Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Yuvasena (2004)




చిత్రం: యువసేన (2004)
సంగీతం: జెస్సి గిఫ్ట్
నటీనటులు: భరత్, శర్వానంద్, కిషోర్, పద్మకుమార్, రేవతి, గోపిక
దర్శకత్వం: జయరాజ్
నిర్మాత: స్రవంతి రవికిషోర్
విడుదల తేది: 12.11.2004



Songs List:



మల్లీశ్వరివే మధురాశల మంజరివే పాట సాహిత్యం

 
చిత్రం: యువసేన (2004)
సంగీతం: జెస్సి గిఫ్ట్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: జెస్సి గిఫ్ట్

Watch watch on watch on
Watch this dup dup dup style
I'am gonna dip dip dip it into your smile
Hold me baby just hold my hand forever and ever
Every time i wanna see you my girl

ఆ...ఆ... ఆ...
మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే
తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా
వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా
చక్కనైన మల్లికవొ
హే చిక్కులు పెట్టే అల్లికవో
పోలికలో పసిబాలికవే
చురకత్తుల చుపులున్నా

మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే హో

నీ కళ్ల నింగి లో పున్నాల పొంగులో
వేవేల తారకలే జలకమాడుతున్నవో
నాలోని కోరికలే మునిగి తేలుతున్నవో
సింగారి చెంపలో కెంజాయ సొంపులో
వెచ్చనైన వేడుకలే మేలుకొలుపు విన్నవో
నిదరలో ఉదయం ఎదురయే సమయం
ఎదకు ఇంద్రజాలమేదో  చూపుతోందె సోయగమా

Baby don't you ever leave i'm your Dhanaraja
Dhanaraja
Come on any time u're my dilruba
I can never stop this feeling i'm u 're Dhanaraja
Dhanaraja
Yeah... hey... hey... hey

మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే హో

Yo Baby run your body with this freaky 
Thin and i won't let u go and i won't let u down
Through the fire the limit to the wall ? 
Just to be with u i'm gladly risk it all
Ha, let me do it one more time do it one more time
Ha baby, come on and lets get it into the party

కొల్లేటి సరసులో తుళ్లేటి చేపలై
రంగేళి కులుకులెన్నో తళుకులీనుతున్నవే
నా కొంగ జపము చూచి ఉలికి పడుతు ఉన్నవే
ఎన్నేసి మెలికలో ఎరవేసి నన్నిలా
ఏ వైపు చుపు తిప్పనీక చంపుతున్నవే
వదలదే హృదయం కదలదే నిమిషం 
చిగురు పెదవి చిలిపి స్వరము తెలపవె సౌందర్యమా

మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే
తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా
వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా
చక్కనైన మల్లికవొ
హే చిక్కులు పెట్టే అల్లికవో
పోలికలో పసిబాలికవే
చురకత్తుల చుపులున్నా

మల్లీశ్వరివే మధురాశల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే హో





స్వప్నాలను పిలిచే చేతులివి పాట సాహిత్యం

 
చిత్రం: యువసేన (2004)
సంగీతం: జెస్సి గిఫ్ట్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సందీప్

Its an open passage - for the people
hey it's a message - for the people
Yo, full of passion - for the people
Its an open passage - for the people
hey it's a message - for the people

As a token of love here we goes out to all the people
with different colours of truth
minds of crreeping darkness and heart shatterred promises
we are on the look out to find an another race and
turn out the world from groove danger
its an open passage - for the people
hey it's a message - for the pepple
yo, full of passion - for the pepple
Need for the salvation to come...
Greed for the notion to change
making the grave for the blind
and bring a newer kingdom
oh ya.. go.. go.. go.. 

స్వప్నాలను పిలిచే చేతులివి
సత్యాలుగ మలిచే చేతలివి
నిట్టూరుపు తెలియని ఆశలివి 
Oh chaogs every where baby
we wanna getting back ot the
good time ever, lady

కన్నీళ్ళను తుడిచే చెలిమవుతాం 
కష్టాలను గెలిచే బలమౌతాం... 
కలకాలం నిలిచే కధలవుతాం
మన రేపటి కోసం 

Ohh.. go.. go.. go..
yeah we wanna shake
The world witnin the thom of pity baby
cheak out the new light sun, you my baby
Open your eyes and close your dreams
hold the faith and fight for the land now
yeah we wanna shake the world
Shake, shake shake the world now
shake it now
shake it now.. shake it now

leavin the shaken hope behind
showing the courage to win
one love for each and every one
one need for love and peace and joy

మా వాదం గీతకి అనువాదం
మా క్రోదం శాంతికి అభివాదం
మా స్వేదం స్వేచ్చకి అభిషేకం
go.. go.. go..

మా నాదం నవతకి చైత్ర స్వరం
మా పాదం భవితకి భానురధం
మా పయనం ప్రగతికి ధర్మపధం
తొలి అడుగెయ్ నేస్తం




ఓణీ వేసుకున్న పాట సాహిత్యం

 
చిత్రం: యువసేన (2004)
సంగీతం: జెస్సి గిఫ్ట్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: జెస్సి గిఫ్ట్, హాయ్ రబ్బా స్మిత

ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే బల్లే బల్లే
బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే బల్లే బల్లే
రాణీకాసులన్నీ కళ్ళనిండా రాలుతుంటే బల్లే బల్లే
కానీ ఖర్చులేని అల్లరిట్టా తుళ్ళుతుంటే బల్లే బల్లే

యే హ చాంద్ క టుక్ డా
ఏదో చెయ్యవేంది పోరడా
నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా
ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా

ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే బల్లే బల్లే
బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే బల్లే బల్లే
నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా
ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా

మణులున్న గనిలాంటి నిగనిగల సిరి వగల
కలవారి కామాక్షి నువ్వే కదా
కలలంటి కళలన్నీ మా కళ్ళకిచ్చేసి
నిరుపేద లోలాక్షివయ్యావుగా
బట్టల్లో పొదుపంటే నాకిష్టం
అందాలపై అదుపు అంతే కష్టం
బొత్తాలు మానేసి లోకానికి
చిన్నిమొత్తాల పొదుపంటే చూపావులే

ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే బల్లే బల్లే
బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే బల్లే బల్లే
యే హ చాంద్ క తుక్డా
ఏదో చెయ్యవేంది పోరడా
నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా
ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా

తల్వారు తళుకుల్తో నిలువెల్లా కోస్తుంటే
ఆ తీపిగాయాలు మానేదెలా
జలతారు సొంపుల్తో జాదూలు చేస్తుంటే
ఆ చిలిపి జాతర్ని ఆపేదెలా
ఇన్నిన్ని అందాలు నా నేరమా
జాలేసి చూపిస్తే నిష్ఠూరమా
నీకున్న జనశక్తి సామాన్యమా
నిన్ను చూశాక మతి చెడితే విడ్డూరమా

ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే బల్లే బల్లే
బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే బల్లే బల్లే
యే హ చాంద్ క తుక్డా
ఏదో చెయ్యవేంది పోరడా
నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా
ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా

ఓణీ వేసుకున్న పూలతీగ ఊగుతుంటే బల్లే బల్లే
బోణీ చేసుకున్న తేనెటీగ తూగుతుంటే బల్లే బల్లే
నీకు ఆశ ఉంటే చెయ్యివెయ్యి చెప్పకుండా
ఇట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా





లోకాస్సమాస్తా స్సుఖినోభవంతు పాట సాహిత్యం

 
చిత్రం: యువసేన (2004)
సంగీతం: జెస్సి గిఫ్ట్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సందీప్

Hey... here we go man
Now every body comes and listen to this little thing of reality
And we gonna fight against the devils of humanity
and yo,
now its time to go and it the flames for the future
But don't fear the things that feared before
Are you ready
Now it's time to kick some dirt off the ground, yeah

లోకాస్సమాస్తా స్సుఖినోభవంతు
ఆ వేదం మా ఎద నాదం
ఆ మాటకర్థం ఇదిగో ఇదంటూ
చూపాలి మన జీవితం
అందర్లా నిద్దర్లో ఉండిపోక
చీకట్నే వేటాడుతాం
పాపాన్నే పసికట్టే చూపులతో 
పాగా కాస్తూనే వుంటాం హో హో హో

లోకాస్సమాస్తా స్సుఖినోభవంతు
ఆ వేదం మా ఎద నాదం

Hey it's a hot shot
its so hot hot...

ఎప్పటికఫ్ఫుడు తప్పుని తప్పని చెప్పక తప్పదుగా
పచ్చని పైరుకు పట్టిన చీడను తుంచక తప్పదుగా
నీతికి చితిబెట్టే చేతికి నిప్పంటే చెబుతాం
నెత్తురు చవిచూపే కత్తికి నొప్పిని చూపెడతాం
చేస్తున్నాం ధర్మమని తోచిందేదో
ఫలితం ఏదైనా మేం సిద్దం

అందరికీ అమృతమందేలా గరళం సేవిస్తాం
అందరి భారం శిలువై మోసిన కరుణై గర్విస్తాం
రాత్రిని కరిగించే, వేకువ కోసం మా పయనం
ధాత్రిని రక్షించే క్షాత్రవ సైన్యం మా ధైర్యం

Hey it's a hot shot
It's  so hot hot...       

లోకాస్సమాస్తా స్సుఖినోభవంతు
ఆ వేదం మా ఎద నాదం
అందర్లా నిద్దర్లో వుండిపోక
చీకట్నే వేటాడుతాం

Hey it's a hot shot
It's  so hot hot... 




Mallewsarive Remix పాట సాహిత్యం

 
Mallewsarive Remix

చిత్రం: యువసేన (2004)
సంగీతం: జెస్సి గిఫ్ట్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: జెస్సి గిఫ్ట్

Malleeswarive (Remix)




ఏ దిక్కున నువ్వున్నా పాట సాహిత్యం

 
చిత్రం: యువసేన (2004)
సంగీతం: జెస్సి గిఫ్ట్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: జెస్సి గిఫ్ట్

జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే (4)

ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా
నా రెక్కల కలనాపే బలమేది లేదు సుమా...
పొంగే అలవొస్తే తలవంచాలి
వయసూ అలలాంటిదేగా
ప్రాయం వెనకాలే పయనించాలి
ప్రణయం వెన్నాడి రాగా

జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే (2)

సరిగరిసరి సరిగ సరిగ రిసరి సరిగ సరి సరిగమ (2)

ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా
నా రెక్కల కలనాపే బలమేది లేదు సుమా...

చరణం: 1
గిరులే వణికే జలపాతంలో జోరు
నీలో చూశా బంగారూ
ఎదిగే సొగసై ఎదురొస్తే పదహారు
అలలై ఎగిసే ఎదహోరు
వర్ణాల విల్లులో ఒక్కోరంగు తీసి
వయ్యారి ఒంటికి పూసిందెవరు?
మనసే చెడక నిలిచే నరవరులెవరు

జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే (4)

చరణం: 2
మధువే తొణికే అధరం మధుకలశం
మౌనం కూడా ప్రియమంత్రం
అపుడూ అపుడూ తెగిపడనీ ఒక ముత్యం
వెనకే తిరిగా ప్రతినిత్యం
ఆ చిలక పలుకులే అలా అలా ఏరి
నాలోని తలపులే స్వరాలు చేసి
నీకే ఇస్తా సఖియా కవితలు కూర్చి...

జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే  (4)

ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా
నా రెక్కల కలనాపే బలమేది లేదు సుమా...
పొంగే అలవొస్తే తలవంచాలి
వయసూ అలలాంటిదేగా
ప్రాయం వెనకాలే పయనించాలి
ప్రణయం వెన్నాడి రాగా

జిల్లేలే జిల్లేలే జుంతతకిట జిల్లేలే (2)
సరిగరిసరి సరిగ సరిగ రిసరి సరిగ సరి సరిగమ (2)

ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా
నా రెక్కల కలనాపే బలమేది లేదు సుమా...


Most Recent

Default