Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Chettu Kinda Pleader (1989)


చిత్రం: చెట్టు కింద ప్లీడరు (1989)
సంగీతం: ఇళయరాజా
రచన: వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: రాజేంద్రప్రసాద్, కిన్నెర, ఊర్వశి
దర్శకత్వం: వంశీ
నిర్మాత: నందిగాం సూర్య రవీంద్ర
విడుదల తేది: 16.02.1989

చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..
చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..
రంగేళి జోడి బంగారు బాడీ
వేగంలో చేసెను దాడి
వేడెక్కి ఆగెను ఓడి
అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా
దారి చెప్పవా చెప్పవా

చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..
చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..
రంగేళి జోడి బంగారు బాడీ
వేగంలో చేసెను దాడి
వేడెక్కి ఆగెను ఓడి
అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా
దారి చెప్పవా చెప్పవా

దేవతలే మెచ్చిన కారు దేశాలు తిరిగిన కారు
వీరులకు ఝాన్సీ కారు హీరోలకు ఫాన్సీ కారు
అశోకుడు యుద్దంలోన వాడింది ఈ కారు
శివాజీ గుర్రం వీడి ఎక్కింది ఈ కారు
చరిత్రల లోతులు చేరి రాతలు మారి
చేతులు మారినదీ జంపరు బంపరు
బండి రా బండిరా జగమొండి రా మొండి రా

చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..

ఆంగ్లేయులు తోలిన కారు ఆంధ్రానే ఏలిన కారు
అందాల లండన్ కారు అన్నింటా ఎమ్డెన్ కారు
బుల్లెట్లా దూసుకుపోయే రాకెట్టే ఈ కారు
రేసుల్లో కప్పులు మనకే రాబట్టే ఈ కారు
హుషారుగ ఎక్కినా చాలు
దక్కును మేలు చిక్కు సుఖాలు
ఇదే సూపరు డూపరు బండి రా బండి రా
జగమొండి రా మొండి రా

చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..

చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి..
రంగేళి జోడి బంగారు బాడీ
వేగంలో చేసెను దాడి
వేడెక్కి ఆగెను ఓడి
అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా
దారి చెప్పవా చెప్పవా
చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడి





చిత్రం: చెట్టు కింద ప్లీడరు (1989)
సంగీతం: ఇళయరాజా
రచన: వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలు, చిత్ర

అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే
మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రావే
అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా
మల్లెపూల చినుకై రానా పల్లవించు పలుకై రానా
వేచే ఎదలో వెలుగై రానా
అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే
అల్లిబిల్లి కలలా

చరణం: 1
సోగకళ్ళ విరిసే సొగసే గోగుపూలు కురిసే
రాగమైన పిలుపే తెలిపే మూగగుండె వలపే
రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే
నిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచే
ఏలబిగువా ఏలుకొనవా ప్రేమకధ వినవా

అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా
అల్లిబిల్లి కలలా

చరణం: 2
జావళీలు పాడే జాణ జాబిలమ్మ తానై
గుండె నిండిపోయే చానా వెండిమబ్బు తానై
సంగతేదో తెలిపే పలపే సంగతేదో పలికే
దూరమింక చెరిపే వలపే దోరనవ్వు చిలికే
మేనికుళుకే తేనెచినుకై పూలజల్లు కురిసే

అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే
అల్లిబిల్లి కలలా రానా అల్లుకున్న కధలా రానా
మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే
వేచే ఎదలో వెలుగై రానా
అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రానా
అల్లిబిల్లి కలలా





చిత్రం: చెట్టు కింద ప్లీడరు (1989)
సంగీతం: ఇళయరాజా
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర


పల్లవి:
నీరుగారి పారిపోకు నీరసాన జారిపోకు లే మేలుకో
మారుమూల దాగిపోకు పిరికి మందు తాగబోకు లే మేలుకో
ఎందుకీ భయం అందుకో జయం
నీడలాగ నీకు తోడు నేనే లేనా

నీరుగారి పారిపోకు  నీరసాన జారిపోకు లే

చరణం: 1
రూపురేఖలో చురుకైన చూపులో నీవే జాకీ చాన్
కొండరాళ్ళనే నీ కండరాలతో లేపే  సూపర్ మాన్
కీచులాటలు కుంఫుల ఫైటులు రావే ఏం చేస్తాం
ఎగిరి దూకడం అలవాటు లేదెలా అమ్మో పడి చస్తాం
అహ ఎంతవారలైన నీకు చీమ దోమ
హయ్యో ! ఎందుకమ్మ అంత చేటు ధీమా భామ
హి మాన్ లా నువ్వు హుంకరించరా
ఆ పైన నా ప్రాణం హరించరా
వీరస్వర్గమే వరించరా

మాయదారి మాటలేల మాయలేడి వేటలేల నే రాను పో
చేతగాని శౌర్యమేల ఈదలేని లోతులేల హా...!

చరణం: 2
పాలపాలుడా పలనాటి బాలుడా ఏదీ నీ ధైర్యం
కదనవీరుడా అసహాయ శూరుడా కానీ ఘనకార్యం
నీకు మొక్కుతా ఒక మూల నక్కుతా పోరే వద్దంట
బతుకు దక్కితే బలుసాకు మొక్కుతా పోనీ నన్నిట్టా
అహ కీడు నీడ చూసి నీకు భయమా భీమా
చేయలేదు ఇంతవరకు జీవిత భీమా
ఆంజనేయుడా నీ శక్తి తెలుసుకో
అమ్మనాయనో నన్నింక విడిచిపో
జంకు బొంకు లేక నడిచిపో

మాయదారి మాటలేల మాయలేడి వేటలేల నే రాను పో
చేతగాని శౌర్యమేల ఈదలేని లోతులేల నే రాను పో
పాడు రొంపిలో నన్ను దింపకే
ముందు నుయ్యి వెనుక గొయ్యి చావే ఖాయం

నీరుగారి పారిపోకు నీరసాన జారిపోకు లే మేలుకో
మారుమూల దాగిపోకు పిరికి మందు తాగబోకు లే





చిత్రం: చెట్టు కింద ప్లీడరు (1989)
సంగీతం: ఇళయరాజా
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
జిగిజిగిజిగిజ జాగేల వనజ రావేల నారోజా
జిగిజిగిజిగిజ ఓ బాలరాజ నీదేర ఈ రోజా
నీదేలే వలపుల వైభోగం..
నాదేలే మమతల మణిహారం..

ఓయ్...జిగిజిగిజిగిగిజ జాగేల వనజ రావేల నారోజా
జిగిజిగిజిగిజ ఓ బాలరాజ నీదేర ఈ రోజా

చరణం: 1
లాలీ..లాలీ ప్రేమరాణీ.. అనురాగంలోనే సాగిపోనీ
మేనలోన చేరుకోని..సురభోగాలన్నీ అందుకోనే..
పెదవి పెదవి కలవాలి.. ఎదలో మధువే కొసరాలి..
బ్రతుకే మమతై నిలవాలి..మురళి స్వరమై పలకాలి..

ప్రేయసి పలుకే మాణిక్య వీణ.. ప్రేమావేశంలోన..
కౌగిలి విలువే వజ్రాలహారం.. మోహావేశంలోన..
రావే రావే రసమందారమా...!!

జిగిజిగిజిగిజ జాగేల వనజ రావేల నారోజా
జిగిజిగిజిగిజ ఓ బాలరాజ నీదేర ఈ రోజా
నీదేలే వలపుల వైభోగం..
నాదేలే మమతల మణిహారం..

చరణం: 2
స్నానాలాడే మోహనాంగి..ఇక సొంతం కావే శొభనాంగి..
దూరాలన్నీ తీరిపోనీ..రస తీరాలేవో చేరుకోని..
తనువు తనువు కలిసాక..వగలే ఒలికే శశిరేఖ..
ఎగసే కెరటం ఎదలోన..సరసం విరిసే సమయాన..

ముందే నిలిచే ముత్యాల శాన.. పువ్వై నవ్వే వేళ..
రమ్మని పిలిచే రత్నాల మేడ..సంధ్యారాగం లోన..
వలపే..పలికే ఒక ఆలాపన..

జిగిజిగిజిగిజ జాగేల వనజ రావేల నారోజా
జిగిజిగిజిగిజ ఓ బాలరాజ నీదేర ఈ రోజా
నీదేలే వలపుల వైభోగం..
నాదేలే మమతల మణిహారం..


Most Recent

Default