Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Boss (2006)





చిత్రం: బాస్ (2006)
సంగీతం: కళ్యాణి మాలిక్, హ్యారి ఆనంద్ 
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్: అనూప్ రూబెన్స్
నటీనటులు: నాగార్జున, నయనతార, పూనమ్ బజ్వా, శ్రేయ శరన్, సలోని అశ్వని
దర్శకత్వం: వి. యన్. ఆదిత్య
నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 27.09.2006



Songs List:



నచ్చిందె చేసెయ్ పాట సాహిత్యం

 
చిత్రం: బాస్ (2006)
సంగీతం: కళ్యాణి మాలిక్, హ్యారి ఆనంద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హేమచేంద్ర

నచ్చిందె చేసెయ్ చేసెయ్ తోచిందె చెప్పెసెయ్
నచ్చిందె చేసెయ్ చేసెయ్ తోచిందె చెప్పెసెయ్
నచ్చకపోతె మానుకో నీ ఇష్టం నీదేనోయ్
ఎవడేం కూసినా ఎవడేం మోసినా అన్ని వదిలేసెయ్
దున్నేసెయ్ దున్నేసెయ్ దునియానే దున్నేసెయ్
దున్నేసెయ్ దున్నేసెయ్ దునియానే దున్నేసెయ్

నచ్చిందె చేసెయ్ చేసెయ్ తోచిందె చెప్పెసెయ్
నచ్చకపోతె మానుకో నీ ఇష్టం నీదేనోయ్
ఎవడేం కూసినా ఎవడేం మోసినా అన్ని వదిలేసెయ్
దున్నేసెయ్ దున్నేసెయ్ దునియానే దున్నేసెయ్
దున్నేసెయ్ దున్నేసెయ్ దునియానే దున్నేసెయ్


సొంత పేరు సొంత ఊరు ఉందిగా మరి నీకు
సొంతదైన స్టైలు ఉంటె తప్పు కానె కాదూ
సొంత దమ్ము సొంత దిల్లు ఉండగా మరి నీకూ
కొంత అయిన తిక్క ఉంటె తిరుగు లేనె లేదు
ఇలా నడుచుకో….ఎన్నో గెలుచుకో
ఎవడెం కుల్లినా ఎవడెం లొల్లినా అన్ని వదిలేసెయ్

దున్నేసెయ్ దున్నేసెయ్ దునియానే దున్నేసెయ్
దున్నేసెయ్ దున్నేసెయ్ దునియానే దున్నేసెయ్

అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం
అలసిపోయి కన్ను మూస్తె ఆపలేదు బంధం
జారి పోయి దూరమైతె చేరుకోదు ప్రేమా
దారిలోన చీకటైతె తోడు రాదు నీడా
నిన్నే నమ్ముకో...నువ్వై సాగిపో
ఎవడెం నవ్వినా ఎవడెం ఏడ్చినా అన్ని వదిలెదెయ్

దున్నేసెయ్ దున్నేసెయ్ దునియానే దున్నేసెయ్
దున్నేసెయ్ దున్నేసెయ్ దునియానే దున్నేసె

నచ్చిందె చేసెయ్ చేసెయ్ తోచిందె చెప్పెసెయ్
నచ్చకపోతె మానుకో నీ ఇష్టం నీదేనోయ్
ఎవడేం కూసినా ఎవడేం మోసినా అన్ని వదిలేసెయ్
దున్నేసెయ్ దున్నేసెయ్ దునియానే దున్నేసెయ్
దున్నేసెయ్ దున్నేసెయ్ దునియానే దున్నేసెయ్

దున్నేసెయ్ దున్నేసెయ్ దునియానే దున్నేసెయ్
దున్నేసెయ్ దున్నేసెయ్ దునియానే దున్నేసెయ్



ఏదొ తమాషగా పాట సాహిత్యం

 
చిత్రం: బాస్ (2006)
సంగీతం: కళ్యాణి మాలిక్, హ్యారి ఆనంద్
సాహిత్యం: సాహితి
గానం: నిహాల్ ., సునీత

ఏదొ తమాషగా నాలో నిషా నిషా
అరె ఇదేమి వరసా చిరు సెగల్లొ తడిశా
నవ వస్తంత జరిలో నే మరింత మురిశా
అటు ఇటు తేల హైరామా
శ్రుతే మించి పోయె హంగామా
నిజంగా ఇదేదొ నీ మహిమా

ఏదొ తమాషగా నాలో నిషా నిషా
అరె ఇదేమి వరసా చిరు సెగల్లొ తడిశా
నవ వస్తంత జరిలో నే మరింత మురిశా
అటు ఇటు తేల హైరామా
శ్రుతే మించి పోయె హంగామా
నిజంగా ఇదేదొ నీ మహిమా

నిన్నలాగ మొన్న లాగా తిన్నగానే నువ్వు లేవు
పక్కనిట్ట తోడు లేక ఒక్క అడుగు వెయ్యలేవు
ఊహల్లో రెక్కలొచ్చి తేలిపోతిరా
తేలిపోకిలా నువ్ తూలిపోకిలా
నీ ముచ్చటైన ముచ్చటంత గుచ్చి గుచ్చి చెప్పుకోవె
చెప్పేది సరిగా ఇక చెప్పాలి గురిగా
అని లిప్పేమొ తెరిచా ఆ చెప్పేది మరిచా

ఏదొ తమాషగా నాలో నిషా నిషా

నువ్వు ఇట్ట హద్దు మీరి ముద్దులోకి జారిపోతె
ఇంత వింత మాయదారి సంత గోల యెందుకొచ్చె
ఓరయ్య యెందుకో బుర్ర తిరిగెరా
ఇప్పుడెందుకే నీ తిప్పలెందుకే
నువ్వు పప్పు లోన కాలు వేస్తె యెప్పుదైన తిప్ప లేవె
చేసేటి పనిని ఇక చెయ్యాలి పదనీ
కీ ఇచ్చేస్తె ఎదకీ కథ ఇట్టాగె కొదకీ

ఏదొ తమాషగా నాలో నిషా నిషా
అరె ఇదేమి గొడవా పలు రకాల చొరవా
సరి సమాన దిసగా నీ పదాలు పడవా
అటు ఇటు తేల హైరామా
శ్రుతే మించి పోయె హంగామా
నిజంగా ఇదేదొ నీ మహిమా
హైరామా.....



నా కల్లు వాలే పాట సాహిత్యం

 
చిత్రం: బాస్ (2006)
సంగీతం: కళ్యాణి మాలిక్, హ్యారి ఆనంద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు, సునీత, సుమంగళి 

నా జల్లో పూలే చేసేను గోలే
నా గుండె రైలే ఉర్కే ఇవాలే
అట్టట్ట జరిగిందంటె పుట్టింది ప్రేమెలే లే
జీలే జీలే ప్యార్ మే జీలే
జీలే జీలే ప్యార్ మే జీలే

పదహారు ఏల్లే దాటావు చాల్లే
కొరికావు గోల్లే నమిలావు నీల్లే
తడిమావు దిల్లే తనువంత జిల్లే
అయ్యయ్యో జరిగిందింతే అయ్యింది ప్రేమెలే లే
జీలే జీలే ప్యార్ మే జీలే
జీలే జీలే ప్యార్ మే జీలే

దదాపు ఆడాల్లంత పైటెస్తారు ఎడం వైపు
దదాపు ఆడాల్లంత పైటెస్తారు ఎడం వైపు
తమలోని హ్రుదయం యెపుడు పడిపోకుండ అది కాపు
మగ వాల్ల చొక్కాకి ఎడం వైపె జేబులు
మది కన్న పదిలంగ దాస్తారు డబ్బులూ
కుడి ఎడమల గొదవే తగ్గి పొంగేది ప్రేమెలే లే
జీలే జీలే ప్యార్ మే జీలే
జీలే జీలే ప్యార్ మే జీలే

అమ్మాయిని కవితల్లోన నదితోనె పోలుస్తారు
అమ్మాయిని కవితల్లోన నదితోనె పోలుస్తారు
అటు గాని వెల్లామంటె నవ్వేసి ముంచేస్తారు
అబ్బయిని పోల్చారు సముద్రంతో పోలికా
తన నిండా నీల్లున్నా తాగేందుకు లేదికా
పన్నీటి సాగరమల్లే సాగేసు ప్రేమెలే లే
జీలే జీలే ప్యార్ మే జీలే
జీలే జీలే ప్యార్ మే జీలే

నా కల్లు వాలే నా వొల్లు తూలే
నా జల్లో పూలే చేసేను గోలే
నా గుండె రైలే ఉర్కే ఇవాలే
అట్టట్ట జరిగిందంటె పుట్టింది ప్రేమెలే లే
జీలే జీలే ప్యార్ మే జీలే
జీలే జీలే ప్యార్ మే జీలే




అందగాడు ముట్టూకుంటె పాట సాహిత్యం

 
చిత్రం: బాస్ (2006)
సంగీతం: కళ్యాణి మాలిక్, హ్యారి ఆనంద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె.కె , సునీత

అక్కడో ఇక్కడొ ఎక్కడొ ఒక్క చోట
అక్కడో ఇక్కడొ ఎక్కడొ ఒక్క చోట

అందగాడు ముట్టూకుంటె చందమామ ఎర్రబడ్డదీ
ఎక్కడెక్కడా అబ్బ ఎక్కడెక్కడా
పిల్ల గాడూ పట్టూకుంటె మల్లె మొగ్గ మంట పెట్టెనే
ఎక్కడెక్కడా అబ్బ ఎక్కడెక్కడా
నీ చక్కనీ చెంప మీదనా
లేక నున్ననీ ఒంపు మీదనా
నీ కంటిపై రెప్ప మీదనా
లేక కాలిలో మువ్వ మీదనా
నువ్వు చెప్పలేనిది నేను చెప్పుకోనిది
అబ్బ అక్కడో ఇక్కడొ ఎక్కడొ ఒక్క చోట

అందగాడు ముట్టూకుంటె చందమామ ఎర్రబడ్డదీ
ఎక్కడెక్కడా అబ్బ ఎక్కడెక్కడా

ఊరికే జారినా కొంగు మీదనా లేక ఉంగరాల వేలి మీదనా
హ హ హ హ హ హ హ హ హ హ హ
చీరకే చాలనీ చెంగు మీదనా లేక ఒంగరాల ఒడ్డు మీదనా
న న న న న న న నా న న నా
వెండి వెన్నెలైన చేరనీ మందిరానా
వేడి చుట్టూ ముట్టి చంపుతుంది లోనా
ఎండ కన్నులేవి సోకనీ మండపానా
ఎంత ఉక్కపోసి ఊపిరాడకున్నా
నేను చూడలేనిదీ నువ్వు చూపలేనిదీ
అబ్బ అక్కడో ఇక్కడొ ఎక్కడొ ఒక్క చోట

అందగాడు ముట్టూకుంటె చందమామ ఎర్రబడ్డదీ
ఎక్కడెక్కడా అబ్బ ఎక్కడెక్కడా
పిల్ల గాడూ పట్టూకుంటె మల్లె మొగ్గ మంట పెట్టెనే
ఎక్కడెక్కడా అబ్బ ఎక్కడెక్కడా

చెక్కిలే చెక్కనీ నొక్కు మీదనా ఆ పక్కనున్న ముక్కు మీదనా
హు హు హు హు హు హు హు హు హు హు హు
చేతికే చిక్కిన రెక్క మీదన లేక రెక్క దాటి బిక్క మీదనా
హు హు హు హు హు హు హు హు హు హు హు
ఉన్న మాట నువ్వు చెప్పరా చిట్టి కన్నా
కన్నె తోడు లోన తీసుకోర వెన్న
నన్ను దాటి నువ్వు చాటుగా తప్పుకున్నా
ఎన్ని జన్మలైన నిన్ను చేరుకోనా
కన్ను కొట్టీ పెట్టనా నిన్ను కట్టీ పెట్టనా
అబ్బ అక్కడో ఇక్కడొ ఎక్కడొ ఒక్క చోట

అందగాడు ముట్టూకుంటె చందమామ ఎర్రబడ్డదీ
ఎక్కడెక్కడా అబ్బ ఎక్కడెక్కడా
పిల్ల గాడూ పట్టూకుంటె మల్లె మొగ్గ మంట పెట్టెనే
ఎక్కడెక్కడా అబ్బ ఎక్కడెక్కడా
నీ చక్కనీ చెంప మీదనా
లేక నున్ననీ ఒంపు మీదనా
నీ కంటిపై రెప్ప మీదనా
లేక కాలిలో మువ్వ మీదనా
నువ్వు చెప్పలేనిది నేను చెప్పుకోనిది
అబ్బ ఎక్కడొ కాదులే ఇక్కడె గుండెలోనా



హల్లో బాసూ పాట సాహిత్యం

 
చిత్రం: బాస్ (2006)
సంగీతం: కళ్యాణి మాలిక్, హ్యారి ఆనంద్
సాహిత్యం: సాహితి
గానం: టిప్పు, గాయత్రి


హల్లో బాసూ మహా క్లాసు
అలా చూస్తే మ మ మాసు
ఎదురొదురొస్తె సరా సరి
యద రేగె మరీ మరీ
నిషా ముద్దుల పోరి నిను మెచ్చిందిరా కోరి
నా మజా మజా పెదాలనే చేసెయ్యరా చోరి

నారి నారి మేర ప్యారీ
వగలమారీ సొగసు కారీ
నిను చూసి హనీ హనీ
మతి పోయె టపీ మనీ
సింగారాల సోని నీ చున్ని నాదె కానీ
నా సఖి ప్రియా సుఖాలకి నువ్వే కదా వానీ

హల్లో బాసూ

చలి వేలా ఏదోల ఉందిరా i will rock you right now
సరసాల ఉయ్యాల ఊపరా i will shock you with love
గులాబి పువ్వుల్లో గువ్వలా మితి మీరి
కవ్వించుకోరా ఈ రాతిరీ
సుగందమే పోని ప్రియ వసంతమే రానీ
నీ సుఖీభవా సుమాలలో సరగమై పోనీ

హల్లో బాసూ మహా క్లాసు
అలా చూస్తే మ మ మాసు

పరువాలే కంగేటి పిలిచెరా...మేర దిల్ దివానా
విరహాల సెగలేవొ రేగెరా...ముజె సుబ్ కుచ్ హోనా
నా సిగ్గు దొంతరలే మబ్బులా కరిగంచి
కమ్మేసుకో కమ్మి కౌగిలై
పదే పదే కోరి నా జతే ఇలా చేరి
మన సరీగమా సయ్యాతకి చేసెయ్యవే బోనీ

హల్లో బాసూ మహా క్లాసు
అలా చూస్తే మ మ మాసు
నిను చూసి హనీ హనీ
మతి పోయె టపీ మనీ
నిషా ముద్దుల పోరి నిను మెచ్చిందిరా కోరి
నా మజా మజా పెదాలనే చేసెయ్యరా చోరి



అనగనగనగా పాట సాహిత్యం

 
చిత్రం: బాస్ (2006)
సంగీతం: కళ్యాణి మాలిక్, హ్యారి ఆనంద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె.కె., సునీత

అనగనగనగా మనసున మెరుపే మెరిసిన తరుణంలో
మెరుపుల వెనుక చిరు చిరు చినుకే కురిసిన సమయంలో

మెరుపు వెలుగులతో చినుకు పిలుపులతో
తెరవని తలుపులు తెరిచిన క్షణమున

ధీంతార ధిరనా తక ధింతతార ధిరనా
కొత్త ప్రేమ తపన మొలకెత్తు ఇందు వలన

తెలిసిన కధలో కలసిన తిధిలో
తిరగని మలపులు తిరిగిన క్షణమున

ధీంతార ధిరనా తక ధింతతార ధిరనా
పిచ్చి ప్రేమ తపన పురి విప్పే ఇందు వలన

కుంకుమ పువ్వుకు కాటుక రేఖవనా
కోరిన ప్రియునికి కౌగిలి లేఖవనా
నీలినింగిని వదిలి ఆ తారలిటు కదిలి
చేరుకున్నవి మజిలి నీ చెలిమి పెన్నిధి తగిలి
జిలిబిలి తార ఎద గగనమున
జాబిలి తీరుగ ఎదిగిన క్షణమున

ధీంతార ధిరనా తక ధింతతార ధిరనా
పిచ్చి ప్రేమ తపన పురివిప్పే ఇందు వలన

నచ్చిన చేతికి గోరింటాకవనా
నల్లని రేయికి వెన్నెల పడకవనా
కొద్దిగ ఇటు జరిగి నా ముద్దులో మునిగి
నవ్వవా అటు తిరిగి నేనివ్వలేనిది అడిగి

అడుగు కలిపి నడుమును కొలిచి
నడవని దారిన నదచిన క్షణమున

ధీంతార ధిరనా తక ధింతతార ధిరనా
పిచ్చి ప్రేమ తపన పురివిప్పే ఇందు వలన

అనగనగనగా మనసున మెరుపే మెరిసిన తరుణంలో
మెరుపుల వెనుక చిరు చిరు చినుకే కురిసిన సమయంలో
మెరుపు వెలుగులతో చినుకు పిలుపులతో
తెరవని తలుపులు తెరిచిన క్షణమున
ధీంతార ధిరనా తక ధింతతార ధిరనా



వెళుతున్న వెళుతున్న పాట సాహిత్యం

 
చిత్రం: బాస్ (2006)
సంగీతం: కళ్యాణి మాలిక్, హ్యారి ఆనంద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె.కె., సునీత

వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న
వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న
నామనసు నీ నీడలో వదిలేసి వెళుతున్న
నాకలలు నీ దారిలో పారేసి వెళుతున్న
నా కన్నీళ్లను నీ గుమ్మంలో ముగ్గేసి వెళుతున్న

వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న
వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న
నామనసు నీనీడలో వదిలేసి వెళుతున్న....
నాకలలు నీ దారిలో పారేసి వెళుతున్న
నా కన్నీళ్లను నీ గుమ్మంలో ముగ్గేసి వెళుతున్న

వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న
వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న

ఒకే పెదవితో పదములు ఎప్పుడు పలకవని
ఒకే పదముతో పరుగులు ఎప్పుడు సాగావనీ
ఒకే చేతితో చప్పట్లన్నవి మొగవనీ
ఒకే మనసుతో ముచ్చట్లన్నవి తీరవనీ
జతలోన రెండు మనసులు వుండాలి ఎపుడైనా
జతలోన రెండు మనసులు వుండాలి ఎపుడైనా
ఇకపైన నేనే రెండుగా విడిపోయి వెళుతున్నా

వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న
వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న

వస్తున్న వస్తున్నా నీకోసం వస్తున్న
నీలోన దాగున్న నాకోసం వస్తున్న
నీ మౌన రాగంలో మంత్రమై వస్తున్న
నీ ప్రేమ యాగంలో జ్వాలనై వస్తున్న
నీ మెడలోన నిత్యంనిలిచే సూత్రానై వస్తున్న
ఆణువణువణువున ఎగసిన అలలను నేడే గమనిస్తున్న
ఆ అలలను కలలుగ మలిచిన మహిమే నీదని గుర్తిస్తున్న
కలలకు వెల్లువ రప్పించి ఊహకు ఉప్పెన అందించి
ఆశల అలజడి పుట్టించి అన్నింటిని ప్రేమకు జత చేసి
నీ మది నది చేరగా కడలిని నేనై కదిలోస్తున్న

నీ మౌన రాగంలో మంత్రమై వస్తున్న
నీ ప్రేమ యాగంలో జ్వాలనై వస్తున్న
నీ మెడలోన నిత్యంనిలిచే సూత్రానై వస్తున్న



వస్తున్నా వస్తున్నా పాట సాహిత్యం

 
చిత్రం: బాస్ (2006)
సంగీతం: కళ్యాణి మాలిక్, హ్యారి ఆనంద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కె.కె.

వస్తున్నా వస్తున్నా 



Boss I Love You" (Instrumental)

 
చిత్రం: బాస్ (2006)
సంగీతం: కళ్యాణి మాలిక్, హ్యారి ఆనంద్

Boss I Love You" (Instrumental)

Most Recent

Default