చిత్రం: చండీప్రియ (1980) సంగీతం: పి.ఆదినారాయణ రావు నటీనటులు: శోభన్ బాబు, చిరంజీవి, జయప్రద దర్శకత్వం: వి.మధుసూదనరావు నిర్మాత: అంజలీ దేవి విడుదల తేది: 07.03.1980
Songs List:
శ్రీ బాగ్యరేఖామ్ పాట సాహిత్యం
చిత్రం: చండీప్రియ (1980) సంగీతం: పి.ఆదినారాయణరావు సాహిత్యం: దేవులల్లి కృష్ణశాస్త్రి గానం: పి.సుశీల & కోరస్ శ్లోకం శ్రీ బాగ్యరేఖామ్ - ఉపపాదయన్తి శివంకరీమ్ - సింధుర మందయానామ్ శీతాంశుబింబ ప్రతిమాన వక్రామ్ శీతాద్రి పుత్రీమ్ శిరసా నమామి పాట: జననీ జననీ జననీ నవ లావణ్య వాహిని మోహిని కోరస్: శరణం నీ శరణం శ్రీకరి భవహరి గౌరీ శంకరి చరణముకడవాలని శిరమిడి పూజించని నటియించే నీ కాలి యందియల గంటల గలగలలేవి దేవి చెలియించే నీకేలి కంకణపు మువ్వల సవ్వడలేవీ దేవి ఊగి తూగు సిగ పాయలలో తురిమిన తారకలేవి దేవి ఆ సుందర సుందర రూపం ఈ చండీప్రియ హృదయ దీపం సుమమృదు హాసిని సుమధుర భాషిణి సువర్ణ పీఠా ధ్యాసిని మెడలో కదిలే సర్పహారములు పొగడ సరాలుగ మార్చిన దేవి జ్వలియించే నీ పాల నేత్రమును అరుణ తిలకముగా మార్చిన దేవి ఎంత చల్లని తల్లివో గాని వింతలు వింతలు నీ చేతలు ఆ మధుర మధుర దరహాసం ఆ మంజుల నాట్య విలాసం సుమమృదు హాసిని సుమధుర భాషిణి సువర్ణ పీఠా ధ్యాసిని
ఓ ప్రియా చండీప్రియా పాట సాహిత్యం
చిత్రం: చండీప్రియ (1980) సంగీతం: పి.ఆదినారాయణరావు సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: ఓ ప్రియా - ప్రియా చండీప్రియా - ప్రియా తొలి గిలిగింతలు కలిగించిందా నా ప్రేమలేఖా నడిచే చంద్రరేఖ ఓ ప్రియా - ప్రియా చండీప్రియా - ప్రియా తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా నీదే ఈ చంద్రరేఖ చరణం: 1 మనసులో ప్రతి మలుపులో నిను మలుచుకున్నానులే కలలలో మధువనులలో నీ పిలుపు విన్నానులే మనసులో ప్రతి మలుపులో నిను మలుచుకున్నానులే కలలో మధువనులలో నీ పిలుపు విన్నానులే ఆ.. చెలియ రూపాన చేరుకున్నావ పలికే రాగలేఖ కలా? - నిజం.. నిజం? - మ్మ్.. ఓ ప్రియా - ప్రియా చండీప్రియా - ప్రియా తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా నీదే ఈ చంద్రరేఖ చరణం: 2 ఎవ్వతే నీ వెవ్వతే వలికించుతావు వగలు ఏమీటే కథ ఏమిటే కురిపించుతావు సెగలు ఆశను జీవితాశను నే చెదిరితే విషాదం చండిని అపర చండిని నను కదిపితే ప్రమాదం ఆ నీవు నా కైపు తాను నా వైపు అయ్యో ఏమి రాత అటా? - ఇటూ... ఏటు? - ఇటూ ... ఓ ప్రియా - ప్రియా చండీప్రియా - ప్రియా తొలి గిలిగింతలు కలిగించిందా నా ప్రేమలేఖా నడిచే చంద్రరేఖ తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా నీదే ఈ చంద్రరేఖ
ఏ వేళనైన ఒకే కోరికా పాట సాహిత్యం
చిత్రం: చండీప్రియ (1980) సంగీతం: పి.ఆదినారాయణరావు సాహిత్యం: వేటూరి సుందరరామ్మూర్తి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: ఏ వేళనైన ఒకే కోరికా ఏ పూవులైన ఒకే మాలిక ఇలాగే పాడాలి కలకాలం ఇలాగే పాడాలి కలకాలం ఏ వేళనైన ఒకే కోరికా ఏ పువులైన ఒకే మాలిక యూ హీ హమ్ గాయేంగే జనమే జనమ్ యూ హీ హమ్ గాయేంగే జనమే జనమ్ చరణం: 1 అరవిరిసే కనులే కమలాలు ముసురుకునే కురులే బ్రమరాలు మిల్ కర్ సనమ్ హర్ కదమ్ హమ్ చలేంగే మిల్ కర్ సనమ్ హర్ కదమ్ హమ్ చలేంగే దిగిరావా నీలాల గగనాలు ఏ వేళనైన ఒకే కోరికా ఏ పూవులైన ఒకే మాలిక యూ హీ హమ్ గాయేంగే జనమే జనమ్ యూ హీ హమ్ గాయేంగే జనమే జనమ్ చరణం: 2 కెహెతా హై ప్యాసా మన్ మేరే సాజన్ ఖిల్తా రహే అబ్ మై ఆజ్ సావన్ మెరిసే నీ నవ్వులే జల్లులైతే మెరిసే నీ నవ్వులే జల్లులైతే పరువాలే శ్రావణ మేఘాలు ఏ వేళనైన - ఒకే కోరికా ఏ పూవులైన - ఒకే మాలిక యూ హీ హమ్ గాయేంగే జనమే జనమ్ యూ హీ హమ్ గాయేంగే జనమే జనమ్
ఏలెలో ఏలెలో పాట సాహిత్యం
చిత్రం: చండీప్రియ (1980) సంగీతం: పి.ఆదినారాయణరావు సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల & బృందం ఏలెలో ఏలెలో ఏలేలో హైలెస్సా ఏలెలో ఏలెలో ఏలేలో హైలెస్సా ఆ మల్లెలో మారాజా - ఎన్నెల్లో రేరాజా రార మా రాజా మా మోజు తీరగ రారా ఏలెలో ఏలో ఏలో వలపులు ఏవేవో నీలో నాలో పిలుపులు నవ్వే నా అందం నువ్వే నా బంధం కరిగిపోరా కౌగిలిలో మనసే రేగి వయసే ఊగి పిలిచే పాటలో శృతినే మించి లయనే పెంచి అడే ఆటలో అందమే నాది, అనుభవం నీది రసజగం, చెరిసగం ఏలుకుందాము ఎన్నెల్లో ఈ మోహలు రసదాహాలు కలిసే వేళలో మన దేహాలు సందేహాలు పలికే వేళలో పెదవులే నావి మధువులేనీవి ఇద్దరం ఒక్కరై కలిసి సోదాముకాలంలో
మసక పడితే నిదరపట్టదు పాట సాహిత్యం
చిత్రం: చండీప్రియ (1980) సంగీతం: పి.ఆదినారాయణరావు సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: పి.సుశీల, యస్.పి.బాలు మసక పడితే నిదరపట్టదు నిదర పడితే పక్క కుదరదు పక్క కుదిరితే కాకతగ్గదు ఎన్నెట్లో ఎండేసిపో - లేదంటే నట్టింట్లో నువ్వుండిపో మసక పడితే నిదరపట్టదు నిదర పడితే పక్క కదరదు పక్క కుదిరితే కాకతగ్గదు కౌగిట్లో నన్నుంచుకో కాదంటే నట్టేట్లో నను ముంచిపో ఏరల్లే వచ్ఛింది ఈడు అది ఎల్లువైతే ఎవరు తోడు మనసులోతు తెలుసుకోరా వడ్డునీవై వరుసుకోరా నింగి వొంగి నేల పొంగి ముద్దులాడే పొద్ధుకాడ జాబిల్లితో వచ్ఛిపో తొలిరేయి జామల్లే గుర్తుండిపో తెలిమంచు వానల్లే నువ్వూ చలిమంట లవ్వల్లే నవ్వూ పురులువిప్పి పులకరించి మరులు నాలో చిలకరించు కడలివంక వాగువంక పరుగు తీసే పదునుమీద సూరీడుతో వచ్ఛిపో మరుపొద్ధు రావద్దని చెప్పిపో