చిత్రం: ఖుషి క ఖుషిగా (2004)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: ఉమా మహేశ్వరరావు
గానం: హరిహరన్ మాతాంగి
నటీనటులు: జగపతిబాబు, వేణు, రమ్యకృష్ణ , సంగీత, నిఖిత
దర్శకత్వం: జి. రాంప్రసాద్
నిర్మాత: ఆదిత్య రామ్
విడుదల తేది: 16.04.2004
తీయని ఈ నిజం చెప్పనా... నిను చేరింది మనసే...
దాగని ఈ నిజం విప్పనా... నిను కోరింది వయసే...
నా ప్రతీ ఊహలో నువ్వే ఉన్నావనీ...
ఈ ప్రియ భావనా తెలిపే రోజేదనీ...
నిలదీసాను చిరుగాలినీ...
యవ్వనం నిధిలా దాచి..ఇవ్వనా కానుక చేసి
వేచి... తలుపు తెర తీసీ...
తారలా మెరిసే చెలికి చేరనా తళుకై దరికి
నీడై ఆమెకొక తోడై...
ఇలా ఎంత కాలం సదా బ్రహ్మచర్యం...
ఎలా చేరుకోను ప్రియా ప్రేమ సౌధం...
తెలియకనే అదిరినదా అధరం...
నా యెదలో నీ స్వప్నం మధురం...
దరి చేరాలి మురళీధరా...
నిన్ను నా సిగలో తురిమి చెయ్యనా త్వరగా చెలిమి
యోగి.. ప్రేమ రసభోగి...
రాలుతూ చినుకై ఎదుట రాత నై చెలి నీ నుదుట
వుంటా పైట పొదరింటా
ఎలా దాచుకోను ప్రియా కన్నె ప్రాయం...
ఇలా ఇవ్వరాదా చెలీ సొగసు దానం...
నీ తలపే ప్రతి నిముషం మురిపెం..
నీ కొరకే నా హృదయం పయనం...
ఇటు రావయ్య నవ మన్మధా...
********* ********* ********
చిత్రం: ఖుషీ ఖుషీగా (2004)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: మూర్తి
గానం: రాజేష్, శ్రేయా ఘోషల్
గోదారి గట్టుంది ఎవరూ లేరంటోంది
అదిగో ఆ కొబ్బరి తోట ఆడుకోను రమ్మంది
రావాలని మనసుంది ఐనా ఓ గుబులుంది
ఇట్టా నువ్వల్లరి చేస్తే ఆశ పెరిగిపోతుంది
గోరువంక వింటోంది కబురులెందుకంటోంది
కన్నెమనసు ఔనందీ ఏడిపించకే అంది
గోదారి గట్టుంది ఎవరూ లేరంటోంది
అదిగో ఆ కొబ్బరి తోట ఆడుకోను రమ్మంది
కాకెంగిలి కలకండ వడపప్పు బెల్లాలు
తింటూ వరిచేలల్లో పడి లేస్తూ పకపకలూ
ఆ మామిడి తోటల్లో ఆడిన దొంగాటల్లో
నన్నే మురిపిస్తూ ముద్దులు పెట్టిన ముచ్చటలూ
ఈ సరదా సంతోషం నీకేగా మరి సొంతం
అని అంటూ వినమంటూ ఆ పాలపిట్ట పాడింది
గోదారి గట్టుంది ఎవరూ లేరంటోంది
ఇట్టా నువ్వల్లరి చేస్తే ఆశ పెరిగిపోతుంది