Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bobbili Simham (1994)




చిత్రం: బొబ్బిలి సింహం (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: బాలకృష్ణ, రోజా, మీనా
దర్శకత్వం: ఏ.కోదండ రామిరెడ్డి
నిర్మాత: టి. త్రివిక్రమ రావు
విడుదల తేది: 23.09.1994



Songs List:



పాలకొల్లు పాపా పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి సింహం (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

పాలకొల్లు పాపా నీ పైట జారు వేళ 
యహు యహు యహు యహు యా యా యా
చిలకలూరి చిలక నీ చిట్టిఈడు గోల
యహు యహు యహు యహు యా యా యా

పాలకొల్లు పాపా నీ పైట జారు వేళ 
యహు యహు యహు యహు యా యా యా
చిలకలూరి చిలక నీ చిట్టిఈడు గోల
యహు యహు యహు యహు యా యా యా
అది ఉలుకో చెలి తళుకో సొగసరి అలకో
సింగరాయ కొండ నా సిగ్గుపూల దండ
యహు యహు యహు యహు యా యా యా
తొంగి చూసినాడే నా జున్నుపాల కుండ
యహు యహు యహు యహు యా యా యా
అది ఉడుకో ఒడి దుడుకో మగసిరి చురకో

పాలకొల్లు పాపా నీ పైట జారు వేళ 
యహు యహు యహు యహు యా యా యా
సింగరాయ కొండ నా సిగ్గుపూల దండ
యహు యహు యహు యహు యా యా యా

భం చిక్ భంభం భం చిక్ భంభం  (2)

పట్టుచీర కట్టి పట్టే మంచమెక్కి 
దిండునోత్తుకుంటు పండుకున్నవేళ 
నీవు చెంతరాక నిప్పులాంటి కోక జాగారం
మంచికాడి కొచ్చి మల్లెపూలు తెచ్చి 
నల్ల వాలుజడ్ల నాటుతున్న వేళ 
నిన్నలేని పిచ్చి నిద్రలేచి వచ్చి నీకోసం
కాముడీ సుఖాల చావాడి 
నువ్వాడు జోడు బంతులాటకి రెడీ
హయ్యె కోమలి పెదాల ఫ్యామిలీ 
ముద్దాడు ముచ్చటాడు మూగ అల్లరీ
మనోరమా - నేనే సుమా
కలయిక నిజామా...

పాలకొల్లు పాపా నీ పైట జారు వేళ 
యహు యహు యహు యహు యా యా యా
సింగరాయ కొండ నా సిగ్గుపూల దండ
యహు యహు యహు యహు యా యా యా

భం చిక్ భంభం భం చిక్ భంభం  (2)

మాపటేల నుంచి రేపటేల దాక 
తేప తేప కోక తీపిమేత పెట్టి
సందుచూసి నాతో సందెకాపురాలు చేస్తావా
లొట్టిపిట్ట పట్టి లొల్లిచేసి పెట్టి 
పిట్టముద్దుకొట్టి నన్నుగిల్లిపెట్టి
పైట చాటు తోట విందు భోజనాలు చేస్తావా
పిల్లకి వసంత పల్లకీ రప్పించుకుంది కొత్త రంగనాయకి
జంటకి కులాస వేటకి లవంగి చెట్టుకింద లవ్వు లాయికి
వరూధుని - వరించని
వదలకు పొదనీ...

పాలకొల్లు పాపా నీ పైట జారు వేళ 
యహు యహు యహు యహు యా యా యా
సింగరాయ కొండ నా సిగ్గుపూల దండ
యహు యహు యహు యహు యా యా యా





ఈడు ఈల వేసినా పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి సింహం (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

ఈడు ఈల వేసినా నీకు గాలమేసినా
కౌగిలింత లాగ వచ్చి కన్ను గొట్టు
ఆకలెంత ఉంటె అంత ముద్దు పెట్టు

ఈడు ఈల వేసిన సోకు పూలు పూసినా
కందిరీగ లాగ వాలి నన్ను కుట్టు
నీకు దక్కుతుంది కన్నె తేనె బొట్టు 

ఎంత కాలు జారినా సంతకాలు మారునా
వొంగుతున్న అందమే తొంగి చూడనా
పగ్గమెంత వేసిన పక్క దున్నుడాగునా
వొంగ తోట కాపునే తుంచి ఇవ్వనా
కంచి పట్టు చీరలోన పొంచి ఉన్న పొంగులన్ని
గంజి పెట్టి పంచకిస్తే ఎహెయ్

ఈడు ఈల వేసినా నీకు గాలమేసినా
కౌగిలింత లాగ వచ్చి కన్ను గొట్టు
ఆకలెంత ఉంటె అంత ముద్దు పెట్టు

ఈడు ఈల వేసిన సోకు పూలు పూసినా
కందిరీగ లాగ వాలి నన్ను కుట్టు
నీకు దక్కుతుంది కన్నె తేనె బొట్టు 

పరువమే ఇరుకమ్మో కొరికితే చెఱుకమ్మో
తలుకైన తార ఒక్క సారా చాలదెట్టమ్మో
వయసులో వలపయ్యో మనసుకే గెలుపయ్యో
విరి పాన్పు వీర వన్స్ మోర చాలులేవయ్యొ
తీస్తుంటే నువ్వు పక్క పాపిడీ - హాయ్ హాయ్
కూస్తుందే గువ్వ అర్ధ రాతిరి - హాయ్ హాయ్
చేస్తుంటే నువ్వు పైట దోపిడీ  - హొయ్ హొయ్
అవుతుంది అందమంత ఆవిరి  - హొయ్ హొయ్
పెంచలయ్య కోన కాడ కంచలన్ని చేను మేస్తే
పట్టు పావడాలు పెట్టి ఎహెయ్

ఈడు ఈల వేసిన సోకు పూలు పూసినా
కందిరీగ లాగ వాలి నన్ను కుట్టు
నీకు దక్కుతుంది కన్నె తేనె బొట్టు 

ఈడు ఈల వేసినా నీకు గాలమేసినా
కౌగిలింత లాగ వచ్చి కన్ను గొట్టు
ఆకలెంత ఉంటె అంత ముద్దు పెట్టు

పెదవిలో సుగరయ్యె పొదలకే పొగరయ్యో
చలి సందెవేళ సంకు రాత్రి చేసి పోవయ్యో
చిలిపి నా చిలకమ్మో వలపులో అలకమ్మో
సిరిమల్లె పూల సిగ్గు రాత్రి వచ్చి పోవమ్మో
చూస్తుంటే వాలు జల్ల అల్లిక - హాయ్ హాయ్
రాస్తావు కొత్త కాళిదాసుగా - హాయ్ హాయ్
చూస్తుంటే కోల కళ్ళ కోరిక - హొయ్ హొయ్
లేస్తుంది ఈడు లేడి వేడిగా - హొయ్ హొయ్
నల్ల నల్ల కోన లోన నారు మల్లు వేసుకున్న 
పైట చాటు పంట నీది ఎహెయ్

ఈడు ఈల వేసినా నీకు గాలమేసినా
కౌగిలింత లాగ వచ్చి కన్ను గొట్టు
ఆకలెంత ఉంటె అంత ముద్దు పెట్టు

ఈడు ఈల వేసిన సోకు పూలు పూసినా
కందిరీగ లాగ వాలి నన్ను కుట్టు
నీకు దక్కుతుంది కన్నె తేనె బొట్టు 




కిట్టమ్మ లీల పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి సింహం (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

కిట్టమ్మ లీల ఎంకమ్మ గోల 
ఇద్దరూ పడ్డారు నా పాలా
కిట్టమ్మ లీల ఎంకమ్మ గోల 
ఇద్దరూ పడ్డారు నా పాలా
బేలా ఐదేలా పాలా అంబాల 
తబలాకి తైతక్క నాకేలా
అతివల అందాల అడ కత్తెరా
ఇరుకున పెడుతుంటే ఏం మత్తురా
గోపాలా... కోక కోలా

కిట్టమ్మ లీల ఎంకమ్మ గోల 
ఇద్దరూ పడ్డారు నా పాలా
బేలా ఐదేలా పాలా అంబాల 
తబలాకి తైతక్క నాకేలా

చోలీకే పీచే దాసే శోభనాల పొంగుల్తో
ఖాళీగా ఉన్నానేను కౌగిలిస్తావా
లాల్చీతో పేచీవస్తే లోగిరాకి బేరంలో
వాల్చి నా మంచమెక్కి ఒళ్ళు పడతావా
హే అలివేణి చలి ఓణీ తొలి బోణీ సుఖీమణి
పొదరాని కథలన్నీ నడిపించవే
మగసిరి దీపాలు మరుమల్లేలా
గోపాలా... రాధా లోలా

కిట్టమ్మ లీల ఎంకమ్మ గోల
ఇద్దరూ పడ్డారు నా పాలా
బేలా ఐదేలా పాలా అంబాల
తబలాకి తైతక్క నాకేలా

జోడీగా గుమ్మలోచ్చి జోరు చేసే వేళల్లో
నారీ ఈ బ్రహ్మచారి ప్యారికొస్తావా
లౌలీగా లాటికొచ్చే ఈ గులాబి తోటల్లో
నారైక ముళ్ళు మీద ముద్దు పెడతావా
హే విరజాజి విరహాల తొలిపేజి భలే కసి
పెనవేసి తొణతీసి రుచిచూడనా
పురుషుడి పుట్టిల్లు పులకింతలా
గోపాలా... తపాలేలా

కిట్టమ్మ లీల ఎంకమ్మ గోల
ఇద్దరూ పడ్డారు నా పాలా
బేలా ఐదేలా పాలా అంబాల
తబలాకి తైతక్క నాకేలా

హే కిట్టమ్మ లీల ఎంకమ్మ గోల
ఇద్దరూ పడ్డారు నా పాలా
బేలా ఐదేలా పాలా అంబాల
తబలాకి తైతక్క నాకేలా





మాయదారి పిల్లడా చేయివేయకక్కడా పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి సింహం (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: మనో, రాధిక

ఎక్కడా ఎక్కడా - అక్కడ (4)
ఎక్కడా ఎక్కడా ఎక్కడ - అక్కడ

మాయదారి పిల్లడా చేయివేయకక్కడా
ఎక్కడా - అక్కడ
మల్లెపూల వీరుడా తొంగిచూడకక్కడా
ఎక్కడా - అక్కడ
మజాగుంది భామా ఖలేజాలకామా
భడాయేలా భామ బందరులో

మాయదారి పిల్లడా చేయివేయకక్కడా
ఎక్కడా - అక్కడ
మల్లెపూల వీరుడా తొంగిచూడకక్కడా
ఎక్కడా -  ఉహు హుఁ అక్కడ

నీ కొబ్బరెంత ఉంటుందో నా కోరుడంత ఉంటుంది
సఖియా సుఖియా ప్రియమౌ లయలే ఫిరాయించకే
నీ కన్ను పడితే కాకాలు నా సోకు చదివే శ్లోకాలు
ప్రియుడా మయుడా జతగా జతులే చాలాయించరా
హే నెమలి పాపలా పురులు విప్పుకో
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
చినుకు చీరలో తళుకు పెంచుకో
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
చిలిపి కంటిలో మెరుపు చూసుకో 
ఉన్నప్పుడే ఉడుకు తెలుసుకో
లాగయించుకోరా లడ్డులా

మాయదారి పిల్లడా చేయివేయకక్కడా
ఎక్కడా - అక్కడ
మల్లెపూల వీరుడా తొంగిచూడకక్కడా
ఎక్కడా -  హ హ హఁ అక్కడ

హఁ హ హ హ హ

హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్...

ఒల్లెక్కి కూసే వయ్యారం వాటేసుకుంటే జాగారం
ఒకరం ఒకరం జంటై పోతే మహా మోతలే
హఁ తబ్బిబ్బు ఒళ్ళు తానందం
పగ్గేయమంది పంచాంగం
ఎగుడు దిగుడు సొగసే వలచే కథే వింతలే
రాతిరేలలో కోడి కూతట
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
హే పుంజు కోరిక గింజ మేతట
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
పంచడానికే పంచదారట మంచమెక్కితే వంశధారట
సవాలందుకోవే సరసంలో

మాయదారి పిల్లడా చేయివేయకక్కడా
ఎక్కడా - అక్కడ
మల్లెపూల వీరుడా తొంగిచూడకక్కడా
ఎక్కడా -  ఉహు హుఁ అక్కడ
మజాగుంది భామా ఖలేజాలకామా
భడాయేలా భామ బందరులో

మాయదారి పిల్లడా చేయివేయకక్కడా
ఎక్కడా - అక్కడ
మల్లెపూల వీరుడా తొంగిచూడకక్కడా
ఎక్కడా -  అక్కడ




లకడీకపూలట లబ్జనకో పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి సింహం (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

హే లకడీకపూలట లబ్జనకో
లడికి మా మూలటా లవ్ పడకో
లకడీకపూలట లబ్జనకో
లడికి మా మూలటా లవ్ పడకో
చక్కని చుక్కట చెమ్మలో చెక్కట
ఆపిమ్మట దుప్పట్లో తప్పెట
ఎన్నెల్లో ఎడూళ్ళ తిప్పట
గోల్కొండ దిబ్బట ఇంటెనకో
మల్గాడి బొబ్బట కొక్కరకో
గోల్కొండ దిబ్బట ఇంటెనకో
మల్గాడి బొబ్బట కొక్కరకో
ఆకు లో వక్కట పరువాల పక్కట
మస్థానా మరుమల్లే పువ్వటా
నన్ను చూస్తేనే నీ బాబు తృవ్వట

లకడీకపూలట లబ్జనకో
లడికి మా మూలటా లవ్ పడకో
గోల్కొండ దిబ్బట ఇంటెనకో
మల్గాడి బొబ్బట కొక్కరకో

కోటీలో బస్సెక్కి మండీలో దిగుతుంటే
మార్కెట్లో కోడి కూసే కోడి మనసంతా వేడిచేసే ఏ ఏ
జగదాంబ సెంటర్లో జడదెబ్బ కొడుతుంటే
మల్లెల్లో పొద్దుగూకే పైట ముల్లల్లే మువ్వ మోగే
రాక్ రాక్ రాపాడుకుంటుంటే
షేప్ షేప్ షేప్ షేప్ మారిందమ్మో మాపటికే
వయసుల యాంగిరి వలపుర డింగిరి
చలి చలి హంగిరి చెలిమొక జాంగిరి
లగాయించేయ్నా ఈ రాతిరి
హయ్యె తెల్లార్లు నవరాత్రి నౌకరి

లకడీకపూలట లబ్జనకో
లడికి మా మూలటా లవ్ పడకో
గోల్కొండ దిబ్బట ఇంటెనకో
మల్గాడి బొబ్బట కొక్కరకో

కూ... చికుబుకుచికు

బెజవాడ స్టేషన్లో బండెక్క బోతుంటే
రద్దిలో రంగుమారే రాత కొద్దీ నా రైలు మారే
హనుమను జంక్షన్లో హనీమూన్ కెళుతుంటే
భజనేదో సాగిపోయే ఉన్న భయమేదో తీరిపోయే
జోర్ జోర్ లగ్గాయించేస్తుంటే
ప్యార్ ప్యార్ జిందాబాద్ అంటున్నదీ నా వయసే
రగిలిన రాపిడి రాత్రికి తాకిడి
విరహపు వీరుడి పిలుపుకు నే రెడీ
సరే సాగించు నీ దోపిడీ
అందాల డేరాలు అలికిడి

లకడీకపూలట లబ్జనకో
లడికి మా మూలటా లవ్ పడకో
గోల్కొండ దిబ్బట ఇంటెనకో
మల్గాడి బొబ్బట కొక్కరకో
చక్కని చుక్కట చెమ్మలో చెక్కట
ఆపిమ్మట దుప్పట్లో తప్పెట
ఎన్నెల్లో ఎడూళ్ళ తిప్పట
గోల్కొండ దిబ్బట ఇంటెనకో
లకడీకపూలట లబ్జనకో
మల్గాడి బొబ్బట కొక్కరకో
అరె లడికి మా మూలటా లవ్ పడకో
లబ్జనకో...




శ్రీరస్తూ శుభమస్తూ పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి సింహం (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: జాలాది
గానం: యస్. పి. బాలు, చిత్ర

శ్రీరస్తూ శుభమస్తూ కొత్తపెళ్లి కూతురా కళ్యాణమస్తు
శ్రీరస్తూ శుభమస్తూ మా ఇంటి దేవతా సౌభాగ్యమస్తు
మా గుండె గుడిలో ఆశల ఒడిలో జ్యోతిని వెలిగించగా

శ్రీరస్తూ శుభమస్తూ కొత్తపెళ్లి కూతురా కళ్యాణమస్తు

ఏ పూజకేపువ్వు ఋణమై పూసిందో కాలానికే తెలుసటా
ఆ కాలం కనుమూస్తే కలగా చెరిగేది జీవితమొకటేనటా
సవతిగ కాకుండ చెల్లిగ నను చూసి తల్లిని చేశావుగా
ఈ పారాని పాదాలు సేవించినా గాని ఋణమే తీరదుగా
ఇది కలకాలమై ఉండగా...
నీ అనుబంధమే పండగా...
ఇంటికి దీపం ఇల్లాలనిపించు నా ముద్దు చెల్లాయిగా

శ్రీరస్తూ శుభమస్తూ మా ఇంటి దేవతా సౌభాగ్యమస్తు

ఎదిగే మరణాన్ని ఎదలో దాచేసి కథగాచే దేవుడు
పంతాల గిరి గీసి ప్రణయాన్ని ఉరివేసి మోసం చేశాడు
రాగాలు వెన్నెల్ని రాహువుతో చంపి చీకటి మిగిలించితే
ఆ వేకువలా మళ్ళి రేకులు వెదజల్లి రవియే పుడతాడులే
ఆ దీపంలో నీ రూపమే పూపాపల్లె ఆడాలని
ఊపిరి ఉయ్యాలై ఊసుల జంపాలై ఒడిలో ఆడేనులే

శ్రీరస్తూ శుభమస్తూ మా ఇంటి దేవతా సౌభాగ్యమస్తు
శ్రీరస్తూ శుభమస్తూ మా ఇంటి దేవతా సౌభాగ్యమస్తు

Most Recent

Default