చిత్రం: అంతులేని కధ (1976) సంగీతం: యం యస్ విశ్వనాథన్ నటీనటులు: జయప్రద, రజినీకాంత్, కమల్ హాసన్, ఫటాఫట్ జయలక్ష్మి, శ్రీప్రియ దర్శకత్వం: కె. బాలచందర్ నిర్మాత: అరంగణ్ణల్ విడుదల: 27.02.1976
Songs List:
అరే ఏమిటి లోకం పాట సాహిత్యం
చిత్రం: అంతులేని కధ (1976) సంగీతం: యం యస్ విశ్వనాథన్ సాహిత్యం: ఆత్రేయ గానం: ఎల్. ఆర్. ఈశ్వరి అరే ఏమిటి లోకం
తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల పాట సాహిత్యం
చిత్రం : అంతులేని కధ (1976) సంగీతం : యం యస్ విశ్వనాథన్ సాహిత్యం : ఆత్రేయ గానం : యస్. పి. బాలు తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఓ హో హో ఆ హా హా ఉహూఁ హూఁ ఏ హే హే తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో అహా హా ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల వికటకవి నేను వినండి ఒక కథ చెబుతాను కాకులు దూరని కారడవి అందులో కాలం ఎరుగని మానొకటి ఆ అందాల మానులో ఆ అద్భుత వనంలో చక్కని చిలకలు అక్కాచెల్లెలు పక్కన గోరింకలు ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మా బావా రావా నన్నేలుకోవా తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో మేళాలు తాళాలు మంగళవాద్యాలు మిన్నంటి మోగెనమ్మా మేళాలు తాళాలు మంగళవాద్యాలు మిన్నంటి మోగెనమ్మా వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా Singapore airlines announces the arrival of flight S2583 ఊరేగు దారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా సింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఓ హో హో ఆ హా హా ఉహూఁ హూఁ ఏ హే హే తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో అహా హా ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల గోమాత లేగతో కొండంత ప్రేమతో దీవించ వచ్చెనమ్మా కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్స్ చెప్పిరమ్మా Wish you both a happy life... happy happy married life నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్లు వర్థిల్లమనెనమ్మా తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల చేయి చేయిగ చిలుక గోరింక శయ్యకు తరలిరమ్మా చెల్లెలి కోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలగెనమ్మా తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా అది చిలుకే కాదని బావిలో కప్పని జాలిగ తలచెనమ్మా తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల
కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు పాట సాహిత్యం
చిత్రం: అంతులేని కథ (1976) సంగీతం: ఎమ్. ఎస్. విశ్వనాథన్ సాహిత్యం: ఆత్రేయ గానం: ఎస్. జానకి కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు రాళ్లలో ఉన్న నీరు క ళ్లకెలా తెలుసు రాళ్లలో ఉన్న నీరు క ళ్లకెలా తెలుసు నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు రాళ్లలో ఉన్న నీరు క ళ్లకెలా తెలుసు చరణం: 1 నీటిలో ఆరే నిప్పును కానూ నిప్పున కాగే నీరైన కానూ ఏదీ కానీ నాలో రగిలే ఏదీ కానీ నాలో రగిలే ఈ అనలాన్నీ ఆర్పేదెవరో నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు చరణం: 2 తానే మంటై వెలుగిచ్చు దీపం చెప్పదు తనలో చెలరేగు తాపం నే వెళ్లు దారి ఓ ముళ్లదారి నే వెళ్లు దారి ఓ ముళ్లదారి రాలేరు ఎవరూ నాతో చేరి నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు చరణం: 3 వేసవిలోనూ వానలు రావా కోవెల శిలకు జీవం రాదా జరిగేనాడే జరుగును అన్నీ జరిగేనాడే జరుగును అన్నీ జరిగిననాడే తెలియును కొన్నీ నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు రాళ్లలో ఉన్న నీరు క ళ్లకెలా తెలుసు నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు
ఊగుతుండు నీ ఇంత ఉయ్యాలా పాట సాహిత్యం
చిత్రం: అంతులేనికథ సంగీతం: యమ్.ఎస్.విశ్వనాథన్ సాహిత్యం: ఆత్రేయ గానం: జేసుదాస్ ఊగుతుండు నీ ఇంత ఉయ్యాలా
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి పాట సాహిత్యం
చిత్రం: అంతులేనికథ సంగీతం: యమ్.ఎస్.విశ్వనాథన్ సాహిత్యం: ఆత్రేయ గానం: జేసుదాస్ దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇక ఊరేల సొంత ఇల్లేలా ఇక ఊరేల సొంత ఇల్లేలా ఓ చెల్లెలా... ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం నన్నడిగి తలిదండ్రి కన్నారా... నన్నడిగి తలిదండ్రి కన్నారా నా పిల్లలే నన్నడిగి పుట్టారా పాపం పుణ్యం నాదికాదే పోవే పిచ్చమ్మా నారుపోసి నీరుపోసే నాధుడువాడమ్మా ఏది నీది ఏది నాది ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా... ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి శిలలేని గుడికేల నైవేద్యం ఈ కలలోని సిరికేల ఈ సంబరం ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచె ఎందుకు పిచ్చమ్మా కళ్ళులేని కబోది చేతి దీపం నీవమ్మా తొలుత ఇల్లు తుదకు మన్ను ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా... ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం అది తెలియకపోతేనే వేదాంతం మన్నులోన మణిక్యాన్ని వెదికే వెర్రమ్మా నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా ఏది సత్యం ఏది నిత్యం ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా... ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి