్లవి:
సమరానికి నేడే ప్రారంభం... యమరాజుకు మూడెను ప్రారబ్ధం
సమరానికి నేడే ప్రారంభం... యమరాజుకు మూడెను ప్రారబ్ధం
నరలోకమున కార్మిక శక్తికి.. తిరుగే లేదని చాటిద్దాం
ఇంక్విలాబ్‌.. జిందాబాద్‌.. కార్మిక సంఘం జిందాబాద్‌

లెఫ్ట్‌.. రైట్‌.. లెఫ్ట్‌.. రైట్‌

చరణం: 1
యముడి నిరంకుశ పాలన వద్దు.. యమ అర్జెన్సీ ఇకపై రద్దు
యముడి నిరంకుశ పాలన వద్దు.. యమ అర్జెన్సీ ఇకపై రద్దు
వెట్టిచాకిరికి తలపై మొట్టు... వెయ్యండర్రా అందరు ఒట్టు
ఒట్టు ఒట్టు ఒట్టు ఒట్టు
భూలోకమె మన పుణ్యతీర్థమని.. భూలోకమె మన పుణ్యతీర్థమని
నరుడే గురుడని పూజిద్దాం...

భూలోకం జిందాబాద్.. భూలోకం జిందాబాద్.. జయహో నరుడా
సమరానికి నేడే ప్రారంభం... యమరాజుకు మూడెను ప్రారబ్ధం

చరణం: 2
కోరలు కొమ్మలు మీకిక వద్దు.. రంగుల తేడా లసలే వద్దు
కోరలు కొమ్మలు మాకిక వద్దు.. రంగుల తేడా లసలే వద్దు
జనతకు సమతను సాధించాలి.. చట్టం మార్చే ఓటుండాలి
ప్రజాస్వామ్యమును మన సౌధానికి.. పునాది రాళ్ళను పరిచేద్దాం..

సమరానికి నేడే ప్రారంభం... యమరాజుకు మూడెను ప్రారబ్ధం
సమరానికి నేడే ప్రారంభం... యమరాజుకు మూడెను ప్రారబ్ధం

నరలోకమున కార్మిక శక్తికి.. తిరుగే లేదని చాటిద్దాం 
ఇంక్విలాబ్‌.. జిందాబాద్‌.. కార్మిక సంఘం జిందాబాద్‌
జయహో నరుడా.. జయహో నరుడా



వయసు ముసురుకొస్తున్నదీ.. పాట సాహిత్యం

 
చిత్రం: యమగోల (1977)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

పల్లవి:
ఏహే..హే..హే..హే..ఆహా హా హా ఆహా అహా హా
వయసు ముసురుకొస్తున్నదీ.. వాన మబ్బులా
సొగసు దూసుకొస్తున్నది.. సూది మెరుపులా
వయసు ముసురుకొస్తున్నదీ.. వాన మబ్బులా
సొగసు దూసుకొస్తున్నది.. సూది మెరుపులా

అయ్య బాబో..య్ ఆగలేనూ..
ఆ ముసురూ.. ఈ విసురూ..ఊ..ఊ..ఊ ఆపలేను..ఊ..ఊ

చరణం: 1
కన్నుల తెర తీసి.. వెన్నెల వల వేసీ
కన్నుల తెర తీసి.. వెన్నెల వల వేసీ
ప్రాణం లాగేసి .. పోతే ఎలా...
యేటి కాడ కన్నుకొట్టి.. తోట కాడ చేయిపట్టి
యేటి కాడ కన్నుకొట్టి.. తోట కాడ చేయిపట్టి
నా పైట ఈ పూట నాజూకుగా లాగి పట్టి
మెలికేస్తే..ఎలా..ఎలా..పెనవేస్తే ఎలా ఎలా

అయ్య బాబోయ్ ఆగ లేనూ
ఆ ముసురూ..ఈ విసురూ..ఊ..ఊ..ఆపలేనూ..

చరణం: 2
చెంపలు నిమిరేసీ....సిగ్గులు కాజేసీ..
చెంపలు నిమిరేసీ....సిగ్గులు కాజేసీ..
నిప్పులు చెరిగేసి పోతే ఎలా.....
నిన్న కలలో వెన్ను తట్టి.. మొన్న కలలో ముద్దు పెట్టి..
నిన్న కలలో వెన్ను తట్టి.. మొన్న కలలో ముద్దు పెట్టి..
ఆపైనా నాలోన తీపి సెగలే రగులబెట్టి
ఊరుకుంటే ఎలా..ఎలా..జారుకుంటే ఎలా..ఎలా..
అయ్యబాబోయ్ ఆగలేనూ..
ఆ ముసురూ...ఈ విసురూ.. ఆప లేనూ..

Most Recent

Default