చిత్రం: అనగనగా ఓ ధీరుడు (2011)
సంగీతం: సలీమ్ సులైమాన్ , కోటి, యమ్. యమ్. కీరవాణి, మిక్కీ జే మేయర్, అనంత్
నటీనటులు: సిద్దార్థ్ , శృతి హాసన్, లక్ష్మీ మంచు
దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి
నిర్మాతలు: ప్రసాద్ దేవినేని, ప్రకాష్ కోవెలమూడి
విడుదల తేది: 14.01.2011
చిత్రం: అనగనగా ఓ ధీరుడు (2011)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కార్తిక్, సాహితి
చందమామలా అందగాడిని చుక్కలెందరో నా వెనకే
చుక్కలెందరో చుట్టిముట్టినా చెలి కొరకే నా పరుగే
చరణం: 1
పెదవులు పగడ కాంతులు
పలుకులు చెరుకు బంతులు
నడకలు నెమలి గంతులు గలగలగలలు
కనులలో కోటి రంగులు
నడుములో మర ఫిరంగులు
కురులలో జలధి పొంగులు జలజలజలలు
తన కొరకే కలవరమై తన వరకే చెలి స్వరమై
తన దరికే నా ప్రాణమే ప్రయాణమై
చరణం : 2
జిగిబిగి మనసు సంకెల
తెగువగ తెంచా నేనిలా
మగువను మార్చా ప్రేమలా తొలితొలితొలిగా
పరిచిన పసిడి దారిలా
విరిసిన వెలుగు ధారలా
నడిచా ఆమె నీడలా కలకలకలగా
తన వలపే అమృతము
తన వరమే జీవితము
తన పరమై తరించనీ ఈ సోయగము
చిత్రం: అనగనగా ఓ ధీరుడు (2011)
సంగీతం: సలీమ్ సులైమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సలీమ్ మర్చంట్, శ్రేయ ఘోషల్
పల్లవి:
చిరుగాలై వచ్చేదెవరో చెలి చెంప గిచ్చేదెవరో
చిరకాలం నిలిచేదెవరో ఎవరో వారెవరో
అలలాగ వచ్చేదెవరో అరచేయి పట్టేదెవరో
అనురాగం పంచేదెవరో ఎవరో వారెవరో
ఎవరంటే నీ వెంట నేనేలే
నేనంటే నిలువెల్లా నీవేలే
నీవంటే తనువెల్లా ప్రేమేలే
ప్రేమించే వేళయిందో...
చరణం: 1
ప్రేమలేఖ రాసెనే ఇలా పెదాలు
ప్రేమరేఖ దాటెనే ఇలా పదాలు
ప్రేమకిక వేసెనే ఇలా ప్రాయాలు
ఏం మాయ ఏం చేస్తుందో
ప్రేమలేఖ రాసెనే ఇలా పెదాలు
ప్రేమలాలి కోరెనే ఇలా క్షణాలు
ప్రేమలోతు చేరెనే పది ప్రాణాలు
ఈ హాయి ఎటుపోతుందో
చరణం : 2
నవ్వావంటే నువ్వు ఆ నవ్వే గువ్వై తారాజువ్వై నాలో ఏఁమాయెనో
రువ్వావంటే చూపు ఆ చూపే చేపై సిగ్గై చెరువై లోలో ఏఁమాయెనో
ముసినవ్వుకు మనసే లేత మొగ్గ వేసునో
కొనచూపుకు వయసే రేకు విచ్చునో
పసిరేకుల సొగసే నేడు పూత పూసెనో
ఆ పూవు ప్రేమైందో ఏమో...
చిత్రం: అనగనగా ఓ ధీరుడు (2011)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: అనుజ్ గుర్వర, చైత్ర
నిన్ను చూడని..నిన్ను చూడని..
కన్నులెందుకో అని అని..
నిన్ను తాకని..నిన్ను తాకని
చేతులెందుకో అని అని..
మనస్సు చెప్పుతోంది
ఈ మంచి మాటని
వయస్సు ఒప్పుకుంది ఆ మాట చాలని
సుదూర తీరమేదో ఏరికోరి మీరి
చేరగా చెంతగా మారగా జంటగా
సూటిగా ఘాటుగా
రెప్పవేయకుండా మూయకుండా
చరణం: 1
కోనదాటి వచ్చా కొండదాటి వచ్చా
నింగిలాగ వచ్చా నిండు ప్రేమ తెచ్చా
కోటదాటి వచ్చా తోట దాటి వచ్చా
కొమ్మలాగ వచ్చా కొత్త ప్రేమ తెచ్చా
మేఘమల్లే వచ్చా మెరుపులిచ్చా
కౌగిలల్లె వచ్చా కానుకకిచ్చా
చేరగా చెంతగా మారగా జంటగా వేడిగా వాడిగా
చుట్టు పక్కలేవీ చూడకుండా
చరణం: 2
గీత మారుతున్నా రాత మారుతున్నా
ఊపిరాగుతున్నా ఉండలేక వచ్చా
హాని జరుగుతున్నా, అలుపెరుగుతున్నా
ప్రాణమాగుతున్నా పరుగులెట్టి వచ్చా
అమృతాన్ని తెచ్చా ఆయువిచ్చా
అద్బుతాన్ని తెచ్చా హాయినిచ్చా
చేరగా చెంతగా మారగా జంటగా నీడగా తోడుగా
ఒక్క నీటి బొట్టు జారకుండా