Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Dhada (2011)




చిత్రం: దడ (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: నాగ చైతన్య, కాజల్ 
దర్శకత్వం: అజయ్ భూయన్
నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 11.08.2011



Songs List:



భూమే గుండ్రంగా పాట సాహిత్యం

 
చిత్రం: దడ (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి 
గానం:  రనీన రెడ్డి ,  రిచర్డ్ 

భూమే గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా
ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా
సూర్యుడికా వెలుగేంటి అని క్వశ్చన్ గాని వేశావా
చిరుగాలీ కన పడవేంటని ఎపుడైనా ప్రశ్నించావా
ఇది వరకు నడిచిన దూరం ఎంతని కొలిచావా
కాలానికి వయసెంతా అని ఆరా తీశావా

ఈ ప్రశ్నలకన్నిటికీ జవాబే తెలియకున్నా
పోయేది ఏమీలేదు ఛోడ్‌ దో
లోలీటా సెన్యో రీటా లైఫే ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ అంటా
లోలీటా సెన్యో రీటా అంచేతే కానిచ్చేద్దాం ఆటాపాటా

ఒక మనిషికి ఒకటే మెదడు ఎందుకు ఉందో అడిగావా
గుండెకు ఆ లబ్‌డబ్ సౌండ్ ఏంటని క్వశ్చన్ చేశావా
కనుబొమ్మలు కలిసేలేవని కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యావా
నీ తల్లో మెమరీ సైజు ఎన్ని బైట్లో ప్రశ్నించావా
దోమలది ఏ బ్లడ్‌ గ్రూప్ అని గూగుల్లో వెతికావా
స్వీటెందుకు ఇష్టం నీకని చీమని అడిగావా
                              
ఈ ప్రశ్నలకన్నిటికీ జవాబే తెలియకున్నా
పోయేది ఏమీలేదు ఛోడ్‌ దో
లోలీటా సెన్యో రీటా లైఫే ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ అంటా
లోలీటా సెన్యో రీటా అంచేతే కానిచ్చేద్దాం ఆటాపాటా

ఆల్ఫాబెట్‌లు ఇరవైఆరే ఉన్నాయేంటని అడిగావా
రోజుకు ఓ యాభైగంటలు లేవేంటని ఫీలయ్యావా
ఫోనెత్తి హల్లో ఎందుకు అంటాం ఆలోచించావా
అగరొత్తికి దేవుడికి  లింకేంటో రీసెర్చ్ చేశావా
రెయిన్‌బోలో బ్లాక్ అండ్ వైట్ ఎందుకు లేవన్నావా
నిద్దర్లో కలదేరంగో రీవైండ్ చేశావా

ఈ ప్రశ్నలకన్నిటికీ జవాబే తెలియకున్నా
పోయేది ఏమీలేదు ఛోడ్‌ దో
లోలీటా సెన్యో రీటా లైఫే ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ అంటా
లోలీటా సెన్యో రీటా అంచేతే కానిచ్చేద్దాం ఆటాపాటా




ఓ హలో హలో పాట సాహిత్యం

 
చిత్రం: దడ (2011)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: నిఖిల్ డిసౌజ, నేహా భాసిన్

పల్లవి : 
ఓ హలో హలో హలో లైలా మాయమైంది నా మనస్సు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నాదో కళ్లముందే  దాగి ఉండు పగటిపూట తారలా
హలో హలో హలో చాలా చేసినావు చాలులేరా గోపాలా
నాలోనే దాచి పెట్టేసి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడమాకలా
ఐతే నా మనసు నిన్ను చేరినట్టు నీకు కూడ తెలిసినట్టే
ఐనా ముందు అడుగు వేయకుండా ఆపుతావు అదేమిటే
పెదాలతో ముడేయనా...
ప్రతిక్షణం అదే పనా...

చరణం: 1
ముద్దుదాకా వెళ్లనిచ్చి హద్దు దాటనీయవేంటి 
కావాలమ్మా కౌగిలి కౌగిలి ఓ చెలీ చెలీ
కొద్దిపాటి కౌగిలిస్తే కొత్తదేదో కోరుకుంటూ 
చేస్తావేమో అల్లరి అల్లరి మరి మరి మరి
అమ్మో నా లోపలున్నదంతా అచ్చు గుద్దినట్టు చెప్పినావే
అవునోయ్ నీకంతకన్నా గొప్పఆశ ఇప్పుడైతే రానే రాదోయ్
అందాలతో ఆటాడనా... 
అనుక్షణం అదే పనా...

హలో హలో హలో లైలా మాయమైంది నా మనస్సు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నాదో కళ్లముందే  దాగి ఉండు పగటిపూట తారలా

చరణం: 2 
ఒక్కసారి చాలలేదు మక్కువంత తీరలేదు 
ఇంకోసారి అన్నది అన్నది మది మది మది
ఒడ్డుదాకే హద్దు నీకు లోతుకొచ్చి వేడుకోకు 
నీదే పూచీ నీదిలే నీదిలే భలే భలే భలే
ఆ మాత్రం సాగనిస్తే చాలునమ్మా సాగరాన్ని చుట్టిరానా
నీ ఆత్రం తీరిపోవు వేళదాకా తీరమైన చూపిస్తానా
సుఖాలలో ముంచెయ్యనా...
క్షణక్షణం అదే పనా...

ఓ హలో హలో హలో లైలా మాయమైంది నా మనస్సు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నాదో కళ్లముందే  దాగి ఉండు పగటిపూట తారలా



తెలుగు బెంగాలీ పాట సాహిత్యం

 
చిత్రం: దడ (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: నీరజ్ శ్రీధర్, శ్రీ చరణ్, మేఘ 

హే సర్రని సుర్రని కిర్రెన్క్కించే బుర్రని
హే జల్లని జిల్లాని దొర్లించే దిల్లుని
హోం నిన్నని మొన్ననీ మరిచి దరువెయ్యని
హే తప్పని గిప్పని ఎవడేదైనా చెప్పని
హే మేడ మీద బాల్కనీ ఇవ్వలేదు ఈడ మజాని
డోలు ఊహకందని ఉత్సాహాన్ని కళ్ళల్లో
కాళ్లల్లో చెంపల్లో చేతుల్లో రప్పించి స్టెప్పేయ్ హనీ

తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ
భాషే లేదంటే లైఫ్ అంత పార్టీ

జీన్స్ ట్రాక్సర్లు లుంగీ లంగోటి
తేడా లేదంటే లైఫ్ అంత పార్టీ

హే సర్రని సుర్రని కిర్రెన్క్కించే బుర్రని
హే జల్లని జిల్లాని దొర్లించే దిల్లుని

హే డీజే బీటే ఆలా రోజు వింటే చెవులు హీట్ హీటే
అడపా దడపా ఇలా బల్లని కొడితే అదో కొత్త బీటే
మొత్తం దమ్ము నువ్వే లాగించేస్తే అసలు కిక్కు లేదోయ్
కొంచెం కొంచెం ఇలా షేరింగ్ చేస్తే ఫుల్ ఎక్కుతాదే

చిలీ చికెన్ చీకుతో చిత్తుగా చిందులేస్తే చింత మాయం
హొయ్ మిర్చి మఠాను ముక్కలే మత్తులో అందిస్తాయి వింత సాయం
హే కోల్డ్ కాఫియీ పక్కనెట్టు గరం ఛాయ్ ముందరుంది
సిప్పేసి స్టెప్పేయ్ హనీ

తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ
భాషే లేదంటే లైఫ్ అంత పార్టీ

జీన్స్ ట్రాక్సర్లు లుంగీ లంగోటి
తేడా లేదంటే లైఫ్ అంత పార్టీ

హే సర్రని సుర్రని కిర్రెన్క్కించే బుర్రని
హే జల్లని జిల్లాని దొర్లించే దిల్లుని

ఎం మయేరో ఎమ్యేరో ఎదో చేశావురో
సిండ్రెల్లా లాంటి అమ్మాయిలో చిత్రంగా మత్తేదో నింపావురో
నీ మాటలో నీ నవ్వులో తననే ముంచేసావురో
గోరంతటి తన గుండెలో కొండంత కల్లోలం ఓంపావురో

తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ

భాషే లేదంటే లైఫ్ అంత పార్టీ

హే సోనీ సోనీ జరా సోచో సోనీ నీకే అర్ధమవుద్ది
హే సంతోషాన్ని ఇలా పంచుకుంటే పెరుగుతాది
కానీ ఖని అరె బాతాఖానీ గుండె తేలికవుద్ది
సుతి సోది ఆలా వేసేకొద్దీ ఫ్రెండ్షిప్ ఎక్కువవుద్ది

రేచె రేచి వయసులో రచ్చ రచ్చ చేయాలనీ రూల్ ఉంది
గిచ్చే గిచ్చే ఆశలే రాచి తీర్చుకోవాలని రాసి ఉంది
పిల్ల సెంట్రల్ ఏసీ ఆఫ్ చేసి చల్ల గాలి లోన మనసు
విప్పేసి స్టెప్పేయ్ హనీ

తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ
భాషే లేదంటే లైఫ్ అంత పార్టీ

జీన్స్ ట్రాక్సర్లు లుంగీ లంగోటి
తేడా లేదంటే లైఫ్ అంత పార్టీ




గొడవ గొడవ పాట సాహిత్యం

 
చిత్రం: దడ (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
గానం: కార్తీక్, ప్రియా హిమేష్ 

హోం గొడవ గొడవ గొడవ న గుండెలోన గొడవ
ఈ అందమైన గొడవ ఓ అంతులేని గొడవ

హోం గొడవ గొడవ గొడవ న గుండెలోన గొడవ
ఈ అందమైన గొడవ ఓ అంతులేని గొడవ

ఒక్కసారి నా గుండె తట్టి చూస్తావా
బయటపడని భూకంపమంతా గొడవ
ఒక్కసారి నా కళ్ళలోకి చూస్తావా
నిధ్రపోని నిశ్శబ్ద మైన గొడవ

ఓ పగటి తో రాతిరి గొడవ
పాప తో రెప్పలా గొడవ
ఎప్పుడు నీ కలలో ఉంటానని
మనసుతో మౌనం గొడవ
ప్రేమతో ప్రాణం గొడవ
నువ్వు తమ చోటే కాజేసావని

ఏదేమైనా ఈ గొడవ బాగుంది లే

హోం గొడవ గొడవ గొడవ న గుండెలోన గొడవ
ఈ అందమైన గొడవ ఓ అంతులేని గొడవ

హే రాజుల రా రాజుల నా గతం ఉండేదట
ఇంతలో వింతగా ఏమయ్యిందేమో
రాణి వెంటే నీడలా తిరుగుతుందే నా కథ
ప్రేమలో తిప్పలు తప్పవేమో

రోజుకో రోజాపువ్విచ్చే రోమీయోనయ్యా నీవళ్లే
రోడ్డుకు రోమియోను నేను చూసానాలే

హోం గొడవ గొడవ గొడవ న గుండెలోన గొడవ
ఈ అందమైన గొడవ ఓ అంతులేని గొడవ

హాయ్ గాలిలో నీపేరునే కవితల రాసానులే
కవితలు కబుర్లు ప్రేమకలవాటే
పువ్వులే ఓ కుంచగా నీ బొమ్మ గీసానులే
బొమ్మలు రంగులు పాతమాటే

ప్రేమతో వేళాకోళాల లోకువైపోయాన చాలా
తప్పదు ఈ తమాషా అనుకుంటే పొలా

గొడవ గొడవ గొడవ న గుండెలోన గొడవ
ఈ అందమైన గొడవ ఓ అంతులేని గొడవ



దీవాలీ దీపాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: దడ (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
గానం: ఆండ్రియా, కళ్యాణ్

చక్కెర చిన్నోడ ఆలే కత్తెర కళ్లోడా ఆలే 
చూడర బుల్లోడా ఆలే అందాన్ని
ఒంటరి పిల్లోడ ఆలే తుంటరి పిల్లోడా ఆలే 
వద్దకు లాగెయ్‌ రా ఆలే వజ్రాన్ని

దీవాలీ దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్లలోన ఆకళ్లు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని

చక్కెర చిన్నోడ ఆలే కత్తెర కళ్లోడా ఆలే
చూడర బుల్లోడా ఆలే అందాన్ని

ఊరించే నిషాని ఊపిరిపోసే విషాన్ని
నెత్తురు లోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని
అత్తరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని
అల్లుకుపోరా కాముడు రాసిన గ్రంథాన్ని

చక్కెర చిన్నోడ ఆలే కత్తెర కళ్లోడా ఆలే
చూడర బుల్లోడా ఆలే అందాన్ని

కదిలే నావలా వయసే ఊయల
ఎదటే నువ్వలా గిచ్చే కన్నై చూస్తుంటే
నిజమా ఈ కల అనిపించేంతలా
మనసే గువ్వలా గాల్లో తేలిందే

నీపక్క చోటిస్తే నన్నే నా నుంచి దోచిస్తా
నాకే నీలోన చోటిస్తే నన్నే దాచేస్తా
ఓ... నీ గూడు నాకిస్తే ఇందా నా గుండె నీకిస్తా
నీతో వెయ్యేళ్లు రానిస్తే నన్నే రాసిస్తా

దీవాలీ దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్లలోన ఆకళ్లు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని

ఒకడే వేయిగా కదిలే మాయగా
కనిపించావుగా అటూ ఇటూ నా చుట్టూ
సలసల హాయిగా సరసున రాయిగ
కదిలించావుగా ప్రాయం పొంగేట్టు

పొందుకు వస్తావో నాతో పొత్తుకు వస్తావో
ఎటో ఎత్తుకు పోతావో అంతా నీ ఇష్టం
ఉప్పెన తెస్తావో నొప్పిని ఉఫ్ఫనిపిస్తావో
తప్పని తప్పును చేస్తావో అందం నీ సొంతం 

దీవాలీ దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్లలోన ఆకళ్లు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని




చిన్నగ చిన్నగ పాట సాహిత్యం

 
చిత్రం: దడ (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం : అనంత శ్రీరాం 
గానం: సాగర్ 

చిన్నగా చిన్నగా మొదలైంది అల్లరి
తిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి
చల్లనైన ఆవిరి చూపుల్లో చేరేనెందుకో మరి
తుళ్లుతున్న లాహిరి తలపుల్లో తీపి ఆశ రేపి నన్ను లాగుతుందే మరి

ఆమ్మో నా మనసే దారి మారి
నీతో వస్తుందే ఏదేదో కోరి

ఆమ్మో నా మనసే దారి మారి
నీతో వస్తుందే ఏదేదో కోరి

చిన్నగా చిన్నగా మొదలైంది అల్లరి
తిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి



ఏ పిల్లా పిల్లా పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: దడ (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి 
గానం: జాస్‌ప్రీత్ జాస్ట్ ,  సుచిత్ర 

ఏ పిల్లా పిల్లా పిల్లా పిల్లా పిల్లా పిల్లా పిల్లా
ఏ పిల్లా పిల్లా పిల్లా నా స్వీటు సిండరెల్లా
నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు బిళ్ల
ఈ పిల్లా పిల్లా పిల్లా నీదేరా గ్రీకు వీరా
నీ షర్టుకు ముడేస్తారా నా పట్టుచీర
తీనుమారే హోహో దిల్లు కోరే హోహో
నిన్ను డైమండ్ రింగై రమ్మంది నా టెండర్ ఫింగరే
హే రయ్యా రయ్యా రయ్యంటుంది గాడి
అయిపోదాం పదా నంబర్ వన్ జోడి
హే తయ్యారయ్యే ఉంది లక్కీ లేడి
ఇక మోగించెయ్ పీప్పీప్పీ మెలోడి

ఏ పిల్లా పిల్లా పిల్లా నా స్వీటు సిండరెల్లా
నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు బిళ్ల

ఐఫిల్ టవర్ అంచులోన లవ్ సింబల్ షేపులోన
రిచ్‌ గా పెళ్లికి వెన్యూ సెట్‌చేసెయ్‌నా కన్నె కూనా
ముద్దుగా మూడేముళ్లు నీ మెళ్లోన వేసుకోనా
ఎయిర్ బస్ పల్లకీలో పక్కనొచ్చి వాలిపోనా
బుద్ధిగా తలొంచేసి తలంబ్రాలు పోసుకోనా
హార్ట్‌ లో వేసిన టెంటు పర్మనెంట్ చేసుకోనా

హేయ్ సోనా సోనా పబ్బుల్లో గానాబజానా
వారెవ్వా వాట్ ఏ పెళ్లి అనాలెవరైనా

హే రయ్యా రయ్యా రయ్యంటుంది గాడి
అయిపోదాం పదా నంబర్ వన్ జోడి
హే తయ్యారయ్యే ఉంది లక్కీ లేడి
ఇక మోగించెయ్ పీప్పీప్పీ మెలోడి

చాక్‌లెట్ ర్యాపర్‌లా గిఫ్ట్‌ఫ్యాక్ పేపర్లా
లెఫ్టు రైటు అటు ఇటూ చుట్టేస్తానే ఐస్ పిల్లా
వెచ్చగా టాప్ టూ బోటమ్ అంటుకుపోతా స్టిక్కరులా
పంజరాన ప్యారెట్‌లా పెవికాల్ మ్యాగ్నెట్‌లా
ఆల్ ది టైమ్ నీతో ఉంటా మెళ్లో వేసిన లాకెట్టులా
నీకు నాకు సెంటీమీటర్ గ్యాపే ఉన్నా నచ్చదురా
ఏ పిల్లా పిల్లా ఇలా రావే రసగుల్లా
నా షాడో నీ షాడో మ్యాచ్ అయ్యేలా

హే రయ్యా రయ్యా రయ్యంటుంది గాడి
అయిపోదాం పదా నంబర్ వన్ జోడి
హే తయ్యారయ్యే ఉంది లక్కీ లేడి
ఇక మోగించెయ్ పీప్పీప్పీ మెలోడి

ఏ పిల్లా పిల్లా పిల్లా నా స్వీటు సిండరెల్లా
నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు బిళ్ల
ఈ పిల్లా పిల్లా పిల్లా నీదేరా గ్రీకు వీరా
నీ షర్టుకు ముడేస్తారా నా పట్టుచీర



Most Recent

Default