చిత్రం: జీవనతరంగలు (1973) సంగీతం: జె.వి.రాఘవులు నటీనటులు: శోభన్ బాబు, కృష్ణంరాజు, వాణిశ్రీ, లక్ష్మి, చంద్రమోహన్, శ్రీరంజని Jr. దర్శకత్వం: తాతినేని రామారావు నిర్మాత: డి. రామానాయుడు విడుదల తేది: 1973
Songs List:
ఈ అందానికి బంధం పాట సాహిత్యం
చిత్రం: జీవనతరంగలు (1973) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, సుశీల పల్లవి: ఈ అందానికి బంధం వేశానొకనాడు ఆ బంధమే నాకందమైనది ఈనాడు చరణం: 1 నీ కళ్లు ఆనాడు ఎరుపెక్కెను నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను నీ చేతులానాడు తెరలాయెను నేడు ఆ తెరలె కౌగిలై పెనవేసెను చరణం: 2 నీ వేడిలోనే నా చలువ ఉందని వాన ఎండను చేరింది నీ చలువే నా వేడికి విలువని ఎండే వానను మెచ్చింది ఇద్దరు కలిసిన ఆ ఒద్దికలో ఇంద్రధనస్సే విరిసింది ఏడురంగుల ముగ్గులు వేసి నింగీనేలను కలిపింది ప్రేమకు పెళ్లే చేసింది
ఈ జీవనతరంగాలలో... పాట సాహిత్యం
చిత్రం: జీవనతరంగలు (1973) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల పదిమాసాలు మోశావు పిల్లలను బ్రతుకంతా మోశావు బాధలను ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు పల్లవి : ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము... ఎంతవరకీ బంధము చరణం: 1 కడుపు చించుకు పుట్టిందొకరు కాటికి నిన్ను మోసేదొకరు తలకు కొరివి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు... ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము... ఎంతవరకీ బంధము చరణం: 2 మమతే మనిషికి బందిఖానా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాశం వెంటబడి ఋణం తీర్చుకోమంటుంది తెలియని పాశం వెంటబడి ఋణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము... ఎంతవరకీ బంధము చరణం: 3 తాళి కట్టిన మగడు లేడని తరలించుకు పోయే మృత్యువాగదు ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు ఆ కన్నీళ్ళకు చితిమంటలారవు ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము... ఎంతవరకీ బంధము ఈ జీవనతరంగాలలో...
నందామయా గురుడ పాట సాహిత్యం
చిత్రం: జీవనతరంగలు (1973) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి. సుశీల పల్లవి: నందామయా - గురుడ నందామయా ఉందామయా....తెలుసుకుందామయా చరణం: 1 మెరిసే సంఘం మేడిపండు - దాని పొట్ట విప్పిచూస్తే పురుగులుండు (2) ఆ కుళ్లులేని చోటూ - యిక్కడే ఆ కుళ్లులేని చోటూ - యిక్కడే అనుభవించు రాజా - యిప్పుడే ఆనందసారం యింతేనయా! ఆనందసారం యింతేనయా! చరణం: 2 పుట్టినప్పుడు బట్టకట్టలేదు పోయేటప్పుడు అది వెంటరాదు (2) నడుమ బట్టకడితే నగుబాటు నడుమ బట్టకడితే నగుబాటు నాగరీకం ముదిరితే పొరపాటు వేదాంతసారం యింతేనయా! వేదాంతసారం యింతేనయా! వేదాంతసారం యింతేనయా!
పుట్టినరోజు పండగే అందరికి పాట సాహిత్యం
చిత్రం: జీవనతరంగలు (1973) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: పి. సుశీల పల్లవి : పుట్టినరోజు పండగే అందరికి మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి పుట్టినరోజు పండగే అందరికి మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి ఎందరికి ఎందరికి... చరణం: 1 కలిమికేమి వలసినంత ఉన్నా మనసు చెలిమి కొరకు చేయి చాచుతుంది ఆ మనసే ఎంత పేదైదైనా అనురాగపు సిరులు పంచుతుంది మమత కొరకు తపియించే జీవనం మమత కొరకు తపియించే జీవనం దైవమందిరంలా పరమపావ నం పుట్టినరోజు పండగే అందరికి మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి ఎందరికి... ఎందరికి... చరణం: 2 పువ్వెందుకు తీగపై పుడుతుంది జడలోనో గుడిలోనో నిలవాలని ముత్యమేల కడలిలో పుడుతుంది ముచ్చటైన హారంలో మెరవాలని ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలని తానున్నా... లేకున్నా... తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి పుట్టినరోజు పండగే అందరికి మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి ఎందరికి... ఎందరికి...
తెంచుకుంటావా పాట సాహిత్యం
చిత్రం: జీవనతరంగలు (1973) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల, L.R. ఈశ్వరి తెంచెయ్... ఆగు...అది సవిత్రమైన మంగళ సూత్రం కాదు కాదు... అది బలవంతాన వేసిన వురితాడు.. తెంచుకుంటావా ? ఉంచుకుంటావా ? అది పవిత్రమైన మంగళ సూత్రం... మంగళ సూత్రం ఇది బలవంతాన వేసిన వురితాడు... పురితాడు... వురితాడు... ఎవరు వేశారు ? ఏనాడో విధి నీ నొసటను రాశాడు. ఆది అతడు చేశాడు... నీ భర్తెనాడు ఎవరు భర్త... ? ఆ మనసులేని పశువా ? పశువు కట్టినదా మాంగల్యం ? కసాయితోనా దాంపత్యం... ? మనసు చచ్చీ బ్రతికితే నువు మనిషివి కావు ఉరితాటి కింత పసుపు రాస్తే తాళి కాదు... తెంచెయ్... తెంచుకుంటావా...? ఉంచుకుంటావా... ? భగవాన్... నాకెందుకీ శిక్ష... ? ఏమిటీ పరీక్ష... ? నేను కోరుకోలేదే ? నాకు తెలిసి జరగలేదే ? పిచ్చిదానా..... ఎలా జరిగినా పెళ్లి పెళ్లే నువ్వేనాటికైనా అతని సతివే ఒక్కసారే ఆడదానికి పెళ్లి జరిగేది తెంచుకున్నా తీరిపోని బంధమే యిది తాళి తెంచే దెవరికమ్మా ఆ పై ... ఆడబ్రతుకు దేనికమ్మా- ఆడబ్రతుకు దేవికమ్మా....
ఉడతా ఉడుతా ఊచ్ పాట సాహిత్యం
చిత్రం: జీవనతరంగలు (1973) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, రమోల పల్లవి : ఉడతా ఉడతా హూత్... ఎక్కడి కెళతావ్ హూత్ ... కొమ్మమీది...జాంపండు కోసుకొస్తావా... మా బేబీకిస్తావా ?...... చరణం : చిలకమ్మా! ఓ చిలకమ్మా చెప్పేది కాస్తా వినవమ్మా !! నీ పంచదార పలుకులన్నీ బేబీకిస్తావా... నూ బేబీకిస్తావా...? చరణం : ఉరకలేసే ఓ జింకా పరుగులాపవె నీవింకా నువు నేర్చుకున్న పరుగులన్నీ బేబీకిస్తావా... మా బేబీకిస్తావా ? చరణం : చిలకల్లారా, కోకిలలారా ! చెంగున దూకే జింకల్లారా! చిన్నారి పాపలముందు మా చిన్నారి పాపలముందు-మీ రెంత... ?