చిత్రం: కోడెనాగు (1974) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు నటీనటులు: శోభన్ బాబు, లక్ష్మీ, చంద్రకళ దర్శకత్వం: కె.ఎస్.ప్రకాష్ రావ్ ( డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు గారి నాన్నగారు) నిర్మాత: యం.ఎస్.రెడ్డి విడుదల తేది: 15.03.1984
Songs List:
ఇదే చంద్రగిరి...పాట సాహిత్యం
చిత్రం: కోడెనాగు (1974) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: మల్లెమాల గానం: ఘంటసాల పల్లవి: ఇదే చంద్రగిరి... శౌర్యానికి గీచిన గిరి ఇదే చంద్రగిరి... శౌర్యానికి గీచిన గిరి... ఇదే చంద్రగిరి.. ఇదే చంద్రగిరి... శౌర్యానికి గీచిన గిరి... ఇదే చంద్రగిరి... చరణం: 1 తెలుగుజాతి చరితలోన చెరిగిపోని కీర్తి సిరి చెరిగిపోని కీర్తి సిరి తెలుగు నెత్తురుడికించిన వైరులకిది మృత్యువు గరి ఇదే చంద్రగిరి …. శౌర్యానికి గీచిన గిరి... ఇదే చంద్రగిరి చరణం: 2 తిరుమల శ్రీ వేంకటేశు చిర దరిశన వాంఛతో తిరుమల శ్రీ వేంకటేశు చిర దరిశన వాంఛతో ఇమ్మడి నరసింహుడు నిర్మించిన దుర్గము ఇమ్మడి నరసింహుడు నిర్మించిన దుర్గము ఆంధ్ర శిల్పి పనితనానికద్భుత తార్కాణముగా.. ఆ... ఆ.. ఆ.. ..ఆ... ఆ.. ఆ ఆంధ్ర శిల్పి పనితనానికద్భుత తార్కాణముగా వెలసిన దిట స్వర్గము .. వెయ్యేళ్ళకు పూర్వము... వెయ్యేళ్ళకు పూర్వము ఇదే చంద్రగిరి …. శౌర్యానికి గీచిన గిరి.. ఇదే చంద్రగిరి చరణం: 3 ఇక్కడే తిమ్మరుసు చదివి ఎదిగినాడు ఇక్కడే తిమ్మరుసు చదివి ఎదిగినాడు రాజనీతి రాటుదేలి రాయల గురివై నాడు రాజనీతి రాటుదేలి రాయల గురివై నాడు ఈ మహలే కవి గాయక పండిత జన మండల మొకనాడు ఈ శిధిలాలే గత వైభవ చిహ్నములై మిగిలిన వీనాడు గత వైభవ చిహ్నములై మిగిలిన వీనాడు... ఈనాడు....
అందాల గడసరివాడు పాట సాహిత్యం
చిత్రం: కోడెనాగు (1974) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: మల్లెమాల గానం: పి.సుశీల అందాల గడసరివాడు అడగకుండ మనసిచ్చాడు ఆడపిల్ల కంతకన్న అందమేముంది ఆనంద మేముందీ.... అతని ఎదలో గుడుగుడు గుంచం ఆడుకుంటాను..... ఆ ఆటలోనె వానిచుట్టూ అల్లుకుంటాను. అతని గొంతుతొ ఎంకి పాటలు పాడుకుంటాను.... ఆ పాటలన్నీ మూటగట్టి దాచుకుంటాను.... పెళ్ళి పీటలమీద చిలిపిగ నన్ను చూస్తాడూ .... ఎందు కంత సిగ్గు అని కనుసైగ చేస్తాడూ... మొలక నవ్వులతోనే నేను పలకరిస్తాను.... తెలుసులే నీ కొంటెతనమని తిప్పి కొడతాను.... తిప్పికొడతాను ....
నాగుపాము పగ పన్నెండేళ్ళు పాట సాహిత్యం
చిత్రం: కోడెనాగు (1974) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: అత్రేయ గానం: ఘంటసాల నాగుపాము పగ పన్నెండేళ్ళు నాలో రగిలే పగ నూరేళ్ళూ ॥ నాగు॥ విషం లేదు నా హృదయంలో భయంలేదు ఏ విషయంలో అభిమానం త్యజించలేను అవమానం సహించబోను సహించబోను సహించబోను ॥ నాగు॥ ధర్మం వైపే ఉంటాను వుంటాను అందుకు దైవాన్నైనా ఎదిరిస్తాను స్నేహం చేస్తే ప్రాణంయిస్తాను ద్రోహానికి వస్తే ప్రాణం తీసాను ప్రాణం తీసాను॥నాగు || చెయ్యని నేరం మొయ్యాలా ? నేరంచేసినవాళ్ళను వదలాలా ? నీతిగ వుండీ నిందపడాలా : నిజం నిప్పువంటిదని చెప్పాలా : నాగుపాము పగ పన్నెండేళ్ళు నాగరాజు పగ నూరేళ్ళు ఈ కోడెనాగు పగ నూరేళ్ళు ....
నాలో కలిసిపో నా ఎదలో నిలిచిపో పాట సాహిత్యం
చిత్రం: కోడెనాగు (1974) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: ఆత్రేయ గానం: ఘంటసాల నాలో కలిసిపో - నా ఎదలో నిలిచిపో కాచుకున్న కౌగిలిలో కప్పురమై కరిగిపో కరిగిపో నవ వసంత మల్లికలా నవ్వుతూ వుండిపో నవ యౌవన శోరలా నరనరాల నిండిపో నీ నవ్వులే.... ఈ జన్మకు దీపావళి దివ్వెలు నీ చూపులే.... నా ఆశకు నిన్నకాని రేపులు నీకోసమె తెరిచినాను ఈ కోవెల తలుపులు నువ్వే మోగించాలి తొలి గంటలు అణువణువున నీ రూపే ఆవహించెనూ అనుక్షణం నీ స్మరణే ఊపిరాయనూ అనుకోని అనుబంధం పెనవేసెనూ అది ముందుముందు జన్మలకు మిగిలిపోవును
సంగమం... సంగమం... పాట సాహిత్యం
చిత్రం: కోడెనాగు (1974) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: మల్లెమాల గానం: ఘంటసాల, పి.సుశీల పల్లవి: సంగమం... సంగమం.... అనురాగ సంగమం జన్మ జన్మ ఋణానుబంధ సంగమం సంగమం... సంగమం ఆనంద సంగమం భావ రాగ తాళ మధుర సంగమం... సంగమం... సంగమం... అనురాగ సంగమం.. ఆనంద సంగమం చరణం: 1 పాలు తేనె కలసి మెలసి జాలువారు సంగమం పాలు తేనె కలసి మెలసి జాలువారు సంగమం సాగిపోవు ఏరులన్నీ ఆగి చూచు సంగమం ఆగి చూచు సంగమం ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... సాగిపోవు ఏరులన్నీ ఆగి చూచు సంగమం ఆగి చూచు సంగమం సంగమం... సంగమం.... అనురాగ సంగమం ఆనంద సంగమం చరణం: 2 నింగి నేల నింగి నేల ఏకమైన నిరుపమాన సంగమం నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం ఆ...ఆ...ఆ... ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ.. నిత్యమై సత్యమై నిలిచిపోవు సంగమం నిలిచిపోవు సంగమం సంగమం....సంగమం.... అనురాగ సంగమం.. ఆనంద సంగమం చరణం: 3 జాతికన్న నీతి గొప్పది మతము కన్న మమత గొప్పది జాతికన్న నీతి గొప్పది మతము కన్న మమత గొప్పది మమతలు మనసులు ఐక్యమైనవి ఆ ఐక్యతే మానవతకు అద్దమన్నవీ అద్దమన్నవీ సంగమం... సంగమం.... అనురాగ సంగమం ఆనంద సంగమం
కథ విందువా... పాట సాహిత్యం
చిత్రం: కోడెనాగు (1974) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: ఆత్రేయ గానం: పి.సుశీల పల్లవి: కథ విందువా...నా కథ విందువా విథికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన కథ విందువా నా కథ విందువా చరణం: 1 బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు అన్న అనుమాటతో అన్ని తుంచేశావు పసుపు కుంకుమ తెచ్చి పెళ్ళి కానుకగ యిచ్చి ఉరితాడు నా మెడకు వేయించినావు కథ విందువా...నా కథ విందువా చరణం: 2 తొలిరేయి విరిపానుపు ముళ్ళనే పరిచింది తొలిరేయి విరిపానుపు ముళ్ళనే పరిచింది కసటు కోరిక మగని రూపాన నిలిచింది నీ పేరు మెదలిన మధురాధరము పైన చిరు చేదు చిలికింది... జీవితమె మారింది చిరుచేదు చిలికింది... జీవితమె మారింది కథ విందువా...నా కథ విందువా విథికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన కథ విందువా నా కథ విందువా చరణం: 3 శీలాన్ని ఏలమున పెట్టింది స్వార్థము శీలాన్ని ఏలమున పెట్టింది స్వార్థము తాళినే ఎగతాళి చేసింది ధనము కాముకుల కాహుతైపోయింది మానము నా పాలి నరకమై మిగిలింది ప్రాణము నా పాలి నరకమై మిగిలింది ప్రాణము కథ విందువా... నా కథ విందువా విథికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన కథ విందువా నా కథ విందువా