Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Jyo Achyutananda (2016)

చిత్రం: జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం: కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి )
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: సింహా
నటీనటులు: నారారోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్రా
డైరెక్టర్: అవసరాల శ్రీనివాస్
నిర్మాత: సాయి కొర్రపాటి
విడుదల తేది: 09.09.2016

ఆల్చిప్ప లాంటి నీ కళ్ళు రెండు తిప్పుతూ హైరానా పెట్టకే పిల్లా పిల్లా
జాంకాయ లాగ మాంచి దోరగున్న ఈడుతో ఊరించి చంపకే పిల్లా పిల్లా
చక్కెర కలిపిన పటాసులా  ఆ చిటపట లేంటే బాలా ?
విప్పొదిలేసిన కుళాయిలా  చిరునవ్వులు రువ్వే గలా గలా
తొలిసారి ప్రేమలో ఇలా ఎలా జారి పడ్డాను వెల్లాకిల్లా

సువర్ణ సువర్ణ సువర్ణ నీ పేరుంది నాలుక చివర్న
సువర్ణ సువర్ణ సువర్ణ నన్ను కట్టెయ్యి కొంగుకి చివర్న

చరణం: 1
హే కథాకళీ చుశానీ నడకల్లో
చుశానీ నడకల్లో
హే హే నాగావళీ హొయలున్నవె మెలికల్లో ...
హొయలున్నవె మెలికల్లో
బుసకొట్టకే బంగారీ నస పెట్టకె నాంచారీ
తల తిప్పుకు పోకే టపక్కునా
ఇక పెట్టకు నన్నే ఇరుక్కునా
తెగ బెట్టుచేస్తవే బజారునా
చుట్టు జనాలు చూడాలనా ?
సువర్ణ సువర్ణ సువర్ణ నీ పేరుంది నాలుక చివర్న
సువర్ణ సువర్ణ సువర్ణ నన్ను కట్టెయ్యి కొంగుకి చివర్న

చరణం: 2
హే అనార్కలీ అరసున్నా నడుముల్లో
అరసున్నా నడుముల్లో
హే హే దీపావళీ వచ్చిందీ మే-నెల్లో
నడిరాతిరి తెల్లారీ పోతున్నా పొలమారీ
నువు కాదని అంటే పుసుక్కునా
నా ప్రాణం పోదా పుటుక్కునా
నా మనసునాపడం అయ్యేపనా ?
నువ్వు కారాలు నూరేసినా

ఆల్చిప్ప లాంటి నీ కళ్ళు రెండు తిప్పుతూ హైరానా పెట్టకే పిల్లా పిల్లా
జాంకాయ లాగ మాంచి దోరగున్న ఈడుతో ఊరించి చంపకే పిల్లా పిల్లా
చక్కెర కలిపిన పటాసులా  ఆ చిటపట లేంటే బాలా ?
విప్పొదిలేసిన కుళాయిలా  చిరునవ్వులు రువ్వే గలా గలా
తొలిసారి ప్రేమలో ఇలా ఎలా జారి పడ్డాను వెల్లాకిల్లా

సువర్ణ సువర్ణ సువర్ణ నీ పేరుంది నాలుక చివర్న
సువర్ణ సువర్ణ సువర్ణ నన్ను కట్టెయ్యి కొంగుకి చివర్న

*********   ********   *********

చిత్రం: జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం: కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి )
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: కార్తీక్ ,  రమ్య బెహరా

పల్లవి:
ఆకుపచ్చని చందమామలా  మారిపోయె భూలోకం
ఈరోజే గమ్మత్తుగా
గోరువెచ్చనీ సూర్యకాంతిలా తాకుతోంది ఆనందం
దాచెయ్యాలన్నంతగా
కేరింతల్లో ఇలా సీతాకోకలా ఎగిరిందిలే మనస్సంతా
సంతోషం ఏదంటూ అందర్నీ అడగాలా
మనచుట్టే వుంటుందిగా చూస్తేఇలా

ఆహాహా బాగున్నదీ
ఆహాహా బాగున్నదీ
ఈ హాయి బాగున్నది
ఈ హాయి బాగున్నది

ఆకుపచ్చని చందమామలా  మారిపోయె భూలోకం
ఈరోజే గమ్మత్తుగా
గోరువెచ్చనీ సూర్యకాంతిలా తాకుతోంది ఆనందం
దాచెయ్యాలన్నంతగా

చరణం: 1
తరించే క్షణాలే ఏరి క్షణంలో నిధుల్లా మార్చుకుందాం
తమాషా కబుర్లే తెచ్చి మనస్సు అరల్లో పేర్చుకుందాం
వసారాలు దాటొచ్చాయీ వసంతాలు ఈ వేళా
తుషారాలు చిరునవ్వుల్లో కురిసేలా
ప్రతీ దారి ఓ మిణుగుర్లా మెరుస్తోంది ఈ వేళా
కలుస్తున్నవే నింగీనేలా

ఆహాహా బాగున్నదీ
ఆహాహా బాగున్నదీ
ఈ హాయి బాగున్నది
ఈ హాయి బాగున్నది
ఆహాహా బాగున్నదీ

చరణం: 2
భుజంతో భుజాన్నే తట్టి బలంగా భరోసా ఇచ్చుకుందాం
ఒకర్లో ఒకర్లా మారి నిదర్లో కలల్నే పంచుకుందాం
మహా మత్తులో ఈరోజే పడేస్తోంది ఈ గాలీ
సుగంధాలు ఏం జల్లిందో అడగాలీ
మరో పుట్టుకా అన్నట్టూ మరీ కొత్తగా వుందీ
ఇదేం చిత్రమో ఏమోగానీ

ఆహాహా బాగున్నదీ
ఆహాహా బాగున్నదీ
ఈ హాయి బాగున్నది
ఈ హాయి బాగున్నది
ఆహాహా బాగున్నదీ
ఆహాహా బాగున్నదీ

*********   ********   *********

చిత్రం: జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం: కళ్యాణి మాలిక్ (శ్రీ కళ్యాణ్ రమణ )
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: శంకర్ మహాదేవన్

పల్లవి :
ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా
ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా
తియ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటునా
కలబోసుకున్న ఊసులు  ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో

ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా

చరణం: 1
ఇంత కాలం దాచుకున్న ప్రేమనీ హాయినీ
కాలమేమీ దోచుకోదు ఇమ్మనీ
పెదవంచు మీదా నవ్వునీ పూయించు కోడం నీ పనీ
నీ మౌనమే మాటాడితే దరి చేరుకోదా ఆమనీ

ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా
తియ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటునా

చరణం: 2
అందనంత దూరమేలే  నింగికీ నేలకీ
వానజల్లే రాయబారం వాటికి
మనసుంటె మార్గం ఉండదా ? ప్రతి మనిషి  నీకే చెందడా ?
ఈ బంధమే ఆనందమే నువు మోసుకెళ్లే సంపదా

ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా
తియ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటునా
కలబోసుకున్న ఊసులు  ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో

ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా

*********   ********   *********

చిత్రం: జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం: కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి )
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: కళ్యాణి మాలిక్ , హాయ్ రబ్బా స్మిత

ఇదేమి గారడీ ఇదేమి తాకిడీ భలేగ వుందిలే ఇదీ
ఇదేమి లాహిరీ ఇదేమి జాజిరీ తెలీదుగాని బాగుందీ
ఇదేమి అల్లరీ ఇదేమి గిల్లరీ పరాకు గుందిలే మదీ
అదేదొ మాదిరీ ఇదేమి ఆవిరీ మనస్సు ఊయలూగిందీ
ఎడారి దారిలో సుమాలు పూసినట్టు ఈ గాలి జోల పాడిందే
పెదాల గూటిలో పదాలు దాచినట్టు మహత్తుగున్నదీ ఇదీ

జ్యో అచ్యుతానంద
జ్యో అచ్యుతానంద
జ్యో అచ్యుతానంద
జ్యో అచ్యుతానంద

ఇదేమి ఉక్కిరీ ఇదేమి బిక్కిరీ భరించడంఎలా ఇదీ ?
గులాబి జాబిలీ గులేబకావళీ పడేసి ఆడుకుంటోందీ
ఇదేమి చిత్రమో ఇదేమి చోద్యమో తెలీని యాతనే ఇది
చమక్కు వెన్నెలా చురుక్కు ఎండలా
గుండెల్లో గుచ్చుకుంటోందీ
స్వరాల వీణలే చిరాకు పాట లాగ  చెవుల్లొ గోల చేస్తోందే
తరించు హాయిలో దహించు మంటలాగ సహించలేనిదీ ఇదీ

జ్యో అచ్యుతానంద
జ్యో అచ్యుతానంద
జ్యో అచ్యుతానంద
జ్యో అచ్యుతానంద

*********   ********   *********

చిత్రం: జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం: కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి )
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: హరిణి రావు

ఒక లాలన ఒక దీవెన సడి చేయవా యెద మాటున
ఒక లాలన ఒక దీవెన సడి చేయవా యెద మాటున
తియతీయని ప్రియభావన చిగురించదా పొరపాటున
కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో

ఒక లాలన ఒక దీవెన సడి చేయవా యెద మాటున

అంతులేనీ ఇష్టమంతా గంగలా పొంగనీ ఆనకట్టే వేసుకోకూ వద్దనీ
కలపాలనుంటే చేతినీ ఎగరాలనుంటే మనసునీ
దాచేయయకూ ఆపేయకూ అటు వైపు సాగే అడుగునీ

ఒక లాలన ఒక దీవెన సడి చేయవా యెద మాటున
తియతీయని ప్రియభావన చిగురించదా పొరపాటున
కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో

Most Recent

Default