చిత్రం: అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: చిరంజీవి, విజయశాంతి దర్శకత్వం: ఏ.కోదండరామిరెడ్డి నిర్మాత: అల్లు అరవింద్ విడుదల తేది: 14.01.1989
Songs List:
శాంతీ ఓం శాంతీ పాట సాహిత్యం
చిత్రం: అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989) సంగీతం: చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి శాంతీ ఓం శాంతీ...అరె ఖైధి పోయే దారేదీ స్పీడె తగ్గించు లేడీ వేడుక కాదయ్య చూడు నా వేడి ఇక దూకే నా బ్రేకే చూడమ్మా... ఓకే చూశాకే చూపిస్తా నా తడాకా దూకే నా బ్రేకే చూడమ్మా... ఓకే చూశాకే చూపిస్తా నా తడాకా శాంతీ ఓం శాంతీ...అరె ఖైధి టక్కు టిక్కు టెక్కు నిక్కు తుపాఖీ రుక్క పిక్క దక్కే వేలా జలాకీ కౌగిల్లల్లో ఖైదూ...చెయ్యాలమ్మ నేడూ శ్రుతే ముంచి మతే పోయీ జతే అయినందుకూ ఈ కేసునే కొట్టెయనా పట్టెసుకోనా దూకే నా బ్రేకే చూడమ్మా... ఓకే చూశాకే చూపిస్తా నా తడాకా దూకే నా బ్రేకే చూడమ్మా... ఓకే చూశాకే చూపిస్తా నా తడాకా శాంతీ ఓం శాంతీ...అరె ఖైధి కన్ను ముక్కు సోకు చూసి వరించా ఎక్కి తొక్కి నీకే దక్కి వలేసా వయ్యారంతో ఫైలూ ఒల్లోకొస్తే వెయ్యి బజారంతా మజాచేసెయ్ నిషా అందాలతో నీ ఊపులో ఊరేగనా చలరేగిపోనా శాంతీ ఓం శాంతీ...అరె ఖైధి పోయే దారేదీ స్పీడె తగ్గించు లేడీ వేడుక కాదయ్య చూడు నా వేడి ఇక దూకే నా బ్రేకే చూడమ్మా... ఓకే చూశాకే చూపిస్తా నా తడాకా దూకే నా బ్రేకే చూడమ్మా... ఓకే చూశాకే చూపిస్తా నా తడాకా
మెరుపులా.. లా.. లా పాట సాహిత్యం
చిత్రం: అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989) సంగీతం: చక్రవర్తి సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు పల్లవి: మెరుపులా.. లా.. లా... ఆడతా.. తా.. తా పిడుగులా .. లా.. లా... రేగుతా.. తా.. తా దమ్ముంటే కాస్కో చాలెంజి చేస్కో డిస్కో డాన్సు ఫైటు మిక్స్ చేసి చూపిస్తా రా చరణం: 1 డబ్బుకి లేదే సిగ్గు ఎగ్గు న్యాయం అదుంటే నీ కళ్ళే నీ నెత్తికెక్కడం ఖాయం ఒప్పు చేసినా తప్పులెన్నితే లోకం ఫటా ఫట్ నట్టు బిగించి చెప్పేస్తా గుణపాఠం ప్యారే తెలుసుకో దారి మలుచుకో హద్దు మీరకు ఆటలాడకు జా జా మెరుపులా.. లా.. లా... ఆడతా.. తా.. తా పిడుగులా .. లా.. లా... రేగుతా.. తా.. తా దమ్ముంటే కాస్కో చాలెంజి చేస్కో డిస్కో డాన్సు ఫైటు మిక్స్ చేసి చూపిస్తా రా చరణం: 2 సలాము చేస్తే గులాము నేనై ఉంటా ఖలేజా ఖరీదు కట్టే షరాబు నేనేనంటా రెచ్చగొట్టితే రచ్చకీడ్చి కవ్విస్తా ఓరబ్బా హోలు సేలుగా గోలుమాలు చేయిస్తా దేఖో మెహబూబా... పోటీ తగదిక కాలు కదిపితే కాటు తప్పదిక సోజా మెరుపులా.. లా.. లా... ఆడతా.. తా.. తా పిడుగులా .. లా.. లా... రేగుతా.. తా.. తా దమ్ముంటే కాస్కో చాలెంజి చేస్కో డిస్కో డాన్సు ఫైటు మిక్స్ చేసి చూపిస్తా రా
దిగు దిగు దిగు భామా పాట సాహిత్యం
చిత్రం: అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి పల్లవి: దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే చరణం: 1 వాటేసి చూశాకే ఓ భామా తెలిసింది వయసెంతో ఓలమ్మో ఒళ్లోకి వచ్చాకే ఓ వీరా తేలింది వలపెంతో ఓరయ్యో కాటేసుకున్నాకే ఓలమ్మి కందింది నీ బుగ్గే ఎర్రంగా సాయంకాలం హాయి రేయి తొలిరేయి చెలరేగే వేళ దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే చరణం: 2 నా పైట పడగల్లో ఓ వీరా చాపేసి పడుకుంటే తోడుంటా నా చూపు చురకల్లో ఓ భామా ఉడుకెత్తిపోతుంటే ఇమ్మంట కవ్వించుకున్నాకే ఓరయ్యో కాళింది పొంగింది ఒళ్ళంతా నాగస్వరమే పాడే ఈడే శృతి మించి జత చేరే వేళ దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే
కలలో పెట్టని పాట సాహిత్యం
చిత్రం: అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989) సంగీతం: చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి సాకీ: పైట జారే పడుచు రాగాలలోనా పాటలొచ్చే చిలిపి భావాలలో... పల్లవి: కలలో పెట్టని ముద్దులు పెట్టు కరిచే గాలికి కౌగిలి పట్టు కసిగా కలవకపోతే ఒట్టు కంచెలు దాటిన ప్రేమను తిట్టు నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను కలలో పెట్టని ముద్దులు పెట్టు కరిచే గాలికి కౌగిలి పట్టు కసిగా కలవకపోతే ఒట్టు కంచెలు దాటిన ప్రేమను తిట్టు నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను చరణం: 1 సందిట్లో పడి కాగే కాముడు గోల పెట్టగా పూలే ఈల కొట్టగా కన్నెపిట్టకే కన్ను కొట్టుకోనా ఓ..ఓ.. అందిట్లో పడి వెన్నెట్లో పడుచందమిచ్చుకోనా ముచ్చట్లో ముడి ముద్దుల్లో తడి మేను దాచుకోనా మంచుల్లో ఊరేసాను మల్లెపూలు మంచంలో ఆరేస్తాను కన్నె పూలు కొంగుల్లో దాచుంచాను కొత్త పూలు కొత్తల్లో మొగ్గేసేవే సిగ్గు పూలు కలలో పెట్టని ముద్దులు పెట్టు కరిచే గాలికి కౌగిలి పట్టు కసిగా కలవకపోతే ఒట్టు కంచెలు దాటిన ప్రేమను తిట్టు నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను చరణం: 2 ఊపుల్లో పడి రేగే సొంపులు ఊగుతున్నవి నాలో ఆగకున్నవి జాజి తీగెలా నిన్ను అల్లుకోనా ఓ..ఓ..ఓ.. చూపుల్లో సడి చేతల్లో పడి తప్పు చేసుకోనా రాజీలే పడి సాగే దోపిడి నేను ఒప్పుకోనా తాళాలే దాటించాలి తందనాలు ఓ.. తాపాలే తగ్గించాలి చందనాలు ఇంతట్లో రగిలాయంటే ఇంధనాలు వాటేసి చేసేస్తాలే వందనాలు కలలో పెట్టని ముద్దులు పెట్టు కరిచే గాలికి కౌగిలి పట్టు కసిగా కలవకపోతే ఒట్టు కంచెలు దాటిన ప్రేమను తిట్టు నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను కలలో పెట్టని ముద్దులు పెట్టు కరిచే గాలికి కౌగిలి పట్టు కసిగా కలవకపోతే ఒట్టు కంచెలు దాటిన ప్రేమను తిట్టు నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను
టింగురంగ పాట సాహిత్యం
చిత్రం: అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989) సంగీతం: చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి టింగురమ్మ చక్కనమ్మ చెక్కిలెంత మక్కువో చెంగు చెంగు లేది చూపు కల్లకెంత మక్కువో దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా జారు కొప్పుల్లో చామంతి పెట్టనా దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా జారు కొప్పుల్లో చామంతి పెట్టనా టింగురంగ చక్కనోడి కౌగిలెంత తొక్కిడో టింగు టింగు రెప్పలాడు కళ్ళకెంత తాకిడొ వాలు సంద్యల్లొ పూలే కొట్టనా వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా వాలు సంద్యల్లొ పూలే కొట్టనా వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా నీ ఒంపుకొక్క కొంప కట్టి కాపురాలు చేసెయ్యనా నీ ఒళ్ళు పక్క ఒళ్ళు పెట్టి కన్నె సోకు కాజెయ్యనా అరె కొత్త పిచ్చి పట్టుకున్న ఖోడె గాడికేమో కొంగే అలుసంటా కోక సిగ్గు వీడకున్న ఈడు తల్లికేమో కొంతే తెలుసంటా సరేనంటె సాయంకాలం చలె తీరిపోదా అలాగంటె వేలాకోలం శృతేమించి పోదా టింగురమ్మ చక్కనమ్మ చెక్కిలెంత మక్కువో టింగురంగ చక్కనోడి కౌగిలెంత తొక్కిడో దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా జారు కొప్పుల్లో చామంతి పెట్టనా వాలు సంద్యల్లొ పూలే కొట్టనా వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా నీ ముట్టడింక ఆపలేక ముద్దబంతులిచ్చెయ్యనా నీ తట్టుడింక తట్టుకుంటు తందనాలకొచ్చెయ్యనా తేమ గాలి అంటుకొని ప్రేమ పురాణం చెబుతా రమ్మంటా తెల్ల చీర కట్టు తప్పు భామా కలాపం ఇపుడే లెమ్మంటా చలాకీల సయ్యాటల్లో సలామంట నీకూ గులాభీల పూదోటుందీ చలో అంట నేనూ టింగురంగ చక్కనోడి కౌగిలెంత తొక్కిడో టింగు టింగు రెప్పలాడు కళ్ళకెంత తాకిడొ వాలు సంద్యల్లొ పూలే కొట్టనా వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా వాలు సంద్యల్లొ పూలే కొట్టనా వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా టింగురమ్మ చక్కనమ్మ చెక్కిలెంత మక్కువో చెంగు చెంగు లేది చూపు కల్లకెంత మక్కువో దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా జారు కొప్పుల్లో చామంతి పెట్టనా దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా జారు కొప్పుల్లో చామంతి పెట్టనా