Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kanche (2015)






చిత్రం: కంచె (2015)
సంగీతం: చిరంతన్ భట్
నటీనటులు: వరుణ్ తేజ్ , ప్రాగ్యా జైస్వాల్
దర్శకత్వం: జాగర్లమూడి రాధా కృష్ణ (క్రిష్)
నిర్మాతలు: వై. రాజీవ్ రెడ్డి, జె. సాయిబాబు
విడుదల తేది: 22.10.2015



Songs List:



ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో ఏమో పాట సాహిత్యం

 
చిత్రం: కంచె (2015)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అభయ్ జోధ్ పుర్కార్, శ్రేయ గోషల్

పల్లవి : 
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో ఏమో 
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో ఏమో
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో ఏమో 
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో ఏమో
సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో 
స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో 
ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కథానిక మొదలైందో  
మనం అనే కథానిక మొదలైందో
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో ఏమో 
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో ఏమో

చరణం: 1  
ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఘడియగ కుదించ వీలవకా
చిరాకు పడేట్టు పరారయ్యిందో సమయం కనబడక
ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెళిపోదా 
తనోటి ఉందని మనం ఎలాగ గమనించం గనక 
కలగంటున్నా మెలకువలో ఉన్నాం కదా మనదరికెవరు వస్తారు కదిలించగా 
ఉషస్సెలా ఉదయిస్తుందో నిశిధెలా ఎటు పోతుందో
నిదర ఎపుడు నిదరౌతుందో మొదలు ఎపుడు మొదలౌతుందో
ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కథానిక మొదలైందో  
మనం అనే కథానిక మొదలైందో
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో ఏమో 
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో ఏమో
పమగరిసారీ ససససారీ నిగాగారీ గదమదా
పమగరిసారీ ససససారీ నిగాగారీ గదమదా

చరణం: 2
పెదాల మీదుగా అదేమి గలగల పదాల మాదిరిగా 
సుధల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత మాధురిగా
ఇలాంటి వేళకు ఇలాంటి ఊసులు ప్రపంచ భాష కదా
ఫలాన అర్థం అనేది తెలిపే నిఘంటువుండదుగా 
కాబోతున్న కళ్యాణ మంత్రాలుగా  వినబోతున్న సన్నాయి మేళాలుగా
ఓ సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో 
స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో 
ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కథానిక మొదలైందో
మనం అనే కథానిక మొదలైందో
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో ఏమో 
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో ఏమో





ఊరు యేరైంది పాట సాహిత్యం

 
చిత్రం: కంచె (2015)
సాహిత్యం:  సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: చిరంతన్  భట్
గానం: శంకర్ మహదేవన్ 

ఊరు యేరైంది



నిజమేనని నమ్మనీ పాట సాహిత్యం

 
చిత్రం: కంచె (2015)
సాహిత్యం:  సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: చిరంతన్  భట్
గానం: శ్రేయా గోషల్

నిజమేనని నమ్మనీ
అవునా అనే మనసునీ
మనకోసమే ఈ లోకం అనీ
నిజమేనని నమ్మనీ

కనుపాపలోనీ ఈ కలల కాంతీ
కరిగేది కానే కాదనీ
గత జన్మలన్నీ మరు జన్మలన్నీ
ఈ జన్మ గానే మారనీ
ఈ జంటలోనే  చూడనీ
నిజమేనని నమ్మనీ
నిజమేనని నమ్మనీ

కాలం అనేదే లేని చోటా
విలయాల పేరే వినని చోటా
మనం పెంచుదాం ఏకమై
ప్రేమగా ప్రేమనీ
నిజమేనని నమ్మనీ
నిజమేనని నమ్మనీ




భగ భాగమని పాట సాహిత్యం

 
చిత్రం: కంచె (2015)
సాహిత్యం:  సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: చిరంతన్  భట్
గానం: విజయ్ ప్రకాష్ 

భగ భాగమని 



రా ముందడుగేదడాద్దాం పాట సాహిత్యం

 
చిత్రం: కంచె (2015)
సాహిత్యం:  సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: చిరంతన్  భట్
గానం: విజయ్ ప్రకాష్ , కీర్తి సగతియ

రా ముందడుగేదడాద్దాం



లవ్ ఈజ్ వార్ పాట సాహిత్యం

 
చిత్రం: కంచె (2015)
సాహిత్యం:  సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: చిరంతన్  భట్
గానం: చిరంతన్  భట్

లవ్ ఈజ్ వార్ 

Most Recent

Default