Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Anthaka Mundu Aa Tarvatha (2013)



చిత్రం: అంతకుముందు ఆ తరువాత (2013)
సంగీతం: కళ్యాణీ మాలిక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హేమచంద్ర,  కోగంటి దీప్తి
నటీనటులు: సుమంత్ అశ్విన్, ఈశ రెబ్బా
దర్శకత్వం: మోహన్ కృష్ణ ఇంద్రగంటి
నిర్మాత: కె.ఎల్. దామోధర్ ప్రసాద్
విడుదల తేది: 23.08.2013

గమ్మత్తుగా ఉన్నది... నమ్మేట్టు లేదే ఇది
ఇదేమి లోకమో హ్మ్ హ్మ్ హ్మ్
ఝుమ్మంటు నా ఊపిరి
కొమ్మెక్కి కూస్తున్నది
ఇదేమి రాగమో హ్మ్ హ్మ్ హ్మ్
గమ్మత్తుగా ఉన్నది
హా హుహుహు హుహూ హుహూ హుహుహు
హుహుహూ హుహుహు హా హుహు

చరణం: 1
రివ్వున సాగే ఉవ్విళ్ళు
మువ్వలు మోగే సవ్వెళ్ళు
నువ్విచ్చావా నా గుండెకి...
దాక్కొని ఉండే చుట్టాలు
దాక్కుని వచ్చే మంత్రాలు
నేర్పించావా నా కళ్ళకి
ఇంతకు ముందేవి నాలో ఇన్ని ఊహలు
ఈ తరువాతేం చూడాలొ కొత్త వింతలు
ఏమైంతేనేం బానే ఉంది ఇదేమిటో..
గమ్మత్తుగా ఉన్నది
నమ్మేట్టు లేదే ఇది
హుహూహు హూహుహూ ఆ అ అ ఆ

చరణం: 2
తుంటరి చూపుల తుంపర్లు
తుమ్మెద రేపే పుప్పొళ్లు
కొంటెగ ఉందే నీ వైఖరి
నవ్వులు పూసే చెక్కిళ్ళు
ఎక్కువ చేస్తే ఎక్కిళ్ళు
ఉక్కిరి బిక్కిరి కానున్నవి
చూస్తున్నా నీలో నిన్న లేని అల్లరి
వింటున్నా మాటల్లో నువ్వనని సంగతి
తెలిసిందిగా ఎంచక్కగా కథేమిటో
గమ్మత్తుగా ఉన్నది
నమ్మేట్టు లేదే ఇది
హుహూ హ్మ్ ఆ ఆ అ ఆ ఆహాహ
ఝుమ్మంటు నా ఊపిరి
కొమ్మెక్కి కూస్తున్నది
ఇదేమి రాగమో ఓహోహో
గమ్మత్తుగా ఉన్నది

అనిల్ మనం పెళ్లి చేసుకుందాం
ఆ.. పెళ్లా ఓకే చేసుకుందాం
నిజంగా?
ఆ నిజంగా
ఎప్పుడు?
ఎప్పుడంటే.. నువ్వెప్పుడంటే అప్పుడే
నిజంగానా?
ఆహ
గాడ్! ఐ లవ్ యూ
హ ఐ లవ్ యూ టూ
రేపు ఎన్నింటికి కలుద్దం?
ఆ.. 5 ఓ'క్లాక్
డన్



********   *********   ********


చిత్రం: అంతకుముందు ఆ తరువాత (2013)
సంగీతం: కళ్యాణీ మాలిక్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: కాళభైరవ, స్రవంతి

హేయ్ కనిపెట్టేయ్ ఓ కొత్త ఫార్ములా
నీ బతుకంతా ఫాలో అయేంతలా
హేయ్ కనిపెట్టేయ్ ఓ కొత్త ఫార్ములా
నీ బతుకంతా ఫాలో అయేంతలా
ఓ రోజులో భవసాగరం ఈదాలనే ఆత్రంలో
నూరేళ్ళని మూణ్ణాళ్ళలో చూడాలనే కంగారులో
హేయ్ కనిపెట్టేయ్ ఓ కొత్త ఫార్ములా
నీ బతుకంతా ఫాలో అయేంతలా

చరణం: 1
ఇరుకు మంచిదేనని ఇంటి సైన్సు అంటున్నది
సరిగ సర్దుకోవడం నేర్చుకోమనే మెసేజ్ అది
మరకలున్న గోడ నీ మదికి అద్దమై ఉన్నది
మరొక రంగు అద్దుతూ మార్చుకొమ్మనే లెస్సన్ అది
బయటోళ్లపై కోపాలనే తలుపుల తెరల్లో ఆపుతూ
చల చల్లని భోగాలనే ఏసీ గదుల్లో దాచుకొనుటకు
హేయ్ కనిపెట్టేయ్ ఓ కొత్త ఫార్ములా
నీ బతుకంతా ఫాలో అయేంతలా

చరణం: 2
పరుగులెన్ని తీసినా టైం మిగలటం చోద్యమయి
సరుకులెన్ని తెచ్చినా లోటు తీరడం అసాధ్యమే
పొరుగు వాడి సాయముల్ లేకపోవడం లాభమే
సొరుగులో రహస్యముల్ బయట పాకితే పాదమే
టీవీలతో మిక్సీలతో రోజూ ధ్వనించే ఇంటిలో
పోట్లాటలు కొట్లాటలు ఇతరులు వినాలంటే కుదరదు
హేయ్ కనిపెట్టేయ్ ఓ కొత్త ఫార్ములా
నీ బతుకంతా ఫాలో అయేంతలా
ఓ రోజులో భవసాగరం ఈదాలనే ఆత్రంలో
నూరేళ్ళని మూణ్ణాళ్ళలో చూడాలనే కంగారులో
డా టడడట్టా టట్టాడడాడడా
డట్టా టడడట్టా డట్టాడడాడడా
డా టడడట్టా టట్టాడడాడడా
డా డడడట్టా డట్టాడడట్టడా


********   *********   ********


చిత్రం: అంతకుముందు ఆ తరువాత (2013)
సంగీతం: కళ్యాణీ మాలిక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రీకృష్ణ , సునీత

నేనేనా ఆ నేనేనా
నా నుంచి నేనే వేరయ్యానా
ఉన్నానా నేనున్ననా
ఉన్నానుగా అంటున్నానా
వెళ్లొస్తానంటూ.. ఆ నిజం
ఓ జ్ఞాపకంలా మారిపోతున్నా
ఏం చేసానని ఏం చూస్తున్నానని
అనుకోని ఆ క్షణం
నేనేనా ఆ నేనేనా
నా నుంచి నేనే వేరయ్యానా

చరణం: 1
గాలిలో మేడ గాల్లోనె ఉంటుంది
నేలకేనాడు దిగిరాదని
నీటిలో నీడ నీళ్ళల్లో కరిగింది
చేతికందేది కాదే అది
చెప్పాలా ఎవరో కొత్తగా
అది నమ్మలేని వింత కాదనీ..
ఏం చేసానని ఏం చూస్తున్నానని
అనుకోని ఆ క్షణం
నేనేనా ఆ నేనేనా
నా నుంచి నేనే వేరయ్యానా
ఆ.... ఆ..... ఆ....

చరణం: 2
నన్ను నాలాగ చూపించవేమంటు
నిలువుటద్దాన్ని నిందించనా
నేను తన లాగ ఏనాడు మారానో
నాకు నేనింక కనిపించనా
అద్దంలో లోపం లేదనీ
నా చూపులోనే శూన్యముందనీ..
ఏం చేసానని ఏం చూస్తున్నానని
అనుకోని ఆ క్షణం
నేనేనా ఆ నేనేనా
నా నుంచి నేనే వేరయ్యానా


********   *********   ********


చిత్రం: అంతకుముందు ఆ తరువాత (2013)
సంగీతం: కళ్యాణీ మాలిక్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: కళ్యాణీ మాలిక్, సునీత

తమరితోనే సమయమంతా గడిచిపోతున్నా
తమరి వైపే అడుగులన్నీ నడిచిపోతున్నా
మమతలోనో మాయలోనో అలై మెరిసానా
తమరితోనే సమయమంతా గడిచిపోతున్నా
తమరి వైపే అడుగులన్నీ నడిచిపోతున్నా
హ్మ్.... హ్మ్.....

చరణం: 1
వరమో అవసరమో అసలిపుడు ఇది ఏమో
ప్రేమో... ఊహూ...
ఎదపైన వాలే భారమో హృదయాలు అల్లే వారమో
తెలియరాకా తేల్చలేక ఇలా మిగిలానా
తమరితోనే సమయమంతా గడిచిపోతున్నా
తమరి వైపే అడుగులన్నీ నడిచిపోతున్నా

చరణం: 2
విడిచి నిను మరచి నిదురవదు కునుకైనా
ఔనా... ఊహూ...
వదలాలనే ఆలోచన ఒకవైపు నాకే తోచినా
గడప దాటే గాలులన్నీ ఎటో రమ్మన్నా....
తమరితోనే సమయమంతా గడిచిపోతున్నా
తమరి వైపే అడుగులన్నీ నడిచిపోతున్నా
మమతలోనో మాయలోనో అలై మెరిసానా
తమరితోనే సమయమంతా గడిచిపోతున్నా
తమరి వైపే అడుగులన్నీ నడిచిపోతున్నా
హ్మ్.... హ్మ్.....


********   *********   ********


తేనె ముల్లులా అదేమిటంతలా
అలాంటి చూపు నాటితే ఎలా
వాన వెల్లులా ఇవాళ ఇంతలా
మరీ ఇలాగ ఇన్ని వన్నెలా

చరణం: 1
నిన్న ఇలాగె నువ్వు నన్ను తాకుతున్నా
తెలియని ఈ బిడియం కాస్తైనా
ఈనాడే నీలో ఈడు మెలుకుందా
ఏకాంతం నాతో తోడు కోరుకుందా
తలొంచుకున్న కన్నె వేడుకా
తేనె ముల్లులా అదేమిటంతలా
అలాంటి చూపు నాటితే ఎలా
వాన వెల్లులా ఇవాళ ఇంతలా
మరీ ఇలాగ ఇన్ని వన్నెలా

చరణం: 2
భారం భరించలేని మేఘమంటి భావం
కురిసినది చిరు చెమటల వాన
దూరం కరిగించి తేలికైన దేహం
తనువుల తెర దించి ఏకమైన కాలం
తలెత్తనుంది జంట జన్మగా
తేనె ముల్లులా అదేమిటంతలా
అలాంటి చూపు నాటితే ఎలా


********   *********   ********


చిత్రం: అంతకుముందు ఆ తరువాత (2013)
సంగీతం: కళ్యాణీ మాలిక్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: హేమచంద్ర

ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ
జాబిల్లి చెల్లాయివే..
అన్నుల మిన్నుల వెన్నెల రాణీ
ఎన్నడు తోడవుతావే
ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ
జాబిల్లి చెల్లాయివే..

చరణం: 1
చిరునవ్వు పూసింది చీకట్లు పోయేలా
తొలి చూపు తాకింది తొందరయ్యేలా
ఆ.. చిరునవ్వు పూసింది చీకట్లు పోయేలా
తొలి చూపు తాకింది తొందరయ్యేలా
ఆరాట పడిపోతుందీ..
ఆరాట పడిపోతుంది అబ్బాయి జన్మ
పిలిచీనా పలుకవేమే పింగాణి బొమ్మా
ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ
ఏ ఇంటి అమ్మాయివే..

చరణం: 2
పాపిట్లొ పారింది మా ఊరి గోదారి
ఆశల్లో ముంచిందిలా నన్ను చేరి
పాపిట్లొ పారింది మా ఊరి గోదారి
ఆశల్లో ముంచిందిలా నన్ను చేరి
ఎరుపెక్కే చెంపల్లోన..
ఎరుపెక్కే చెంపల్లోన తెల్లారు ఝాము
నను తట్టీ లేపిందమ్మా నా మాట నమ్ము
ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ
జాబిల్లి జాబిల్లి చెల్లాయివే..

చరణం: 3
చామంతి మాలని పోలిన నీ చెయ్యి
చేజిక్కితే ఇక ఢోలు సన్నాయి
హ్మ్ చామంతి మాలని పోలిన నీ చెయ్యి
చేజిక్కితే ఇక ఢోలు సన్నాయి
వందేళ్ళూ పట్టుకుంట
వందేళ్ళూ పట్టుకుంట వదిలేయకుండా
గుండెల్లో పెట్టుకుంటా గూడూ కట్టుకుంటా
ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ
జాబిల్లి చెల్లాయివే..
అన్నుల మిన్నుల వెన్నెల రాణీ
ఎన్నడు తోడవుతావే
ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ
జాబిల్లి చెల్లాయివే..
ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ
జాబిల్లి చెల్లాయివే..

Most Recent

Default