చిత్రం: ఆరాధన (1987) సంగీతం: ఇళయరాజా నటీనటులు: చిరంజీవి , సుహాసిని, రాధిక దర్శకత్వం: భారతీరాజ నిర్మాత: అల్లు అరవింద్ విడుదల తేది: 27.03.1987
Songs List:
హాయ్ జమకు జామ్మ పాట సాహిత్యం
చిత్రం: ఆరాధన (1987) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: ఎస్. జానకి హాయ్ జమకు జామ్మ
ఏమౌతుందీ పాట సాహిత్యం
చిత్రం: ఆరాధన (1987) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, జానకి ఏమౌతుందీ తన మనసుని మరచిన మనసెటు వెలుతోందీ ఏమౌతుందీ తన ప్రాణం విడిచి దేహం వెలుతోంది కలలన్ని కరిగాక కనులేల అంటుందీ ఇక వెన్నెలలేని పున్నమి మిగిలింది ఎమౌతుందీ తన మనసుని మరచిన మనసెటు వెలుతోందీ ఎమౌతుందీ దిక్కులేని జీవం పిలుపు దిక్కులన్ని మూగిందీ దిక్కుమారి పోయె వలపు మారు పలకలేకుందీ మనసు రాయి చేసుకున్న మమత గ్ష మానుకుంది కల్ల నీల్లు దాచుకున్న కలల బరువు తీరకుంది మూగ ప్రెమ మోసబోయి మోడు బారిపొయిందీ పాడుతున్న పాట మరీచి గొంతు పూడిపోయిందీ శ్ర్తి తప్పిందీ ఎమౌతుందీ తన ప్రాణం విడిచి దేహం వెలుతోంది ఎమౌతుందీ తన మనసుని మరచిన మనసెటు వెలుతోందీ పూవులెన్ని పూస్తువున్న ముల్లు నాకు దక్కిందీ పూజచేయు కోరికున్న కోవెలేమొ కూలిందీ దేవిలెని కోవెలుంది దీపమేమొ ఆరుతొంది చమురు పోయు చేయి ఉంది ప్రమిద దానికందకుంది నన్ను చుట్టి చీకటున్న నేను కాలిపోతున్న వెలుగులోకి వెలుతూవున్న నేను చీకటౌతున్న ఇది తుది అవునా ఏమౌతుందీ తన మనసుని మరచిన మనసెటు వెలుతోందీ ఏమౌతుందీ తన ప్రాణం విడిచి దేహం వెలుతోంది కలలన్ని కరిగాక కనులేల అంటుందీ ఇక వెన్నెలలేని పున్నమి మిగిలింది ఎమౌతుందీ తన మనసుని మరచిన మనసెటు వెలుతోందీ ఎమౌతుందీ
తీగనై మల్లెలు పాట సాహిత్యం
చిత్రం: ఆరాధన (1987) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, జానకి తీగనై మల్లెలు పూచిన వేళ ఆగనా అల్లనా పూజకో మాల మనసు తెర తీసినా మోమాటమేనా మమత కలబోసినా మాట కరువేనా తీగనై మల్లెలు పూచిన వేళ ఆగనా అల్లనా పూజకో మాల తెలిసీ తెలియందా ఇది తెలియక జరిగిందా ఎపుడో జరిగిందా అది ఇపుడే తెలిసింద ఆశ పడ్డా అందుతుందా అర్హతైనా ఉందా అందుకున్నా పొందికుందా పొత్తు కుదిరేనా ప్రేమకన్నా పాశముందా పెంచుకుంటే దోషముందా తెంచుంకుంటే తీరుతుందా పంచుకొంటే మరిచేదా కలలో మెదిలిందా ఇధి కధలో జరిగిందా మెరుపై మెరిసిందా అది వలపై కురిసిందా రాసి ఉంటే తప్పుతుందా తప్పు నీదవునా మారమంటే మారుతుందా మాసిపోతుంద చేసుకున్నా పుణ్యముందా చేరుకొనే దారి ఉందా చేదుకొనే చేయి ఉందా చేయి చేయి కలిసేన తీగనై మల్లెలు పూచిన వేళ ఆగనా అల్లనా పూజకో మాల మనసు తెర తీసినా మోమాటమేనా మమత కలబోసినా మాట కరువేనా తీగనై మల్లెలు పూచిన వేళ ఆగనా అల్లనా పూజకో మాల
అరే ఏమైందీ... పాట సాహిత్యం
చిత్రం: ఆరాధన (1987) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, జానకి ఆ గొఱ్ఱెపిల్ల నీకే దొరికితే నువేంచేస్తావ్ మనమయితేనా దెబ్బకి తెగనరికి ఏటపలవ్ వండుకొని తినము అఁ ... అహ్... హా... హా... హా... హా... ఆహ్... ఆఁ ... అదే జెన్నిఫర్ అయితే టీచర్ అది... నేనే అయితే అరే ఏమైందీ... అరే ఏమైందీ... ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ అది ఏమైందీ... తన మనిషిని వెదుకుతు ఇక్కడికొచ్చి వాలిందీ కలగాని - కలఏదో కళ్ళెదుటే నిలిచిందీ అది నీలో మమతను నిద్దుర లేపిందీ అ... అరే ఏమైందీ ... ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ ... అది ఏమైందీ...? చరణం: 1 నింగి వంగి నేలతోటి నేస్తమేదొ కోరింది నేలపొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది పూలునేను చూడలేను పూజలేవి చేయలేను నేలపైన కాళ్ళులేవు నింగివైపు చూపులేదు కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో కాన రాణి గుండెలోకి కన్నమేసి వచ్చావో అది దోచావో... ఓ... ఓ...ఓ... లలలల లా... లలలల లా... లలలల లా... లలలల లా... లలలల లా... లల లల లల లల లల లలలా చరణం: 2 బీడులోన వానచినుకు పిచ్చిమొలక వేసింది పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది గుండె ఒక్కటున్న చాలు గొంతుతానె పాడగలదు మాటలన్ని దాచుకుంటే పాట నీవు రాయగలవు రాతరాని వాడిరాత దేవుడేమి రాశాడో చేతనైతే మార్చిచూడు వీడుమారిపోతాడు మనిషౌతాడు... ఉ... ఉ...ఉ అరే ఏమైందీ... ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ అది ఏమైందీ... తనమనిషిని వెదుకుతు ఇక్కడికొచ్చి వాలిందీ... కలగాని - కలఏదో కళ్ళెదుటే నిలిచిందీ అదినీలో మమతను నిద్దుర లేపింది అరే ఏమైందీ... ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ... అది ఏమైందీ...?
ఆగిపో ఆగిపో కాలమా ఆగిపో పాట సాహిత్యం
చిత్రం: ఆరాధన (1987) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు ఆగిపో ఆగిపో కాలమా ఆగిపో ఆగిపో ఆగిపో కాలమా ఆగిపో కలత సెగలు చిందు కదలి పోకుమా వదలి పోకుమా ఆగిపో ఆగిపో కాలమా ఆగిపో ఎదలో చెలి రూపం మెరిపించావు మమతా మణిదీపం వెలిగించావు కలగా కరిగావు కథగా మిగిలావు వెలుగంటే చితిమంట బ్రతుకంటే స్మృతులేనా జేలే లేదా ఆగిపో ఆగిపో కాలమా ఆగిపో