Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Lankeswarudu (1989)





చిత్రం: లంకేశ్వరుడు (1989)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: చిరంజీవి, రాధ, రేవతి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: వడ్డే రమేష్
విడుదల తేది: 27.10.1989



Songs List:



జివ్వుమని కొండగాలి పాట సాహిత్యం

 
చిత్రం: లంకేశ్వరుడు (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: మనో, యస్. జానకి

జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది
వెచ్చనీ.. కోరికా.. రగిలిందిలే
నీవే నా ప్రేయసివే
నీకేలే అందుకో ప్రేమ గీతం

కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది
తియ్యనీ.. కానుకా.. దొరికిందిలే
నీవే నా ప్రేమవులే
నీకేలే అందుకో ప్రేమ గీతం
 
జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది

ఒంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
ఒంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది 
కాశ్మీర కొండల్లో అందాలకే
కొత్త అందాలు ఇచ్చావో...
కాశ్మీర వాగుల్లో పరుగులకే
కొత్త అడుగుల్ని నేర్పావో...
నేనే నిను కోరి చేరి వాలి పోవాలి

కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది
 
మంచల్లే కరగాలి మురిపాలు
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు 
మంచల్లే కరగాలి మురిపాలు
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు
కొమ్మల్లొ పూలన్ని పానుపుగా
మన ముందుంచే పూలగాలీ...
పూవుల్లొ దాగున్న అందాలనే
మన ముందుంచే గంధాలుగా...
నేనే నిను కోరి చేరి వాలి పోవాలి
 
జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది
కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది



కన్నె పిల్ల వేడికీ పాట సాహిత్యం

 
చిత్రం: లంకేశ్వరుడు (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: మనో, యస్. జానకి

కందిరీగ నడుము ఎగురుంతోందీ పట్టుకోరాదా
వలపు వలలతాడు కట్టి ఉంది వాలిపో రాధా
కందిరీగ నడుము ఎగురుంతోందీ పట్టుకోరాదా
వలపు వలలతాడు కట్టి ఉంది వాలిపో రాధా
సుడిగాలిలాగా చుట్టెయ్యలేవా
నింగికి నే నిచ్చనెయానా...అక్కడ ఓ మేడ కట్టనా

భలే భలే అదే అదే అందమైన విందు అందే కాదా
కన్నె పిల్ల వేడికీ ఓం నమహా
రగులుతున్న ప్రేమకి ఓం నమహా

మనసు రగులుతోనీ మండుతోంది ఆర్పరా రాధా
కుర్ర కారు వానా దంచుతోంది తడిచిపోరాదా
మనసు రగులుతోనీ మండుతోంది ఆర్పరారాదా
కుర్ర కారు వానా దంచుతోంది తడిచిపో రాధా
కురిపించు వాన లోలోతుల్లోనా
వరదలాగ పొంగితే మదీ వయసు గట్టు పగలదా మరీ

భలే భలే అదే అదే అందమైన విందు అందే కాదా
కన్నె పిల్ల వేడికీ ఓం నమహా
రగులుతున్న ప్రేమకి ఓం నమహా

ఆ ఇంద్రుని మరచీ దివినే విడిచీ
నిలిచింది నీకై ఊర్వసిగా
చూసి చూదని చూపె తెలిపెను నన్నే ప్రేయసిగా
కన్నె పిల్ల వేడికీ ఓం నమహా
రగులుతున్న ప్రేమకి ఓం నమహా



పదహారేళ్ళ వయసు పాట సాహిత్యం

 
చిత్రం:  లంకేశ్వరుడు (1989)
సంగీతం:  రాజ్-కోటి
సాహిత్యం:  దాసరి
గానం:  యస్.పి.బాలు,  జానకి

పల్లవి: 
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పదహారేళ్ళ వయసు
పడిపడి లేచే మనసు

పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

చరణం: 1
రెండు రెండు కళ్ళు.. చూడ చూడ ఒళ్ళు
వేడి వేడి సెగలు.. ప్రేమ కోరు పొగలు
చూడ గుండె ఝల్లు.. లోన వానజల్లు
లేనిపోని దిగులు.. రేయిపగలు రగులు
ఆడ పిల్ల సబ్బు బిళ్ళ రాసుకుంటే
కన్నె పిల్ల అగ్గి పుల్ల రాజుకుంటే
ఆడ పిల్ల సబ్బు బిళ్ళ.. కన్నె పిల్ల అగ్గి పుల్ల
రాసుకుంటే.. రాజుకుంటే

పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు 

చరణం: 2
పిల్లదాని ఊపు .. కుర్రకారు ఆపు
పైన చూడ పొగరు..  లోన చూడ వగరు
పిల్ల కాదు పిడుగు..  గుండె కోసి అడుగు
దాచలేని ఉడుకు..  దోచుకోని సరుకు
అందమైన ఆడపిల్ల పట్టుకుంటే
చూడలేక చందమామ తప్పుకుంటే
అందమైన ఆడపిల్ల..  చూడలేక చందమామ
పట్టుకుంటే తప్పుకుంటే

పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు

పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో



పోతే పోనీ పోరా పాట సాహిత్యం

 
చిత్రం:  లంకేశ్వరుడు (1989)
సంగీతం:  రాజ్-కోటి
సాహిత్యం:  దాసరి
గానం:  మనో 

i am back yes i am back
i am back...i am back
సహించలేను భరించలేను
భరించి నిన్ను నేను విడిచి ఉండలేను
అయోమయం ఒకే భయం
ఒకరికొకరు ఎవరికెవ్వరూ నో నో నో నో
పోతే పోనీ పోరా చెల్లే లేదనుకోరా

i am back...i am back
i am back yes i am back

నారుని తెచ్చీ నీరుని పోసీ మొక్కను పెంచున మాలీ
నారుని తెచ్చీ నీరుని పోసీ మొక్కను పెంచున మాలీ
నీదని నమ్మకూ నాలా అవ్వకూ
నీదని నమ్మకూ నాలా అవ్వకూ
నమ్మవో....finish finish finish
పుట్టేటప్పుడు నీతో వచ్చినదెవరూ
పోయేటప్పుడు నీతో వచ్హేదెవరూ

పోతే పోనీ పోరా చెల్లే లేదనుకోరా

i am back yes i am back
i am back...i am back

గుండెను కోసి ప్రాణం పోసీ ప్రేమగ పెంచిన చెల్లీ
గుండెను కోసి ప్రాణం పోసీ ప్రేమగ పెంచిన చెల్లీ
నీదని పిలవకూ ఏదని అదగకూ
నీదని పిలవకూ ఏదని అదగకూ
అడిగావో...finish finish finish
పెల్లికి ముందు అన్ని దైవం సర్వం
తాలే పడితే అన్న గిన్న సూన్యం

పోతే పోనీ పోరా చెల్లే లేదనుకోరా

i am back yes i am back
i am back...i am back
సహించలేను భరించలేను
భరించి నిన్ను నేను విడిచి ఉండలేను
అయోమయం ఒకే భయం
ఒకరికొకరు ఎవరికెవ్వరూ నో నో నో నో
పోతే పోనీ పోరా చెల్లే లేదనుకోరా

you are sad....yes i am sad
you are mad...yes i am mad
you are mad mad mad mad




ఏ బాబు ఎ ఎ బాబు పాట సాహిత్యం

 
చిత్రం: లంకేశ్వరుడు (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: దాసరి నారాయణరావు
గానం: మనో, యస్. జానకి

ఏ బాబు ఎ ఎ బాబు ఏదో ఒకటి చేద్దాం బాబు
నిన్నటి కల్లో మొన్నటి కల్లో నిన్నటి కల్లో మొన్నటి కల్లో
తల్లో ఒళ్ళో  హోలు మొత్తం నువ్వే నువ్వే బాబు
ఏ పాప ఎ ఎ పాప ఏదో ఒకటి చేద్దాం పాప
నిన్నటి కల్లో మొన్నటి కల్లో నిన్నటి కల్లో మొన్నటి కల్లో
తల్లో ఒళ్ళో హోలు మొత్తం నువ్వే నువ్వే నువ్వే పాప

ఏ బాబు ఎ ఎ బాబు ఏదో ఒకటి చేద్దాం బాబు

బుస గొట్టె నాగుల్లాగ నువ్వు నేను రేగాలి
కసి తిరా కింద మీదా ఆడాలి
సడి రేగి గుండల్లోన నన్నె చుట్టుకుపొవలి
చలరేగి మంటల్లోన కాల్చాలి
ఇది ఏమి సరుకో - అమ్మయి చురుకో
ఇది ఏమి సరుకో - అమ్మయి చురుకో
తాకిందమ్మో - సోకిందమ్మో
రేగిందమ్మో  - లేచిందమ్మో
తల్లో ఒళ్ళో హోలు మొత్తం నువ్వే నువ్వే బాబు

ఏ బాబు ఎ ఎ బాబు ఏదో ఒకటి చేద్దాం బాబు

విసిరేసే గాలి వాన నీలో నాలో కురవాలి
తడిపేసి నాలో నిన్ను కలపాలి
పడి లేచే  కెరటాలల్లె ఆటుపోటు చూడాలి
అసలైన లోతుల్లోన మునగాలి
ఇది ఏమి సలుపో  - అమ్మాయి బులుపో
ఇది ఏమి సలుపో  - అమ్మాయి బులుపో
కాటేసింది - వాటెసింది 
తడిమేసింది - కుదిపేసింది
తల్లో ఒళ్ళో హోలు మొత్తం నువ్వే నువ్వే బాబు

ఏ పాప ఎ ఎ పాప ఏదో ఒకటి చేద్దాం పాప
నిన్నటి కల్లో మొన్నటి కల్లో నిన్నటి కల్లో మొన్నటి కల్లో
తల్లో ఒళ్ళో హోలు మొత్తం నువ్వే నువ్వే నువ్వే పాప
ఏ బాబు ఎ ఎ బాబు ఏదో ఒకటి చేద్దాం బాబు
ఏ పాప ఎ ఎ పాప ఏదో ఒకటి చేద్దాం పాప

Most Recent

Default