చిత్రం: ఆకాశమంత (2009) సంగీతం: విద్యా సాగర్ నటీనటులు: త్రిష , ప్రకాష్ రాజ్, ఐశ్వర్య, జగపతిబాబు దర్శకత్వం: రాధా మోహన్ నిర్మాత: దిల్ రాజు విడుదల తేది: 27.03.2009
Songs List:
ఒకానొక ఊరిలో పాట సాహిత్యం
చిత్రం: ఆకాశమంత (2009) సంగీతం: విద్యా సాగర్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: కైలాష్ ఖేర్ ఒకానొక ఊరిలో
ఆటలపాటల నవ్వుల పాట సాహిత్యం
చిత్రం: ఆకాశమంత (2009) సంగీతం: విద్యా సాగర్ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ గానం: మధు బాలకృష్ణన్ ఆటలపాటల నవ్వుల పుత్తడి బొమ్మరా .. బొమ్మరా ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా .. అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా .. లోకాన్ని కొత్తగ చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా .. చల్లనీ హాయినందిస్తా (2) అడుగులే పడుతుంటే .. ఎదనిలా తడుతుంటే మధురమౌ భావాలేవో మోగే లోలోనా .. పలుకులే పైకొస్తే .. చిలిపిగా పిలుపిస్తే పులకలే పదులై వేలై పొంగే నాలోనా .. లాలిపాటే నేనై .. లాలపోసే వాణ్ణై లాలనే నింపనా లేత హృదయానా ! ఎగురుతూ నీ పాదం .. ఎదుగుతూ నీ రూపం ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం అడుగుతూ కాసేపూ .. అలుగుతూ కాసేపూ అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం క్షణములెన్నౌతున్నా .. వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే నాన్న నయనానా !
వీచే గాలి మాపై పాట సాహిత్యం
చిత్రం: ఆకాశమంత (2009) సంగీతం: విద్యా సాగర్ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ గానం: సాధనా సర్గమ్ వీచే గాలి మాపై
దూరం కావాలా పాట సాహిత్యం
చిత్రం: ఆకాశమంత (2009) సంగీతం: విద్యా సాగర్ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ గానం: యస్.పి.బాలు దూరం కావాలా నన్నే విడిచీ వేరై పోవాలా అన్నీ మరిచీ ఎప్పుడూ ఒదిగే ఎదపై విసిగీ దూరం కావాలా నన్నే విడిచీ వేరై పోవాలా అన్నీ మరిచీ వేలుని వీడని చేతుల వత్తిడి ఇంకా మరి గురుతుందే లాలికి వాలిన రెప్పల సవ్వడి ఇంకా వినిపిస్తుందే గుండెల అంచున పాదము తాకిడి ఇంకా నను తడిమిందే పూటకి పూటకి పండగలౌ గతమింకా తరిమిందే ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా నువ్వే లోకం నీ నాన్నగా నా ప్రేమలో ఉందా లోపం వేరే దారే వెతికీ .. దూరం కావాలా నన్నే విడిచీ వేరై పోవాలా అన్నీ మరీచి నమ్మిన వెంటనే తొందర పాటున నువ్వే మనసిచ్చావా నా ప్రతి ఊపిరి నీ ప్రాణములో ఉంచానని మరిచావా నాన్నని మించిన చల్లని ప్రేమని నీకే పంచిస్తాడా కన్నుల చాటున మెల్లగ పెంచిన నిన్నే తను కాస్తాడా నే కోరిన తీరాలనే చూశావేమో నీ దారిలో ఆ తీరమే చేరావేమో అయినా అయినా వెళుతూ .. దూరం కావాలా నన్నే విడిచీ వేరై పోవాలా అన్నీ మరిచీ ఎప్పుడూ ఒదిగే ఎదపై విసిగీ దూరం కావాలా నన్నే విడిచీ వేరై పోవాలా అన్నీ మరిచీ
చిన్నమ్మ కళ్యాణం పాట సాహిత్యం
చిత్రం: ఆకాశమంత (2009) సంగీతం: విద్యా సాగర్ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: కైలాష్ ఖేర్ చిన్నమ్మ కళ్యాణం