చిత్రం: ఆహ్వానం (1997) సంగీతం: ఎస్.వి కృష్ణారెడ్డి నటీనటులు: శ్రీకాంత్ , రమ్యకృష్ణ , హీరా దర్శకత్వం: ఎస్.వి కృష్ణారెడ్డి నిర్మాత: టి.త్రివిక్రమ రావు విడుదల తేది: 02.05.1997
Songs List:
దేవతలారా రండి పాట సాహిత్యం
చిత్రం: ఆహ్వానం (1997) సంగీతం: ఎస్.వి కృష్ణారెడ్డి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర పల్లవి: దేవతలారా రండి మీ దీవెనలందించండి నోచిన నోములు పండించే నా తోడును పంపించండి కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతి రాడనిపించే వరున్నే వరముగ ఇవ్వండి కనీవినీ ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతి రాడనిపించే వరున్నే వరముగ ఇవ్వండి కనీవినీ ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి చరణం: 1 శివ పర్వతులేమో ఈ దంపతులనిపించాలి ప్రతి సంసారంలోను మా కథలే వినిపించాలి ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి శ్రీకాంతుల కొలువంటే మా కాపురమనిపించాలి మా ముంగిలిలోన పున్నమి పూల వెన్నెల విరియాలి మా చక్కని జంట చుక్కలతోట పరిపాలించాలి కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతి రాడనిపించే వరున్నే వరముగ ఇవ్వండి కనీవినీ ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి చరణం: 2 తన ఎదపై రతణంలా నిను నిలిపే మొగుడొస్తాడు నీ వగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు తన ఇంటికి కళ తెచ్చే మహాలక్ష్మిగ పూజిస్తాడు తన కంటికి వెలుగిచ్చే మణి దీపం నీవంటాడు ఈ పుత్తడి బొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతిచోట నిధి నిక్షేపాలు నిద్దురలేచి ఎదురొచ్చేనంటా కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతి రాడనిపించే వరున్నే వరముగ ఇవ్వండి కనీవినీ ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి దేవతలారా రండి మీ దీవెనలందించండి నోచిన నోములు పండించే నా తోడును పంపించండి కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతి రాడనిపించే వరున్నే వరముగ ఇవ్వండి కనీవినీ ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి
పందిరి వేసిన ఆకాశానికి పాట సాహిత్యం
చిత్రం: ఆహ్వానం (1997) సంగీతం: ఎస్.వి కృష్ణారెడ్డి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం నువ్వు రామ్మా ఓ వేదమా విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేరు చేయుమా దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం ప్రతి మనువూ స్వర్గంలో మునుముందే ముడిబడుతుందా ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్యా నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా నువ్వు రామ్మా ఓ అరుంధతి ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా నిజంగా పెళ్లికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మా పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం చితిమంటల సహగమనం ఒకసారే బలి చేస్తుంది పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు నువ్వు రామ్మా మాంగల్యమా వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళ్లకు విడాకుల వేడుకలో నేడు తెంపడం నేర్పడానికి పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
హాయ్ హాయ్ నాయక పాట సాహిత్యం
చిత్రం: ఆహ్వానం (1997) సంగీతం: ఎస్.వి కృష్ణారెడ్డి సాహిత్యం: సిరివెన్నెల గానం: హరిహరన్, చిత్ర హాయ్ హాయ్ నాయక
మనసా నా మనసా పాట సాహిత్యం
చిత్రం: ఆహ్వానం (1997) సంగీతం: ఎస్.వి కృష్ణారెడ్డి సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర మనసా నా మనసా
ఎలాలోయి పాట సాహిత్యం
చిత్రం: ఆహ్వానం (1997) సంగీతం: ఎస్.వి కృష్ణారెడ్డి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర ఎలాలోయి
శ్రీరస్తు శుభమస్తు పాట సాహిత్యం
చిత్రం: ఆహ్వానం (1997) సంగీతం: ఎస్.వి కృష్ణారెడ్డి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వస్తిశ్రీ చాంద్రమానేనా శ్రీ ధాత్రు నామ సంవత్సర మార్గశిర శుద్ధ శనివారం అనగా తేదీ 14-12-96న శ్రవణ నక్షత్రయుగ్న ధనుర్లఘ్నమందు ఉ.07:13 ని.లకు వివాహమునకు సుముహూర్తముగా నిర్ణయించడమైనది. హా సువ్వి… ఆహా సువ్వి హా సువ్వి… ఆహా సువ్వి ఆకాశం పందిరి వేసింది… ఈ నేలమ్మ పీటను వేసింది జరిగే వైభోగం రమ్మంది… జనులారా కనులారా చూడండి మంగళవాద్యాలు పిలుపులు అందించగ ముంగిట మురిపాలు కళకళలాడగ పచ్చగ పెళ్ళయ్యే ముహూర్తమె తథాస్తంది ఆకాశం పందిరి వేసింది ఈ నేలమ్మ పీటను వేసింది హా సువ్వి… ఆహా సువ్వి హా సువ్వి… ఆహా సువ్వి నలుగురూ చేరి నలుగుపెట్టరే చిన్నారిని జలకాలాడించరే ముద్దుగా ముస్తాబును చెయ్యరే బుగ్గమీద పెళ్ళిచుక్క దిద్దరే వరుడితొ మగపెళ్ళివారు… తయ్యారు విడిదికి వియ్యాలవారు… వచ్చారు మనవిని మన్నించి… మనువుకి రండయ్యా, ఆ ఆఆ పప్పన్నం పెడతాం… దయచేయండయ్యా అడిగినవన్నీ ఇచ్చి కన్యాదానం చేస్తామయ్యా ఆకాశం పందిరి వేసింది ఈ నేలమ్మ పీటను వేసింది హా సువ్వి… ఆహా సువ్వి హా సువ్వి… ఆహా సువ్వి గౌరీపూజను చేసి… చేసి నీ కోసం నోములు నోచి… నోచి కులుకుల కాణాచి… అదిగో వచ్చింది, ఈ ఈఈ తెరవెనుకన వేచి… కలలే కంటోంది పరిణయ ప్రమాణమే… చేసి పొందమంటోంది ఆకాశం పందిరి వేసి… ఈ నేలమ్మ పీటను వేసింది ధర్మే త్వయా యేశ నాతిచరితవ్యా (ధర్మే త్వయా యేశ నాతిచరితవ్యా) అయ్య..! నాతిచరామి అనండి… నాతిచరామి అర్థేత్వయా యేశ నాతిచరితవ్యా (అర్థేత్వయా యేశ నాతిచరితవ్యా)… నాతిచరామి కామేత్వయా యేశ నాతిచరితవ్యా (కామేత్వయా యేశ నాతిచరితవ్యా)… నాతిచరామి అయ్యా ఈ మంత్రాలు అంటున్నారు అనమంటున్నారుగాని, మరి వాటికి అర్థాలు తెలియాలి కదండీ చెబుతారా? అలాగే..! ధర్మార్థకామములలోన ఏనాడూ, ఈమె తోడును నీవు విడిచిపోరాదు. నీ బాస చేసి ఇక నిండు నూరేళ్ళు, ఈ సతికి నీడవై నిలిచి కాపాడు. మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! నా జీవితానికే అధారము… అయి నిన్నుఅల్లింది ఈ దారం నీ మెడను వాలు ఈ మాంగల్యము… నా శాంతి సౌఖ్యముల సంకేతము ఈ సూత్రముతో నీవు చిరకాలము… వర్ధిల్లితే నాకు అది క్షేమము ధృవంతే రాజా వరుణో ధృవం దేవో బృహస్పతిః ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధృవం॥ ఈ జన్మలో ఇంక విడని ముడివేసి కలిపారు దేవతలు దివినుంచి చూసి ఈ బ్రహ్మముడి ఇద్దరిని ఒకటి చేసి దాంపత్య రాజ్యాన్ని ఏలమంటోంది
నీ మనసులో మాట పాట సాహిత్యం
చిత్రం: ఆహ్వానం (1997) సంగీతం: ఎస్.వి కృష్ణారెడ్డి సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర, కైకాల సత్యన్నారాయణ, నిర్మలమ్మ, ప్రసన్న కుమార్ నీ మనసులో మాట
మిన్సారే మిన్సారే పాట సాహిత్యం
చిత్రం: ఆహ్వానం (1997) సంగీతం: ఎస్.వి కృష్ణారెడ్డి సాహిత్యం: భువనచంద్ర గానం: హరిహరన్ , చిత్ర, మిన్సారే మిన్సారే