చిత్రం: చంటబ్బాయి (1986) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: చిరంజీవి , సుహాసిని దర్శకత్వం: జంధ్యాల నిర్మాత: భీమవరపు బుచ్చిరెడ్డి విడుదల తేది: 22.08.1986
Songs List:
అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను పాట సాహిత్యం
చిత్రం: చంటబ్బాయి (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: గానం: యస్.పి.బాలు, శైలజ అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను
నేను నీకై పుట్టినానని పాట సాహిత్యం
చిత్రం: చంటబ్బాయి (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆరుద్ర గానం: యస్.పి.బాలు, సుశీల పల్లవి: నేను నీకై పుట్టినానని నిన్ను పొందకా మట్టికానని చెమ్మగిల్లే కనులతో చేయి పట్టే మనసుతో చేసుకున్న బాసలో ఊసులే...ప్రేమ ....ఊపిరే ప్రేమ చరణం: 1 నిన్ను చూడకా నిదురపోనీ..రెండు నేత్రాలు కలల హారతి నీకు పట్టే..మౌన మంత్రాలు నిన్ను తాకకా నిలవలేనీ..పంచ ప్రాణాలూ కౌగిలింతలా గర్భగుడిలో... మూగ దీపాలు ప్రేమ మహిమ తెలుప తరమా.. ప్రేమే...జీవన మధురిమా... నేను నీకై పుట్టినానని నిన్ను పొందకా మట్టికానని చెమ్మగిల్లే కనులతో... చేయి పట్టే మనసుతో... చేసుకున్న బాసలో ఊసులే..ప్రేమ ....ఊపిరే ప్రేమ చరణం: 2 స్త్రీ అనే తెలుగక్షరంలా నీవు నిలుచుంటే క్రావడల్లే నీకు వెలుగులా ప్రమిదనై ఉంటా ఓం...అనే వేదాక్షరంలా నీవు ఎదురైతే గానమై నిన్నాలపించే..ప్రణవమై ఉంటా ప్రేమ మహిమ తెలియ తరమా.. ప్రేమే... జీవన మధురిమా నేను నీకై పుట్టినానని నిన్ను పొందకా మట్టికానని చెమ్మగిల్లే కనులతో చేయి పట్టే మనసుతో చేసుకున్న బాసలో ఊసులే..ప్రేమ ....ఊపిరే ప్రేమ
నేను ప్రేమ పూజారి పాట సాహిత్యం
చిత్రం: చంటబ్బాయి (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆరుద్ర గానం: యస్.పి.బాలు నేను ప్రేమ పూజారి ఏది పోదు చేజారి గుండెల్లొ దాచుకున్న గుట్టు లాగె గూడచారి నేను ప్రేమ పూజారి ఏది పోదు చేజారి సీతమ్మె కాజెస్తె చింతాకు పదకము రామచంద్రాయా ఆ పదకము బట్ట పట్టాల పాలైతి హలో రామచంద్రా... సక్షి గణపతి లేడు సౌమిత్రి ఊరుకోదు రాగేసిరోమని షురషికామణి ఐతే నిజమైతె నిఉప్పుకే చెదలంటదా నీటికే నిపాంటదా హరిలోరంగ హరి వదిలేదు లేదీ సారి క్రిష్న జన్మ స్తానం దాక పోనికమ్మ ముందు దారి హరిలోరంగ హరి వదిలేదు లేదీ సారి సొమ్ములేవె సోము దేవి నా నగలు తేవీ నంగ నాచి సత్య సోదన్లొ నేను సవ్యసాచినే వీర తాల్లు తగిలి తగిలి వీపు వాచనే విక్రమర్కుని పట్టు నాది వక్రమార్కము పట్టకే నా పేరు గాణచారి ఇట్టె పట్టెస్తానె చోరి తప్పె నువ్వు ఒప్పుకుంటె తగదె లేదె నంచారి నా పేరు గాణచారి ఇట్టె పట్టెస్తానె చోరి Twinkle, twinkle, little star How I wonder what you are Up above the jaiki scare Like a diamond in your way నా పేరె మిస్సు మేరి నేను కాను మిస్సు ఏది కస్సు బుస్సు అన్నావంటె కరుసై పోతావె బేబి నా పేరె మిస్సు మేరి నేను కాను మిస్సు ఏది
ఉత్తరాన లేవంది పాట సాహిత్యం
చిత్రం: చంటబ్బాయి (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆరుద్ర గానం: యస్.పి.బాలు పల్లవి: ఆ అహహాహా... ఆ..... ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం దక్షిణాన లేవంది మలయపర్వతం నింగిలేని తారకా .. నీవెక్కడా .. నీ వెక్కడా చెప్పవే నీ చిరునామా .. చెప్పవే నీ చిరునామా ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం దక్షిణాన లేవంది మలయపర్వతం చరణం: 1 చుక్కపాపనడిగాను వెన్నెలమ్మ ఏదనీ... పిల్లగాలినడిగాను పూలకొమ్మ ఏదనీ... జాణవున్న తావునే జాజిమల్లి తావులు ప్రాణమున్న చోటుకే పరుగులెత్తు ఆశలూ వెతికాయీ నీ చిరునామా.. వెతికాయీ నీ చిరునామా.. తెలుపరాదటే ఓ ప్రియభామా... ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం దక్షిణాన లేవంది మలయపర్వతం చరణం: 2 ఈ నిశీధి వీధిలో బాటసారినై... ఈ విశాల జగతిలో బ్రహ్మచారినై... నీ దర్శన భాగ్యమే కోరుకున్న కనులతో నీ సన్నిధి కోసమే బ్రతుకుతున్న కలలతో వెతికానూ నీ చిరునామా.. వెతికానూ నీ చిరునామా.. తెలుపరాదటే ఓ ప్రియభామా... ఉత్తరాన లేవంది ధృవనక్షత్రం దక్షిణాన లేవంది మలయపర్వతం నింగిలేని తారకా .. నీవెక్కడా .. నీ వెక్కడా చెప్పవే నీ చిరునామా .. చెప్పవే నీ చిరునామా