చిత్రం: కబడ్డీ కబడ్డీ (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రవివర్మ, కౌసల్య
నటీనటులు: జగపతిబాబు, కళ్యాణి
దర్శకత్వం: వెంకీ
నిర్మాత: వల్లూరిపల్లి రమేష్ బాబు
విడుదల తేది: 16.02.2003
గోరువంక గోదారివంక ఈతకెళదాం వస్తావా
గోరువంక గోదారివంక ఈతకెళదాం వస్తావా
పూలపడక వేశాను కనుక మంచి మూర్తం చూస్తావా
పందార తిన్నట్టు తియ్యంగ ఉన్నాది
నాకేమిటయ్యిందొ తెలియదుగా
మందార పువ్వంటి నాజూకు వయ్యారి
నన్నేలే రమ్మంటు పిలిచెనుగా
కలవరమా చెరిసగమా
ఏమని చెప్పను భామా ఎంతని దాచను రామా
గోదారి కెరటాలు చల్లగాలి పంపుతుంటే
గోరువంక.. గోరువంక గోదారివంక ఈతకెళదాం వస్తావా
పూలపడక వేశాను కనుక మంచి మూర్తం చూస్తావా
గుప్పెడు గుండెల చప్పుడు రేగెను చప్పున నే నిను చూడగా
రెప్పల మాటున ఇప్పటి అలజడి ఎప్పుడు ఎరగను ఇదేమి గొడవా
కాకితో కబురెట్టాలి త్వరగా కారణం కనిపెట్టాలిగా
అందాల చినుకా బంగారు తునక సింగారి చినుకా ఓఓఓఓ
ఎండల్లో చలిగా గుండెల్లో గిలిగా కోరికేదొ రేగెనా గోలచేసెనా
గోరువంక.. గోరువంక గోదారివంక ఈతకెళదాం వస్తావా
పూలపడక వేశాను కనుక మంచి మూర్తం చూస్తావా
కమ్ముకు పోయిన తిమ్మిరి యాతన రమ్మని పిలిచెనుగా మరి
కన్నుల వాకిట పున్నమి పువ్వుల వెన్నెల కాసెను ఇదేమి చొరవా
ప్రేమలో పడిపోయింది మనసా ప్రాయమే చిగురేసిందిగా
మంచల్లె కురిశా ముద్దుల్లో మురిశా నిద్దర్లో తలచా ఓఓఓఓ
వానొచ్చి తడిశా పువ్విచ్చి పిలిచా
వాయిదాలు వేయకా దాయి దాయి దా
గోరువంక.. గోరువంక గోదారివంక ఈతకెళదాం వస్తావా
పూలపడక వేశాను కనుక మంచి మూర్తం చూస్తావా