చిత్రం: జయసింహా (1955)
సంగీతం: టి.వి. రాజు (తోటకూర వెంకట రాజు)
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: ఘంటసాల, పి.లీల
నటీనటులు: యన్.టి.ఆర్, అంజలీదేవి, కాంతారావు
దర్శకత్వం: దాసరి యోగానంద్
నిర్మాత: యన్.త్రివిక్రమ రావు
విడుదల తేది: 21.10.1955
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ..
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ..
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి..
నీ ఊహతోనే పులకించి పోయే
ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ..
నీ ఊహతోనే పులకించి పోయే
ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ..
నీ కోసమే ఈ అడియాశలన్ని
నా ధ్యాస నా ఆశ నీవే సఖా
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి..
ఏ నోము ఫలమో ఏ నోటి వరమో
ఈ ప్రేమ జవరాలా..ఆ..ఆ..ఆ..
ఏ నోము ఫలమో ఏ నోటి వరమో
ఈ ప్రేమ జవరాలా..ఆ..ఆ..ఆ..
మనియేములే ఇక విరితావిలీల
మన ప్రేమ కెదురేది లేదే సఖి..
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి..
ఊగేములే తుల తూగేములే
ఇక తొలి ప్రేమ భోగాలా..
ఆ..ఆ..ఆ.. ఊగేములే తులతూగేములే
ఇక తొలి ప్రేమ భోగాలా..
మురిపాలతేలే మన జీవితాలు
మురిపాలతేలే మన జీవితాలు
దరహాస లీలావిలాసాలులే..
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
కల కాదోయి నిజమోయి..ఈ..ఈ..ఈ..
ఈనాటి ఈ హాయి..
********** ******** *********
చిత్రం: జయసింహా (1955)
సంగీతం: టి.వి. రాజు (తోటకూర వెంకట రాజు)
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: జిక్కీ
నెలనడిమి వెన్నెలహాయి కనపడదు అమాసరేయి
నెలనడిమి వెన్నెలహాయి కనపడదు అమాసరేయి
చరణం: 1
విరిసే పువ్వులందు,మురిసే తేనెచిందు
విరిసే పువ్వులందు,మురిసే తేనెచిందు
మెరిసే మెరపోపసందు,బ్రతుకే ఓనాటి విందు
మెరిసే మెరపోపసందు,బ్రతుకే ఓనాటి విందు
నెలనడిమి వెన్నెలహాయి కనపడదు అమాసరేయి
నెలనడిమి వెన్నెలహాయి కనపడదు అమాసరేయి
చరణం: 2
మరిరాదే మధురవేళ మరిగిపోయెనేమి నను మరిగిపోయెనేమి
మరిరాదే మధురవేళ మరిగిపోయెనేమి నను మరిగిపోయెనేమి
మనసైన అనుభవాలే మిగిలేను ఆనవాలై,మిగిలేను ఆనవాలై
నెలనడిమి వెన్నెలహాయి కనపడదు అమాసరేయి
నెలనడిమి వెన్నెలహాయి కనపడదు అమాసరేయి