చిత్రం: అనుకోకుండా ఒక రోజు (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: స్మిత
నటీనటులు: జగపతిబాబు, ఛార్మి కౌర్, శశాంక్
దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత: గంగరాజు గుణ్ణం
విడుదల తేది: 30.06.2005
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని (2)
నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్నా రాజునేనై కోటిగుండెల కోటల్ని
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
చరణం: 1
రాళ్ళే ఉలిక్కిపడాలి నా రాగం వింటే
ఊళ్ళే ఉప్పొంగిపోవాలి నా వేగం వెంటే
కొండవాగులై ఇలా నేను చిటికేస్తే
క్షణాలన్ని వీణ తీగలై స్వరాలెన్నో కురిపిస్తాయంటే అంటే
అది నిజమోకాదో తేలాలంటే చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగా
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
చరణం: 2
చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలా
ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలా
ఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని
ఆ స్వర్గం కూడా తలవంచేలా మన జెండా ఎగరాలీవేళ చుక్కల్ని తాకేంతలా
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
********* ********* ***********
చిత్రం: అనుకోకుండా ఒక రోజు (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి, గంగరాజు, మారుతి
గానం: సునిధి చౌహన్, డొమినిక్యూ సీర్జీయో
I wanna sing and sing and swing and swing till I tumble down
I wanna fly like a bird with the wind in my face
slowly soaring above the ground
తరచి కొలవకు కొలవకు కాలాన్ని
గుర్తుంచుకునేంతగ ఏమున్నది నీ నిన్నల్లో మొన్నల్లో
Ticky Ticky Ticky Ticky clock goes round
Tickety Ticky fun goes on
Ticky Ticky Ticky Ticky come along
When everybody is going round and round
and round and round and round and round
I wanna sing and sing and swing and swing till I tumble down
I wanna fly like a bird with the wind in my face
slowly soaring above the ground
చరణం: 1
సాయంత్రం మనది ఒంటరి ఒంటరి జీవితం
ఈ మంత్రం చెరుపుతున్నది దూరము దూరము
If you wanna sing నాతో గీతం
If you wanna do నాతో నాట్యం
If you wanna spend నాతో సమయం
This is the moment
If you wanna do ఏదైనా కొంచెం
Ticky Ticky Ticky Ticky clock goes round
Tickety Ticky fun goes on
Ticky Ticky Ticky Ticky come along
When everybody is going round and round
and round and round and round and round
I wanna sing and sing and swing and swing till I tumble down
I wanna fly like a bird with the wind in my face
slowly soaring above the ground
చరణం: 2
చూస్తావా సరిగమ విరిచిన హరివిల్లుని
గీస్తావా అసలు హద్దుకి అవతల హద్దుని
If you wanna sleep పరిగెడుతూనే
If you wanna fly నిలబడుతూనే
If you wanna live చనిపోతూనే
Its not a big deal, you have got it down ఇంకో డ్రింకోటి
Ticky Ticky Ticky Ticky clock goes round
Tickety Ticky fun goes on
Ticky Ticky Ticky Ticky come along
When everybody is going round and round
and round and round and round and round
********* ********* *********
చిత్రం: అనుకోకుండా ఒక రోజు (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి, గంగరాజు, మారుతి
గానం: సునిధి చౌహన్, డొమినిక్యూ సీర్జీయో
న న పరుగు తీసినా
న న వదిలి పెడుదునా
వెనుకకి తిరిగి నువ్వు చూడకున్నా
ఎదుటకి వచ్చి నిన్ను చుట్టుకున్నా
షైన న న న న న న న (6)
న న పరుగు తీసినా
న న వదిలి పెడుదునా
వెనుకకి తిరిగి నువ్వు చూడకున్నా
ఎదుటకి వచ్చి నిన్ను చుట్టుకున్నా
షైన న న న న న న న (6)
చరణం: 1
ముఖ ముఖాన పరిచయం అసలు లేదు అవసరం
తనువుకి తెలుసు తనువు అవసరం
పెదవి నుంచి పెదవికి తరుగుతుంటె దూరము
ఇంతకు మించి ఎలా పయనము
సోకార్డ్ సోల్ మేట్ కోసమేల నీ వేట
బ్రాండ్ న్యూ దొరుకుతుంటే ప్రతి పూట
షైన న న న న న న న (6)
న న పరుగు తీసినా
న న వదిలి పెడుదునా
వెనుకకి తిరిగి నువ్వు చూడకున్నా
ఎదుటకి వచ్చి నిన్ను చుట్టుకున్నా
షైన న న న న న న న (6)
చరణం: 2
మసక మసక ఎండలో మంచులాగా కరగక
శాశ్వత బంధం మనకెందుకు
అనుభవాల కొలనులో చేపలాగ ఈదక
పసిఫిక్ సంద్రం గొడవెందుకు
హృదయం లోతులన్ని తెరచి చూస్తే టైం వేస్ట్
పరువం ఎత్తులెక్కు అందుతుంది ఎవరెస్ట్
షైన న న న న న న న (6)
న న పరుగు తీసినా
న న వదిలి పెడుదునా
వెనుకకి తిరిగి నువ్వు చూడకున్నా
ఎదుటకి వచ్చి నిన్ను చుట్టుకున్నా
షైన న న న న న న న (6)
********* ********* ***********
చిత్రం: అనుకోకుండా ఒక రోజు (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి, గంగరాజు
గానం: శ్రేయా గోషల్
నీడల్లే తరుముతు ఉంది గతమేదొ వెంటాడి
మౌనంగ పైబడుతుంది ఉరమేదొ ఉండుండి
స్వాసల్లొ ఉప్పనై చూపుల్లొ చీకటై
దిక్కుల్లొ శూన్యమై శూన్యమై
చరణం: 1
నిప్పు పై నడకలొ తోడుగా నువ్వుండగా
ఒక బంధమే బూడిదై మంటలే మది నిండగా
నీ బాధ ఏ కొంచమో నా చెలిమితో తీరదా
పీల్చే గాలినైనా నడిచే నేలనైనా
నమ్మాలో నమ్మరాదొ తెలియని ఈ పయనంలో
చరణం: 2
ఎందుకొ ఎప్పుడొ ఎమిటొ ఎక్కడొ
బదులు లేని ప్రశ్నలే నీ ఉనికినే ఉరి తీయగా
భయమన్నదే పుట్టదా
ప్రతి ఊహతో పెరగదా
పీల్చే గాలినైనా నడిచే నేలనైనా
నమ్మాలో నమ్మరాదొ తెలియని ఈ పయనంలో
********* ********* ***********
చిత్రం: అనుకోకుండా ఒక రోజు (2005)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి, గంగరాజు
గానం: శ్రేయా గోషల్
రైటో లెఫ్టో లెఫ్టో రైటో
ముందుకో వెనకకో
పైపైకో కిందకో
అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో గో గో గో గో
చరణం: 1
చేలియో చెల్లకో ఇట్స్ ఇట్స్ నో నో నో నో
చేరియో చేరకో యు గో గో గో గో
రాముడో భీముడో ఇంకేవ్వడో
120 చాలదమ్మా ఇట్స్ సో సో సో సో స్లో
చరణం: 2
చూడుడు చూడుడు బుద్ధ విగ్రహం
అక్కడ కాదు ఇక్కడే
ముద్దిస్తేనే స్పీడొస్తుందా
అయితే అయితే అయితే