Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bhale Thammudu (1969)




చిత్రం: భలే తమ్ముడు (1969)
సంగీతం: టి.వి.రాజు
నటీనటులు: యన్.టి.రామారావు, కె.ఆర్.విజయ
దర్శకత్వం: బి.ఎ. సుబ్బారావు
నిర్మాత: అట్లూరి పుందారికాక్షయ్య
విడుదల తేది: 18.11.1969



Songs List:



యే మజా దేఖ్ లో పాట సాహిత్యం

 
చిత్రం: భలే తమ్ముడు (1969)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

యే మజా దేఖ్ లో 




ఎంతవారు గాని పాట సాహిత్యం

 
చిత్రం: భలేతమ్ముడు (1969)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: మహమ్మద్ రఫీ

(ఈ పాటను నారా రోహిత్ నటించిన రౌడీ ఫెలో (2014)  సినిమాలో రీమిక్స్ చేశారు)


ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులో ఓఓ...

ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులో ఓఓ...

చిన్నది మేనిలో మెరుపున్నది హహ
చేపలా తళుకన్నది సైప లేకున్నది
చిన్నది మేనిలో మెరుపున్నది
చేపలా తళుకన్నది సైప లేకున్నది
ఏ వన్నెకాని వలపు నమ్మి వలను చిక్కునో
కైపులో కైపులో కైపులో ఓఓ..

ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులో ఓఓ...
ఆడకు వయసుతో చెరలాడకు ఆహా
ఆడితే వెనుకాడకు ఊహూ కూడి విడిపోకు
ఆడకు వయసుతో చెరలాడకు
ఆడితే వెనుకాడకు కూడి విడిపోకు
మనసు తెలిసి కలిసి మెలిసి వలపు నింపుకో
కైపులో కైపులో కైపులో ఓఓ..

ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులో ఓఓ...
హహహ ఓ భలే భలే లేత వయసుడికిందిలే
తాత మనసూరిందిలే లోకమింతేలే
హహహ ఓ భలే భలే లేత వయసుడికిందిలే
తాత మనసూరిందిలే లోకమింతేలే
ఓయ్ పాత రుచులు తలచి తలచి తాత ఊగెనోయ్
కైపులో కైపులో కైపులో ఓఓ..

ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులో ఓఓ...





గోపాల బాల నిన్నే కోరి ..పాట సాహిత్యం

 
చిత్రం: భలే తమ్ముడు (1969)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: మహమ్మద్ రఫీ, పి. సుశీల 

గోపాల బాల నిన్నే కోరి ..నీ సన్నిధి చేరి
నీ చుట్టే తిరుగుతు ఉంటాను..ఊ..ఊ..హూ..హూ..హూ..
గోపాల బాల నిన్నే కోరి ..నీ సన్నిధి చేరి
నీ చుట్టే తి రు గు తు ఉంటాను...

నీ నామం వింటూ వుంటే.. నిలువెల్ల పులికించేను
నీ రూపం కంటూ వుంటే.. నన్ను నేనే మరిచేనూ....
హే..గీతా..ఆ..ఆ..ఆ నాథా..ఆ..ఆ..

నీ నామం వింటూ వుంటే.. నిలువెల్ల పులికించేను
నీ రూపం కంటూ వుంటే.. నన్ను నేనే మరిచేనూ
గారాల బాలా మారాము చేయొద్దు..
బైరాగిని అనుకోవద్దు..నేను.. ఆ నేనే.. ఈ నేనూ

గొపాల బాల నిన్నే కోరి .. నీ సన్నిధి చేరి
నీ చుట్టే తిరుగుతు ఉంటాను..ఊ..ఊ.

ఏ మూఢులు కాదంటున్నా.. నా మనసే నీదేనన్న..
పూజారి అడ్డం వున్నా... నా దైవం నీవేనమ్మ..
కృష్ణమ్మా..ఆ...ఆ..ఆ..ఆ

ఏ మూఢులు కాదంటున్నా.. నా మనసే నీదేనన్న..
పూజారి అడ్డం వున్నా... నా దైవం నీవేనమ్మ

నిన్ను నమ్మిన వాన్ని నట్టేటా ముంచేస్తావో..
మరి గట్టు మీద చేరుస్తావో..
అంతా నీ భారమన్నాను..ఊ..ఊ

గోపాల బాల నిన్నే కోరి .. నీ సన్నిధి చేరి
నీ చుట్టే తిరుగుతు ఉంటాను..ఊ..ఊ.

సిరులంటే ఆశ లేదు.. వరమేమి అక్కరలేదు
గీతా పారాయణమే.. నా జీవిత లక్ష్యం అన్నాను..
సిరులంటే ఆశ లేదు.. వరమేమి అక్కరలేదు
గీతా పారాయణమే.. నా జీవిత లక్ష్యం అన్నాను..

నా ముద్దు మురిపాలన్నీ తీర్చేదాక..
నీలో నన్నే చేర్చేదాక
నీడల్లే నిన్నంటే వుంటాను

గోపాల బాల నిన్నే కోరి .. నీ సన్నిధి చేరి
నీ చుట్టే తిరుగుతు ఉంటాను..ఊ..ఊ.
గోపాల బాల నిన్నే కోరి ..నీ సన్నిధి చేరి..ఈ..ఈ
నీ చుట్టే తిరుగుతు ఉంటాను..ఊ..ఊ.
నీ చుట్టే తిరుగుతు వుంటానూ..
నీ చుట్టే తిరుగుతు వుంటానూ..
నీ చుట్టే..నీ చుట్టే తిరుగుతు వుంటానూ..
తిరుగుతు వుంటాను..తిరుగుతు వుంటాను..తి..





ఇద్దరి మనసులు ఒకటాయె పాట సాహిత్యం

 
చిత్రం: భలే తమ్ముడు (1969)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: మహమ్మద్ రఫీ, పి. సుశీల 

పల్లవి:
ఇద్దరి మనసులు ఒకటాయె - సరి
హద్దులు లేనే లేవాయె
ముద్దుల తలపులు మొదలాయె - మరి
నిద్దుర రానే రాదాయె (2)

చరణం: 1
కనులు కనులు కలిసినపుడే
మనసు మనసూ మాటలాడె
మరులు విరబూసె "ఇద్దరి"

చరణం: 2
చేయి చేయి తాకగానే
హాయి ఏదో సోకగానే (2)
పైట బరువాయె

చరణం: 3
కలలెరుగని కోనలోన
చెలిమిపండే సీమలోన (2)
కలిసిపోదామా




గుమ్మ గుమ్మ గుమ్మా.. పాట సాహిత్యం

 
చిత్రం: భలే తమ్ముడు (1969)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: మహమ్మద్ రఫీ, పి. సుశీల 

పల్లవి: 
గుమ్మ గుమ్మ గుమ్మా.. ఆ... గుమ్మెత్తిచ్చే
ముద్దుల గుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా.. ఆ... గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
కైపెక్కిన కన్నులతోనే మత్తెంకించే కమ్మెసే బొమ్మా ఈ ముద్దుల గుమ్మా
ఉసికొలిపే వంపులతోనే మరులెత్తించి పూజించే రెమ్మా ఈ ముద్దుల గుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా.. ఆ... గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా.. ఆ... గుమ్మెత్తిచ్చే ముద్దులు గుమ్మ

చరణం: 1
విసుగెత్తిన బ్రతుకులలోన ఏముంది.. పస ఏముందీ...
విసుగెత్తిన బ్రతుకులలోన ఏముంది.. పస ఏముందీ...
సిసలైన సారం ఈ క్లబ్బుల కౌగిట దాగుంది..ఈ..ఈ
సిసలైన సారం ఈ క్లబ్బుల కౌగిట దాగుంది
సరదాగ సీతాకోక చిలుకల్లాగ తిరగాలి రోజూ.. తీరాలి
మోజే...
రేపన్నది లేనేలేదు రానే రాదు వుందొకటే నేడు నీ ముందుంది చూడు

చరణం: 2
గుమ్మా... ఆ..ఆ...ఆ..ఆ...ఆహ్...
కాకి కోకిల అవుతుందా... కంచు కనకం అవుతుందా...
క్లబ్ కాపురం అవుతుందా... వెలయాలు '
ఇల్లాలు అవుతందా...
కాకి కోకిల అవుతుందా... కంచు కనకం అవుతుందా...
క్లబ్ కాపురం అవుతుందా... వెలయాలు ఇల్లాలు అవుతుందా...
జబ్జల దాకా జాకెట్టు... అహ... సిగ్గు ఎగ్గూ తీసాకట్టూ
బారెడు జుట్టు జానెడాయే.. అయ్యో బొడ్డు కింద చీరకట్టు మోజులాయే...
బారెడు జుట్టు జానెడాయే.. అయ్యో బొడ్డు కింద చీరకట్టు మోజులాయే...
హో...ఏ...ఏ...ఏ
ఓరయ్యో ఉన్నది అంతా ఉన్నట్టంటే ఊరంతా ఉలుకూ...గుండెల్లో కెలుకూ
ఓరయ్యో ఉన్నది అంతా ఉన్నట్టంటే ఊరంతా
ఉలుకూ...గుండెల్లో కెలుకూ

గుమ్మ గుమ్మ గుమ్మా.. ఆ... గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా.. ఆ... గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా.. ఆ... గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా.. ఆ... గుమ్మెత్తిచ్చే ముద్దుల గుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా.. ఆ... గుమ్మెత్తిచ్చే ముద్దులు గుమ్మ
గుమ్మా...ఆ...ఆ...ఆ...ఆ



నేడే ఈనాడే పాట సాహిత్యం

 
చిత్రం: భలే తమ్ముడు (1969)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: మహమ్మద్ రఫీ, పి.సుశీల 

(ఈ పాటను బాలకృష్ణ నటించిన అల్లరి పిడిగు (2006)  సినిమాలో రీమిక్స్ చేశారు)

పల్లవి:
నేడే ఈనాడే
కరుణించె నన్ను చెలికాడే (2)

చరణం: 1
కనులముందున్న రతనాలమూర్తిని
విలువలెరుగక విసిరితిని (2)
కనులు తెరచీ విలువ తెలిసి
మనసే గుడిగా మలచితిని (2)

చరణం: 2
మదిలో విరిసే మమతల మాలలు
చెలిమికి కానుక చేసెదను (2)
ఆరని వలపుల హారతి వెలుగుల (2)
కలకాలం నిను కొలిచెదను "నేడే"

చరణం: 3
చిలిపిగ కసిరే
చిలిపిగ కసిరే చెలియ విసురులో
అలకలు గని నవ్వుకున్నారు
చేతులు సాచి చెంతకు చేరిన (2)
ఆ చెలినే అందుకున్నారు (2)

నేడ ఈనాడే
మురిపించె నన్ను చెలి తానే
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈనాడే మురిపించె నన్ను చెలి తానే
అహా....




కలతలెరుగని కోనలోన పాట సాహిత్యం

 
చిత్రం: భలే తమ్ముడు (1969)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: మొహమ్మద్ రఫీ, పి. సుశీల 

కలతలెరుగని కోనలోన


Most Recent

Default