చిత్రం: హృదయం (1991) సంగీతం: ఇళయరాజా నటీనటులు: మురళి, హీరా రాజగోపాల్ దర్శకత్వం: కథిర్ నిర్మాత: ఆర్.బాలకృష్ణన్ విడుదల తేది: 06.09.1991
Songs List:
ఏప్రిల్ మేలలో పాట సాహిత్యం
చిత్రం: హృదయం (1991) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి. బాలు ఏప్రిల్ మేలలో పాపల్లేరురా కాంతి లేదురా ఈ ఉరు మోడురా వట్టి బీడురా బోరు బోరు రా ఇక చాలయా అరె పోవయా జూన్ జూలైలో ముద్దబంతులే విరిసెను విరిసెను తేనె జల్లులే కురిసెను కురిసెను పాలపొంగులే తెలిసెను తెలిసెను కన్నె చిలకలన్ని మనకు విందులు రా.. చరణం: 1 కుర్తా మాక్సీల సల్వార్ కమీజుల ఆడపిల్లలే ఎక్కడ ఎక్కడని ఎదురు చూసెనే లేత కన్నులే పోలిస్ కాన్స్టెబుల్ కన్నె వగలకే గుటకలేసెనే పొలం గట్టున దిష్టిబొమ్మలా బిగిసిపోయెనే డ్రైవింగ్ హోటల్స్ ఈ ఊరి బీచ్ డల్ అయిపోయే చూడండి మల్లెపూవులే మాకే లేవని కలత పడితిమి మేమే ఇది న్యాయమా ఇంత ఘోరమా వెత తీరునా చరణం: 2 కాలేజ్ చిలకలు కాన్వెంట్ కులుకులు సినిమాకెళ్ళితే టాక్సీ డ్రైవరు చొంగ కార్చుతూ మీటరేసెనే చిలిపి వేడుక చూచు వారిలో బులుపు రేపెనే కన్నె పిల్లలే రోడ్డు దాటుతూ వెక్కిరించిరే స్టెల్లా మేరీస్ క్వీన్ మేరీస్ రంగు రంగుల పూలవనం వొంపు సొంపులు కులికే వేళ ఎదను పొంగె ఆనందం ఇక పాటలే ఈ పూటలే భలే జోరులే...
ఊసులాడే ఒక జాబిలట పాట సాహిత్యం
చిత్రం: హృదయం (1991) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట అందాలే చిందే చెలి రూపం నా కోసం ఆనందం నిలిపేటి ధ్యానం చెలి ధ్యానం అదే పేరు నేను జపించేను రోజు ననే చూసే వేళ అలై పొంగుతాను మౌనం సగమై మోహం సగమై నేనే నాలో రగిలేను ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట చరణం: 2 నాలో నువ్వు రేగే నీ పాట చెలి పాట నీడల్లె సాగే నీ వెంట తన వెంట స్వరాలై పొంగేనా వరాలే కోరేనా ఇలా ఊహల్లోన సదా ఉండిపోనా ఒకటై ఆడు ఒకటై పాడు పండగ నాకు ఏనాడో ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట
హృదయమా హృదయమా పాట సాహిత్యం
చిత్రం: హృదయం (1991) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు, చిత్ర హృదయమా హృదయమా నీ మౌనమెంత వేదన హృదయమా హృదయమా నీ విరహమెంత యాతన చందమామ లేని నింగి నేనులే తోడు లేని మోడునైతి నేడులే చరణం: 1 మంచల్లె కరిగి నదిలాగ మారి నీ నీడగా సాగినానే నీ ధ్యాస నేనై ఈ లోకాన్ని మరిచి ఊహల్లో ఊరేగి విహరించానే నీ కంటి పిలుపే నా ప్రేమ లోకం(2) పుండు పగిలెనే ఎద శోకమాయెనే నీవు లేని బ్రతుకు నాకు ఏలనే... చరణం: 2 నా జీవ రాగం చిరుగాలి నీకు ఈ వేళ వినిపించలేదా చెలి లేని బ్రతుకే శృతి లేని గీతం ఇక ఎందుకో నాకు ఈ నా జన్మ రగిలేటి సెగలే ఎదలోన మోసా(2) చెలిమి నేరమా నా ప్రేమ నేరమా నీవు లేని బ్రతుకు నాకు ఏలనే..
ఓ పిల్ల జాజి మల్లి రా పాట సాహిత్యం
చిత్రం: హృదయం (1991) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు ఓ పిల్ల జాజి మల్లి రా ఓ బ్యూటీ అంటే బ్యూటీ రా వన్నెలు చిలికించి మగవాళ్ళను కవ్వించి మనసులు తేలించి మురిపించావులే నీకే జోహారే చరణం: 1 లేటైనా వేచుంటే బస్సు దొరుకు ఒక కేడీ ప్రేమిస్తే కిస్ దొరకు ఆడవాళ్లే చిన్న చూపు బుస్సులకే చేదోడు మేముంటాం మిస్సులకే వెంటపడి మేమొస్తేనే మీకు రక్షణే చల్లని చూపు పడిందా మాకు మోక్షమే కలిసొస్తే అనురాగం కాదంటే అది శోకం నిన్ను యవ్వనమే పిలిచేనే వెన్నెలమ్మా రావే చరణం: 2 పిల్లలనే నువ్వు కంటే పండుగలే పుస్తకాలు నువ్వు మోస్తే పాపములే పడక గది పాఠాలకు మేము రెడీ ఓ చిలకా నా మనసే నీకు బడి చెలిమి అందచందాలే దాచిపెట్టొద్దే నాలో ఆశ రేగించి రెచ్చగొట్టొద్దే మందారం మీ సొగసే పాశాణం మీ మనసే నును మీసమున్న మగవాళ్ళం నిను కొలిచాం రావే
పూలతలే పూచెనమ్మా పాట సాహిత్యం
చిత్రం: హృదయం (1991) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు పూలతలే పూచెనమ్మా..తుమ్మెదలే పాడెనమ్మా చెలరేగే గాలులకే..చిన్నారీ ఆ పూవులివే..రాలినవే నిను కన్నతల్లైన నువు కోరకుండా.. పీఠేసి బ్రతిమాలి వడ్డించదంట నీ ఇంటిలో ఉన్న నీ అద్దమైనా నీవెదుట నిలవందె నిను చూపదంటా మనసున భావాలు ఎన్నెన్ని ఉన్నా పెదవులు తెరవందే చేరవు బంధాలు పిరికోళ్ళ ప్రేమలన్నీ మూగోళ్ళ పాటలులే ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ పూలతలే పూచెనమ్మా..తుమ్మెదలే పాడెనమ్మా చెలరేగే గాలులకే..చిన్నారీ ఆ పూవులివే..రాలినవే పూలతలే పూచెనమ్మా..తుమ్మెదలే పాడెనమ్మా ఎదలోన ఆశున్న నీకేది లాభం అది నీటిపై రాత నీ బ్రతుకు శాపం మది దాటిరాలేని నీలోని భావం వర్షాలు ఈలేని ఆకాశ మేఘం తెలిపేటి ధైర్యం కొందరికి రాదూ ధైర్యం లేదంటె అనుకున్నది కాదూ వెలిరాని ఆశలన్నీ మీటని వీణియలే ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ పూలతలే పూచెనమ్మా..తుమ్మెదలే పాడెనమ్మా చెలరేగే గాలులకే..చిన్నారీ ఆ పూవులివే..రాలినవే పూలతలే పూచెనమ్మా..తుమ్మెదలే పాడెనమ్మా