చిత్రం: జెమిని (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ నటీనటులు: వెంకటేష్ , నమిత , ముంతాజ్ దర్శకత్వం: శరన్ నిర్మాతలు: యమ్.శరవణన్ , యమ్.బాలసుబ్రహ్మణియన్, యమ్.ఎస్. గుహన్, బి.గురునాథ్ విడుదల తేది: 11.10.2002
Songs List:
చెలి చెడుగుడు జెమిని జెమిని పాట సాహిత్యం
చిత్రం: జెమిని (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: వేటూరి గానం: అనురాధా శ్రీరామ్, యస్ పి బాలు చెలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని జెమిని చలి విరుగుడు జెమిని జెమిని పిలుపెరగడు జెమిని జెమిని కలబడుమరి జెమిని జెమిని కధ ముదిరిన జెమిని జెమిని నిలబడు మరి జెమిని జెమిని చెలి వలచిన జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని కామిని కామిని కామిని కామిని జెమిని జెమిని జెమిని జెమిని కామిని కామిని కామిని కామిని నీ క్రేజీ సొగసులతో టీనేజీ వయసులతో వీలైతే పురుషుడికి ఈలేసే తికమకలు వెయ్ పోటు...వెయ్ పోటు(4) చెలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని జెమిని చలి విరుగుడు జెమిని జెమిని పిలుపెరగడు జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని... సిగ్గిడిచిన పిల్లరో మొగ్గ చెడిన మల్లెరో బుగ్గపండు గిల్లరో తిక్క దించరో ఓ బజారు కోకిల కాలు జారు షోకిలా మారుతావు కాకిలా రెచ్చి పోకిలా ఏలూరుల ఎక్కినా ఉయ్యురుల ఊగినా బెజవాడల బెంగ పడి మంగళగిరి చేరినా వచ్చేస్తా టచ్చేస్తా నచ్చింది ఇచ్చేస్తా దాచింది దోచేస్తా దమ్మెంతో చూపిస్తా కొట్టు కొట్టు కోక నట్టు కట్టు కట్టు చీర కట్టు ముద్దులన్ని మూట కట్టు మూత పెట్టి ముద్దు పెట్టు వెయ్ పోటు...వెయ్ పోటు వెయ్ పోటు...వెసేయ్ పోటు చెలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని జెమిని చలి విరుగుడు జెమిని జెమిని పిలుపెరగడు జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని... కంటపడిన చిన్నది కంటగించు కున్నది కనికరించ కున్నది కన్ను గీటినా లవ్వు మత్తులో పడి లైఫ్ బొత్తిగా చెడి అడ్డరోడ్డునే పడి అలమటించినా కృష్ణలో మునిగినా కృష్ణుడల్లే తేలినా భంగు ఎంత కొట్టినా బ్యారేజి ఎక్కినా నీ రూపే గుండెల్లో దాచనే ఇన్నాళ్లు నీకోసం ఉంచానే కవ్వించే కౌగిల్లు పావడాల పానిపట్టు ప్రాయసాల తేనే పట్టు ఎక్కమాకు చింత చెట్టు చిట్టి చీమ నిన్ను కుట్టు వెయ్ పోటు...వెయ్ పోటు (2) చెలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని జెమిని చలి విరుగుడు జెమిని జెమిని పిలుపెరగడు జెమిని జెమిని కలబడుమరి జెమిని జెమిని కధ ముదిరిన జెమిని జెమిని నిలవడు మరి జెమిని జెమిని చెలి వలచిన జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని కామిని కామిని కామిని కామిని జెమిని జెమిని జెమిని జెమిని కామిని కామిని కామిని కామిని నీ క్రేజీ సొగసులతో టీనేజీ వయసులతో వీలైతే పురుషుడికి ఈలేసే తికమకలు వెయ్ పోటు...వెయ్ పోటు(3)
పూలలో తేనే ప్రేమ పాట సాహిత్యం
చిత్రం: జెమిని (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: వేటూరి గానం: రాజేశ్ పూలలో తేనే ప్రేమ... ప్రేమ తేనెలో తీపి ప్రేమ... ప్రేమ తీపిలో హాయి ప్రేమ... ప్రేమ హాయి నీవంది ప్రేమ... ప్రేమ భహుశా నా ప్రాణమై నిలిచే నీ ప్రేమా మనసో అది ఏమిటో తెలియనిది ప్రేమా పూలలో తేనే ప్రేమ... ప్రేమ తేనెలో తీపి ప్రేమ... ప్రేమ తీపిలో హాయి ప్రేమ... ప్రేమ హాయి నీవంది ప్రేమ... ప్రేమ చరణం: 1 కమ్మని కల కౌగిలి కధ ఎర్రని పెదాలలో ప్రేమ వెన్నెల కల వెచ్చని వల నీవు నేనైన ప్రేమ కమ్మని కల కౌగిలి కధ ఎర్రని పెదాలలో ప్రేమ వెన్నెల కల వెచ్చని వల నీవు నేనైన ప్రేమ కాలం చెల్లని ప్రేమ నీ దూరపు చేరువ ప్రేమ సింధూరపు తూరుపు ప్రేమ నీవు సుమా... పూలలో తేనే ప్రేమ... ప్రేమ తేనెలో తీపి ప్రేమ... ప్రేమ తీపిలో హాయి ప్రేమ... ప్రేమ హాయి నీవంది ప్రేమ... ప్రేమ చరణం: 2 ఆ పరిచయం ఈ పరిమళం పూసిన ఎడారి నా ప్రేమ కోరిన సుఖం చేరిన సగం నాకు నీవైన ప్రేమ ఆ పరిచయం ఈ పరిమళం పూసిన ఎడారి నా ప్రేమ కోరిన సుఖం చేరిన సగం నాకు నీవైన ప్రేమ చూపుగ నాటిన ప్రేమ కను చూపుకు అందని ప్రేమ అందానికి అందం తెచ్చే ప్రేమ సుమా... పూలలో తేనే ప్రేమ... ప్రేమ తేనెలో తీపి ప్రేమ... ప్రేమ తీపిలో హాయి ప్రేమ... ప్రేమ హాయి నీవంది ప్రేమ... ప్రేమ భహుశా నా ప్రాణమై నిలిచే నీ ప్రేమా మనసో అది ఏమిటో తెలియనిది ప్రేమా పూలలో తేనే ప్రేమ... ప్రేమ తేనెలో తీపి ప్రేమ... ప్రేమ తీపిలో హాయి ప్రేమ... ప్రేమ హాయి నీవంది ప్రేమ... ప్రేమ
దిల్ దివాన పాట సాహిత్యం
చిత్రం: జెమిని (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: వేటూరి గానం: ఉష దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీందుడాయే కాన్ ఏ హర్ పల్ వేణువూది చంపుతావు వేళగాని వేళలో ఉట్టిగొట్టి పుట్టికాస్త ముంచుతావు వాడలో కన్నెముద్ద వెన్నముద్ద దోచుకున్న హాయిలో చీరనైన వదలవాయే సిగ్గుపడ్డ ఈడులో దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీందుడాయే కాన్ ఏ హర్ పల్ చరణం: 1 కోయిలమ్మ కొమ్మకొచ్చి కొత్తపాట పాడుతుంటే తుమ్మెదొచ్చి రెమ్మపూల గుమ్మెతేనె కోరుకుంటే అందమైన ఇంట్లో నందనాలు పూసే చిలకముక్కుపచ్చ తోరణాలుకట్టే నోరుపండనివ్వు ముద్దుతో... మిలి ఏక్ ఆజ్ నబీ సే కోయీ ఆగేనా పీచే తుమ్ హి కహొయే కోయీ బాత్ హై దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీందుడాయే కాన్ ఏ హర్ పల్ చరణం: 2 అందమంతా లాలపోసి ముద్దచేసే జంటలోన నీటిపైట మీటి పోయే వీణలాంటి ఒంటి మీన మరుగుతున్న ఎండె కరిగి వెన్నెలాయే పాలవెల్లువల్లె ఈడు తుళ్లిపోయే గోరువెచ్చ వాలు పొద్దులో... మిలి ఏక్ ఆజ్ నబీసే కోయీ ఆగేనా పీచే తుమ్ హి కహొయే కోయీ బాత్ హై దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీందుడాయే కాన్ ఏ హర్ పల్ వేణువూది చంపుతావు వేళగాని వేళలో ఉట్టిగొట్టి పుట్టికాస్త ముంచుతావు వాడలో కన్నెముద్ద వెన్నముద్ద దోచుకున్న హాయిలో చీరనైన వదలవాయే సిగ్గుపడ్డ ఈడులో దిల్ దివాన మై హసీన ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీందుడాయే కాన్ ఏ హర్ పల్
బ్రహ్మ ఓ బ్రహ్మ పాట సాహిత్యం
చిత్రం: జెమిని (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: యస్ పి బాలు బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా జాబిల్లిలా వుంది జాణా ఆ నవ్వు మీటింది వీణ ఏడేడు లోకాలలో యింత అందాన్ని ఈ రోజే చూశానుగా బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా చరణం: 1 నీలాల ఆ కళ్లలో నీరెండ దాగున్నదో ఆ లేడి కూనమ్మ ఈ వింత చూసింద ఏమంటదో ఆ పాల చెక్కిళ్లలో మందారమే పూచేనో ఈ చోద్యమే చూసి అందాల గోరింట ఏమంటదో నా గుండె దోసిళ్లు నిండాలిలేనాడు ఆ నవ్వు మత్యాలతో ఈ జ్ణాపకాలన్ని నే దాచుకుంటాను ప్రేమతో బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా చరణం: 2 నూరేళ్ల ఈ జన్మనీ ఇచ్చింది నువ్వేననీ ఏ పూజలూ రాని నేనంటే నీ కెంత ప్రేముందనీ ఈ వేళ ఈ హాయినీ నా గుండెనే తాకనీ అందాల ఆ రాణి కౌగిళ్లలో వాలి జీవించనీ ఆ పంచభూతాలు ఒక్కొక్కటై వచ్చి చల్లంగ దీవించనీ తన చెంతకే చేరి ఏ రోజు చెప్పాలి ప్రేమనీ బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా జాబిల్లిలా వుంది జాణా ఆ నవ్వు మీటింది వీణ ఏడేడు లోకాలలో యింత అందాన్ని ఈ రోజే చూశానుగా బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా
చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు పాట సాహిత్యం
చిత్రం: జెమిని (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: వందేమాతరం శ్రీనివాస్ చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నదీ బొట్టురాల్చుకుంటుందీ కట్టుకున్నదీ పాడె ఎత్తటానికే స్నేహమన్నదీ కొరివి పెట్టడానికే కొడుకు వున్నదీ చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు చరణం: 1 పోయినోడు యిక రాడు ఎవడికెవడు తోడు ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నదీ కన్నీళ్లకు కట్టేకూడా ఆరనన్నదీ చావు బ్రతుకులన్నవి ఆడుకుంటవీ చావులేని స్నేహమే తోడువుంటదీ... చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు
బంధమే ముల్లు అయినా పాట సాహిత్యం
చిత్రం: జెమిని (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: వేటూరి గానం: ఆర్.పి.పట్నాయక్ బంధమే ముల్లు అయినా బాధలో నవ్వు ప్రేమ ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమ లైలా మజ్నూలుగా రాలిన ఆ ప్రేమ బ్రతుకే ఓ మాయని చాటిన ఈ ప్రేమ బంధమే ముల్లు అయినా బాధలో నవ్వు ప్రేమ ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమ చరణం: 1 కమ్మని కల కంటికి అల వెచ్చని నిషాలదీ ప్రేమ ప్రేయసి శిల వలపొక వల నన్ను కాదన్న ప్రేమ కమ్మని కల కంటికి అల వెచ్చని నిషాలదీ ప్రేమ ప్రేయసి శిల వలపొక వల నన్ను కాదన్న ప్రేమ కాలం చల్లని ప్రేమ మన దూరం చెరపని ప్రేమ ప్రాణానికి ప్రాణం ప్రేమ నీవు సుమా... బంధమే ముల్లు అయినా బాధలో నవ్వు ప్రేమ ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమ
నడక చూస్తే వయారం పాట సాహిత్యం
చిత్రం: జెమిని (2003) సంగీతం: ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం: వేటూరి గానం: శంకర్ మహాదేవన్ , ఉష సాకి: ఓ సిన్నదానా సందె వేళ సందు చూసి వచ్చేయనా నీ గుండెలోన నిద్రపోనా... పల్లవి: నడక చూస్తే వయారం కులుకు చూస్తే సింగారం పడుచు సోకు పలారం దుమ్ము దుమారం పిడత ముద్ద పింగాణం ఉడత నడుము వడ్డాణం మనసుపడ్డ మాగాణం గుట్టు గుడారం వియ్యల వారి ఉయ్యాల కట్నం వయ్యారిభామా ఓహో అల్లారు ముద్దు చల్లారనీదు పిల్లాడి ప్రేమా హే హే ధిల్లా లంగడియో హే ధిల్లా లంగడియో ధిల్లా లంగడియో హే ధిల్లా లంగడియో నడక చూస్తే వయారం కులుకు చూస్తే సింగారం పడుచు సోకు పలారం దుమ్ము దుమారం మనసు నిలవదంట మడి కట్టుకుంటే ఎట్టా మల్లెమొగ్గలన్నీ నన్ను గిల్లేసే ఈ పూట వయసు పిలిచెనంట ఇక వాయిదాకి టాటా ముద్దులెన్నో వచ్చి నన్ను ముంచేసే ఈ పూట మాట ఇచ్చినాక మొహమాటమేలనంట చాటు చూసుకుంటా తొలికాటు వేసుకుంటా ఆటు పోటులన్నీ నీతోటి పంచుకుంటా ఆటవిడుపు కోసం నా రూటు మార్చుకుంటా ధిల్లా లంగడియో... హే ధిల్లా లంగడియో...(4) నడక చూస్తే వయారం కులుకు చూస్తే సింగారం పడుచు సోకు పలారం దుమ్ము దుమారం మంచు పల్లకీలో మరుమల్లె ఒత్తిడంట ఒత్తిడెంత ఉన్నా నీ ఒళ్లంతా పువ్వంట పంచదార ఇసకే ఈ మంచు వెన్నెలంట నంచుకుంటే రుచిలే నీ ముద్దంతా యిమ్మంట పడుచు ఎండకెన్నో మురిపాలు పొంగెనంట ఒడిసి పట్టగానే ఒళ్లంత మీగడంట అహ ఓపలేను నాలో వయసమ్మ గుండెకోతా చెరగనీకు పాప చెలిమైన బ్రహ్మరాత ధిల్లా లంగడియో... హే ధిల్లా లంగడియో...(2) నడక చూస్తే వయారం కులుకు చూస్తే సింగారం పడుచు సోకు పలారం దుమ్ము దుమారం పిడత ముద్ద పింగాణం ఉడత నడుము వడ్డాణం మనసుపడ్డ మాగాణం గుట్టు గుడారం వియ్యల వారి ఉయ్యాల కట్నం వయ్యారిభామా ఓహో అల్లారు ముద్దు చల్లారనీదు పిల్లాడి ప్రేమా హే హే ధిల్లా లంగడియో హే ధిల్లా లంగడియో ధిల్లా లంగడియో హే ధిల్లా లంగడియో ధిల్లా లంగడియో హే హే ధిల్లా లంగడియో