చిత్రం: కృష్ణం వందే జగద్గురుం (2012) సంగీతం: మణిశర్మ నటీనటులు: రాణా దగ్గుబాటి, నయనతార దర్శకత్వం: క్రిష్ నిర్మాతలు: సాయి బాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి విడుదల తేది: 30.11.2012
Songs List:
అరెరే పసి మనసా పాట సాహిత్యం
చిత్రం: కృష్ణం వందే జగద్గురుం (2012) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: నరేంద్ర, శ్రావణ భార్గవి అరెరే పసి మనసా చేజారే వరసా చెబితే వినవటె వయసా... మరుపే మొదటిదశ అటుపై దాని దిశ తెలుపదు చిలిపి తమాషా... తననొదిలి ఎటువైపు కను కదలని చూపు నిను మరచిన తలపు వినదిక నీ పిలుపు ఊహా విహారమా సాగే సరాగమా సరదా తగదు సుమ సుతారమా పాపా జాగర్తే పరాకుల్లో పడతావే పాపా జాగర్తే పరాకుల్లో పడతావే చూస్తూ చూస్తూ సుడిలో దిగిపోతావే అరెరే పసి మనసా చేజారే వరసా చెబితే వినవటె వయసా... మరుపే మొదటిదశ అటుపై దాని దిశ తెలుపదు చిలిపి తమాషా... అవునా... ఇతనేనా ఇన్నాళ్ళు యెదరున్నది కాదా మరి అయినా... ఇంతకుముందేనాడు పరిచయమైనా లేనట్టుంది ఎపుడు ఇలాంటి ఓ మలుపు ఈ ప్రయాణంలో కనిపించిందా వయసుకు ఇదే మేలుకొలుపు ఈ ముహుర్తంలో అనిపించిందా కదిలే ఒకో క్షణం నడిపే మనోరధం తెలిపే కథా క్రమం ఏం చెబుతాం పాపా జాగర్తే పరాకుల్లో పడతావే వద్దొద్దంటునే పరాకుల్లో పడుతున్నా పాపా జాగర్తే పరాకుల్లో పడతావే చూస్తూ చూస్తూ సుడిలో దిగిపోతావే అరెరే పసి మనసా చేజారే వరసా చెబితే వినవటె వయసా... మరుపే మొదటిదశ అటుపై దాని దిశ తెలుపదు చిలిపి తమాషా... అబలా... ఏమైపొతున్నావే సుడిగాలిలో చిగురాకులా నువ్వలా... ఎప్పుడు గుర్తిస్తావే తరిమేదెవరో నిలిపేదెపుడో నీలో ఇదే కదా మొదలు ఈ నిషా లయలు గమనించావా లోలో అదోలాంటి గుబులు ఎందుకో అసలు కనిపెట్టవా ఏదో అయోమయం అయినా మహా ప్రియం దాన్నే కదా మనం ప్రేమంటాం
సై అంద్రి నాను పాట సాహిత్యం
చిత్రం: కృష్ణం వందే జగద్గురుం (2012) సంగీతం: మణిశర్మ సాహిత్యం: ఈ. ఎస్.మూర్తి గానం: శ్రేయగోషల్, రాహుల్ సిప్లిగంజ్, దీపు సై అంద్రి నాను సై అంటిర నమ్మాసు తీర్సు నడి అంటిర సై అంద్రి నాను సై అంటిర నమ్మాసు తీర్సు నడి అంటిర బల్లారి బావ బావేగబారా మైసురు రంగోల మనవెట్టు బండాల బల్లారి బావ బావేగబారా మైసురు రంగోల మనవెట్టు బండాల బావలందరివార... రార బొబ్బిలిరాజ ఆ అడ్డు పొడుగు ఏందిరో సూరిడల్లె నీలో సురుకేదొ ఉందిరో సూపుల్లొ సూదులు ఉంటె సరసం ఎట్టయ్యొ బల్లారి బావ బావేగబారా మైసురు రంగోల మనవెత్తుబండాల బల్లారి బావ బావేగబారా మైసురు రంగోల మనవెట్టు బంగాళ ఊరించి వెడెక్కించె మగరాయుడు వీలున్న వద్దంటాదు ఏం రసికుడు ఆ కండదండల్లో సరుకెంతని సూపిస్తె పోయెది ఎముందని రంగోల రంగోలా ఏ.... ఓ.... రంగోల రంగోలా రంజయినా రంగసానివే ABCD లైన నాకింక రానేరావులె మాటల్థొ మస్కా కొట్టె మాయలమారివిలే రంగొల రమ్మంటె రాలేని ఎర్రొల్లు ఇనుమల్లె ఎన్నున్న ఏంచేసుకుంటారు బల్లారి బావ బావేగబారా మైసురు రంగోల మనవెట్టు బంగాళ ఒంటరిగా ఉంటె చాలు అమ్మాయిలు.... ఊసులుతో వెంటొస్తారు రస రాజులు ఒంటరిగా ఉంటె చాలు అమ్మాయిలు ఊసులుతో వెంటొస్తారు రస రాజులు ఒల్లంత ఊపిరులు తగిలేంతలా పైపైకి వస్తారు వడగాలిలా రంగోల రంగోలా ఎ.. ఎ.... రంగోల రంగోలా మీరేమొ అగ్గిరవ్వలు సొకంత ఎరవేసి కిర్రెక్కించే కొరకంచులు నీ వేడి సల్లారాక గుర్తుండేదెవరు బిస్లెరి బొట్టిల్లా ఆడోల్ల అందాలు తాగేసి ఇసిరేస్తారు తీరాక తాపాలు బల్లారి బావ బావేగబారా మైసురు రంగోల మనవెట్టు బంగాళ బల్లారి బావ బావేగబారా మైసురు రంగోల మనవెట్టు బంగాళ
కృష్ణం వందే జగద్గురుం పాట సాహిత్యం
చిత్రం: కృష్ణం వందే జగద్గురుం (2012) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: యస్.పి. బాల సుబ్రహ్మణ్యం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం పురాతనపు పురాణ వర్ణన పైకి కనపడుతున్న కథనం నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం చెలియలి కట్టను తెంచుకుని, విలయము విజ్రుంభించునని ధర్మ మూలమే మరచిన జగతిని యుగాంత మెదురై ముంచునని సత్యం వ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూత నిచ్చి నావగ త్రోవను చూపిన సత్యం కాలగతిని సవరించిన సాక్ష్యం చేయ దలచిన మహాత్కార్యము మోయజాలని భారమైతే పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించ గలిగిన ఓరిమి కూర్మమన్నది క్షీరసాగర మథన మర్మం ఉనికిని నిలిపే ఇలను కడలిలో కల్పగ నురికే ఉన్మాదమ్మును నరాల దంష్ట్రుల ఉల్లగించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోద్ధరితరిణ హుంకారం ఆది వరాహపు ఆకారం ఏడి ఎక్కడ రా? నీ హరి దాక్కున్నాడే రా? భయపడి బయటకు రమ్మనరా ఎదుటపడి నన్ను గెలవగలడా ! తలపడి ? నువ్వు నిలిచిన ఈ నేలను అడుగు నాడుల జీవ జలమ్ము ని అడుగు నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు నీ ఊపిరిలో గాలిని అడుగు నీ అడుగులో ఆకాశాన్నడుగు నీలో నరుని హరిని కలుపు నీవే నరహరివని నువ్ తెలుపు ఉన్మత్త మాతంగ బంధికాతుక వికతి హంత్రు సంక్రాతనీ క్రుడని విడనీ జగతి అహము రధమై యెతికె అవనికిదె అసనిహతి ఆకతాయుల నిహతి అనివర్యమవు నియతి శిత హస్తి హత మస్త కారినక సవకాసియో క్రూరాసి క్రోసి హ్రుతదాయ దంష్ట్రుల దోసి మసి చేయ మహిత యజ్ఞం అమేయమనూహ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగ జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగ జగమే నాటకం పాపపు తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మగ్లానిని పెరుకగ పరశురాముడై భయదభీముడై పరశురాముడై భయద భీముడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన శ్రోత్రియ క్షత్రియ తత్వమె భార్గవుడు ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మశక్యము గాని ఏ మర్మమూ లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగ మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచే ఇన్ని రీతులుగ ఇన్నిన్ని పాత్రలుగ నిన్ను నీకే నూత్న పరిచితునిగ దర్శింపజేయగల జ్ఞాన దర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణతరణము అణిమగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాకామ్యవర్తిగా ఈశత్వముగా వశిత్వమ్ముగా నీలోని అష్తసిద్ధులు నీకు కన్వట్టగా స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగ తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం
స్పైసీ స్పైసీ గర్ల్ పాట సాహిత్యం
చిత్రం: కృష్ణం వందే జగద్గురుం (2012) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సాయి మాధవ్ బుర్రా గానం: హేమచంద్ర, చైత్ర, శ్రావణ భార్గవి స్పైసీ స్పైసీ గర్ల్
రంగమార్తాండ బీటెక్ బాబు పాట సాహిత్యం
చిత్రం: కృష్ణం వందే జగద్గురుం (2012) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సాయి మాధవ్ బుర్రా గానం: రఘుబాబు, హేమచంద్ర, సాయి మాధవ్ బుర్రా రంగమార్తాండ బీటెక్ బాబు రంగులు మార్చే బూటక బాబు Once more.. రంగమార్తాండ బీటెక్ బాబు రంగులు మార్చే బూటక బాబు వీడికి తెలియని నాటకముంటుందా మిలమిల మెరుపుల మేకప్ అతుకు తళతళ లాడే తగరపు బతుకు పరుసును తీస్తే పైసా ఉండదు రా ఏర మనకేరా తెర లాగితే కింగే రా మూడు పెగ్గులు ఆరు విగ్గులు పంచుకు బతకాలా పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేయరా జెండా పై కపిరాజంటు జెండా ఎగరేయరా చరణం: 1 లోకం మయసభ ఆటరా కాలు జారి పడబోకురా నాకు నేనే రా రాజురా నవ్వే ద్రౌపది లేదురా లైఫ్ ఓ డ్రామ, విను విశ్వదాభి రామా లైటు ఆరినా లైను మారినా సీను సీతారమ్మా పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేయరా జెండా పై కపిరాజంటు జెండా ఎగరేయరా చరణం: 2 రిస్కు చేస్తే నో లాసు రా అందుతుంది అట్లాసు రా లక్ అడ్రెస్సు వెతకరా జిందగి నీది బతుకరా మాయ మశ్చింద్రా మేగిక్ చేసేయరా లైఫ్ కొంచెము ఆశ లంచము ఇచ్చి పెంచుకోరా పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేయరా జెండా పై కపిరాజంటు జెండా ఎగరేయరా పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేయరా జెండా పై కపిరాజంటు జెండా ఎగరేయరా
చల్ చల్ పాట సాహిత్యం
చిత్రం: కృష్ణం వందే జగద్గురుం (2012) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సాయి మాధవ్ బుర్రా గానం: జోయన్న చల్ చల్
చిత్రం: కృష్ణం వందే జగద్గురుం (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: నరేంద్ర, శ్రావణ భార్గవి
నటీనటులు: రాణా దగ్గుబాటి, నయనతార
దర్శకత్వం: క్రిష్
నిర్మాతలు: సాయి బాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి
విడుదల తేది: 30.11.2012
అరెరే పసి మనసా చేజారే వరసా
చెబితే వినవటె వయసా...
మరుపే మొదటి దిశ అటుపై దాని దిశ
తెలుపదు చిలిపి తమాషా...
తననొదిలి ఎటువైపు కను కదలని చూపు
నిను మరచిన తలపు వినదిక నీ పిలుపు
ఊహ విహారమా సాగే సరాగమా
సరదా తగదు సుమ సుతారమా
పాపా జాగ్రత్తే పరాకుల్లో పడతావే
పాపా జాగ్రత్తే పరాకుల్లో పడతావే
చూస్తూ చూస్తూ సుడిలో దిగిపోతావే
అరెరే పసి మనసా చేజారే వరసా
చెబితే వినవటె వయసా...
మరుపే మొదటి దిశ అటుపై దాని దిశ
తెలుపదు చిలిపి తమాషా...
అవునా... ఇతనేనా ఇన్నాళ్ళు యెదరున్నది కాదా మరి
అయినా... ఇంతకుముందేనాడు పరిచయమైనా లేనట్టుంది
ఎపుడు ఇలాంటి ఓ మలుపు ఈ ప్రయాణంలో కనిపించిందా
వయసుకు ఇదే మేలుకొలుపు ఈ ముహుర్తంలో అనిపించిందా
కదిలే ఒకో క్షణం నడిపే మనోరధం
తెలిపి కథా క్రమం ఏం చెబుతాం
పాపా జాగ్రత్తే పరాకుల్లో పడతావే
వద్దొద్దంటునే పరాకుల్లో పడుతున్నా
పాపా జాగ్రత్తే పరాకుల్లో పడతావే
చూస్తూ చూస్తూ సుడిలో దిగిపోతావే
అబలా... ఏమైపొతున్నావే సుడిగాలిలో చిగురాకులా
నువ్వలా... ఎప్పుడు గుర్తిస్తావే తరిమేదెవరో నిలిపేదెపుడో
నీలో ఇదే కదా మొదలు ఈ నిషా లయలు గమనించావా
లోలో అదోలాంటి గుబులు ఎందుకో అసలు కనిపెట్టవా
ఏదో అయోమయం అయినా మహా ప్రియం
దాన్నే కదా మనం ప్రేమంటాం
******** ********* *********
చిత్రం: కృష్ణం వందే జగద్గురుం (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: యస్.పి. బాల సుబ్రహ్మణ్యం
జరుగుతున్నది జగన్నాటకం
జరుగుతున్నది జగన్నాటకం
పురాతనపు పురాణ వర్ణన
పైకి కనపడుతున్న కథనం
నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం
జరుగుతున్నది జగన్నాటకం
జరుగుతున్నది జగన్నాటకం
చెలియలి కట్టను తెంచుకుని,
విలయము విజ్రు౦భించునని
ధర్మ మూలమే మరచిన జగతిని
యుగాంత మెదురై ముంచునని
సత్యం వ్రతునకు సాక్షాత్కరించి
సృష్టి రక్షణకు చేయూత నిచ్చి
నావగా త్రోవను చూపిన సత్యం
కాలగతిని సవరించిన సాక్ష్యం
చేయ దలచిన మహాత్కార్యము మోయజాలని భారమైతే
పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే
బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక
ఓటమిని ఓడించ గలిగిన ఓరిమి కూర్మమన్నది క్షీరసాగర మథన మర్మం
ఉనికిని నిలిపే ఇలను కడలిలో
కల్పగా నురికే ఉన్మాదమ్మును
నరాల దంష్ట్రుల ఉల్లగించి
ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల
ధీరోద్ధరితరిణ హుంకారం
ఆది వరాహపు ఆకారం
ఏడి ఎక్కడ రా?
నీ హరి దాక్కున్నాడే రా? భయపడి
బయటకు రమ్మనరా ...
ఎదుటపడి నన్ను గెలవగాలడా ! తలపడి ?
నువ్వు నిలిచిన ఈ నేలను అడుగు
నాడుల జీవ జలమ్ము ని అడుగు
నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు
నీ ఊపిరిలో గాలిని అడుగు
నీ అడుగులో ఆకాశాన్నడుగు
నీలో నరుని హరిని కలుపు
నీవే నరహరివని నువ్ తెలుపు
ఉన్మత్త మాతంగ బంధికాతుక వికతి
హంత్రు సంక్రాతనీ క్రుడని విడనీ జగతి
అహము రధమై యెతికె అవనికిదె అసనిహతిఆకతాయుల నిహతి అనివర్యమవు నియతి
శిత హస్తి హత మస్త కారినక సవకాసియో
క్రూరాసి క్రోసి హ్రుతదాయ దంష్ట్రుల దోసి మసి చేయ మహిత యజ్ఞం
అమేయమనూహ్యమనంత విశ్వం
ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం
కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం
ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం
జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగ జగన్నాటకం
జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగ జగమే నాటకం
పాపపు తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మగ్లానిని పెరుకగ
పరశురాముడై భయదభీముడై పరశురాముడై భయద భీముడై
ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన శ్రోత్రియ క్షత్రియ తత్వమె భార్గవుడు
ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మశక్యము గాని ఏ మర్మమూ లేక
మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగ మహిని మిగలగలిగే మనికి
సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలిచె
ఇన్ని రీతులుగ ఇన్నిన్ని పాత్రలుగ నిన్ను నీకె నూత్న పరిచితునిగ
దర్శింపజేయగల జ్ఞాన దర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణతరణము
అణిమగా… మహిమగా… గరిమగా… లఘిమగా…
ప్రాప్తిగా… ప్రాకామ్యవర్తిగా….ఈశత్వముగా… వశిత్వమ్ముగా…
నీలోని అష్తసిద్ధులు నీకు కన్వట్టగా స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా
నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగ
తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే
వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం….
కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం
వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం….
కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం
*********** *********** ***********
చిత్రం: కృష్ణం వందే జగద్గురుం (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: ఈ. ఎస్.మూర్తి
గానం: శ్రేయగోషల్, రాహుల్ సిప్లిగంజ్, దీపు
సై అంద్రె నాను సై అందిర నమ్మస తీర్సు నడి అంటిర సై అంద్రె నాను సై అందిర నమ్మస తీర్సు నడి అంటిర బల్లారి బాబ బావెగ రారా మైసురు రంగోల మనవెత్తుకుంటర బల్లారి బాబ బావెగ రారా మైసురు రంగోల మనవెత్తుకుంటర
బావలందరివార... రార బొబ్బిలిరాజ ఆ అడ్డు పొడుగు ఎందిరో సురిడల్లె నీలొ సురుకేదొ ఉందిరో సూపుల్లొ సూదులు ఉంటె సరసం ఎట్టయ్యొ బల్లారి బాబ బావెగ రారా మైసురు రంగోల మనవెత్తుకుంటర
బల్లారి బాబ బావెగ రారా మైసురు రంగోల మనవెత్తుకుంటర
ఊరించి వెడెక్కించె మొగరాయుడు వీలున్న వద్దంటాదు ఏం రసికుడు ఆ కండదండల్లో సరుకెంతని సూపిస్తె పోయెది ఎముందని
రంగోల రంగోలా ఏ.... ఒ.... రంగోల రంగోలా రంజయినా రంగసానివే ఆ భ్ డ్ ఛ్ లైన నాకింక రావులె
మాటల్థొ మస్కా కొట్టె మాయలమారివిలే రంగొల రమ్మంటె రాలేని ఎర్రొల్లు ఇనుమల్లె ఎన్నున్న ఎంచెసుకుంటారు అతడు: బల్లారి బాబ బావెగ రారా మైసురు రంగోల మనవెత్తుకుంటర
ఒంటరిగా ఉంటె చాలు అమ్మాయిలు మోజులతో వెంటొస్తారు రస రాజులు ఒల్లంత ఊపిరులు తగిలేంతలా పైపైకి వస్తారు వడగాలిలా అతడు: రంగోల రంగోలా ఎ.. ఎ.... రంగోల రంగోలా మీరేమొ అగ్గిరవ్వలు సొకంత ఎరవేసి కిర్రెక్కించే కొరకంచులు
నీ ఎడి సల్లారాక గుర్తుండేదెవరు బిసిలెరి బొట్టిల్లా ఆడోల్ల అందాలు లాగేసి ఇసిరెస్తారు తీరాక తాపాలు
బల్లారి బాబ బావెగ రారా మైసురు రంగోల మనవెత్తుకుంటర బల్లారి బాబ బావెగ రారా మైసురు రంగోల మనవెత్తుకుంటర
*********** *********** ***********
చిత్రం: కృష్ణం వందే జగద్గురుం (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాయి మాధవ్ బుర్రా
గానం: రఘుబాబు, హేమచంద్ర, సాయి మాధవ్ బుర్రా
రంగమార్తాండ బీటెక్ బాబు
రంగులు మార్చే బూటక బాబు once more..
రంగమార్తాండ బీటెక్ బాబు
రంగులు మార్చే బూటక బాబు
వీడికి తెలియని నాటకముంటుందా
మిలమిల మెరుపుల మేకప్ అతుకు
తళతళ లాడే తగరపు బతుకు
పరుసును తీస్తే పైసా ఉండదు రా
ఏర మనకేరా తెర లాగితే కింగే రా
మూడు పెగ్గులు ఆరు విగ్గులు పంచుకు బతకాలా
చరణం: 1
లోకం మయసభ ఆటరా కాలు జారి పడబోకురా
నాకు నేనే రా రాజురా నవ్వే ద్రౌపది లేదురా
లైఫ్ ఓ డ్రామ, విను విశ్వదాభి రామా
లైటు ఆరినా లైను మారినా సీను సీతారాం రా
పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేయరా
జెండా పై కపిరాజంటు జెండా ఎగరేయరా
చరణం: 2
రిస్కు చేస్తే నో లాసు రా
అందుకుంది అట్లాసు రా
లక్ అడ్రెస్సు వెతకరా
జిందగి నీది బతుకరా
మాయ మశ్చింద్రా మేగిక్ చేసేయరా
లైఫ్ కొంచెము ఆశ లంచము ఇచ్చి పెంచుకోరా
పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేయరా
జెండా పై కపిరాజంటు జెండా ఎగరేయరా
యా యా యా
పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేయరా
జెండా పై కపిరాజంటు జెండా ఎగరేయరా