చిత్రం: భుకైలస్ (1958) సంగీతం: సుదర్శనం - గోవర్ధనం నటీనటులు: యన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, జమున దర్శకత్వం: కె.శంకర్ నిర్మాణం: ఏవియం ప్రొడక్షన్స్ విడుదల తేది: 20.03.1958
Songs List:
అందములు విందులయ్ పాట సాహిత్యం
చిత్రం: భుకైలస్ (1958) సంగీతం: సుదర్శనం - గోవర్ధనం సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: పి. సుశీల, ఏ.పి.కోమల, టి.ఎస్.భార్గవి అందములు విందులయే అవని ఇదేనా కమలాసనునీ కోటి శిల్ప కూటమిదేనా కూటమిదేనా ఎందును లేనీ తీయందనాలూ చిందులు వేసేనుగా అందములు విందులయే అవని ఇదేనా కమలాసనునీ కోటి శిల్ప కూటమిదేనా కూటమిదేనా తెలుసును నీలో వలపుదుమారంరం కలచివేసినట్టే విచారం నీ మది దోచే మన్మధుడెవరే నిజమేనా యోచనా ప్రణయ సుధా యాచన తగవేనా ఈ నటనా చాలునింక వంచన అందములు విందులయే అవని ఇదేనా కమలాసనునీ కోటి శిల్ప కూటమిదేనా కూటమిదేనా తామర పూవులా తురిమేము రారే మనసున వేదన మితిమీరి పోనే (2) అంతేనా ఔనౌనె చాలు మీదు ఆగడాలు చాలు మీదు ఆగడాలు అందములు విందులయే అవని ఇదేనా కమలాసనునీ కోటి శిల్ప కూటమిదేనా కూటమిదేనా
దేవ దేవ ధవళాచల పాట సాహిత్యం
చిత్రం: భుకైలస్ (1958) సంగీతం: సుదర్శనం - గోవర్ధనం సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: ఘంటసాల దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో హాలహలధర శూలా యుధకర శైల సుతావర నమో నమో హాలహలధర శూలా యుధకర శైల సుతావర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో దురిత విమోచన ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ దురిత విమోచన ఫాల విలోచన పరమ దయాకర నమో నమో కరి చర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో కరి చర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నారాయణహరి నమోనమో నారాయణహరి నమోనమో నారాయణహరి నమోనమో నారాయణహరి నమోనమో నారద హృదయ విహారీ నమో నమో నారద హృదయ విహారీ నమో నమో నారాయణహరి నమోనమో నారాయణహరి నమోనమో పంకజనయన పన్నగశయనా పంకజనయన పన్నగశయనా పంకజనయన పన్నగశయనా శంకర వినుతా నమో నమో శంకర వినుతా నమో నమో నారాయణహరి నమోనమో నారాయణహరి నారాయణహరి నారాయణహరి నమోనమో
దేవ మహాదేవ పాట సాహిత్యం
చిత్రం: భుకైలస్ (1958) సంగీతం: సుదర్శనం - గోవర్ధనం సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: ML వసంత కుమారి దేవ మహాదేవ మము బ్రోవుము శివా భవ పాశ నాశనా భువనైక పోషణా పరమ ప్రేమాకార నిఖిల జీవాధార సకల పాప విదూర దరహాస గంభీర దివ్య తేజోపూర్ణ తనయులను గన్నాను దేవతా మాతలతో పరియశము గొన్నాను కావుమా నా సుతల చల్లగా గౌరీశ ఈ వరము నాకొసగు ప్రేమతో సర్వేశ
మున్నీట పవళించు నాగశయన పాట సాహిత్యం
చిత్రం: భుకైలస్ (1958) సంగీతం: సుదర్శనం - గోవర్ధనం సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: ML వసంత కుమారి మున్నీట పవళించు నాగశయన చిన్నారి దేవేరి సేవలు చేయ నీ నాభి కమలాన కొలువు జేసే వాణీసు భుజపీఠి బరువు వేసి మీనాకృతి దాల్చినావు వేదాల రక్షింప! కుర్మాకృతి బూనినావు వారధి మధియింప! కిటి రూపము దాల్చినావు కనకాక్షు వధియింప! నరసింహమై వెలసినావు ప్రహ్లాదు రక్షింప! నతపాల మమునేల జాగేల - పాల మోహినీ విలాన కలిత నవమోహణ మోహదూర మౌనిరాజ మనోమోహన మందహాస మధుర వదన రమానాయక కోటి చంద్ర కాంతి సదన శ్రీలోల - పాల
నా నోము ఫలించెనుగా నేడే పాట సాహిత్యం
చిత్రం: భుకైలస్ (1958) సంగీతం: సుదర్శనం - గోవర్ధనం సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: పి. సుశీల నా నోము ఫలించెనుగా నేడే నా నోము ఫలించెనుగా నేడే సురభామినులు తలచేవలచే నవప్రేమామృత సారములు చవులు గొలిపే నేడే కాంతి సోయగమించి ఆశలు పెంచె ప్రేమిక హృదయాల కాంతి విరహానల తాపము బాయెగా తొలిప్రేమలు పూలు పూచి కాయగా నవప్రేమామృత సారములు చవులు గొలిపే నేడే నీదు సొమ్మేరా నా మేను సుకుమార (వీణ) మృదు గానమీవు లయనైదు నేను చేసేము రాగసాధన (వేణువు) తానన తాన తన్నానన (మృదంగం) భావరాగ తాళమేళన (మోర్సింగ్) శృంగార కలిత (ఘటం) సంగీత భరిత (మోర్ సింగ్) సరళ (వీణ) సరస (వేణువు) రీతి (ఘటం) గీతి (మోర్ సింగ్) సరళ సరస రీతి గీతి సరళ సరస రీతి గీతి పొరలిపొంగు వారు విమల ప్రీతి జగజగాల విరియుజేయు హాయి అమర సౌఖ్యమావహించు రేయి నా నోము ఫలించెనుగా
అగ్ని శిఖలతో పాట సాహిత్యం
చిత్రం: భుకైలస్ (1958) సంగీతం: సుదర్శనం - గోవర్ధనం సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: ఘంటసాల అగ్ని శిఖలతో ఆడకుమా నీవు ఆపదపాలు గాకుమా పరసతిగోరి పరుగులువారీ నరకములోబడి నవయగనేల? జలధరశ్యామ, మంగళనామ శ్రీపరంధామా కావుమా పిలిచిన పలుకుమ, నెనరును చిలుకుమ వరముల నిడుమ కమలారమణ
నీలకంథరా పాట సాహిత్యం
చిత్రం: భుకైలస్ (1958) సంగీతం: సుదర్శనం - గోవర్ధనం సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: ఘంటసాల జయ జయ మహాదేవా శంభో సదా శివా ఆశ్రిత మందారా శౄతి శిఖర సంచారా నీలకంథరా దేవా దీనబాంధవా రారా నను గావరా నీలకంథరా దేవా దీనబాంధవా రారా నను గావరా సత్య సుందరా స్వామీ నిత్య నిర్మలా పాహీ సత్య సుందరా స్వామీ నిత్య నిర్మలా పాహీ నీలకంథరా దేవా దీనబాంధవా రారా నను గావరా అన్య దైవమూ గొలువా అన్య దైవమూ గొలువా నీదు పాదమూ విడువ అన్య దైవమూ గొలువా నీదు పాదమూ విడువ దర్శనమ్మునీరా మంగళాంగా గంగాధరా దర్శనమ్మునీరా మంగళాంగా గంగాధరా నీలకంథరా దేవా దీనబాంధవా రారా నను గావరా దేహి అన వరములిడు దానగుణసీమా పాహి అన్నను ముక్తినిడు పరంధామా నీమమున నీ దివ్య నామ సంస్మరణా యేమరక చేయుదును భవతాపహరణా నీ దయామయ దౄష్టి దురితమ్ములారా వరసుధావౄష్టి నా వాంఛలీడేరా కరుణించు పరమేశ దరహాస భాసా హర హర మహాదేవ కైలాశ వాసా కైలాశ వాసా పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా
ప్రేమలీవిధమా పాట సాహిత్యం
చిత్రం: భుకైలస్ (1958) సంగీతం: సుదర్శనం - గోవర్ధనం సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: ఘంటసాల, పి. సుశీల ప్రేమలీవిధమా - విషాదమే ఫలమా మన్నాయెనా, మా ఆశలు కన్నీరే మిగిలేనా కన్నెమది చిరువెన్నెల పున్నమియె కరువాయెనా తీరని మదికోరిక కొనసాగగా దరిజేరినా తరితీయని మన ప్రేమలా తండ్రియె దూరము చేసే మనరాగమేగా అనురాగం తనువూ మనసూ సొగిసే ప్రేమరాగం కోరిన ప్రియులు చేరిన వెనుక కూరిమి బేరము లాడగనేల కన్నులపూచే నిన్నుగనీ మనసు దోచేసి చేసె, నీదాసుని కొనవోయి వెల వోసితి నా మది తీయని కోరికలు తీరును రావె
రాముని అవతారం పాట సాహిత్యం
చిత్రం: భుకైలస్ (1958) సంగీతం: సుదర్శనం - గోవర్ధనం సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: ఘంటసాల ద్వారపాలుర మరల దరిదీయు కృపయో ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో రాముని అవతారం రవికుల సోముని అవతారం సుజన జనావన ధర్మాకారం దుర్జన హృదయ విదారం దాశరధిగ శ్రీకాంతుడు వెలయు కౌసల్యాసతి తఫము ఫలించు జన్మింతురు సహజాతులు మువ్వురు లక్ష్మణ శత్రుఘ్న భరత చదువులు నేరుచు మిషచేత చాపము దాలిచి చేత విశ్వామిత్రుని వెనువెంట యాగము కావగ చనునంట అంతము చేయునహల్యకు శాపము ఒసగును సుందర రూపం ధనువో జనకుని మనసున భయమో ధారుణి కన్యా సంశయమో దనుజులు కలగను సుఖగోపురమో విరిగెను మిధిలా నగరమున కపట నాటకుని పట్టాభిషేకం కలుగును తాత్కాలికా శోకం భీకర కానన వాసారంభం లోకోద్ధరణకు ప్రారంభం భరతుని కోరిక తీరుచు కోసం పాదుక లొసగే ప్రేమావేశం నరజాతికి నవ నవసంతోషం గురుజన సేవకు ఆదేశం అదిగో చూడుము బంగరు జింక మన్నై చనునయ్యో లంక హరనయనాగ్ని పరాంగనవంక అడిగిన మరణమె నీ జింక రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానర కుల పుంగవ హనుమాన్ ముద్రిక కాదిది భువన నిదానం జీవన్ముక్తికి సోపానం రామరామ జయ రామరామ జయ రామరామ రఘుకుల సోమా సీతాశోక వినాశనకారి లంకా వైభవ సంహారి అయ్యో రావణ భక్తాగ్రేసర అమరం బౌనిక నీ చరిత సమయును పరసతిపై మమకారం వెలయును ధర్మ విచారం
సుందరాంగ అందుకోరా పాట సాహిత్యం
చిత్రం: భుకైలస్ (1958) సంగీతం: సుదర్శనం - గోవర్ధనం సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: ఘంటసాల, పి. సుశీల సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము అందంలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా కేలుకేలుగొని మేనులేకముగ ఏకాంత సీమలలో మది సంతాప మారగ సంతోషమూరగ చెంత చేరరార యోగము చేదు విరాగము చేదు అనురాగమె మధురమ్ చాలు సాధన విడవోయి వేదన సంతోషాబ్ధికి పోదము అట రంగారు బంగారు మీనాలమై చవులూరించుచు తేనె జూరాడుదాం తేలాడుదాం ఓలాడుదాం ముదమార తమితీర ఈదాడుదాం
తగున వరమీయవ పాట సాహిత్యం
చిత్రం: భుకైలస్ (1958) సంగీతం: సుదర్శనం - గోవర్ధనం సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: ఘంటసాల తగునా వరమీయ ఈ నీతి దూరునకు, పరమ పావునకు స్నేహము మీరగ నీవేలగా ద్రోహము నే జేసితి పాప కర్ము దుర్మదాంధు నన్ను వేపక దయ చూపితేల - హర మంగళదాయిని, మాత పార్వతిని మతిమాలి మోహించితి కన్నులనించే శూలాల పొడిచి కామము మాపుమా తాళజాలను సలిపిన ఘనపాప సంతాన భరమేనిక చాలునూ కడతేర్చుము ఇకనైన వీని పుణ్యహీన దుర్జన్మము పోనాడితి మతి, వేరేగతి మరిలేదు ఈ నీచుని తల ఇందే తునకలు గానీ మేనియ్యెడ వసివాడి మాడి మసిమసి గానీ పాపము బాపుమా, నీ దయ జూపుమా నీ దయ చూపుమా చేకొనుమా దేవా - శిరము చేకొనుమాదేవా శిరము చేకొనుమా దేవా శిరము చేకొనుమాదేవా చేకొనుమా దేవా శిరము చేకొను మహాదేవా మాలికలో మణిగా నిలుపు కంఠ మాలికలో మణిగా నిలుపు (3) నా పాప భరము తరుగు విరుగు
తీయని తలపుల పాట సాహిత్యం
తీయని తలపుల తీవెలు సాగే గిలి బిలి రాజలేవేవో తీయని తలపుల తీవెలు సాగే గిలి బిలి రాజలేవేవో మనసున పూచిన మాయని వలపు మనసున పూచిన మాయని వలపు సఫలము చేయుము మహదేవా తుమ్మెద పాటకు కమలము రీతి తొలకరి వానకు చాటకి రీతి తుమ్మెద పాటకు కమలము రీతి తొలకరి వానకు చాటకి రీతి ఆగలమేకకు నే గురీయితి ఆగలమేకకు నే గురీయితి మనుపుము నన్ను సదాశివా నీ తరుణామ్రుత కూరము చిలికి మా కూరముల దీవెన సలిపి నీ తరుణామ్రుత కూరము చిలికి మా కూరముల దీవెన సలిపి తొలి చూపులనే మనసు దోచిన తొలి చూపులనే మనసు దోచిన క్రుతయె కొలిపి వలనివ్వ
ఈమేలు మూడునాళ్ళ ముచ్చటేరా పాట సాహిత్యం
చిత్రం: భుకైలస్ (1958) సంగీతం: సుదర్శనం - గోవర్ధనం సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: ఏ.పి. కోమలి ఈమేలు మూడునాళ్ళ ముచ్చటేరా - మిత్తి వెన్నంటి తిరుగుతుంటె ఎరుగవేరా అంతలోనే మానవ ఇంత మారుపేలరా ఐశ్వర్య దాస్యంబు మానుకోరా అరచేత కైలాస మరయనెంతో - ఇహ సౌఖ్యాలు మనసార జూరనెంతో ధరయెల్ల ఏలగా ఆశలేలా (2) యమ కింకరులు కాచుకుంటె కానవేరా అత్యాశ మానవుని శతృవంట - త్యాగ జీవనమె వీడిపోని మిత్రమంట శరణన్న కనుపించు దేవుడంట (2) తన కింకరుల చేవిడక కాచునంట
నా కనుల ముందొలుకు పాట సాహిత్యం
చిత్రం: భుకైలస్ (1958) సంగీతం: సుదర్శనం - గోవర్ధనం సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: ఘంటసాల నా కనుల ముందొలుకు నీ కృపామృతధార
పిలిచిన పలుకుమ పాట సాహిత్యం
చిత్రం: భుకైలస్ (1958) సంగీతం: సుదర్శనం - గోవర్ధనం సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: ఘంటసాల పిలిచిన పలుకుమా .... పిలిచిన పలుకుమా .... ననరును చిలుకుమా వరముల నిడుమా కమలా రమణ జలధర శ్యామా మంగళ నామా శ్రీ పరంధామా గావుమా జలధర శ్యామా మంగళ నామా
సైకత లింగం పాట సాహిత్యం
సైకత లింగంబు జలధి పాలౌనాడు తల్లికిచ్చిన మాట తప్పినావు కరుణించ వచ్చిన కైలాస నాధుని అడుగరాని వరములడిగినావు అఖిల లోకారాధ్యయౌ జగన్నాథను వలపు పల్కుల మది గలిగినావు కామాంధకారమ్ము కనుగవరపగా సకలపాతకములు సలిపినావు పాపములు పండి నరక గర్భములోన కూలనుండిన నీపై జాలిబూని కావగానెంచు నా ఉపకారమునకు నీవసంగు ఉపాయనంబిదియే భూళా
స్వామి ధన్యుడనైతి పాట సాహిత్యం
చిత్రం: భుకైలస్ (1958) సంగీతం: సుదర్శనం - గోవర్ధనం సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: ఘంటసాల స్వామి ధన్యుడనైతి నీ మధుర సాక్షాత్కార భాగ్యంబునన్ నా మేలున్ జప హోమ నిష్టలను ధన్యత్వంబు చెందెన్ ప్రభూ నా మోహము నచించి పోయినది జ్ఞానజ్యోతి సూపటే నీ ప్రేమంబీగతి నాపై నిలుపు గౌరీనాధ భాక్తవనా గౌరీనాధ భాక్తవనా ....