Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Cheliya (2017)



చిత్రం: చెలియా (2017)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హ్రిద్యా గట్టాని, తన్వి షాహ్
నటీనటులు: కార్తీ, అధితి రావ్ హైదరి
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: మణిరత్నం
విడుదల తేది: 07.04.2017

కలలో కలవో ఇలలో చెలివో
ఎదలో ఎగిసే అలవో
మాట వినకా...
మాటు వెనుకా  ఉన్నావే
కంట పడవా నా జంట పడవా

నా కాలి నడకా దాని వెనక
నీలాగ రాక వేరేగ లేదింక

ఓ నువ్వచ్చేదాక
ఆగ లేక నేనే రానా ఉప్పెనలాగ
ఓ చెయ్యందిస్తా ఓ నేన్ వస్తున్నాగా
వెళ్లిపోకే అందకుండా
వెతకాలన్నా  వీళ్ళేకుండా

కలలో కలవో ఇలలో చెలివో
ఎదలో ఎగిసే అలవో
మాట వినకా...
మాటు వెనుకా  ఉన్నావే
కంట పడవా నా జంట పడవా

నీతో ఏదో చెబుతుందంటా
గుండె గుబులేవిటో కొంటె కబురేవిటో
కాస్త చెవినేసుకో అసలేంటో అల్లరి
అదేదో తగునా తగదో
ఇదిలా ఇపుడే మదిలో కలలో
విడిపోవద్దే ముగిసే కధలాగా
కలిసే ఉందాం కాలం కడ దాకా


********   *********   ********


చిత్రం: చెలియా (2017)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అభయ్ జోధ్ పూర్, అర్జున్ చండీ,  చిన్మయి

ఆశ ఆగనందే నిన్ను చూడకుంటే
శ్వాస ఆడనందే అంత దూరముంటే
నన్నే మల్లెతీగలా నువ్వు అల్లకుంటే
నిలువెత్తు ప్రాణం నిలవదటే

అల్లై అల్లై అల్లై అల్లై
నా చిట్టి చిలక జట్టై అల్లై
అల్లై అల్లై అల్లై అల్లై
ఏమంత అలక చాల్లే అల్లై

నిను వెతికే నా కేకలకు
మౌనమే బదులైందే
మౌనములో నీ మాటిదని మనసే పోల్చుకుందే
లాలన చేసే వేలే లేని
పంతం ఒడిలో పలకవటే

అల్లై అల్లై అల్లై అల్లై
పుప్పొడి తునక గాలై అల్లై
అల్లై అల్లై అల్లై అల్లై
పన్నీటి చినుకా జల్లై అల్లై

హో...

ముడిపడి పోయాం ఒక్కటిగా విడివడి పోలేక
కాదనుకున్నా తప్పదుగా వాదన దేనికికా
పదునుగ నాటే మన్మధ బాణం
నేరం ఏమి కాదు కదే

అల్లై అల్లై అల్లై అల్లై
నా జత గువ్వా జట్టై అల్లై
అల్లై అల్లై అల్లై అల్లై
నా చిరునవ్వా జల్లై అల్లై


********   *********   ********


చిత్రం: చెలియా (2017)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎ. ఆర్. రెహమాన్, టిప్పు, నిఖిత గాంధి

మొరెతుకొచ్చింది బూరెతి వుదింది
ఊరంత మోగింది డివ్విట్టం
జొరెట్టి గిచ్చింది గోలెంతొ పెంచింది
లొలోన మా మంచి ముహుర్తం (X2)

ఇంకెన్నాల్ల పాటు దాస్తావు గాని
అగ్గంటి ఆ గుట్టుని
నే జాగర్త చెస్తాగ
నా చేతికిచ్చేసి చల్లారిపొ రమని
నన్నల్లుకుంటె గాని వల్ల కాదు అంది
నీ ఇబ్బంది

అంటుకొ మక్కువగా వచ్చి
ఆదుకొ అక్కున లాలించి
అందుకె లేత సొకులన్ని
ఆకు వక్క చేసి
తాంబూలం అందించని

కల్లతొ ఒల్లంతా నమిలి
చూపు యెర్రబారిందె నెమలి
ఒంపులన్ని గాలిస్తూ
ఎటు వెల్లిందంటె నెనేం చెప్పేది
కల్యాని.. బాగుందె నీ కొంటె బాని

మొరెతుకొచ్చింది బూరెతి వుదింది
ఊరంత మోగింది డివ్విట్టం
జొరెట్టి గిచ్చింది గోలెంతొ పెంచింది
లొలోన మా మంచి ముహుర్తం (X2)

నెగ్గలేని యుధం ఇదని
ఒధనకొవు గదా
ఆష పడ్డ అలసటలొ
గెలుపు వుంది కద

సరె-లెమ్మని ఇలా రమ్మని
ఎదొ కమ్మని తిమ్మిరి
చూదె అమ్మాది

యెవెట్టుకొచింది యవెట్టుకొచింది
చిన్నారి అందాల సంధొహం

పూలెట్టుకొచింది పాలట్టుకొచింది

ఎంటింక నీకున్న సంధెహం

వా కొరిక్కి కారెక్కి
నీ వెంట పడ్డదె ఎట్టాగె దానాపుట
నిను ఆరార కొరుక్కు తినందె
ఆ తిక్క తీరనె తీరాదట

నీ గాలొచి నా చెవి
లొలాక్కుతొ చెప్పె ఆ మాటా

కొప్పులొ బుట్టెదు పూలెట్టి
తప్పుకొ లెనట్టు ఆకట్టి
చెప్పుకొ వీల్లెన్ని అక్కర
పెంచావె పెట్టా ఎం చెయనె అకట

పక్కనె వున్నదె సుకుమారం
పట్టుకొ మన్నదె మగమారం
తట్టుకొ మనక ఇట్టె చప్పున చిక్కి
తప్పించు ఈ ధూరం

కల్యని.. బాగుందె నీ కొంటె బాని

(యెవెట్టుకొచింది యవట్టుకొచింది
చిన్నారి అందాల సంధొహం
పూలెట్టుకొచింది పాలట్టుకొచింది
ఎంటింకా నీకున్న సంధెహం (X3))

కల్యని.. బాగుందె నీ కొంటె బాని
కల్యని.. బాగుందె నీ కొంటె బాని


********   *********   ********


చిత్రం: చెలియా (2017)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: షాశా తిరుపతి

మైమరుపా మెరుపా మెరుపా
మైమరుపా మెరుపా మెరుపా
మైమరుపా మైమరుపా
మైమరుపా మైమరుపా ఆ ఆ ఆ

మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరొ తెలుసా
యెదలొ నిదరె చెదిరె కబురే
చలిలో పడదా
అల్లరిగా నిన్నల్లుకొనే వన్నెలావలనే కనవా

సరెలె అనవా సరదా పడవా
సరెలే అనవా సరదా పడవా
ఈ మంచు ఆమనిలో
కుహుహూ అనవా

మైమరుపా మెరుపా నిన్నిలా నదడిపిందెవరొ తెలుసా
యెదలొ నిదరె చెదిరె కబురే
చలిలో పడదా
అల్లరిగా నిన్నల్లుకొనే వన్నెలావలనే కనవా

నీతో కలిసి వేసే అడుగు
ఏతోవంటు తననే అడుగు
తరిమే చొరవా ఏమంటుందొ
కొండా కోనంలొ ఆపదుగా తన పరుగు
వెలుగే వెలివేసావనుకో
ఇది కల కాదులే నేలా నీకూ

మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరొ తెలుసా
యెదలొ నిదరె చెదిరె కబురే
చలిలో పడదా
అల్లరిగ నిన్నల్లుకొనే వన్నెలావలనే కనవా

సరెలె అనవా సరదా పడవా
సరెలే అనవా సరదా పడవా

సరెలె అనవా సరదా పడవా
సరెలే అనవా సరదా పడవా


********   *********   ********

చిత్రం: చెలియా (2017)
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అర్జున్ చండీ, హరిచరన్, జోనిత గాంధి

చిటికెలు వినవే, బేబీ…
కిలకిలమనవే, బేబీ…
అకటా ఏమననే, నిను చూసి కాస్త మతిచెడెనే…
జాలైనా చూపలేవా, బింకమా బిడియమా?
ఓ లలనా నీ వలన ఇలా పిచ్చిపట్టి తిరుగుతున్నా,
ఈ నేరం నీదేనంటే
నిందిస్తున్నాననుకుంటావా…

హంసరో మ్యారీ మీ మ్యారీ మీ
హంసరో ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ
హంసరో ఏమైనా ఎందుకైనా డోంట్ వర్రీ
హంసరో ఓహ్ హంసరో…

హంసరో మ్యారీ మీ మ్యారీ మీ
హంసరో ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ
హంసరో సిద్ధంగా నేను ఉన్నా బీ రెఢీ
హంసరో ఓహ్ హంసరో…

ఆశకొద్దీ అడిగానే అనుకోవే, ఆ టెక్కెందుకే?
పిడివాదం మాని పోనీలే అంటే, పోయేదేముందే?
వెతకగనే కలిసొచ్చే వేళ
పిలిచిందే బాలా, సందేహించాలా?
మరుగెందుకే…
తగువేలనీ తెరదాటనీ దరిచేరనీ నీ నీ నీ నీ…

హంసరో మ్యారీ మీ మ్యారీ మీ
హంసరో ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ
హంసరో ఏమైనా ఎందుకైనా డోంట్ వర్రీ
హంసరో ఓహ్ హంసరో…

హంసరో మ్యారీ మీ మ్యారీ మీ
హంసరో ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ
హంసరో సిద్ధంగా నేను ఉన్నా బీ రెఢీ
హంసరో ఓహ్ హంసరో…

కలిసొచ్చే వేళ పిలిచిందే బాల
సందేహించాల మరుగెందుకే
తగువేలని తెర దాటని
దరి చేరని నీ

హంసరో మ్యారీ మీ మ్యారీ మీ
హంసరో ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ
హంసరో ఏమైనా ఎందుకైనా డోంట్ వర్రీ
హంసరో ఓహ్ హంసరో…

హంసరో మ్యారీ మీ మ్యారీ మీ
హంసరో ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ
హంసరో సిద్ధంగా నేను ఉన్నా బీ రెఢీ
హంసరో ఓహ్ హంసరో…

Most Recent

Default