చిత్రం: అమృత (2౦౦2)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
నటీనటులు: మాధవన్ , సిమ్రాన్, కీర్తన పార్థిబన్, జె. డి.చక్రవర్తి, నందిత దాస్
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: జి. శ్రీనివాసన్
విడుదల తేది: 14.02.2002
చిత్రం: అమృత (2౦౦2)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, బలరాం
పల్లవి:
కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ...ఓ..
కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ...ఓ..
చరణం: 1
తల్లి నేలని పల్లె సీమని విడ తరమా తరమా
తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా
ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా గలదా
జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం
జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం
కదిలే నదులారా కలలే అలలౌనా
జననీ... జన్మ భూమి స్వర్గాదపి గరీయసి
కన్నీటి తెరలలో తల్లి నేలని
కడసారి పేగు కనలేక కదిలిపోయెనో
కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ...ఓ..
చరణం: 2
పాడే జోలలు పాపల ఏడ్పుల పాలైపోతే
పాడే జోలలు పాపల ఏడ్పుల పాలైపోతే
ఉదయ సూర్యుడే విలయ ధూమపు తెరలో దాగే
పూల డోల నిన్నటి నిదర ముళ్ళు కదా ఇప్పటి నడక
ఉసురు మిగిలుంటే మరలా దరిచేరవా
మనసే.. మిగిలుంటే ఒడిలో తలదాచవా
తలపే అల్పం తపనే అధికం
బరువెక్కిన హృదయం మోసుకునే పోతున్నా...
కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా
ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ...ఓ..
చిత్రం: అమృత (2౦౦2)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: ఏ.ఆర్.రెహమాన్
పల్లవి:
మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తును వదలగా
కనులా తడి తుడిచే ఒడిలో పసి పాపాయి
చిలికే చిరు నగవే చీకటి తల్లికి వేకువా
మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తును వదలగా
కనులా తడి తుడిచే ఒడిలో పసి పాపాయి
చిలికే చిరు నగవే చీకటి తల్లికి వేకువా
చరణం: 1
గాలి పాటలా సడి వాన జావళీ
అది మౌనంలా దూరం అవునా
వేళ మాటలే వివరించలేనిది
తడి కన్నుల్ల అర్ధం అవునా
మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా - విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా - తపనగా
పారాణేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తును వదలగా
చరణం: 2
లేత పాపలా చిరు నవ్వు తోటకే
దిగి వస్తావా సిరుల వెన్నెలా
వీర భూమిలో సమరాలు మారితే
వినిపించే నా స్వరమే కోయిలా
మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా
పారాణేదో భూమికి మెరుపుగా
మందారాలే మత్తును వదలగా
మరు మల్లెల్లో ఈ జగమంతా విరియగా - విరియగా
ప్రతి ఉదయంలో శాంతి కోసమే తపనగా - తపనగా
చిత్రం: అమృత (2౦౦2)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్
పల్లవి:
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఆయువడిగినది నీ నీడే...
ఆయువడిగినది నీ నీడే
గగనం ముగియు దిశ నీవేలే
గాలి కెరటమై సోకినావే
ప్రాణ వాయువే అయ్యినావే మదిని ఊయలూగే

ఎదకు సొంతం లే ఎదురు మాటవు లే
కలికి వెన్నెలలే కడుపు కోతవులే
స్వాతి వానని చిన్న పిడుగని
స్వాతి వానని చిన్న పిడుగని
ప్రాణమైనది పిదప కానిది
ప్రాణమైనది పిదప కానిది
మరణ జనన వలయం నీవే
ఏ దేవి వరము నీవో...
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే నీ చిన్నారి ముద్దు పెడితే
చరణం: 2
సిరుల దీపం నీవే కరువు రూపం నీవే
సరస కావ్యం నీవే తగని వాక్యం నీవే
ఇంటి వెలుగని కంటి నీడని
ఇంటి వెలుగని కంటి నీడని
సొగసు చుక్కవో తెగిన రెక్కవో
సొగసు చుక్కవో తెగిన రెక్కవో
నేనెత్తి పెంచిన శోకంలా...
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా
ఆయువడిగినది నీ నీడే...
ఆయువడిగినది నీ నీడే
గగనం ముగియు దిశ నీవేలే
గాలి కెరటమై సోకినావే
ప్రాణ వాయువే అయ్యినావే మదిని ఊయలూగే
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా