చిత్రం: దూసుకెళ్తా (2013)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: స్వీకర్
నటీనటులు: విష్ణు మంచు, లావణ్య త్రిపాఠి
దర్శకత్వం: వీరు పోట్ల
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 17.10.2013
2010 summerలో రేణిగుంట స్టేషన్
platform 2 లో మెరిసిందో అందాల సెన్సేషన్
ఒక లుక్ ఏసా తను చూసేలా టక్కున సరి చేసా
క్రాఫ్ సెట్ చేసే తొందరలో ఆ పాపను మిస్ చేసా
జుట్టంతా పెక్కుంటు తను ఎక్కడని యమాగ వెతికేసా
చలో టెన్షన్ లో పని జరగదని రిలాక్స్ అయి విజిల్ ఏసా
చరణం: 1
Hey చిక్కినట్టే చిక్కి పక్కకెళ్ళి పోయా పిల్ల పోతే పోనీ అని
నేను ఎక్కవలసిన వెంకటాద్రిని చేరుకున్నా చక చక మని
తాపిగా సెటిల్ అయ్యి చూస్టే ఎదురుగ కనులు చెదిరే సుందరి
మాటల్లో ఫ్రెండ్ ఐపోతూ మెల్లగా తెమ్నంది నన్ను బిస్లరి
కడప స్టేషన్ లో హీరోలా పట్టాన దూకేసా
షాపోడి చిల్లరను లెక్కేస్తూ ట్రయినే మిస్ చేసా
లగెత్తుకెళ్ళిందే నా లడ్కి అని వెక్కెకి ఏడ్చేసా
చలో టెన్షన్ లో పని జరగదని రిలాక్స్ అయి విజిలేసా
2010 సమ్మర్లో కడప రైల్వే స్టేషన్
ట్రైన్ మిస్ అయి ఒంటరి గానే మిగిలా
చరణం: 2
పక్కింటామె అనుకున్న టామీ లాగ చుట్టు తిరిగేసా
మందు మొత్తం లోపెట్టేసా తిరగలేక పిచ్చోడిని అయిపోయా
పక్కింటామె అనుకున్న టామీ లాగ చుట్టు తిరిగేసా
మందు మొత్తం లోపెట్టేసా తిరగలేక పిచ్చోడిని అయిపోయా
పిల్లది పోయే ట్రైన్ కూడ పోయే ఎర్ర బస్ ఇంక శరణు అని
ఫ్రెండ్ పెళ్ళి కదా చేరాం మరి జడ్చర్ల బస్ స్టాండ్ ని
ఎగ దమ్మేద్దాం అని చూడగ జేబుల్లో పర్స్ లేదు గా
ATM కర్డ్స్ చిల్లరతో సహా గోవిందా కొట్టేసారు గా
బేంక్ ఎక్సాం హాల్ టికెట్ దాన్లోనే ఉంది
ఆ మాట గుర్తొచ్చి మనసంతా కెవ్వు కెవ్వు అంది
ఎదుట ఉన్నో బస్సెక్కాడో అక్కడంతా అంతా వెతికేసాం
చలో టెన్షన్ లో పని జరగదని రిలాక్స్ అయి విజిలేసా
excuse me అది నీదేనా అని వినిపించిందో వాయిస్
ఎవరని చుస్తే ఎదురుగ్గా కత్తి లాంటి పోరి విత్ మై పర్స్
ఎగిరి గంతేసి smile ఇస్తూ thanks అని చెప్పేసా
ఓ గంట గడిపేస్తూ తనతోనే కాఫీ సెట్ చేసా
లక్ అంతా పోయిందే అనుకున్నా బోనస్ గెలిచేస
ఈ సారి మరి కొంచెం రిలాక్సై బిందాస్ గా విజిలేసా
******** ********* ********
చిత్రం: దూసుకెళ్తా (2013)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: దినకర్, నరేంద్ర
ఉగ్గు పాల రొజుల్లోనే సిగ్గు శరం వదిలేసాడే
నిక్కర్ల ఈడులోనే చొక్కాల గుండీలు వదిలేసాడే
చిన్నప్పుడే వీడు సిటపట చిచ్చు బుడ్డే
పడ్డైతే చాలిక ధమ ధమ ధమ డైనమైట్ పేలుడే
అప్పుడపుడు నేనేమో మంచిగానే ఉంటాను మంచి పనులే చేస్తాను conditions apply
అప్పుడపుడు ఓసారి తప్పదంటు అనిపిస్తే తప్పులైనా చేస్తాను conditions apply
నేను బ్రేక్స్ లేని గడి రూల్స్ లేని బాడి
దిమాగ్ సే ఆడిసత కబడ్డీ
say what నేను ఓ కిలాడి
say what నేను కారప్పొడి
do what చలో కల్నే వెంటాడి
దూసుకెళ్తుంటా దున్నుకెళ్తుంటా ఎయ్ conditions conditions apply
దూసుకెళ్తుంటా దుమ్మురేపేస్తుంటా ఎయ్ conditions condition apply
అప్పుడపుడు నేనేమో మంచిగానే ఉంటాను మంచి పనులే చేస్తాను conditions apply
అప్పుడపుడు ఓసారి తప్పదంటు అనిపిస్తే తప్పులైనా చేస్తాను conditions apply
చరణం: 1
అరెయ్ లోకమే ఏదోలా తేడా తేడాగా ఉందంటే
నేను ఒకడినే పద్ధతిగా ఉండాలా
నానమ్మలా సుద్దులు నాకేలా
స్వాతి ముత్యంలాగ మేం మెత్తం మెత్తంగా వుంటే
చిత్తై పోతాది ఒళ్ళంతా
తిప్పలు పడిపోమ లైఫ్ అంతా
ఏ ముక్కు సూటిగా ముందుకెళ్తేనే ముక్కు బోర్లా పడతా
ఏ చిక్కు లేని ఓ పక్క దారిలో చిక్కు బుక్కు మంత్రా
దూసుకెళ్తుంటా దున్నుకెళ్తుంటా ఎయ్ conditions conditions apply
దూసుకెళ్తుంటా దుమ్మురేపేస్తుంటా ఎయ్ conditions condition apply
చరణం: 2
నా లైఫ్ లో ప్రతి ఫ్రేం ఓ కొంచెం గేం కొంచెం స్కీం
అట్టానే గెట్ డవున్ అవుతుంటా ప్రతి గంటా ఓ రీచార్జ్ అవుతుంట
మంచి చేసే మనసు ముంచేసే calculations కలబోసే పుట్టా నేనెట్టా
నా IQ తో advance అవుతుంటా, అరెయ్ టైట్ రోప్ పై నడుచుకెళ్టం ఓ అందమైన ఆర్ట్
పడిపోనే పట్టుగా ప్రతి అడుగుతో స్పీడ్ పెంచుకుంటూ
దూసుకెళ్తుంటా దున్నుకెళ్తుంటా ఎయ్ conditions conditions apply
దూసుకెళ్తుంటా దుమ్మురేపేస్తుంటా ఎయ్ conditions condition apply
********* ********** *********
చిత్రం: దూసుకెళ్తా (2013)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రాహుల్ సిప్లిగంజ్, సుధామయి
మొదటి సారి నిన్ను చూస్తున్నా
ఎంతకాలం గానో నువ్వు తెలిసున్నా
పరవశములో మునిగిపోతున్నా
ఎంత ప్రేమే నాలో దాచలేకున్నా
ఓ అలేఖ్యా
ఓ అలేఖ్యా
ఇన్నాళ్ళు నాలో ఉన్నావో లేవో
ఈ క్షణం ఎద నిండి పోయావే
ఓ అలేఖ్యా
ఓ అలేఖ్యా
నా కళ్ళు నీవే నీ కళ్ళ నీళ్ళే
ఈ క్షణం నీ కంట పడనీనే
మొదటి సారి నిన్ను చూస్తున్నా
ఎంతకాలం గానో నువ్వు తెలిసున్నా
పరవశములో మునిగిపోతున్నా
ఎంత ప్రేమే నాలో దాచలేకున్నా
చరణం: 1
చిన్న సాయమే నేడిలా పెద్ద స్నేహమే
ఊపిరే పోసుకిందిగ ప్రేమ లాగా ఆ
చిన్న గొలుసుతో సంకెళ్ళ వేసినావుగ
వెదురునే చూసినావుగా మురళి లాగ ఆ...
ఓ అలేఖ్యా
ఓ అలేఖ్యా
నీ చిన్ననాటి చిన్నాని నేనే
నా ధనం నీ చిన్ని నవ్వేనే
ఓ అలేఖ్యా
ఓ అలేఖ్యా
ఆ చందమామ కధలోని జంటై
జంటగ చిరకాలం ఉందామే
మొదటి సారి నిన్ను చూస్తున్నా
ఎంతకాలం గానో నువ్వు తెలిసున్నా
పరవశములో మునిగిపోతున్నా
ఎంత ప్రేమే నాలో దాచలేకున్నా
చరణం: 2
నువ్వు ఉండగా ప్రతీ క్షణం నాకు అండగా
ప్రేమికుల రోజు పండగ సంబరాలే హెయ్ హెయ్
నువ్వు జంటగ సెకండ్ లో సగము చాలుగా
ఆ సుఖం దాటుతుంది అంబరాలే హెయ్ హెయ్
ఓ అలేఖ్యా
ఓ అలేఖ్యా
దూరాలు కరిగే తీరాలు మనకే
ప్రేమలో విరహాలు చెరిపెయ్యవే
ఓ అలేఖ్యా
ఓ అలేఖ్యా
ఈ జన్మ చాలె నీతోనే లానే
కాలమే కడతేరి పోనీవే
మొదటి సారి నిన్ను చూస్తున్నా
ఎంతకాలం గానో నువ్వు తెలిసున్నా
పరవశములో మునిగిపోతున్నా
ఎంత ప్రేమే నాలో దాచలేకున్నా
********* ********** *********
చిత్రం: దూసుకెళ్తా (2013)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాహితి, రాహుల్ సిప్లిగంజ్
సూదిమందే గుచ్చినావే గుండెల్లో సుందరాంగి
ప్రేమ మందే ఇచ్చినావే ఆ సంగతి చెప్పవేంది
ఇచ్చింది తక్కువే పిచ్చెక్కించేలాగ కిక్కేమో ఎక్కువే
చెప్పింది చాల్లే తిప్పలు ఎన్నో పడి ఒప్పించావ్ లే భలే
డండనక గంటకొక పండగలా ఉందే నీవల్లే
సూదిమందే గుచ్చినావే గుండెల్లో సుందరాంగి
ప్రేమ మందే ఇచ్చినావే ఆ సంగతి చెప్పవేంది
చరణం: 1
పిట్ట కథల్లే ఎన్నో చెప్పి వల వేసి పట్టావే ఈ పిట్టనే
గుండె కొట్టుకొనే వేగాన్నే పెంచేసి బాగా వేసావే ఎదలో పాగా
అట్టా కాదే బుట్టబొమ్మ నీ సొట్ట బుగ్గల్లో నను కట్టేసి
బాగ తెలుసుకొని నా పల్సే పట్టేసి నేరం నా పైకి నెట్టేసావే
నడుం చుట్టేస్తావో ఉడుం పట్టేస్తావో కొల్లగొట్టేసి పరువం పట్టేస్తావో
గుండె కుట్టేస్తావో పిండి కట్టేస్తావో నన్ను గట్టెక్కించేలా ఏం చేస్తావో
నా వెంటే వుంటూ అన్ని చేసేస్తూ నన్నంటవేంటో
ఒంటి పైన పంటితోటి కొంటె గాటు పెట్టేస్కుంటాలే
చరణం: 2
ఇచ్చుకుందాం పుచ్చుకుందాం మన ఇచ్చే తీరేల రెచిపోయి
ఆడెయి అచ్చట్లు తీరేలా ముచ్చట్లు ముత్యాలై రాలు ముత్య మాటలు
చాలు చాలు ఇచ్చుకాలు ఆ పైన ఇస్తాగా నీకా ఛాన్స్
అచ్చె అవ్వాలి మన పెల్లి కార్డ్లు ఇచ్చేసెయ్యాలి తాంబూలాలు
చిచ్చు పెట్టేయ్మాకే అచ్చి బుచ్చమ్మాయి స్కెచ్చులెయ్ మాకే వచ్చి ముద్దిచ్చెయి
నేను ముద్దిచేస్తే నీకు మూదొచ్చేస్తే నైట్ కొచ్చెస్తే రచ్చ రచ్చై పొద్ది
స్విచ్ ఆన్ చేసేయ్ సొగసుల లైటింగే అచ్చా నువ్వు వేసేయ్
జజ్జనక చెక్కిలిపై చుక్క పెట్టి తాళే కట్టేసేయ్
సూదిమందే గుచ్చినావే గుండెల్లో సుందరాంగి
ప్రేమ మందే ఇచ్చినావే ఆ సంగతి చెప్పవేంది
ఇచ్చింది తక్కువే పిచ్చెక్కించేలాగ కిక్కేమో ఎక్కువే
చెప్పింది చాల్లే తిప్పలు ఎన్నో పడి ఒప్పించావ్ లే భలే