చిత్రం: బావ (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్దార్ధ్
నటీనటులు: సిద్దార్ధ్, ప్రణీత
దర్శకత్వం: రాంబాబు
నిర్మాత: యమ్.ఎల్. పద్మకుమార్ చౌదరి
విడుదల తేది: 29.10.2010
అల్లరోడు ఒకడే ఒకడే
తింగరోడు ఒకడే ఒకడే
గోలగాడు ఒకడే ఒకడే
గాలిగాడు ఒకడే ఒకడే
వీడిగ్యాంగు కనిపిస్తే చాలు జనమంత గడగడే వీరగడగడే
వీడిముందు ఆఫ్ట్రాలే కదా అణుబాంబు దడదడే
Who is this పోరగాడే
వీరమాచనేని వంశమున పుట్టిన కిట్టమూర్తి
వీరబాబు ఊరబాబుగా మారిన కల్లు కోతి
పనీ పాట లేనే లేని తొట్టి గుంపుకు దళపతి
ఊరువాడ దణ్ణమెడతాది వీడికే చేతులెత్తి
బావా బావా బావా బావా బావా బావా
అల్లరోడు చిల్లరోడు సొల్లుగాడు సోదిగాడు కొంటె గాడు కోతి గాడు
తింగరోడు తీటగాడు గాలిగాడు గోలగాడు మాసుగాడు
ఎక్కడబడితే అక్కడ తిరిగే all in one పారికోడే
ఎవ్వడినైనా Don't Care అంటూ గొడవకు దిగిపోతాడే
కిరికిరి చేష్టల కింగునని భూమ్మీదసలే నడవడుగా
ఎదవేషాలకు తోపునని కాలరు దించడుగా
అచ్చోసిన Dash Dash అంటే అసలర్ధం వీడేలే
ఆమాటే వాడికి చెప్పే మొగుడే లేడే
||వీరమాచనేని||
చేతులదురద మనకొక సరదా ఎవడినొ ఒకడిని కెలుకు
మొటికలు తిట్లూ చీపురు కట్టలు మామూలేగా మనకు
మంతోగోక్కుని ఎవడైనా నెమ్మదిగా నిదరోడుకదా
సర్లెమ్మని ఎడ్జస్టయినా మనమే వాడిని వొదలముగా
నరకంలో పాపం చేసే ఈ ఊర్లో పుట్టరు
మనచేతికి దొరికేసారు బకరాగాళ్ళు
******** ********* ********
చిత్రం: బావ (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: రంజిత్, హరిణి
మిల మిల మిలమని సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ
తళ తళ తళమని చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ
మిల మిల మిలమని సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ
తళ తళ తళమని చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ
నేనే నా నేనే నా నేను చూస్తుంది నిన్నే నా
నిజమేనా నిజమేనా నమ్మదు నా మనసే
నేనేలే నేనేలే నువ్వు చూస్తుంది నన్నేలే
చిననాటి నీ చెలిమి ఎదురుగానిలిచెనులే
హాయ్ లే హాయ్ లే ప్రతిరోజు సంబరాలే
హాయ్ లే హాయ్ లే ఎండల్లో చల్లని వానలే
హాయ్ లే హాయ్ లే మది తాకే అంబారాలే
హాయ్ లే హాయ్ లే ఎద ఉగుతున్నది ఊయలే
మిల మిల మిలమని సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ
తళ తళ తళమని చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ
ఏ మనసుకు రెక్కలు మొలిచే నువ్వే నన్నే కలిసాకే
తీపిని మించిన తిపే రుచి చూశా ఇపుడే
నింగికి నేలకు నడుమ మది నిలిచే నీతో నడిచే
రంగుల ఆ హరివిల్లై విరబూసే ప్రణయమే
అనందం అంటుంటే ఇన్నాళ్ళు విన్నాలే
ఈ రోజే తొలిసారి అది ఏమిటో కన్నాలే
సద్రం నీటి బొట్టై పిడికిట్లో ఒదిగేనేలే
ఆకాశం పులరెక్కై అరచేతుల్లో చిక్కిందిలే
హాయ్ లే హాయ్ లే ప్రతిరోజు సంబరాలే
హాయ్ లే హాయ్ లే ఎండల్లో చల్లని వానలే
హాయ్ లే హాయ్ లే మది తాకే అంబరాలే
హాయ్ లే హాయ్ లే ఎద ఊగుతున్నది ఊయాలే
మిల మిల మిలమని సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ
తళ తళ తళమని చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ
చేతితో కనులను మూస్తే చీకట్లో నీ రూపం
రారా రమ్మని పిలిచే అది ఏమిటో చిత్రమే
ఇదివరకెన్నడు లేదే నాకంటూ ఒక గమ్యం
నువ్వే ఇక నా తీరం నీ వెనుకే పయనమే
అందంలో నను చూసి నీ రూపం కనిపించే
నీ పేరు ఎవర్న నీ పేరు వినిపించే
లోకం నాకు నువై నే శూన్యం ఐనాలే
నా ప్రాణం నిన్ను చేరి నీ ప్రాణం లో కలిసిందిలే
హాయ్ లే హాయ్ లే ప్రతిరోజు సంబరాలే
హాయ్ లే హాయ్ లే ఎండల్లో చల్లని వానలే
హాయ్ లే హాయ్ లే మది తాకే అంబరాలే
హాయ్ లే హాయ్ లే ఎద ఊగుతున్నది ఊయలే
మిల మిల మిలమని సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ
తళ తళ తళమని చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ
******** ********* ********
చిత్రం: బావ (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: యమ్.యమ్. కీరవాణి
పన్నెండేల్ల ప్రాయం వెన్నెల్లాంటి హృదయం
ఎన్నాళ్ళైనా మరుపే రావుగా
సంతోషాల సమయం పంతాలైన మధురం
సొంతం కాని ఎదలే లేవుగా
కాసేపు ఆ జ్ఞాపకాలన్నీ ఎదురైతే
నీ రూపు ఆ చోట పసిపాపై తోస్తుంది
కథలా కదిలే కాలం లోన అన్నీ వింతలే
చెలిమే చిలికే కళ్ళలోన కలవా చింతలే
అదిగో తేనెటీగల్లె తాకింది ఆ చల్ల గాలి
అపుడే తేనే తీపంతా నన్నందుకోమంది వెళ్ళి
పన్నెండేల్ల ప్రాయం వెన్నెల్లాంటి హృదయం
ఎన్నాళ్ళైనా మరుపే రావుగా
సంతోషాల సమయం పంతాలైన మధురం
సొంతం కాని ఎదలే లేవుగా
చెరువుల్లో ఈత ఇసకల్లో రాత
తిరనాల్లో ఆడే సైఆట
గుడిలోని పాట తూనీగల వేట
బడిలో నేర్పించే బతుకాట
చిననాటి స్నేహాల చిగురింతలే
ఎదిగెను ఈనాటి పులకింతలై
ఆ బొమ్మ పెళ్ళిల్ల సందల్లలో
ఈ బొమ్మకెన్నెన్ని తుల్లింతలో
నువ్వు దాచాలి అనుకున్నా వీల్లేదని తెలుసా
పన్నెండేల్ల ప్రాయం వెన్నెల్లాంటి హృదయం
ఎన్నాళ్ళైనా మరుపే రావుగా
సంతోషాల సమయం పంతాలైన మధురం
సొంతం కాని ఎదలే లేవుగా
మనపై జడివాన కురిసే నిమిషాన
పడవలు తయ్యారే గుర్తుందా
మామిడి కొమ్మల్లో కోకిలతో చేరి
కూసే కచ్చేరీ గుర్తుందా
నిన్నమొన్నే అయినట్టు వున్నాయిలే
ఆ నవ్వు నాతో ఉండేట్టు చేసాయిలే
పాదాలు ఏ దారి నడిపించునో
ఏ ప్రేమ తీరాలు కనిపించునో
అడగలంటు నీ చెంత వాలిందలా మనసు
పన్నెండేల్ల ప్రాయం వెన్నెల్లాంటి హృదయం
ఎన్నాళ్ళైనా మరుపే రావుగా
సంతోషాల సమయం పంతాలైన మధురం
సొంతం కాని ఎదలే లేవుగా