Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bobbili Yuddham (1964)




చిత్రం: బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు: యన్. టి. రామారావు, జమున రాణి, భానుమతి,  ఎస్.వి.రంగారావు
దర్శకత్వం & నిర్మాత: సి.సీతారాం
విడుదల తేది: 04.12.1964



Songs List:



సిరినీలు రాయుడా పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: సాలూరి రాజేశ్వరరావు

సిరినేలు రాయుడా




శ్రీకర కరుణాలవాళ పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సమద్రాల
గానం: భానుమతి

శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా 
శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా
సిరులు యశము సోభిల్ల దీవించు మమ్ములా
శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా 

కాకతీయ వైభవం హంపి వేంగీ ప్రాభవం
కాకతీయ వైభవం హంపి వేంగీ ప్రాభవం
కన్నతండ్రి కలలు నిండి
మా కన్నతండ్రి కలలు నిండి కలకాలం వర్ధిల్లగా

శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా
సిరులు యశము సోభిల్ల దీవించు మమ్ములా
శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా 

పెరిగి మాబాబు వీరుడై ధరణి సుఖాల ఏలగా
పెరిగి మాబాబు వీరుడై ధరణి సుఖాల ఏలగా
తెలుగు కీర్తి తేజరిల్లి 
తెలుగు కీర్తి తేజరిల్లి దిశలా విరాజిల్లగా

శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా
సిరులు యశము సోభిల్ల దీవించు మమ్ములా
శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా !!




ముత్యాల చెమ్మచెక్క పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల & కోరస్

పల్లవి:
ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ

కోరస్: ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ

చరణం: 1
తళ తళ తళ తళ మెరిసే సొగసు
ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ
తళ తళ తళ తళ మెరిసే సొగసు
ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ
పరువము వేసిన పందిరిలో
బుజబుజ రేకులు పూయవలె
పరువము వేసిన పందిరిలో
బుజబుజ రేకులు పూయవలె

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ

చరణం: 2
ఒప్పులకుప్ప వయ్యారి భామా
సన్నబియ్యం  ఛాయపప్పు
చిన్నమువ్వ  సన్నగాజు
కొబ్బరికోరు  బెల్లప్పచ్చు
గూట్లో రూపాయ్ నీ మొగుడు సిపాయ్
రోట్లో తవుడు నీ మొగుడెవడు
హహహహ హహహ హాహహహహహ
 
ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె

ఆ...ఆ... ఆ...ఆ... 
ఓ...ఓ...ఓ...ఓ...

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ





అందాల రాణివే పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, పి. సుశీల

పల్లవి:
అందాల రాణివే నీవెంత జాణవే
కవ్వించి సిగ్గు చెంద నీకు న్యాయమా
వీరాధి వీరులే రణరంగ ధీరులే
ఇదేమి వింత యేల ఇంత తొందరా...
వీరాధి వీరులే 
పరీక్ష చాలులే ఉపేక్ష యేలనే
సుఖాల తీరము ఇకెంత దూరము 
ఓ ఓ ఓ 
పరీక్ష చాలులే ఉపేక్ష యేలనే
సుఖాల తీరము ఇకెంత దూరము 
ఉపేక్ష కాదిది అపేక్ష ఉన్నది
నీరిక్ష చాల మంచిదీ...

వీరాధి వీరులే రణరంగ ధీరులే 
ఇదేమి వింత యేల ఇంత తొందరా...
వీరాధి వీరులే 

చరణం: 1
క్రీగంటితో నను దోచి నా గుండె దొంగిలి దాచి
చాటుగా మాటుగా ఆడుతే చాలులే ఆడుతే చాలులే 
చాలులే చాలులే 
శ్రీవారి హృదయము నా చెంత పదిలము
నా ప్రేమ నిరతము కాపాడు కవచము 
అహహా ఆ ఆ 
శ్రీవారి హృదయము నా చెంత పదిలము
నా ప్రేమ నిరతము కాపాడు కవచము
ప్రియురాలి రూపము రేగించే మోహము
నేనింక తాళజాలనే...

అందాల రాణివే నీవెంత జాణవే
కవ్వించి సిగ్గు చెంద నీకు న్యాయమా...
అందాల రాణివే 

చరణం: 2
నీ వంటివారికి మేలా మేలెంచు పెద్దలు లేరా
వారిదే భారము యేల ఈ ఆగము
ఆగుము ఆగుము - ఆగను ఆగను 
ఏకాంత సమయము ఆనంద నిలయము
నీవెన్ని అనినను నీ చేయి విడువను 
ఓ ఓ ఓ ఓ 
ఏకాంత సమయము ఆనంద నిలయము
నీవెన్ని అనినను నీ చేయి విడువను
జగానికందము వివాహాబంధము ఆనాడే తీరు వేడుకా

అందాల రాణివే నీవెంత జాణవే
ఇదేమి వింత యేల ఇంత తొందరా
అందాల రాణివే నీవెంత జాణవే
ఇదేమి వింత యేల ఇంత తొందరా...
అందాల రాణివే




ఊయల లూగినదోయి పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: భానుమతి

పల్లవి:
ఊయల లూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన 
ఊయల లూగినదోయి మనసే 
తీయని ఊహల తీవెలపైన

ఊయల లూగినదోయీ

చరణం: 1
వెన్నెల పూవులు విరిసే వేళ
వెన్నెల పూవులు విరిసే వేళ
సన్నని గాలులు సాగే వేళ
వలపులు ఏవో పలికెను నాలో...
వలపులు ఏవో పలికెను నాలో
తెలుపగ రానిది ఈ హాయి

ఊయల లూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయల లూగినదోయీ

చరణం: 2
కమ్మని రాతిరి రమ్మని పిలిచే
మల్లెల పానుపు మనకై నిలిచే
కమ్మని రాతిరి రమ్మని పిలిచే
మల్లెల పానుపు మనకై నిలిచే
ప్రాయము నీవై పరువము నేనై...
ప్రాయము నీవై పరువము నేనై
పరిమళించగా రావోయి

ఊయల లూగినదోయి మనసే
తీయని ఊహల తీవెలపైన
ఊయల లూగినదోయీ




మురిపించే అందాలే పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, పి.సుశీల

సాకీ:
సొగసు కీల్జెడలదానా  సోగ కన్నులదాన
వజ్రాలవంటి పల్వరుసదాన
బంగారు జిగిదాన సింగారములదాన
లయవైన వయ్యారి నడలదాన
తోరంపు కటి దాన తొణకు సిగ్గులదాన
పిడుకిట నణగు నెన్నడుము దానా.. ఆ. ఆ..ఆ…

పల్లవి:
మురిపించే అందాలే అవి నన్నే చెందాలే
మురిపించే అందాలే  అవి నన్నే చెందాలే
నా దానవు నీవేలే నీవాడను నేనేలే
ఆ ఆ ఆ ఆ
దరిచేర రావే సఖి నా సఖీ...
ప్రేయసి సిగ్గేల

మరపించే మురిపాలే కరిగించే కెరటాలై
మరపించే మురిపాలే కరిగించే కెరటాలై
నిదురించే భావాలా కదిలించే ఈ వేళా
ఆ  ఆ  ఆ  ఆ
అదే హాయి కాదా  సఖా  నా సఖా

మురిపించే అందాలే  అవి నన్నే చెందాలే

చరణం: 1
చెలి తొలి చూపే మంత్రించెనే 
ప్రియ సఖురూపే మదినేలెనే
చెలి తొలి చూపే మంత్రించెనే 
ప్రియ సఖురూపే మదినేలెనే

ఇది ఎడపాటు కనలేని ప్రేమా
ఇల మనకింక సురలోక సీమ
ఇది ఎడపాటు కనలేని ప్రేమా 
ఇల మనకింక సురలోక సీమ

ఇదే హాయి కాదా సఖా  నా సఖా 

మురిపించే అందాలే  అవి నన్నే చెందాలే

చరణం: 2
అనురాగాల రాగాలలో 
నయగారాల గారాలలో
అనురాగాల రాగాలలో 
నయగారాల గారాలలో

మధు మాధుర్యమే నిండిపోయే 
హృదయానందమే పొంగిపోయే
మధు మాధుర్యమే నిండిపోయే 
హృదయానందమే పొంగిపోయే

దరి చేర రావే సఖీ  నా సఖీ 

మురిపించే అందాలే  అవి నన్నే చెందాలే





సేవలు చెయ్యాలే పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం:  ఆరుద్ర
గానం: పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి

సేవలు చెయ్యాలే



నిను చేర మనసాయెరా పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం: పి.సుశీల

నిను చేర మనసాయెరా ! నా స్వామి
చనువార దయసేయరా (2)

విడిదికి రమ్మని చాల వేడితిరా (2)
బిడియము నీకేలరా  దొరా (2)

సరసుడవని నిన్నే పదిమంది పొగడ
మరిమరి కోర్కెలు విరిసెను ప్రియుడా
వయసు నీకొరకె పలువరించెరా
తనువు నిన్ను దలచి పులకరించెరా
మగువ కోర మొగమాట మేలరా
బిగువు మాని జవరాలి నేలరా
సొగసు చూచి ఎదురు కాచి నిలచి
పగలు రేలు దిగులు చెందు చెలికి

నిను చేర మనసాయెరా ! నా స్వామి
చనువార దయసేయరా!




ఏమయ్యా రామయ్య పాట సాహిత్యం

 
చిత్రం: బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం:  కొసరాజు 
గానం: వసంత, స్వర్ణలత, వి.సత్యారావు

ఏమయ్యా రామయ్య 

Most Recent

Default