చిత్రం: చక్రవర్తి (1987) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: చిరంజీవి , మోహన్ బాబు, భానుప్రియ, రమ్యకృష్ణ దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి నిర్మాత: కె.వెంకటేశ్వరరావు విడుదల తేది: 05.06.1987
Songs List:
ఊపిరి నిండ సాహసమే పాట సాహిత్యం
చిత్రం: చక్రవర్తి (1987) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు ఊపిరి నిండ సాహసమే ఉప్పెనకైన స్వాగతమే జడివానలో సుడిగాలినై ఈ వడిలో పిడుగై రేగనా ఏ దేశమేగినా నేనెందు కాలిడినా ఏ వేషమేసిన ఏ తీరు కనపడినా నన్ను నే మరువను నీతినే విడువను ఈ జన్మకి ఓటమే ఉండదూ ఏ ఆటలాడినా ఏ జంట జతపడినా ఏ మాటరేగిన ఏ బంధమేర్పడిన మారని మనిషిని మాయని మమతని నా పాటకి పల్లవే మారదు ఊపిరి నిండ సాహసమే ఉప్పెనకైన స్వాగతమే జడివానలో సుడిగాలినై ఈ వడిలో పిడుగై రేగనా
వన్నెలరాణి కిన్నెర సాని పాట సాహిత్యం
చిత్రం: చక్రవర్తి (1987) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి వన్నెలరాణి కిన్నెర సాని నీ జంటనె నేను వెన్నెలరాజ ఓ నెల రాజ నా వెంట రావేరా జంట నువ్వుంటె నీ వెంట నేనుంట హద్దులు లేని ముద్దుల కేలికి రా రాణి గాజులు పాడె మోజులు పాటె కమ్మగ రమ్మను వేలా కైపుగ తూగే నీ కను సైగే గుమ్ముగ కమ్మిన గోల అల్లె ఈ మల్లె గాలి చల్లె ఈ ముల్ల వాడి ఎల్ల తప్పించుకోను ఈ అల్లరి తుల్లి పరవల్ల వాన వల్లె వడగల్ల వేడి ఎల్ల నే తట్టుకోను ఈ ఆరడి నను నీ వడిలో దాగుండనీ కోరే ఈడుని ఓడించని హద్దులు లేని ముద్దుల కేలికి రా రాణి వన్నెలరాణి కిన్నెర సాని నీ జంటనె నేను వెన్నెలరాజ ఓ నెల రాజ నా వెంట రావేరా వెన్నెల ఏరై గలగల పారే పొంగిన వలపుల కల వెచ్చని ఊహల తీరం కోరె తియ్యని తలపుల అల కొగిల్ల పందిరెక్కి పాకె ప్రాయాల తీగ పూసె గిలిగింత పూల గందాలతో సాగె సయ్యటలోన ఊగె వయ్యారి ఊహ తాకె నీలాల నింగి ఈ వేలలో తారలు సిగలో కురమాలని తీరని తపనలు తరమాలని హద్దులు లేని ముద్దుల కేలికి రా రాజ వన్నెలరాణి కిన్నెర సాని నీ జంటనె నేను వెన్నెలరాజ ఓ నెల రాజ నా వెంట రావేరా జంట నువ్వుంటె నీ వెంట నేనుంట హద్దులు లేని ముద్దుల కేలికి రా రాణి
సందిట్లో చిక్కిందమ్మ జాబిల్లి పాట సాహిత్యం
చిత్రం: చక్రవర్తి (1987) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, సుశీల సందిట్లో చిక్కిందమ్మ జాబిల్లి పందిట్లో ఏనాడమ్మా మా పెళ్లి ఇల్లెక్కి కూసేటి ఈ పుంజుకి కిర్రెక్కి చూసేటి నా పెట్టకి ఏనాడో ఆ భోగి ఏనాడో సంక్రాంతి పూబంతితో బంతులాడేది ఏనాటికో ముంగిట్లో వచ్చాడమ్మా సూరీడు కౌగిట్లో కొస్తేగాని ముద్దీడు గోడెక్కి దూకేటి నా కోడికి వేడెక్కి పోయేటి నా ఈడుకి ఎన్నాళ్ళో శివరాత్రి ఏనాడో తొలిరాత్రి పులకింతలే పంటకొచ్చేది ఏనాటికో సందిట్లో చిక్కిందమ్మ జాబిల్లి ముంగిట్లో వచ్చాడమ్మా సూరీడు కన్నుకొడతా - ఆ కొట్టి చూడు కొట్టాక నీ ఈడు కోక దాటు అ చెయ్యి పడతా - హ పట్టి చూడు పట్టుకుంటే పాలపొంగు గోదారిరో శృతిమించి పోతుంది నీ ఆగడం ఇది ఆగడం కాదు చెలరేగడం అమ్మమ్మ కొమ్మారెమ్మ పూతకొస్తే ఎట్టమ్మ కొంటె పిట్ట మేతకొస్తే హె అబ్బబ్బా దోరపండు దాచుకుంటే ఓయబ్బా దోపిడింక సాగినట్టే ఆగాలి ఈగాలి చూడింక తగ్గాలిరో సందిట్లో చిక్కిందమ్మ జాబిల్లి ముంగిట్లో వచ్చాడమ్మా సూరీడు ముద్దు పెడతా - అ పెట్టి చూడు నా ముద్దులే నువ్వు మూటగట్టు అ పట్టుబడతా - అరె పట్టి చూడు కన్నెపట్టు కన్నెతేనే పట్టేనిరో ఈ పల్లె రేపల్లెకే చెల్లెలు సాగించు నూరేళ్లు నీ లీలలు ఓ యబ్బ సబ్బు సానామాడబోతే అబ్బబ్బా చీర కాస్త దోచుకుంటా అరెరే ఓయమ్మ కన్నెవెన్న దాచబోతే అమ్మమ్మ దుత్తలన్ని మాయమంటా పడకిళ్ళు పాలించి పాపల్లె లాలించన ముంగిట్లో వచ్చాడమ్మా సూరీడు కౌగిట్లో కొస్తేగాని ముద్దీడు ఇల్లెక్కి కూసేటి ఈ పుంజుకి కిర్రెక్కి చూసేటి నా పెట్టకి ఏనాడో ఆ భోగి ఏనాడో సంక్రాంతి పులకింతలే పంటకొచ్చేది ఏనాటికో సందిట్లో చిక్కిందమ్మ జాబిల్లి ముంగిట్లో వచ్చాడమ్మా సూరీడు
మొక్కజొన్న తోట పాట సాహిత్యం
చిత్రం: చక్రవర్తి (1987) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి / సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, జానకి మొక్కజొన్న తోట కాడ మొన్నటేళా రాజనిమ్మ తోట కాడ నిన్నటేళా మొక్కజొన్న తోట కాడ మొన్నటేళా రాజనిమ్మ తోట కాడ నిన్నటేళా పాలకంకి మీద పైట జారనేలా పడుచుపిట్ట అందులో చిక్కనేలా కొమ్మ చాటు పళ్ళు రెండు కొట్టనేలా మొన్నటేళా నిన్నటేళా మొక్కజొన్న తోట కాడ మొన్నటేళా రాజనిమ్మ తోట కాడ నిన్నటేళా తట్టుకో తట్టుకో నా తాకిడి గుట్టూగా విప్పుకో నా గుప్పిడి సందు చూసి కోసుకో నా గుమ్మడి సంతలో తిప్పుకో నీ కావడి ఎర్రగుండ నల్లగుండ ఏటవాలు కోనగుండ కన్ను సోక కుండ దోచుకోనా పాలకుంద నీరుకుండ పక్కనున్న ఏరు గుండ చేపకైన తెలియకుంద నిన్ను చేరుకోనా పచ్చని పల్లెలో విచ్చిన మల్లెలే ఇచ్చుకోరా ఇచ్చుకోరా వాలు జల్లో గుచ్చుకోరా మొక్కజొన్న తోట కాడ మొన్నటేళా రాజనిమ్మ తోట కాడ నిన్నటేళా మొక్కజొన్న తోట కాడ మొన్నటెళా రాజనిమ్మ తోట కాడ నిన్నటేళా పాలకంకి మీద పైట జారనేలా పడుచుపిట్ట అందులో చిక్కనేలా కొమ్మ చాటు పళ్ళు రెండు కొట్టనేలా మొన్నటేళా నిన్నటేళా మొక్కజొన్న తోట కాడ మొన్నటేళా రాజనిమ్మ తోట కాడ నిన్నటేళా వానలే తాకని నా వంటినీ గాలిలా అంటుకో తుల్లింతకీ వెన్నెలే సోకనీ నీ సోకునీ నీడలా చూడని రేయంతకీ తాటికొండ ఈతకొండ కిందపాలు తాగకుండ పద్దులెవరు పండకుండ లేచిరాన కోరుకొండ గోలుకోండ మీద దెబ్బ తీయకుండ సాలిబంద దారి గుండ రేగిపోనా దొండలా పండినా దోర నా పెదవులే అద్దుకోనా అంటుకోనా ముద్దు బల్లో దిద్దుకోనా మొక్కజొన్న తోట కాడ మొన్నటేళ రాజనిమ్మ తోట కాడ నిన్నటేళ మొక్కజొన్న తోట కాడ మొన్నటేళ రాజనిమ్మ తోట కాడ నిన్నటేళ పాలకంకి మీద పైట జారనేలా పడుచుపిట్ట అందులో చిక్కనేలా కొమ్మ చాటు పళ్ళు రెండు కొట్టనేలా మొన్నటేళా నిన్నటేళా మొక్కజొన్న తోట కాడ మొన్నటెళ రాజనిమ్మ తోట కాడ నిన్నటేళ
ఏరు జోల పాడేనయ్య సామి పాట సాహిత్యం
చిత్రం: చక్రవర్తి (1987) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు ఏరు జోల పాడేనయ్య సామి ఊరు ఊయలయ్యేనయ్య సామి ఎండి మబ్బు పక్కలో సామి నిండు సందమామల్లే సామి నేను లాలి పాదాలా నువ్వు నిద్దరోవాలా ఎన్నెలంటి మనసున్న సామి ఏరు జోల పాడేనయ్య సామి ఊరు ఊయలయ్యేనయ్య సామి మనిషి రెచ్చిపోత ఉంటె సామి మంచి సచ్చిపోతున్నాది సామి దిక్కులేని పిల్ల పాప సామి చెరపలేని సేవ్రాలయ్య సామి చేతులంటి ని కళ్ళే సీకటైన మా గుండెల్లొ ఎన్నెల్లు రాములోరి పాదాలే రాతికైన జీవాలిచ్చే భాగ్యాలు పట్టని నీ పాదాలూ అంజనేయుడల్లె సామి ఏరు జోల పాడేనయ్య సామి ఊరు ఊయలయ్యేనయ్య సామి చెడ్డ పెరిగి పోత ఉంది సామి గడ్డు రోజులొచ్చేనయ్య సామి సుద్దులన్నె చెప్పలయ్య సామి బుద్ది మాకు గరపాలయ్య సామి నావకున్న రేవల్లే మమ్ముదాచుకోవలయ్య నీ ఒల్లో పువ్వు కోరు పూజల్లే నీవు రాయిపోవలయ్య నీ గుల్లో కదగని నీ పాదాలు అంజి గాడి చేతి కన్నీల్లు ఏరు జోల పాడేనయ్య సామి ఊరు ఊయలయ్యేనయ్య సామి
మబ్బులు విడివడి పోయే పాట సాహిత్యం
చిత్రం: చక్రవర్తి (1987) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, సుశీల మబ్బులు విడివడి పోయే మన మనసులు ముడిబడి పోయే మబ్బులు విడివడి పోయే మన మనసులు ముడిబడి పోయే సాయంకాలం సందట్లో సంధ్యారగం పందిట్లో పెదవుల పెళ్ళికి ముద్దుల మద్దెల తాళం వేస్తుంటే వెన్నెల చినుకులు రాలే మది వేసవి ఉడుకులు తీరే వెన్నెల చినుకులు రాలే మది వేసవి ఉడుకులు తీరే సీతకాలం కౌగిట్లో సిగ్గులు రగిలే కుంపట్లో కొంగుల ముళ్లకి కొమ్మల కోయిల మేళం పడుతుంటే కిల్లాడి ని లేడి సోకులు చూస్తూనే అల్లాడి మల్లాడి ఆకులు మెస్తున్నా వసంతలాడుతున్న పూల బంతి చెండునిస్తావా పిల్లాడ నీ ఓడి చూపులు పడుతుంటే నేనోడి నీ వేడి చేతులు పడుతున్నా వరించే జోదు నువ్వే తోడు నువ్వై దిండు వేస్తావా మందార పొద్దుల్లొ ముద్దాడుకుంటాలే శ్రుంగార వీధుల్లో ఊరేగి వస్తాలే చీకటి వాకిట సిగ్గుల ముగ్గుల తొగ్గుల తొలకరిలో మబ్బులు విడివడి పోయే మన మనసులు ముడిబడి పోయే వెన్నెల చినుకులు రాలే మది వేసవి ఉడుకులు తీరే కుర్రాడ నీ నీడ దగ్గరకొస్తుంటె వెర్రెక్కి చుర్రెక్కి వెన్నెల మేస్తున్నా కులస రేగుతున్న రేతిరంత రెచ్చి పోతావా అమ్మాడి గుమ్మాడి అక్కరకొస్తుంటే గుమ్మెక్కి గుమ్మాల కావలి కాస్తున్నా మజాల ఊపుకొచ్చె ఊయలింక ఊగిచూస్తావా కస్తురి గంధాలు కౌగిల్ల కిస్తాలే ని కన్నె అందాలు ప్రాయలకిస్తాలే చిక్కిన చెక్కిలి నొక్కిన చక్కిలి గింతల తాకిడిలో మబ్బులు విడివడి పోయే మన మనసులు ముడిబడి పోయే మబ్బులు విడివడి పోయే మన మనసులు ముడిబడి పోయే సాయంకాలం సందట్లో సంధ్యారగం పందిట్లో పెదవుల పెళ్ళికి ముద్దుల మద్దెల తాళం వేస్తుంటే వెన్నెల చినుకులు రాలే మది వేసవి ఉడుకులు తీరే వెన్నెల చినుకులు రాలే మది వేసవి ఉడుకులు తీరే సీతకాలం కౌగిట్లో సిగ్గులు రగిలే కుంపట్లో కొంగుల ముళ్లకి కొమ్మల కోయిల మేళం పడుతుంటే