చిత్రం: ఢీ (2007)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి, సుధ
నటీనటులు: మంచు విష్ణు , జనీలియ
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాత: కుర్వ శంకర్ యాదవ్
విడుదల తేది: 13.04.2007
మది తెలుపుతున్నది మనమొక్కటేనని
ఈ దూరమన్నది అసలడ్డుకాదని
కనుపాపకు ఇది తెలుసా
నీ శ్వాసకు ఇది తెలుసా
కనుగొందా ఈ వరసా
గుర్తించిందా మనసా
నిను చూస్తున్నా ఏం చేస్తున్నా
నీడై గమనిస్తున్నా
నీ వెనకే వస్తున్నా
తనువులు విడిగా ఉన్నా
హృదయం ఒకటే కాదా
నిన్ను నన్ను ఏకం చేసే వంతెన వలపేగా
నిన్నా మొన్నా ఎపుడైనా ఈ అనందమే చూశానా
నిన్ను నన్ను కలిపింది ఆ దైవమే అనుకోనా
కనుపాపకి ఇది తెలుసా
కనుగొందా ఈ వరసా
పెదవిప్పలేని మాటైనా
కనురెప్పతోటె తెలిపైనా
ఎవరొప్పుకోను అంటున్నా
ఎద చప్పుడసలు ఆగేనా
ఎదుటే కదలాడుతున్నది ప్రాణం విడిగా
ఒకటై నడవాలి చివరికి నీడై ఓ జతగా
ఇంతమందిలో ఒకడై ఉన్నా
నిను వింతగా కనిపెడుతున్నా
ఎంతమందిలో నే కలిసున్నా
నీ చెంతకే చేరగ కలగన్నా
నిన్నా మొన్నా ఎపుడైనా ఈ ఆనందమే చూశానా
అంతా మాత్రం తెలిసున్నా మా ముందేమిటో ఇది తగునా
కనుపాపకి ఇది తెలుసా
నీ శ్వాసకి ఇది తెలుసా
చిరు పంజరాన నేనున్నా
చిరునవ్వుతోనే చూస్తున్నా
తొలిపొద్దు జాడ తెలిసున్నా
సరిహద్దు దాటలేకున్నా
కలలే మరి భారమైనవి నిజమై తెలుసా
భారం ఎన్నాళ్ళో ఉండదు నను నమ్మే మనసా
నమ్మి నిన్నే నీలొ సగమైన కద
గుండెలోన నిన్ను దాచుకున్న ఇలా
గుండె చాటు గుట్టు తెలిసున్నా
అది విప్పి చెప్పలేరుగా ఎవరైనా
నిన్నా మొన్నా ఎపుడైనా ఈ అనందమే చూశానా
ఎన్నో ఎన్నో కథలున్నా ఈ కథే వింత ఎపుడైనా
కనుపాపకి ఇది తెలుసా
నీ శ్వాసకి ఇది తెలుసా
నిను చూస్తున్నా ఏం చేస్తున్నా
నీడై గమనిస్తున్నా
నీ వెనకే వస్తున్నా