చిత్రం: ఆస్తిపరులు (1966) సంగీతం: కె.వి. మహదేవన్ నటీనటులు: నాగేశ్వరరావు, జగ్గయ్య, బేబీ(కుట్టి) పద్మిని, వాణిశ్రీ. జి.వరలక్ష్మి, గిరిజ దర్శకత్వం: వి.మధుసూదనరావు నిర్మాత: వి.బి రాజేంద్రప్రసాద్ విడుదల తేది: 18.11.1966
Songs List:
శ్లోకం
చిత్రం: ఆస్తిపరులు (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల శ్రీకృష్ణ వృష్ఠివర యాదవ రాధికేశ గోవరనోదరణ కంసవినాశ శౌరే గోపాల వేణుధర పాండును తైక బంధో జిహ్వే జపేతి సతతం మథురాక్షరాణీ !
మిడిసి పడకు పాట సాహిత్యం
చిత్రం: ఆస్తిపరులు (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా ముందు ముందు ఉందిలే సంబరాల జాతరా మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా ముందు ముందు ఉందిలే సంబరాల జాతరా మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా రా రా చరణం: 1 దోరవయసు అలవి కాని భారమయింది ఆ బరువు మోయలేక నడుము పలచబడింది దోరవయసు అలవి కాని భారమయింది ఆ బరువు మోయలేక నడుము పలచబడింది నడుములేని నడకే ఒక నాట్యమయింది నడుములేని నడకే ఒక నాట్యమయింది చూచి చూచి బావ మనసు సొమ్మసిల్లింది.. సొమ్మసిల్లింది! చరణం: 2 అత్తకూతురంటేనే హక్కు ఉందిలే అల్లరెంత చేసినా చెల్లుతుందిలే అత్తకూతురంటేనే హక్కు ఉందిలే అల్లరెంత చేసినా చెల్లుతుందిలే ముక్కు తాడు వేయువేళ ముంచుకొచ్చు సిగ్గులో ముక్కు తాడు వేయువేళ ముంచుకొచ్చు సిగ్గులో ఇంత అత్త కూతురూ కొత్త పెళ్ళి కూతురే .. కొత్త పెళ్ళి కూతురే ! మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా ముందు ముందు ఉందిలే సంబరాల జాతరా
చిట్టిఅమ్మలూ పాట సాహిత్యం
చిత్రం: ఆస్తిపరులు (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల చిట్టిఅమ్మలూ చిన్నినాన్నలూ మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు చిట్టి అమ్మలూ... చిన్ని నాన్నలూ... మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు... చిట్టి అమ్మలూ చరణం: 1 హృదయాలను మూయవీ తలుపులు విడదీశారమ్మా మన తనువులు ఉన్నవాళ్ళే నీకింక నీ వాళ్ళు ఉన్నవాళ్ళే నీకింక నీ వాళ్ళు .. తుడిచివేయవమ్మా నీ కన్నీళ్ళు చరణం: 2 అన్నఒడివెచ్చదనంకోసం కన్ను మూయకున్నావు పాపం అన్న ఒడి వెచ్చదనం కోసం కన్ను మూయకున్నావు పాపం ఎదనుచీల్చిపాడుతున్నజోలలు ఎదనుచీల్చిపాడుతున్నజోలలు నిదురపుచ్చులేనిన్నుఅమ్మలు నిదురపుచ్చులేనిన్నుఅమ్మలు.!
చలి చలి వెచ్చని చలి పాట సాహిత్యం
చిత్రం: ఆస్తిపరులు (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల , పి.సుశీల చలి చలి వెచ్చని చలి గిలి గిలిగిలి చక్కలిగిలి నా ఎదుట నువ్వలా పువ్వులా నవ్వినా నా నిదురలో నీవు కలవలె మెదలినా నీ వూనూ తలపోసి పూహలో వూగినా నీ తోడునీడలో నిలిచినా విడిచినా నా వలవు రగిలించి చలిమంట వేయనా నా కంటి రెప్పల దుప్పటి కప్పనా నీ వాడి చూపుల వేడిలో వేగనా నావాడవను తలపు పులకించి పొంగనా యీ బుగ్గపై చిటిక వేస్తినా గిలిగిలి ఆ సిగు తెరచాటు చేసివా చలిచలి ఓపలేను ఈ గిలిగింతలు ఎలా మరీ రేపు మాపు కౌగిలిలో కరిగిపో గడుసరి
సోగ్గాడే చిన్ని నాయన పాట సాహిత్యం
చిత్రం: ఆస్తిపరులు (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: కొసరాజు గానం: పి.సుశీల (ఈ పాటను నాగర్జున నటించిన సోగ్గాడే చిన్నినాయనా (2016) సినిమాలో రీమిక్స్ చేశారు) సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ సోగ్గాడు కట్టె తుపాకెత్తుకోని కట్ట మీద నడుస్తుంటె కాలు జారి పడ్డాడె సోగ్గాడు కట్టె తుపాకెత్తుకోని కట్ట మీద నడుస్తుంటె కాలు జారి పడ్డాడె సోగ్గాడు పగటి వేషగాడల్లె పల్లెటూళ్ళు తిరుగుతుంటె కుక్క పిల్ల భౌ అంది పడుచు పిల్ల ఫక్కు మంది సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ సోగ్గాడు కళ్ళజోడు ఏసుకోని గల్ల కోటు తొడ్డుక్కోని పిల్ల గాలికొచ్చాడె సోగ్గాడు కళ్ళజోడు ఏసుకోని గల్ల కోటు తొడ్డుక్కోని పిల్ల గాలికొచ్చాడె సోగ్గాడు చిట్టివలస వాగుకాడ పిట్ట తుర్రుమంటేను చిట్టివలస వాగుకాడ పిట్ట తుర్రుమంటేను బిక్కమొహమేసాడు సుక్కలెంక చూసాడు బిక్కమొహమేసాడు సుక్కలెంక చూసాడు సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ సోగ్గాడు మూతి మీసం గొరుక్కోని బోసి మొహం పెట్టుకోని యాటకోసం వచ్చాడె సోగ్గాడు మూతి మీసం గొరుక్కోని బోసి మొహం పెట్టుకోని యాటకోసం వచ్చాడె సోగ్గాడు బుల్లి దొర వచ్చెనని కుక్క పిల్ల ఎక్కిరిస్తె ఎర్రి మొహం యేసాడు మిర్రి మిర్రి చూసాడు సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ సోగ్గాడు
మగవాడివలె ఎగరేసుకుపో పాట సాహిత్యం
చిత్రం: ఆస్తిపరులు (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల మగవాడివలె ఎగరేసుకుపో పగవాడివలె నను దోచుకుపో ఎగరేసుకుపో - నను దోచుకుపో చెరగని సిగలో పువ్వుంది చిదుమని పెదవుల నవ్వుంది పువ్వువంటి యవ్వనముంది నవ్వువంటి హృదయంవుంది ఎవ్వరెంత మొనగాడైనా పువ్వునవ్వు విడదీసేనా నవ్వ లేని పువ్వెందులకు పువ్వు లేక నువ్వెందులకు చాకంటి పిల్ల వున్నది అరిటాకువలె ఆడుతున్నది ముల్లు మీద పడబోతున్నది కళ్ళతోటి కాపాడన్నది
అందరికీ తెలియనిది పాట సాహిత్యం
చిత్రం: ఆస్తిపరులు (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల , పి.సుశీల అందరికీ తెలియనిది నీ అందంలో ఒకటుందీ ఒక్కరికీ తెలిసినది నీ మక్కువలో ఒక టుందీ అందుకే నేనది పొందినది అందనిదైనా అందినది పొందిన పిదపే తెలిసినది నేనెందుకు నీకు అందినది వలచుటలో గొప్పున్నదీ నిను వలపించుటలో మెప్పున్నదీ... పరువంలో పొగరున్నది అది పరవశమైతే సొగసున్నది నాలో నే నీవున్నది నువ్వేలే కనుగొన్నది మన ఒద్దికలో ఇహమున్నది
చిట్టి అమ్ములు (Sad Version) పాట సాహిత్యం
చిత్రం: ఆస్తిపరులు (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల చిట్టి అమ్ములు చిన్న నాన్నలు మన యిద్దరికే తెలుసు యీ మమతలు హృదయాలను మూయవీ తలువులు విడదీశారమ్మ మన తనువులు ఉన్న వాళ్లె నీకింక నీవాళ్ళు తుడిచి వేయవమ్మ నీ కన్నీళ్ళు అన్నవాడి వెచ్చదనంకోసం కన్ను మూయకున్నావు పావం ఎదను చీల్చి పాడుతున్న జోలలు నిదురపుచ్చులే నిన్ను అమ్మలు
ఇక్ష్వాకుకుల తిలకా పాట సాహిత్యం
చిత్రం: ఆస్తిపరులు (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల ఇక్ష్వాకుకుల తిలకా ! ఇక నైనా బ్రోవరా రామచంద్రా నీవు రక్షింపకున్న యిక రక్షకు లెవరయ్యా రామచంద్రా అబ్బ, తిట్టితినని ఆయాసపడబోకు రామచంద్రా యీ దెబ్బల కోర్వకా - అబ్బ, తిట్టితినయ్యా రామచంద్రా ఎందుకయ్యా ఉంచినావూ బందిఖానాలో నలుల దోమల చేత రామయ్యా నలుగుచున్నది యీ దేహము రామయ్యా రామయ్యా రామయా ఎందుకయ్యా ఉంచినావూ బందిఖానాలో ఎవరి జవానులు మీరు మిమ్ము ఎవరు పంపగ వచ్చినారు దాసు జవానులు మేము వచ్చినాము
ఎఱ్ఱఎఱ్ఱని బుగ్గలదానా పాట సాహిత్యం
చిత్రం: ఆస్తిపరులు (1966) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, పి.సుశీల ఎఱ్ఱఎఱ్ఱని బుగ్గలదానా నల్ల నల్లని కన్నల దాన కొల్లకొల్లగ కోరిక లెన్నో కొసరుతున్నవి గుండెలోన వల్లమాలిన అల్ల రిబావా - వగలమారి బిగువుల బావా కొల్లగొట్టిన గుండెలోన - కొసరుతున్నది నేను నా మనసు పరుగిడి మాట తడబడి- మగువ కలతపడి నిలిచేదెపుడు పిలుపు వినబడి ప్రియుడు కనబడి కనులు కలబడి కరిగేటప్పుడు చిరుత నగవులు చిరుచిరు చెమటలు - చిగురు చెంపల మెరిసే దేవుడు నులి వెచ్చని నీ తొలి కౌగిలిని - సిగలో మొగ్గలు విరిసేటప్పుడు పరువమున్నదీ పరుగిడుతున్నదీ - పగ్గాలింకా ఎందుకన్నదీ పొద్దువున్నదీ హద్దువున్నదీ - అంతవరకు నిన్నాగమన్నదీ