Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Akbar Salim Anarkali (1978)




చిత్రం: అక్బర్ సలీం అనార్కలి (1978)
సంగీతం: సి.రామచంద్ర
నటీనటులు: యన్.టి.రామారావు, బాలకృష్ణ , జమున, దీప
దర్శకత్వం: యన్.టి.రామారావు
నిర్మాత: యన్.టి.రామారావు
విడుదల తేది: 09.05.1979



Songs List:



సిపాయీ.. సిపాయీ.. పాట సాహిత్యం

 
చిత్రం: అక్బర్ సలీం అనార్కలి (1978)
సంగీతం: సి.రామచంద్ర
సాహిత్యం: సినారే
గానం: మహమ్మద్ రఫీ, పి.సుశీల

పల్లవి:
సిపాయీ.. సిపాయీ..
సిపాయీ.. సిపాయీ..
నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో...
ఈ వాలుకనులనడుగు అడుగు చెపుతాయీ
సిపాయీ.. ఓ..సిపాయీ..

హసీనా.. హసీనా..
నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా
హసీనా.. ఓ.. హసీనా..

చరణం: 1
జడలోనా మల్లెలు జారితే నీ ఒడిలో ఉన్నాననుకున్నా
చిరుగాలిలో కురులూగితే చిరుగాలిలో కురులూగితే..
నీ చేయి సోకెనని అనుకున్నా

ఆ.. మల్లెలలో కదలాడినవి నా కలవరింపులే
ఆ గాలిలో చెలరేగినవి ఆ గాలిలో చెలరేగినవి
నా నిట్టూరుపులే... హసీనా..

చరణం: 2
తడి ఇసుకను గీసిన గీతలు అల తాకితే మాసి పోతాయి
ఎదలోన వ్రాసిన లేఖలు..ఎదలోన వ్రాసిన లేఖలు..
బ్రతుకంతా వుండి పోతాయి..

ఆ.. లేఖలలో ఉదయించినవి నా భాగ్యరేఖలే..
మన ఊపిరిలో పులకించినవి మన ఊపిరిలో పులకించినవి..
వలపు వాకలే.. సిపాయీ...




కలుసుకున్నా గుబులాయె పాట సాహిత్యం

 
చిత్రం: అక్బర్ సలీం అనార్కలి (1978)
సంగీతం: సి.రామచంద్ర
సాహిత్యం: సినారే
గానం: మహమ్మద్ రఫీ, పి.సుశీల

పల్లవి:
కలుసుకున్నా గుబులాయె - కలవకున్న దిగులాయె
ఏమాయె నాలో ఏమాయె 

కలుసుకున్నా క్షణమాయె - కలవకున్న యుగమాయె
ఏమాయె నాలో ఏమాయె

చరణం:
మన్నించు షహజాదా - మనసిచ్చె నిరుపేద
మన్నించు షహజాదా - మనసిచ్చె నిరుపేద
గులాబీ పువ్వు ఎక్కడ - దానిమ్మ మొగ్గ ఎక్కడ
గులాబీ పువ్వు ఎక్కడ - దానిమ్మ మొగ్గ ఎక్కడ

గులాబి ఐనా అనారైనా - మొలిచేది నేలపైన
ఆ నేలలాంటిదే ప్రేమ
ఆ నేలలాంటిదే ప్రేమ
దానికి అంతరాలే లేవుసుమా.... లేవుసుమా  




మధన మొహనడుడే పాట సాహిత్యం

 
చిత్రం: అక్బర్ సలీం అనార్కలి (1978)
సంగీతం: సి.రామచంద్ర
సాహిత్యం: సినారే
గానం: పి.సుశీల, ముస్తఫా ఖాన్ 

మధన మొహనడుడే 




ప్రేమిస్తే తప్పంటారా పాట సాహిత్యం

 
చిత్రం: అక్బర్ సలీం అనార్కలి (1978)
సంగీతం: సి.రామచంద్ర
సాహిత్యం: సినారే
గానం: పి.సుశీల

ప్రేమిస్తే తప్పంటారా 




రేయి ఆగిపోనీ పాట సాహిత్యం

 
చిత్రం: అక్బర్ సలీం అనార్కలి (1978)
సంగీతం: సి.రామచంద్ర
సాహిత్యం: సినారే
గానం: మహమ్మద్ రఫీ, పి.సుశీల

పల్లవి:
రేయి ఆగిపోనీ - రేపు ఆగిపోనీ
ఈ ప్రేమ వాహిని ఇలా సాగిపోనీ
ఈ ప్రేమ వాహిని ఇలా సాగిపోనీ
రేయి ఆగిపోనీ - రేపు ఆగిపోనీ
ఈ ప్రేమ వాహిని ఇలా సాగిపోనీ
రేయి ఆగిపోనీ - రేపు ఆగిపోనీ

చరణం:
ఆ స్వర్గమైనా ఈ  లోకమైనా
అనురాగధారలో అలా వీగిపోనీ

నా తోడు నీవై - నీ తోడు నేనై
నా తోడు నీవై - నీ తోడు నేనై
ఈ ప్రేమ రాగిణి  ఇలా మ్రోగిపోనీ

చరణం:
ఈ గానమే మౌనమై నిండి పోనీ
ఈ ప్రాణమే ధ్యానమై ఉండి పోనీ

నీ పొందులోన ఈ తీపిలోన
నీ పొందులోన ఈ తీపిలోన
ఈ ప్రేమయామిని ఇలా సాగిపోనీ

ఏ నాటికైనా నా మోముపైన
ఈ కురుల నీడలే ఇలా మూగిపోనీ

నీ తలపులోన  నీ పిలుపులోన
నీ తలపులోన  నీ పిలుపులోన
ఈ ప్రేమయోగిని ఇలా దాగిపోనీ 





తానే మేలి ముసుగు తీసి పాట సాహిత్యం

 
చిత్రం: అక్బర్ సలీం అనార్కలి (1978)
సంగీతం: సి.రామచంద్ర
సాహిత్యం: సినారే
గానం: మహమ్మద్ రఫీ, పి.సుశీల

పల్లవి:
తానే మేలి ముసుగు తీసి
ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను
తానే మేలి ముసుగు తీసి
ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను
నవ్వే ఆ నవ్వుతోనే మెలమెల్లగా
పిడుగులే రువ్వుతుంటే ఏం చేయను

చరణం: 1
నేను అనుకొంటినా మరి కలగంటినా
నాలో అనురాగమేదో మ్రోగేనని
ఆ ఆ ఆ... నేను అనుకొంటినా మరి కలగంటినా
నాలో అనురాగమేదో మ్రోగేనని
అందమే నన్ను చేరి కొనగోటితో
అందమే నన్ను చేరి కొనగోటితో
గుండెలో మీటుతుంటే ఏం చేయను
తానే మేలి ముసుగు తీసి
ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను

చరణం: 2
చేత మధు పాత్ర లేదు... చేత మధు పాత్ర లేదు
నాకిప్పుడు... ఐనా అంటారు నన్నే... తాగేనని
కన్నులే పొంగిపోయే మధుపాత్రలై
కన్నులే పొంగిపోయే మధుపాత్రలై
కైపులో ముంచుతుంటే ఏం చేయను
తానే మేలి ముసుగు తీసి
ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను

చరణం: 3
నేను ఫిరదౌసినా మరి కాళిదాసునా కాని అంటారు నన్నే కవిరాజనీ
ఆ ఆ ఆ... నేను ఫిరదౌసినా మరి కాళిదాసునా కాని అంటారు నన్నే కవిరాజనీ
ప్రేయసీ మధుర రూపం మహాకావ్యమై
ప్రేయసీ మధుర రూపం మహాకావ్యమై
ఊహలో పొంగుతుంటే ఏం చేయను
తానే మేలి ముసుగు తీసి
ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను
లలా లాలలలాల...




తారలెంతగా మెరిసేను పాట సాహిత్యం

 
చిత్రం: అక్బర్ సలీం అనార్కలి (1978)
సంగీతం: సి.రామచంద్ర
సాహిత్యం: సినారే
గానం: మహమ్మద్ రఫీ

పల్లవి:
తారలెంతగా మెరిసేను
తారలెంతగా మెరిసేను
చందురుని కోసం
రేయి ఎంతగా మురిసేను
రేయి ఎంతగా మురిసేను
దినకరుని కోసం
తారలెంతగా మెరిసేను

చరణం: 1
చిగురుటాకులే చేతులుగా
మిసిమిరేకులే పెదవులుగా
పరిమళాలే పిలుపులుగా        
మకరందాలే వలపులుగా
పూవులెంతగా వేచేను
పూవులెంతగా వేచేను
తుమ్మెదల కోసం
తుమ్మెదల కోసం
తారలెంతగా మెరిసేను

చరణం: 2
నింగి రంగులే కన్నుల దాచి
కడలి పొంగులే ఎదలో దాచి
గులాబి కళలే బుగ్గల దాచి
మెరుపుల అలలే మేనిలో దాచి
పరువాలెంతగ వేచేను
పరువాలెంతగ వేచేను
పయ్యెదల కోసం
పయ్యెదల కోసం
తారలెంతగా మెరిసేను
చందురుని కోసం




వేళ ఎరిగిన పాట సాహిత్యం

 
చిత్రం: అక్బర్ సలీం అనార్కలి (1978)
సంగీతం: సి.రామచంద్ర
సాహిత్యం: సినారే
గానం: పి.సుశీల, వాణి జయరాం 

వేళ ఎరిగిన 




ఎందుకు ఎందుకు పాట సాహిత్యం

 
చిత్రం: అక్బర్ సలీం అనార్కలి (1978)
సంగీతం: సి.రామచంద్ర
సాహిత్యం: సినారే
గానం:  యస్.పి.బాలు 

ఎందుకు ఎందుకు 

Most Recent

Default