చిత్రం: ఖైది నంబర్ : 150 (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: చిరంజీవి, కాజల్ అగర్వాల్ దర్శకత్వం: వి.వి.వినాయక్ నిర్మాత: రామ్ చరణ్ విడుదల తేది: 11.01.2017
Songs List:
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ పాట సాహిత్యం
చిత్రం: ఖైది నంబర్ : 150 (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్ గానం: దేవి శ్రీ ప్రసాద్, రెనైనా రెడ్డి యో గయ్స్ దిస్ ఈస్ నాట్ మాస్ సాంగ్ దిస్ ఈజ్ ద బాస్ సాంగ్ హె ఎర్ర చొక్కానే నీకోసం ఏశాను సర్రు మంటూ ఫారిన్ సెంటే కొట్టాను గళ్ళ లుంగీనే ట్రెండీగా కట్టాను కల్ల జోడెట్టి నీకోసం వచ్చాను అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను నల్ల జాకెట్టు నైటంతా కుట్టాను వాలు జళ్ళోనా మందారం పెట్టాను కన్నె ఒళ్ళంతా సింగారం చుట్టాను పిల్లడు లెట్స్ డూ కుమ్ముడూ హె ఇన్స్టాగ్రాం ప్రొఫైలు పిక్చర్ లాగా భలే మస్తుందే నీ అందం మల్లె తీగ హా డిస్కవరీ చానెల్ లో చేసింగ్ లాగా అలా పై పైకి దూకెయ్ కు సింహం లాగా అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ చరణం: 1 మండే ఎండలొ ఐస్క్రీము బండిలా కూల్ అండ్ క్యూటుగ ఉండే అందం రెండే కళ్ళతో ధన్ ధన్ స్టెన్ గన్నులా చూపుల గుళ్ళతో తీసావ్ ప్రాణం హాట్ గా ఘాట్ గా ఉండే నీ హిప్పుని నాటుగ చాటుగ పట్టేయనా రఫ్ఫుగ టఫ్ఫుగ ఉండే నీ చేతితో నువ్ తాకితే నేను ఫట్టైపోనా అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ తమ్ముడూ లెట్స్ డూ కుమ్ముడూ చరణం: 2 హె శారీ కట్టినా సల్వారే చుట్టినా అల్లాడిస్తదే నీ ఔట్ లైనూ హె లారీ గుద్దినా ల్యాండ్ మైనే పేలినా నీతో పోలిస్తే నతింగ్ జానూ స్టెప్పులే స్టెప్పులూ నీతో వెయ్యాలని ఇప్పుడే కట్టినా కొత్త ట్యూనూ నిప్పులా ఉన్న నీ వైల్డూ రొమాన్సుకు లిప్పులో దాచినా రెడ్డూ వైనూ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ యో గయ్స్ దిస్ ఈస్ నాట్ మాస్ సాంగ్ దిస్ ఈజ్ ద బాస్ సాంగ్ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ
సుందరి పాట సాహిత్యం
చిత్రం: ఖైది నంబర్ : 150 (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: జస్ప్రీత్ జస్జ్ సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో తేనెటీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి సోకె కుక్కినాదిరో నాజూకు మెక్కినదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంకు నుంచి బ్లాంక్ చేక్కు ఇవ్వరో కోకే కట్టినదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినానురో లవ్ బండి తీసి ట్రాక్ మీద పెట్టినానురో సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో తేనెటీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడూతి కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి చాక్లెట్ చూపి పిల్లవాడిని క్యూట్ గ ఊరించినట్టుగా మాగ్నెట్ లాంటి ఒంపు సోంపుని చూపి నన్ను చంపేరో ఊపి ఊపిరిరాపేరో ట్యూబ్ లైట్ వేసి డల్ నైట్ ని ఫుల్ గ బ్రైట్ చేసినట్టుగా మూన్ లైట్ లాంటి కంటి చూపుతో నా హార్ట్ లైట్ వేసేరో మనసు వెయిట్ పెంచేరో తీసేయ్ రొమాన్స్ గేట్ ని ఇక తోసెయ్ ఆ సిగ్గు సీట్ ని రాసేయ్ నీ కాపీరైట్ ని నా పేరు మీద ఫిక్స్ అని నువ్వు నేను మిక్స్ అని సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో తేనెటీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి కీపర్ లేని టైం చూసి ఫుట్ బాల్ గోల్ కొట్టినట్టుగా కంట్రోల్ లేని టైం చూసి హిప్ నాకు చూపేరో హిప్నటైజ్ చేసేరో రైఫిల్ని లోడ్ చేసి టార్గెట్ నే కాల్చినట్టుగా లిప్స్టిక్ లో రెడ్ తీసి లవ్ సింబల్ ఏసేరో బాణమేసి గుచ్చేరో రావే నా లెఫ్ట్ సైడ్ కి నీకోసం తెరిచా గుండె కిటికీ పోదాం ఈ నైట్ ఫ్లైయట్ కి ఓ హనీమూన్ స్పాట్ కి ఊటీ లాంటి చోటుకి సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో తేనెటీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి
యూ అండ్ మీ పాట సాహిత్యం
చిత్రం: ఖైది నంబర్ : 150 (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శ్రీమణి గానం: హరిచరన్, శ్రేయ ఘోషల్ మీ మీ మిమ్మీమీ ఇకపై ఓన్లీ యూ అండ్ మీ సాయంకాలానా సాగర తీరానా సంధ్య సూర్యుడిలా నువ్వూ నేను వేసవి కాలానా వెన్నెల సమయానా తార చంద్రుడిలా నువ్వూ నేను నువ్వు రాగం అయితే నే పాటవుతాను నువ్వు మేఘం అయితే నీ జిలిబిలి వలపుల వర్షం నేను మీ మీ మిమ్మీమీ ఇకపై ఓన్లీ యూ అండ్ మీ మీ మీ మిమ్మీమీ ఇకపై ఓన్లీ యూ అండ్ మీ సాయంకాలానా సాగర తీరానా సంధ్య సూర్యుడిలా నువ్వూ నేను వేసవి కాలానా వెన్నెల సమయానా తార చంద్రుడిలా నువ్వూ నేను ముద్ద మందారం తెలుసు మెరిసే బంగారం తెలుసు రెండు కలిపేస్తే నువ్వేనా మండే సూరీడు తెలుసు వెండి జాబిల్లి తెలుసు రెండు కలబోస్తే నువ్వేనా రోజు అద్దంలో అందం నువ్వేనా ఆ అందం నువ్వైతే నువ్వూ నేనా రోజు కన్నుల్లో కలలే నువ్వేనా కలలే నిజమైతే నువ్వూ నేనా మీ మీ మిమ్మీమీ ఇకపై ఓన్లీ యూ అండ్ మీ మీ మీ మిమ్మీమీ ఇకపై ఓన్లీ యూ అండ్ మీ కోపం సైనికుడి వరస తాపం ప్రేమికుడి వరస రెండూ ఒకటైతే నువ్వేనా పల్లె పడుచుల్ని చూశా పట్నం సొగసుల్ని చూశా రెండూ ఒకటైతే నువ్వేనా హో రంగుల విల్లంటే అచ్చం నువ్వేనా బాణం నేనైతే నువ్వూ నేనా పువ్వుల వరదంటే అచ్చం నువ్వేనా నన్నే చుట్టేస్తే నువ్వూ నేనా మీ మీ మిమ్మీమీ ఇకపై ఓన్లీ యూ అండ్ మీ మీ మీ మీ మీ మీ ఇకపై ఓన్లీ యూ అండ్ మీ
రత్తాలు రత్తాలు పాట సాహిత్యం
చిత్రం: ఖైది నంబర్ : 150 (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్ గానం: నకాష్ అజిజ్ , జాస్మిన్ సండ్లస్ బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు నీ ఒంపు సోంపు అందం చందం అన్ని నా చుట్టాలూ చెంగుమంటూ రావే తిరగరాసేద్దాం చట్టాలు నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ నీ నవ్వులే రత్నాలు నీ మాటలే ముత్యాలు పొట్లాలు కడితే కోట్ల కొద్ది బేరాలు నీ చేతులే మేగ్నెట్లు నీ వేళ్ళు వీణ మెట్లు నువ్వు తాకుతుంటే రక్తమంతా రాగాలు.. ఓ నువ్వు పక్కనుంటే కిక్కె వేరు వధ్ధులే జారాధాలు ఆవురావురంటూ వున్నా తీర్చు నా సరదాలు అందుకేగా వచ్చేసా రఫ్ఫాడిద్దాం రాత్రి పగలు మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిను చూస్తే ఘల్ ఘల్ మంటాయ్ నా చిట్టి పట్టీలు రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిను చూస్తే నిలబడనంటాయ్ నా జళ్ళో ఏ పూలు బాసూ..చూపీయ్ నీ గ్రేసు.. ఏ.. మై డియర్ బాస్.. నువ్వు మాస్ ప్లస్ క్లాసు నీ స్టైల్ చూస్తే సింహమైన నీతో దిగదా సెల్ఫీలు హే.. మిస్ యూనివర్సు లాంటి నీ ఫీచర్స్ చూస్తూ ఉంటే రెచ్చిపోతాయ్ గుండెలోన గుర్రాలు నీ వాక్ చూస్తే ఓరయ్యో ఐ లూస్ మై కంట్రోలు నీ హీట్ ఉంటే చాలమ్మో ఇక ఎందుకు పెట్రోలు నాకు నూవు నీకు నేను అప్పచెబుదాం పాఠాలు మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు హేయ్ రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు రత్తాలు....... బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ
రైతు కంట నీరు పాట సాహిత్యం
చిత్రం: ఖైది నంబర్ : 150 (2017) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: శంకర్ మహదేవన్ నీరు నీరు నీరు రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరూ... గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరూ... అన్నదాత గోడు నింగినంటె నేడు... ఆలకించు వారు ఎవ్వరూ... నీరు నీరు నీరు రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరూ... గొంతు ఎండిపోయే పేగు మండిపోయే... గంగతల్లి జాడ లేదనీ... నీటి పైన ఆశే నీరుగారి పోయే... రాత మారు దారి లేదని... దాహమారుతుందా... పైరు పండుతుందా... ధారలైన కంటి నీటితో... నీరు నీరు నీరు రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరూ... గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరూ... నేల తల్లి నేడు అంగీలారిపోయే... మూగబోయే రైతు నాగలి... ఆయువంత చూడు ఆర్తనాదమాయే... గొంతు కోసుకుంది ఆకలి...