చిత్రం: కుంతీపుత్రుడు (1993) సంగీతం: ఇళయరాజా నటీనటులు: మోహన్ బాబు, విజయశాంతి దర్శకత్వం: దాసరి నారాయణరావు నిర్మాత: మోహన్ బాబు విడుదల తేది: 29.08.1993
Songs List:
గుమ్మాలు తొమ్మిది (Female) పాట సాహిత్యం
చిత్రం: కుంతీపుత్రుడు (1993) సంగీతం : ఇళయరాజా సాహిత్యం: జాలాది గానం: గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది ఏ దరి వచ్చావురా జీవ ఏ దరి పోయేవురా గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది ఏ దరి వచ్చావురా జీవ ఏ దరి పోయేవురా
గుమ్మాలు తొమ్మిది (Male) పాట సాహిత్యం
చిత్రం: కుంతీపుత్రుడు (1993) సంగీతం : ఇళయరాజా సాహిత్యం: జాలాది గానం: కె.జె. యేసుదాసు గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది ఏ దరి వచ్చావురా జీవ ఏ దరి పోయేవురా గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది ఏ దరి వచ్చావురా జీవ ఏ దరి పోయేవురా నీ కోపమే నీకు కొరివిలాంటిది లోలోపలే నిన్ను కాల్చుతుంటది ద్వేషమును చంపుకుని స్నేహమును పెంచుకొని క్షేమమును ఎంచుకుని ప్రేమనే పంచుకుని జీవించారా నే మేలెంచారా లేకుంటే నీ బతుకు ఇంతేనురా గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది ఏ దరి వచ్చావురా జీవ ఏ దరి పోయేవురా గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది ఏ దరి వచ్చావురా జీవ ఏ దరి పోయేవురా కడుపు కోత జీవితాల కథ ఇదెనురా కన్నీళ్లు తల్లి ఋణము తీర్చలేవురా పేగు తెంచుకున్నది జోల పాడుతుంటది కన్ను మూసుకున్నది మన్ను కలిసి పోతది ఏది నీదిరా మరి కానిదేదిరా వాదాల బతుకు ఎపుడు బాధేనురా గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది ఏ దరి వచ్చావురా జీవ ఏ దరి పోయేవురా గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది ఏ దరి వచ్చావురా జీవ ఏ దరి పోయేవురా చేతి చిటికేనేళ్లు కలిసి కల్యాణమై కాళీ బొటన వేళ్ళు కలిసి నిర్యాణమై కాలమంతా తీరినా కాళ్ళు లేకపోయినా చావలేక బతికినా బతుకు చావు కోరిన మోత ఒకటి రా ఆ రాత ఒకటి రా ఆఖరికి ఆరడుగులు నెల మిగులురా గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది ఏ దరి వచ్చావురా జీవ ఏ దారి పోయేవురా మాసాలు మోసేటి ఈ మాయ జన్మకు వాసాల పరుపంటరా జీవ పోసేది తుల్సాకు నీళ్లెరా గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది ఏ దారి వచ్చావురా జీవ ఏ దారి పోయేవురా గుమ్మాలు తొమ్మిది గుండేమో చిన్నది ఏ దారి వచ్చావురా జీవ ఏ దారి పోయేవురా
జోడు గిత్తల బండి పాట సాహిత్యం
చిత్రం: కుంతీపుత్రుడు (1993) సంగీతం : ఇళయరాజా సాహిత్యం: జాలాది గానం: యస్.పి.బాలు, సుశీల జోడు గిత్తల బండి జోరెక్కువేనమ్మా సుందరి ఆ జానా బెత్తెడు తోవ దాటాకనే మల్లె పందిరి జోడు గిత్తల బండి జోరెక్కువేనమ్మా సుందరి ఆ జానా బెత్తెడు తోవ దాటాకనే మల్లె పందిరి చర్నాకోలా మోత ఇన్నాను జలకట్టు ముందుకొచ్చాను ఎడి నీళ్లు తోడి ఉంచాను లోనకొస్తే లాల పోస్తాను వగలాడి అరకోడి చద్దికి సరిపడా పులుసుండా జోడు గిత్తల బండి జోరెక్కువేనమ్మా సుందరి ఆ జానా బెత్తెడు తోవ దాటాకనే మల్లె పందిరి మెరక వీధి పడుచుకి పడుచుకి పడుచుకి పడుచుకి బారు కుచ్చు జడలకి జడలకి జడలకి జడలకి మెరక వీధి పడుచుకి బారు కుచ్చు జడలకి ఒక మొగ్గ పెట్టాడే నిగ్గదీసి ఒక మొగ్గ పెట్టాడే నిగ్గదీసి ఆ పాయ పాయ లోని చిక్కు దీసి కదలకుండా పడుచుకి పడుచుకి పడుచుకి పడుచుకి గట్టిగేసి జడలకి జడలకి జడలకి జడలకి కదలకుండా పడుచుకి గట్టిగేసి జడలకి విడదీసి కుట్టాలి మొగలి మొగ్గ జడ యెంత బారుందో అంత లెక్క దరువే వేసేయ్ సరిగా చేసేయ్ ఒంపుల జడానికా తకధిమితోమ్ జోడు గిత్తల బండి జోరెక్కువేనమ్మా సుందరి ఆ జానా బెత్తెడు తోవ దాటాకనే మల్లె పందిరి తమలపాకు మడతకి మడతకి మడతకి మడతకి పోకచెక్క బుడిపెకి బుడిపెకి బుడిపెకి బుడిపెకి తమలపాకు మడతకి పోకచెక్క బుడిపెకి తడిసున్నాం కావాలె రంగసాని తడిసున్నాం కావాలె రంగసాని ఆ జాజికాయ జోడు చేసుకుని పడకటింటి పిలుపుకి పిలుపుకి పిలుపుకి పిలుపుకి పిల్లదాని ఎరుపుకి ఎరుపుకి ఎరుపుకి ఎరుపుకి పడకటింటి పిలుపుకి పిల్లదాని ఎరుపుకి కొసమెరుపు దిద్దాలి అందగాడా కొసమెరుపు దిద్దాలి అందగాడా ఆ పెదవి అంచు మీద ఆడుకోరా ఎగుడే అయినా దిగుడే అయినా ఇద్దరి రెపరెప తరికితథోమ్ జోడు గిత్తల బండి జోరెక్కువేనమ్మా సుందరి ఆ జానా బెత్తెడు తోవ దాటాకనే మల్లె పందిరి
లే లే బాబా నిదురలేవయ్యా పాట సాహిత్యం
చిత్రం: కుంతీపుత్రుడు (1993) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సి.నారాయణరెడ్డి గానం: కె.జె. యేసుదాసు లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్య రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చరగ తలుపు తీసెరా బాబా లే లే లే లే లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా వేగు చుక్క తిలకమెట్టి వేద మంత్ర పువ్వులు పెట్టీ ఆ... వేగు చుక్క తిలకమెట్టి వేద మంత్ర పువ్వులు పెట్టీ పాద సేవ చేసుకునే వేల దాటిపోయెనని ప్రశ్నవేయకుంటే మంచిదే ఇద్దరికీ పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికి అందుకనె గుండె నీ గురు పీఠమైనది ఆరాధ్య దైవమని కొని యాడుతున్నది అంతకుమించిన భాగ్యమేదిరా బాబా లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చరగ తలుపు తీసెరా బాబా లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై లోకములు కాచే తండ్రివి నీవేనని రూపములనేకములైన శ్రీ సాయిని నమ్ముకున్న వారికెల్ల నారాయణాత్మవై కుమ్మరించు వరములే సుఖ శాంతి నెలవులై వెన్నంటి నువ్వుంటే లోటే లేదురా బాబా లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చరగ తలుపు తీసెరా బాబా లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా
నాట్య కలాపం నవరస యోగం పాట సాహిత్యం
చిత్రం: కుంతీపుత్రుడు (1993) సంగీతం : ఇళయరాజా సాహిత్యం: గానం: నాట్య కలాపం నవరస యోగం
ఒక హృదయము పలికిన పాట సాహిత్యం
చిత్రం: కుంతీపుత్రుడు (1993) సంగీతం : ఇళయరాజా సాహిత్యం: రసరాజు గానం: కె.జె. యేసుదాసు పల్లవి : ఒక హృదయము పలికిన సరిగమ స్వరము ఇది ఎవరాపిన ఆగని సంధ్యారాగమిది ఓ మేఘమా ఆ నింగిలో ఈ పాటనే వినిపించవే నా మైథిలి లేకుంటే ఎందుకు నాకు ఈ జీవితం చరణం: 1 ఆకాశవీధిలో ఆషాఢమాసాన మేఘమై ఆ కాళిదాసులో అందాల సందేశ రాగమై నాలోని ప్రేమ విరులై పూయగా నా గుండె గొంతు వలపై కూయగా గారీసా గరీ సానిదా పామగరి పమగరిస నిసరి రీగమప రిగమప దనిసరి సారి నిసారి నిసరిమ గారిస నిసరీ సని సానిదా నీదపా నిసరిమా గమపసా నిదప గరిస రిసనిసని దపదమగరి నిసరి నిసారీ గా సరీ చరణం: 2 ఏనాటి బంధమో ఈనాడు ఊగించె నన్నిలా ఏ పూలగంధమో నాపైన చల్లింది వెన్నెల ఆ ప్రేమకే నేను పూజారిగా ఆ గుండెలో చిన్న దీపానిగా గరిగ సరి నిసరీ నిసారీ రిగరి సనిస దపా గమాపా.. సనిసరి సగ రిమగ గరిగమ గపమదపా... పమపని దసనిరిసా దపదస నిరిసగరీ... రిగరి సనిదప సరినిరిగరిగ రీగ రీగ రీగ మగ సరిగామగామగామగ గరీసా నిరిసానీ దసాని దాపా రిసానీ దసానీ దప దపామాగా రిగామాప గమాపాద... మపదని సగరిసనిద పగరిగరి పరిసరిస... రిసనిదప మగపమగ దపనిదప మగరిస... రినిసనిదప మగరిసని
ఓం జయ మహాదేవ పాట సాహిత్యం
చిత్రం: కుంతీపుత్రుడు (1993) సంగీతం : ఇళయరాజా సాహిత్యం: గానం: ఓం జయ మహాదేవ
పైట లాగి పాట సాహిత్యం
చిత్రం: కుంతీపుత్రుడు (1993) సంగీతం : ఇళయరాజా సాహిత్యం: గానం: పైట లాగి
శ్రీ నటరాజ నమో పాట సాహిత్యం
చిత్రం: కుంతీపుత్రుడు (1993) సంగీతం : ఇళయరాజా సాహిత్యం: గానం: శ్రీ నటరాజ నమో