చిత్రం: బంగారు బాబు (1973) సంగీతం: కె.వి. మహదేవన్ నటీనటులు: అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ దర్శకత్వం & నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్ విడుదల తేది: 15.03.1973
Songs List:
చెంగావి రంగు చీర పాట సాహిత్యం
చిత్రం: బంగారు బాబు (1973) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: ఘంటసాల, పి. సుశీల ఛిఛిఛిఛిఛిఛిఛిఛిఛి ఛఛఛఛఛఛ..ఛ చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది.. దాని జిమ్మదీయ..దాని జిమ్మదీయ.. అందమంతా చీరలోనే ఉన్నది!! చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది.. దాని జిమ్మదీయ..దాని జిమ్మదీయ.. కొంగు కొంగు కలిపి చూడమన్నది!! చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది.. దాని జిమ్మదీయ..దాని జిమ్మదీయ.. అందమంతా చీరలోనే ఉన్నది!! చరణం : 1 మెరుపల్లే వచ్చిందీ నా ఇంటికి.. నను మెల్లంగా దించింది ముగ్గులోనికి.. మెరుపల్లే వచ్చిందీ నా ఇంటికి.. నను మెల్లంగా దించింది ముగ్గులోనికి.. తల దాచుకొమని తావిస్తివీ.. తల దాచుకొమని తావిస్తివీ.. పిల్ల దొరికింది చాలని ఇల్లాల్ని చేస్తివి!! చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది.. దాని జిమ్మదీయ.. అందమంతా చీరలోనే ఉన్నది!! చరణం : 2 ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి.. దాంతో వెర్రెత్తి పోయింది కుర్రవాడికి.. ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి.. దాంతో వెర్రెత్తి పోయింది కుర్రవాడికి.. పిచ్చివాడనే పేరు చాటున మాటు వేసినావు.. పిచ్చివాడనే పేరు చాటున మాటు వేసినావు.. పిల్లదాని పెదవిమీద కాటు వేసినావు!! హెయ్.. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది.. దాని జిమ్మదీయ.. కొంగు కొంగు కలిపి చూడమన్నది!! చరణం : 3 సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి.. అబ్బో సంగీతం వచ్చిందీ బుచ్చిబాబుకీ.. తెరచాటు తొలిగింది పరువానికి.. తెరచాటు తొలిగింది పరువానికి.. అది పరవళ్ళు తొక్కుతూ పాడింది నేటికి!! సరి సరి సరి సరి సరి సరి సరి సరి చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది.. దాని జిమ్మదీయ.. కొంగు కొంగు కలిపి చూడమన్నది!! చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది.. దాని జిమ్మదీయ.. అందమంతా చీరలోనే ఉన్నది!! సరిససస సగససస సమససస సరి సరి సరిస సరిససస సగససస సమససస సరి సరి సరిస సరిససస సరిససస సరి సరి సరి సరి సరి సరి సరి స
గౌరమ్మ తల్లీ పాట సాహిత్యం
చిత్రం: బంగారు బాబు (1973) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల & కోరస్ పల్లవి: గౌరమ్మ తల్లీ గౌరమ్మ తల్లీ కోరిన కోర్కెలు తీర్చేతల్లీ సిరులిచ్చినావు గుణమిచ్చినావు చక్కని సొగసిచ్చినావు సొగసును మించిన మనసిచ్చినావు మనసుకు తగిన మనువీయవమ్మా నా మనుగడ నిలకడ చేయవమ్మా చదువున్నవాగా చరణం : 1 చదువుకున్న వాడా సరి అందగాడ ఎవరమ్మ నీకూ తగుజోడు ! నను మెచ్చువాడు మనసిచ్చువాడు వలపించి బులిపించి వయసేలు వాడు చరణం : 2 నిరుపేదనైనా వరియించగలవా వలపులు కురిపించగలవా ? కులమేదైనా పెండ్లాడగలవా పేదవాడైనా ప్రేమున్నచాలు పొత్తుకుదిరితే పూరిపాకైనా చాలు
ఏడడుగుల సంబంధం పాట సాహిత్యం
చిత్రం: బంగారు బాబు (1973) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: ఘంటసాల, పి. సుశీల పల్లవి : ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం నిన్ను నన్ను పెనవేసిన బంధం ఎన్నో జన్మల సంబంధం ఎన్నెన్నో... జన్మల అనుబంధం ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం నిన్ను నన్ను పెనవేసిన బంధం ఎన్నో జన్మల సంబంధం ఎన్నెన్నో... జన్మల అనుబంధం చరణం : 1 ఎన్నో ఊసులు ఎదలో మెదిలే తొలిరోజు అవి మాటలకందక మారాం చేసేదీరోజు ఎన్నో ఊసులు ఎదలో మెదిలే తొలిరోజు అవి మాటలకందక మారాం చేసేదీరోజు ఈ రోజు కోసమే కన్నులు కాయలు కాచినవి ఈ రోజు కోసమే కన్నులు కాయలు కాచినవి ఈ రోజు కోసమే కన్నె సొగసులు దాచినది ఈ రోజు కోసమే కన్నె సొగసులు దాచినది ఇది... ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం నిన్ను నన్ను పెనవేసిన బంధం ఎన్నో జన్మల సంబంధం ఎన్నెన్నో... జన్మల అనుబంధం చరణం : 2 మోజులు పెరగాలివాటిని చేతలు చెయ్యాలి సుఖాల లోతులు చూడాలి ఒడిలో సోలిపోవాలి మోజులు పెరగాలి వాటిని చేతలు చెయ్యాలి సుఖాల లోతులు చూడాలి ఒడిలో సోలిపోవాలి అలుపు సొలుపు ఎరగని పరువం అంతు చూడాలి ఎండ వాన రెండూ చూస్తూ పండిపోవాలి అలుపు సొలుపు ఎరగని పరువం అంతు చూడాలి ఎండ వాన రెండూ చూస్తూ పండిపోవాలి ఇది... ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం నిన్ను నన్ను పెనవేసిన బంధం ఎన్నో జన్మల సంబంధం ఎన్నెన్నో... జన్మల అనుబంధం చరణం : 3 ఆలుమగలుగ ఆనందం చవిచూశాము అనురాగం పండి అమ్మానాన్నలమైనాము ఆలుమగలుగ ఆనందం చవిచూశాము అనురాగం పండి అమ్మానాన్నలమైనాము ఈ రోజు కోసమే ఆడది తపస్సు చేసేది ఈ రోజు కోసమే ఆడది తపస్సు చేసేది ఈ బోసినవ్వుకే మగాడు జోలలు పాడేది ఈ బోసినవ్వుకే మగాడు జోలలు పాడేది ఇది... ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం నిన్ను నన్ను పెనవేసిన బంధం ఎన్నో జన్మల సంబంధం ఎన్నెన్నో... జన్మల అనుబంధం
ఏమనుకున్నావు పాట సాహిత్యం
చిత్రం: బంగారు బాబు (1973) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: ఘంటసాల ఏమనుకున్నావు నన్నేమనుకున్నావు పిచ్చివాడివనుకున్నావా లేక బిచ్చగాడి ననుకున్నావా చరణం : 1 వెళ్ళినట్టె వెళ్ళావు కళ్ళలోనె ఉన్నావు మరచిపోను వీలు లేక, మనసులోనె మెదిలావు పిచ్చివాడి ననుకున్నావా బిచ్చగాడి ననుకున్నావా? చరణం : 2 నిన్ను నేను రమ్మన్నానా ? మనసు నాకు ఇమ్మన్నానా! వచ్చి వలపు రగిలించావు చిచ్చునాకు మిగిలించావు పిచ్చివాడి ననుకున్నావా? బిచ్చగాడిననుకున్నావా చరణం : 3 ప్రేమంటేనే బాధన్నారు ఆ బాధుంటేనే బ్రతుకన్నారూ అది ప్రేమే కాదంటాను ఆ ఊతుకే వద్దంటాను....
కన్నయ్య లాంటి అన్నయ్య పాట సాహిత్యం
చిత్రం: బంగారు బాబు (1973) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: ఘంటసాల, పి. సుశీల కన్నయ్య లాంటి అన్నయ్య
తగిలిందయ్యో తగిలింది పాట సాహిత్యం
చిత్రం: బంగారు బాబు (1973) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల & కోరస్ పల్లవి: తగిలిందయ్యో తగిలింది పై రగాలి ఎగిరిందమ్మో ఎగిరింది పైటకొంగు తగిలింది- ఎగిరింది - య్యయ్యయ్యో పే పురకలు వేసింది. వురకలు వేసింది...... చరణం : 1 కొమ్మ కొమ్మనా జంటలుచూపే పువ్వు పువ్వునా తుమ్మెదలుందే గువ్వల గుసగుస వింటుంటే గుండెలు రెపరెపమంటుంటే అమ్మమ్మమ్మో వయసే బుసబుసపొంగిందీ నా మనసే వురకలు వేసింది చరణం : 2 మబ్బును మబ్బు ముద్దులాడితే సిగ్గున నింగి ఎర్రబారితే ఎన్నడు చూడని అందాలు చూశానమ్మా ఈనాడు అమ్మమ్మమ్మో వయసు మనసూ ఒక పై నా ఉసురు పోసుకున్నాయి
శ్రీరామచంద్రా నారాయణ పాట సాహిత్యం
చిత్రం: బంగారు బాబు (1973) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: ఘంటసాల శ్రీరామచంద్రా నారాయణ, ఎన్నికష్టాలు వచ్చాయిరా నాయనా శ్రీరామచంద్రా నారాయణ, ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా చరణం : 1 పగలంతా యిద్దరమూ ఆలు మగలమూ పడుకునే వేళకూ పక్కల దూరమూ ఊరివారికందమూ వుత్తిత్తి కాపురము నోరూరుతున్న మనకేమో ఓపలేని తాపము..... చరణం : 2 అన్నివున్న అందగత్తె అందుబాటులో వున్నా అన్నమాట, కోసమే ఆశలన్ని అణచుకున్నా వున్నవన్ని వున్నట్టే ఊడ్చివ్వాలనుకున్నా కన్నెకున్న హద్దులకు కట్టుబడి సరుకున్నా చరణం : 3 కళ్ళల్లోకి చూడకు కాళ్లు కలిపి నడవకు మూడుముళ్ళు పడేవరకు మోమాట పెట్టకు ఆ మంచిరోజు వచ్చును హద్దులెగిరిపోవును కాచుకున్న వయసు కచ్చి అప్పుడే తీరును.....