చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల (సీనియర్) గానం: ఘంటసాల, మల్లిక్, పి.లీల, పి.సుశీల నటీనటులు: ఎన్.టీ ఆర్, టి.ఎల్.కాంతారావు, శోభన్ బాబు, అంజలి దేవి, గిరిజ దర్శకత్వం: సి.పుల్లయ్య, సి.యస్.రావు నిర్మాత: శంకర్ రెడ్డి విడుదల తేది: 29.03.1963
Songs List:
శ్రీ విద్యాం జగతాం (శ్లోకం) సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం గానం: ఘంటసాల శ్లో॥ శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గ స్థితి లమేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సున్దరీమ్॥
నవరత్నోజ్వల కాంతివంతమిది (పద్యం) సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం గానం: ఘంటసాల వశిష్ఠుడు : మ॥ నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యంబైన సూర్యాన్వయో ద్భవ రాజన్యులు మున్ను దాల్చి గరిమన్ పాలించి కీ భూమి సం స్థవనీయంబగు నీ కిరీటము శిరోధార్యంబు నీ కి యెడన్ భువి పాలింపు ప్రజానురంజకముగా మోదంబుతో రాఘవా
జయ జయ రామా శ్రీరామా పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం గానం: రాఘవులు, సరోజనిబృందం జయ జయ రామా శ్రీరామా దశరధ తనయా జై జయహో సుందర నామా సూనృత కామా సుగుణధామ సూర్యాన్వయ సోమా అహల్యా సతీ శాపవిరామా శివకారు కహర జానకీవరా
రామన్న రాముడు కోదండ రాముడు పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల సీనియర్ గానం: కె.జమునారాణి, పి.సుశీల రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామ చంద్రుడు వచ్చాడురా హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామ చంద్రుడు వచ్చాడురా హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా నెల మూడు వానలు కురిసేనురా బంగారు పంటలు పండేనురా నెల మూడు వానలు కురిసేనురా బంగారు పంటలు పండేనురా కష్టజీవుల వెతలు తీరేనురా బీదా సాదా బ్రతుకు మారేనురా రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామ చంద్రుడు వచ్చాడురా హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా రామయ్య వంటి కొడుకు రావాలనే సీతమ్మ వంటి బిడ్డ కావాలనే రామయ్య వంటి కొడుకు రావాలనే సీతమ్మ వంటి బిడ్డ కావాలనే ఇల్లు వాకిలి పరువు నిలపాలనే చల్లంగ నూరేళ్ళు వెలగాలనే రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామ చంద్రుడు వచ్చాడురా హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా పేదతనము భూమి మీద ఉండబోదురా భేదాలకికమీద తావులేదురా పేదతనము భూమి మీద ఉండబోదురా భేదాలకికమీద తావులేదురా దొంగ తోడుబోతు బాధ తొలగిపోవురా రామరాజ్యమాయే మనకు లోటులేదురా రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామ చంద్రుడు వచ్చాడురా హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా న్యాయమ్ము పాలించి నడుపువాడురా ధర్మమ్ము గిరిగీసి నిలుపుతాడురా న్యాయమ్ము పాలించి నడుపువాడురా ధర్మమ్ము గిరిగీసి నిలుపుతాడురా మునులందరినీ గాచు మొనగాడురా ముందుగా చెయ్యెత్తి మొక్కుదామురా రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామ చంద్రుడు వచ్చాడురా హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామ చంద్రుడు వచ్చాడురా హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా హోయ్
సప్తాశ్వరథ మారూఢం పాట సాహిత్యం
సూర్య స్తుతి - శ్రీరాముడు పాడినవారు: ఘంటసాల శ్లో॥ సప్తాశ్వరథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
విరిసె చల్లని వెన్నెలా పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల (సీనియర్) గానం: యస్.జానకి విరిసె చల్లని వెన్నెలా మరల ఈనాడు మా కన్నులా చెన్నుమీర జానకమ్మ అంకమ్మున - వామాంకమ్మున మా కన్నుదోయి విందుచేసె మా రాముడు - కరుణా ధాముడు మది నెన్నో వింత సంబరాలు మీరగా మరువగరానీ పండగ నేడు మా పాలికీ - సర్వ జీవాళికి మా ఊరూనాడూ వెలి విరిసె ఉల్లాసము మధురోల్లాసము ధర పొంగీ పోయీ ఆటలాడే హాయిగా
రావణు సంహరించి పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం గానం: ఘంటసాల వాల్మీకి ఉ॥ రావణు సంహరించి, రఘురాముడు దుర్భర కీలి కీలలన్ పావనియైన సీత, నసమాన పతివ్రత లోకమాత నం భావనజేసి గైకొని, సుపర్వులు మెచ్చగ, లక్ష్మణుండు. సు గ్రీవుడు, వాయునందనుడు, ప్రీతిని గొల్వ అయోధ్య కేరినన్ ॥
వెయ్యర దెబ్బ (చాకిరేవు పాట) పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం గానం: ఘంటసాల, జిక్కీ (పి.జి.క్రిష్ణవేణి) వెయ్యర దెబ్బ దరు వెయ్యర దిబ్బ బల్లమీద దబా బాదర అందాల సుబ్బ ముద్దుమోము యిటు తిప్పే పిల్లా మురిపి తా వెందుకే మూరభిస్తావెందుకే ముద్దూ ముచ్చట లేదంతే మన మిద్దర మొకటే కాదంటే అద్దిర నవ్వా అలాగే మామా ఆలూ మగలం కామా పొద తమానం ముచ్చట లైతే బువ్వెటు లొ త్తది మామా అదేపు సూ తావ్ నిటు కేత్తావ్ అదెవ్వరున్నారే పిల్లా మిటకరించి నను మిర్రున చూసి మిటిక లిరుస్తా వెందుకే అదేటి మామా అలాటి మాటలు అగ్గిలాంటి యిల్లాలిని పదేపదే నన్ననుమానిస్తే పలకను నీతో పోపోదు.
ఒల్లనోరి మామా నీ పిల్లనీ (చాకలి పేట పాట) పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం గానం: ఘంటసాల, జిక్కీ (పి.జి.క్రిష్ణవేణి), రాఘవులు, రాణి ఒల్లనోరి మామా నీ పిల్లనీ నీ పిల్లా దీనిమాటలెల్ల కల్ల సంసారమంత గుల్ల ఒలనంట వెందుకు మామయ్య నా వల్లనేరమేమి అయ్యయ్యో దెయ్యాన్ని కొడుదునా దేవతనీ కొడుదునా నూతులో పడుదునా గోతులో పడుదునా చెయ్ చెమత కారి నాయాలా వూరుకో సూరిగాడి యింటికాడ సూడలేదటే నిన్ను మారుమాట లాడుతావా మాయదారి గుంట నిను సూస్తె వళ్లుమంట అయిందాని కల్లరెందు కల్లుడా ఓరల్లుడా మేనల్లుడు మా అప్పగోరి పిల్లడా మీ అప్పమొగం చూడరా మా యమ్మిని కాపాడరా తప్పేమి చేసింది తమ్ముడా ఇప్పుడు ముప్పేమి వచ్చింది తమ్ముడా తప్పతాగి వున్నావు చెప్పుడు మాటిన్నావు అప్పడగ బోయింది అదీ ఒక తప్పా అప్పా ఓ అప్పా నీ మాటలు నేనొప్పా యిక చాలును మీ గొప్పా నా ఆలి గుణము ఎరుగన నే నేలుకోను తీసుకుపో నీ తాగుబోతు మాటలింక మానరా నే సత్తెమైన యిల్లాలిని చూడరా నే నగి ముట్టుకుంటా అరిచేత పట్టుకుంటా తలమీద పెట్టుకుంటా = చెయ్! ఎర్రిరాముడంటి వోణి కాదొలే గొప్ప శౌర్యమైన యింటబుట్టి నానొలె అగ్గిలోన బడ్డా నువు బుగ్గిలోన బడ్డా పరాయింట వున్న దాన్ని పంచజేరనిస్తానా ఒల్ల నోలె పిల్లా యింకెల్లి పో
ఏ మహనీయ సాధ్వి పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం గానం: ఘంటసాల లక్ష్మణుడు : ఉ॥ ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మ రుద్ర సు త్రాములు హవ్యవాహనుడు ప్రస్తుతి చేసిరొ. అట్టి తల్లి సీ తా మహిళా శిరోమణిని దారుణ కాననవీధి కంపగా నీ మది యెట్లు లొప్పె? నెట నేర్చితి వీ కఠినత్వ మగ్రజా
ఏ నిమిషానికి ఏమి జరుగునో పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం గానం: ఘంటసాల ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ కంచెయె నిజముగ చేను మేసిన కాదనువారెవరు రాజే ఇది నాశనమని పల్కిన ప్రతిఘటించువారెవరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ కరుణామయులిది కాదనలేరా కఠిన కార్యమనబోరా సాద్వులకెపుడు వెతలేనా తీరని దుఃఖపు కథలేనా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ ఇనకులమున జనియించిన నృపతులు ఈ దారుణము సహించెదరా విను వీధిని శ్రేణులుగా నిలచి విడ్డూరముగా చూచెదరా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ ఎండకన్ను ఎరగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు తరచి చూచినా భోదపడవులే దైవ చిద్విలాశాలు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ అగ్ని పరీక్షకే నిలిచిన సాద్విని అనుమానించుట న్యాయమా అల్పుని మాటయే జనవాక్యమ్మని అల్పుని మాటయే జనవాక్యమ్మని అనుసరించుటయే ధర్మమా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ ఎవరూహించెదరూ...
ఇంతకు బూనివచ్చి వచియింపక (పద్యం) సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం గానం: ఘంటసాల లక్ష్మణుడు: ఉ॥ ఇంతకు బూనివచ్చి వచియింపక పోదునె, విన్ము తల్లి. దు శ్చింతులు, దైత్యుచేబడిన సీతను గ్రమ్మఱ నేలుచున్నవా డెంత విమోహి రాముడని, యెగ్గులు వల్కిన నాలకించి, భూ కాంతుడు నిందజెంది నిను గానల లోపల డించి రమ్మనెన్
అపవాద దూషితయైన (పద్యం) సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గానం: పి.సుశీల సీత సీ॥ అపవాద దూషితయైన కాంతను బాసి పతి కీర్తి బొందుట భావ్య మనుము కౌసల్యాదిగా గల్గు నత్తల ను గడు భక్తితో మ్రొక్కులిడితి ననుము తోడికోడండ్ర నా తోడి నే సము నెంచి కడసారి నేమంబు నడిగె ననుము చెలిక తియలు నన్ను బలుమారు దలపోసి యుమ్ములింప నిరుపయోగ మనుము ప్రజల నికమీద మోదంబు బడయు డనుము పతిని నెడబాసి యిక సీత బ్రతుక దనుము జన్మ జన్మంబులకు రామ సార్వభౌము బరమపావను భ రగా బడుతు ననుము
ప్రతిదిన మేను తొవొలుత (పద్యం) సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం గానం: ఘంటసాల లక్ష్మణుడు: చ॥ ప్రతిదిన మేను తొవొలుత పాదములంటి నమస్కరించి, నీ యతులితమైన దీవనల నంది చరింతు, తదీయ భాగ్య మీ గతి యెడమాయె, నింకెపుడు గాంతు భవత్పదపద్మముల్ నమ శృతములు నేతునమ్మ కడసారి గ్రహింపుము జానకీ సతీ.
రాజట, రాజధర్మమట (పద్యం) సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం గానం: ఎస్. వరలక్షి భూదేవి : ఉ॥ రాజట, రాజధర్మమట, రాముడు, గర్భిణియైన భార్య రు ద్రా సురాసురుల్ పొగడ నగ్నిపరీక్షకు నిల్చినట్టి వి భ్రాజిత పుణ్యశీల, నొక బాలికు మాటకు వీడినా, డయో వ్యాజననాధుడెంత కఠినాత్ముడొ. నేను క్షమింపజాల, నా రాజును. రాజ్యమున్ ప్రజల, రెండు ప్రతిక్రియనేయ సుగ్రులై.
కన్నులారగ తుదిసారి కరవుతీర (పద్యం) సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం గానం: పి.సుశీల గీ॥ కన్నులారగ తుదిసారి కరవుతీర వీర శృంగార రామావతారమేను దర్శన మొనర్చి పరవశత్వంబు చెంది. నిన్ను జేరెద నపుడు మన్నింపు మమ్మ.
ఇదె మన యాశ్రమం (పద్యం) సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం గానం: ఘంటసాల వాల్మీ కి : చ॥ ఇదె మన యాశ్రమం బిచట నీవు వసింపుము, లోకపావనీ. సదమలవృత్తి నీకు పరిచర్యలు నేయుడు రీ తపస్వినుల్ ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనించు నీ పదములుసోకి మా యునికి పావనమై చెలువొందు నమ్మరో.
ఎందుకే నా మీద కోపం పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం గానం: పిఠాపురం, కోమలి ఎందుకే నా మీద కోపం ఏమిటే నీ పరితాపం ఇపుడెందుకే నామీద కోపం కోపమెందుకు తాపమెందుకు చేసుకున్న పాపం. ఇదంతా చేసుకున్న పాపం పిల్లా పౌపా కలగాలంటే చల్లగ దైవం చూడాలి కావాలంటే వసారా వద్దం టే మానేస్తారా గాలిలో దీపం పెట్టి దేముడా భారము నీదే అంటే సరా మానవయత్నం జపమో తపమో చేయాలిగాని పూజా వ్రతమూ చేదాము పుణ్యక్షేత్రాల్ చూదాము పూజావద్దు పుణ్యం వద్దు పొండీ, నాతో మాటాడకండి. ఎందుకే నామీద కోపం ?
జగదభిరాముడు శ్రీరాముడే పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల (సీనియర్) గానం: ఘంటసాల, మల్లిక్, పి. లీల, పి.సుశీల జయజయరాం జయరఘురాం జయజయరాం జయరఘురాం జగదభిరాముడు శ్రీరాముడే రఘుకులసోముడు ఆ రాముడే జగదభిరాముడు శ్రీరాముడే రఘుకులసోముడు ఆ రాముడే జగదభిరాముడు శ్రీరాముడే జనకుని మాటల తలపై నిలిపి తన సుఖముల విడి వనితామణితో వనములకేగిన ధర్మావతారుడు జగదభిరాముడు శ్రీరాముడే కరమున ధనువు శరములు దాలిచి కరమున ధనువు ఆ... ఆ... కరమున ధనువు శరములు దాలిచి ఇరువది చేతుల దొరనే కూలిచి సురలను గాచిన వీరాధివీరుడు జగదభిరాముడు శ్రీరాముడే ఆలుమగల అనురాగాలకు ఆలుమగల అనురాగాలకు పోలిక సీతారాములే యనగ పోలిక సీతారాములే యనగ వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు జగదభిరాముడు శ్రీరాముడే ఆ... ఆ... ఆ... నిరతము ధర్మము నెరపి నిలిపి ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... నిరతము ధర్మము నెరపి నిలిపి నరులకు సురలకు తరతరాలకు వరవడియైన వరయగ పురుషుడు జగదభిరాముడు శ్రీరాముడే బృందము: ఇనకులమణి సరితూగే తనయుడు అన్నయూ ప్రభువు లేనేలేడని ఇనకులమణి సరితూగే తనయుడు అన్నయూ ప్రభువు లేనేలేడని జనులు భజించే పురుషోత్తముడు జగదభిరాముడు శ్రీరాముడే రఘుకులసోముడు ఆ రాముడే జగదభిరాముడు శ్రీరాముడే జయజయరాం జయరఘురాం జయజయరాం జయరఘురాం జయజయరాం జయరఘురాం జయజయరాం జయరఘురాం
రామకథను వినరయ్యా పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల (సీనియర్) గానం: పి.లీల, పి.సుశీల రామాయణగానం 1 రామకథను వినరయ్యా రామకథను వినరయ్యా ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా సా కీ: అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు ఆ రాజుకు రాణులు మువ్వురు కౌసల్య సుమిత్ర కైకేయి నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆ...ఆ...ఆ...ఆ...ఆ రామకథను వినరయ్యా ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా ఘడియ ఏమి రఘురాముని విడచి గడుపలేని ఆ పూజని కౌశిక యాగము కాచి రమ్మని కౌశిక యాగము కాచి రమ్మని పలికెను నీరదశ్యాముని రామకథను వినరయ్యా తాటకి దునిమి జన్నము గాచి తపసుల దీవన తలదాల్చి జనకుని యాగము చూచు నెపమ్మున జనకుని యాగము చూచు నెపమ్మున చనియెను మిథిలకు దాశరథి రామకథను వినరయ్యా మదనకోటి సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే మురిసినది ధరణిజ మదిలో మెరసిన మోదము ఆ...ఆ...ఆ...ఆ...ఆ ధరణిజ మదిలో మెరసిన మోదము కన్నుల వెన్నెల వీచినది రామకథను వినరయ్యా హరుని విల్లు రఘునాథుడు చేగొని ఎక్కిడ ఫెళ ఫెళ విరిగినది కళకళలాడే సీతారాముల ఆ...ఆ...ఆ...ఆ...ఆ కళకళలాడే సీతారాముల ఆ...ఆ...ఆ...ఆ...ఆ కళకళలాడే సీతారాముల ఆ...ఆ...ఆ...ఆ...ఆ కళకళలాడే సీతారాముల కన్నులు కరములు కలిపినవి రామకథను వినరయ్యా ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా
హరుని విల్లు రఘునాథుడు సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం గానం: పి.లీల, పి.సుశీల హరుని విల్లు రఘునాథుడు చేకొని ఎక్కిడ పెళ పెళ విరిగిన దీ కళకళలాడే సీతరాముల. కన్నులు కరములు కలసిన వీ
వినుడు వినుడు రామయణ గాథ పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల (సీనియర్) గానం: పి. లీల, పి. సుశీల రామాయణగానం 2 ఓ...ఓ...ఓ... వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా ఆలపించినా ఆలకించినా ఆనందమొలికించే గాథ వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా శ్రీరాముని రారాజు సేయగా కోరెను థశరధ భుజాని పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని ఆ...ఆ...ఆ... పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని కారు చిచ్చుగా మారెను కైక మంథర మాట విని మంథర మాట విని వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా అలుక తెలిసి ఏతెంచిన భూపతి నడిగెను వరములు ఆ తన్వి జరుపవలయు పట్టాభిషేకము భరతునికీ పృధివి మెలగవలయు పదునాలుగేడులు రాముడు కారడవి చెలియ మాటకు ఔను కాదని పలుకడు భూజాని కూలే భువి పైని... ఎం వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా కౌసలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి మోసమెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి దోషమనీ వెనుదీసె తమ్ముని రాముడు నయశాలి వనవాస దీక్షకు శెలవు కోరి పినతల్లి పాదాల వ్రాలి ఆ...ఆ...ఆ...ఆ... వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడు నీడగా వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడు నీడగా గోడుగోడునా అయోధ్య ఘొల్లుమన్నది ఆ... వీడకుమా మనలేనని వేడుకొన్నది ఆ... అడుగుల బడి రాఘవా... అడుగుల బడి రాఘవా ఆగమన్నది ఆగమన్నది ఆగమన్నది అడలి అడలి కన్నీరై అరయుచున్నది
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల (సీనియర్) గానం: పి. లీల, పి. సుశీ రామాయణగానం 3. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా చెలువు మీర పంచవటి సీమలో తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో తన కొలువు తీరె రాఘవుడు భామతో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా రాముగని ప్రేమగొనె రావణు చెల్లి ముకుచెవులు కోసె సౌమిత్రి రోసిల్లి రావణుడా మాట విని పంతము పూని మైథిలిని కొనిపోయె మాయలు పన్ని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమ నృపు జేసెను సుగ్రీవుని రామవచన మహిమ ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపుల హనుమంతుడు లంక జేరి వెదకెను నలుదిశలా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా ఆ... నాథా...రఘునాధా...పాహి పాహి పాహి అని అశోకవనిని శోకించే సీత పాహి అని అశోకవనిని శోకించే సీత దరికి జని ముద్రికనిడి తెలిపె విభుని వార్త ఆ జనని శిరోమణి అందుకొని పావని ఆ జనని శిరోమణి అందుకొని పావని లంక కాల్చి రాముని కడకేగెను రివ్వు రివ్వు మని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి అతని తమ్ముని రాజుని చేసి సీతను తెమ్మని పలికె చేరవచ్చు ఇల్లాలిని చూసి శీలపరీక్షను కోరె రఘుపతి అయోనిజపైనే అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరీక్ష పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత కుతవాహుడు చల్లబడి శాంతించెను మాత కుతవాహుడు చల్లబడి శాంతించెను మాత సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా వినుడోయమ్మా వినుడోయమ్మా శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం అజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి రామ సుగుణధామా రఘువంశజలధిసోమా శ్రీరామా సుగుణధామా సీతామనోభిరామా సాకేతసార్వభౌమా శ్రీరామా సుగుణధామా మందస్మిత సుందర వదనారవింద రామా ఇందీవర శ్యామలాంగ వందితసుత్రామా మందార మరందోపమ మధురమధురనామా మందార మరందోపమ మధురమధురనామా శ్రీరామ సుగుణధామా రఘువంశజలధిసోమా శ్రీరామా సుగుణధామా అవతారపురుష రావణాధి దైత్యవిరామా నవనీత హృదయ ధర్మ నిరతరాజలరామా పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా శ్రీరామ సుగుణధామా రఘువంశజలధిసోమా సీతామనోభిరామా సాకేతసార్వభౌమా సీతామనోభిరామా...
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: Traditional గానం: పి. లీల, పి. సుశీల శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్ ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి ||
రామ సుగుణధామ పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం గానం: పి.లీల, పి.సుశీల రామ సుగుణధామ రఘువంశ జలథి సోమ సీతా మనోభిరామ సాకేత సార్వభౌమ మందస్మిత సుందర వదనారవింద రామ ఇందీవర శ్యామలాంగ వందిత సుత్రామ మందార మరందోపమ మధుర మధుర నామ అవతార పురుష రావణాది దైత్య విరామా నవనీత హృదయ ధర్మనిరత రాజలలామా' పవమాన తనయ సన్నుత పరమాత్మ పరంధామా
రంగారు బంగారు చెంగావులు పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: కంకంటి పాపరాజు గానం: ఘంటసాల నీ॥ రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి నారచీర లూనె భూజనంబులు మెచ్చు భోజనంబు లొనర్చు కమలాక్షి కందమూలములు నమలే చంద్రకాంత విశాల చంద్రశాలల నుండు జవ్వని ముని పర్ణశాల నుండె మరులుతో శ్రీరాము నురముపైఁ బవళించు బాలికామణి యొంటి పవ్వళించె గన్ను సన్నల శుదాంతకాంత చ రించు సేవలు మెచ్చని కాంచనాంగి యొగ్గె మునిముగ్ద కాంతాకృతోపచార విధికి, నెంచ నసాధ్యంబు విధికి గలదె.
సందేహించకుమమ్మా రఘురామ ప్రేమను పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల (సీనియర్) గానం: ఘంటసాల సందేహించకుమమ్మా రఘురామ ప్రేమను సీతమ్మ సందేహించకుమమ్మా రఘురామ ప్రేమను సీతమ్మ సందేహించకుమమ్మా ఒకే బాణము ఒకటే మాట ఒక్క భామకే రాముని ప్రేమ ఒకే బాణము ఒకటే మాట ఒక్క భామకే రాముని ప్రేమ మిన్నే విరిగిపడినా...ఆ...ఆ...ఆ... మిన్నే విరిగిపడినా వ్రతభంగమ్ము కానీడమ్మా సందేహించకుమమ్మా రఘురామ ప్రేమను సీతమ్మ సందేహించకుమమ్మా రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు నాదు జపము తపము నా కావ్యమ్మో వృధయగునమ్మా నాదు జపము తపము నా కావ్యమ్మో వృధయగునమ్మా సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మ
అశ్వమేధ యాగానికి పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల, మాధవ పెద్ది, రాణి, రాఘవులు, సరోజిని అశ్వమేధ యాగానికి జయము జయము జయము రామయ్య తండ్రి రాజ్యానికి శుభము శుభము శుభము మధురమైన సమయమిదీ మరపురాని సమయమిదీ మనోవాంఛలన్నీ దీర్చు బలేమంచి సమయమిదీ సర్వేజనాస్సుఖినో భవంతు ! = ప్రజా క్షేమమునకు క్రతువు జరుగుచున్నది హరి ఓం... సర్వ పాపములు నేటితో సమయుచున్నవీ హరి ఓం... దిక్పాలకులారా ఓ దేవదేవులారా దివ్యమైన మీ వాక్కుల దీవించండి పాడి వంటలతో దేశం వరిలాలీ సౌభాగ్యంతో ప్రజలంతా తులతూగాలీ రఘువంశము కీ ర్తి దిశల రాణ కెక్కాలీ రాజలోక మెల్ల తలలువంచి మ్రొక్కాలీ మంగళమగు మంగళమగు మహాయోధులారా విభుని ఋణము దీర్చుకోండి వీరపుత్రులారా అవమానం రాకుండా అపజయమ్ము లేకుండా విజయమైన మరణమైన వెనుదీయక గెల్చిరండి అశ్వమునకు వెన్నుగాచి తిరుగుచుందుము హరి హరాదు లడమైన లెక్కచెయ్యము మిన్ను విరిగి పైబడినా మేరువు తలక్రిందైనా ధైర్యము విడనాడము శౌర్యము గోల్పోవము
సవనాశ్వం బిది, వీరమాతయగు (పద్యం) సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం గానం: పి. సుశీల మ॥ సవనాశ్వం బిది, వీరమాతయగు కౌసల్యా సుతుండైన యా భువనాధీశుడు ధర్మమూర్తి రఘురాముం డశ్వమేధంబు సం స్తవనీయంబు సేయ రక్షకుడుగా శత్రుఘ్ను దేతెంచె, వీ ర వరుల్ గల్గిన పట్టు డీ హయము, లేరా భక్తి కేల్మోడ్పుడి.
హ్రీం కారాసన గర్భితానల (పద్యం) సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: గానం: పి. సుశీల శ్లో॥ హ్రీం కారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రిణేత్రోజ్జ్వలామ్ వందే పుస్తక పాశమంకుశ ధరాం స్రగ్భూషితా ముజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ ॥
ఇను డస్తాద్రికి జేరకుండ సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: గానం: పి. లీల ఇను డస్తాద్రికి జేరకుండ, రివు రాజేంద్రున్నిరోధించి, నే ఘన దోర్దండ పరాక్రమర్రి మమునన్ గర్వాంధునిన్ ద్రుంచి, నా యనుజన్మున్ విడిపించి తెచ్చెద, త్వదీయాంధ్రోద్వయంబాన. నీ వనుమానింపక సత్వరంబనుపుమమ్మా. నన్ను దీవింపుమా.
కడగి నే మనోవాక్కాయ సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: గానం: పి. సుశీల కడగి నే మనోవాక్కాయ కర్మలందు పతి పదాంబుజ భక్తి తత్పరత తప్ప అన్యమెరుగని యిల్లాలి నాదుని మించి విజయంబు నీకు సిద్ధించుగాక
దక్కెను చాలకుండని రధంబున పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: గానం: పి.లీల ఉ|| దక్కెను చాలకుండని రధంబున నెత్తుకపోవ జూతువా, ఎక్కడి కెందుపోగల వహీన పరాక్రముడి కుశుండు, నీ టక్కరి సాగనిచ్చునే. హుటాహుటి నీవిక పోవవచ్చునే, చిక్కితి వింక చిత్రవధ చేసెదరమ్ము నృపాలకాధమా:
తండ్రి పంపుననేగి తాటక బరిమార్చి పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం గానం: ఘంటసాల, పి.లీల, పి. సుశీల తండ్రి పంపుననేగి తాటక బరిమార్చి తపసియాగము గాచే ధర్మమూర్తి ఆడుదానిని జంపె నదియేటి ధర్మంబు చెప్పు కొనుటకైన సిగ్గులేదే శివధనుః ఖండన మవలీల గావించె భుజబలశాలియా పుణ్యమూర్తి పుచ్చిన విలుద్రుంప భుబబలంబగునయ్య దంభంబులిక చాలు తగ్గవయ్య వరపరాక్రముడైన వాలిని తెగటార్చి సూర్యనందనుబ్రోచె శౌర్యధనుడు చాటు మాటున దాగి శాఖాచరుని ద్రుంచె శౌర్య లక్షణమిదా చాలునయ్య దశకంఠు దునుమాడి తమ్ముని గాపాడె కారుణ్యమూ ర్తి రాఘవ విభుండు గర్భవతిని సతిని కానల బోద్రోలె కఠినాత్ము డతనికి కరుణ గలదె బాలురకు ధర్మసూక్ష్మ మే పగిది తెలియు తప్పు శ్రీరాము నెదిరింప తగదు మీకు ఎర్ర గురివింద తన నలు పెరుగనట్లు చెప్పుచున్నావు మీరాము గొప్పలెల్ల చాలు చాలింక ధర్మ పన్నాలుమాని చేవగలదేని యుద్ధంబు నేయవయ్య
లేరు కుశలవుల సాటి పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సముద్రాల (సీనియర్) గానం: పి. లీల, పి. సుశీల లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారునిలో లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారునిలో లేరు కుశలవుల సాటి తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్ను కాయగా వెరువగనేలా ఆ... ఆ...ఆ... ఆ...ఆ...ఆ... తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్ను కాయగా వెరువగనేలా భయమును విడవమురా... లేరు కుశలవుల సాటి బీరములాడి రాముని తమ్ములు తురమున మాతో నిలువగలేక బీరములాడి రాముని తమ్ములు తురమున మాతో నిలువగలేక పరువము మా సిరిగా పరువము మా సిరిగా లేరు కుశలవుల సాటి పరాజయమ్మే ఎరుగని రాముని రణమున మేమే గెలిచితిమేమి పరాజయమ్మే ఎరుగని రాముని రణమున మేమే గెలిచితిమేమి యశమిక మాదేగా... ఆ...ఆ...ఆ యశమిక మాదేగా...ఆ...ఆ...ఆ యశమిక మాదేగా...ఆ...ఆ...ఆ లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారునిలో లేరు కుశలవుల సాటి
శ్రీ బాలవృద్ధుల తెగవేయబూనుట పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం గానం: ఘంటసాల, పి.లీల, పి. సుశీల శ్రీ బాలవృద్ధుల తెగవేయబూనుట పాడిగాదని వెనుకాడుచుంటి తాటక చంపుచో 'మేటికీ ధర్మంబు తలపలేదో చెప్పగలవటయ్య ముక్కు పచ్చారని ముని కుమారులు చంప కూడదటంచు నే గొంకుచుంటి రిపులపై నెవరైన కృపవహింతు రటయ్య కొంకు కాదది మీకు జంకుగాని రాముడు: గీ॥ చిన్నిపాపలు కడసారి చెప్పుచుంటి తురగమును వీడి రణభూమి తొలగి పొండి. లవ కుశులు వారువమెకాదు మిముకూడ వదలమయ్య రణమొ శరణమొ చెప్పుమా రామచంద్రా॥
శ్రీరామ పరంధామా జయరామ పరంధామా పాట సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: వెంపటి సదాశివబ్రహ్మం గానం: రాఘవులు, వై దేహి , కోమల, సౌమిత్రి జయజయరాం జయజయరాం శ్రీరామ పరంధామా జయరామ పరంధామా (2) రఘురామ రామ రణరంగభీమ జగదేక సార్వభౌమ శ్రీరామ పరంధామా జయరామ పరంధామా చరణం: 1 సూర్యాన్వయాభి సోమ సుగుణాభి రామా శుభ నామా (2) కారుణ్యధామా దశకంఠవిరామా రాఘవ రాజా లలామా శ్రీరామ పరంధామా జయరామ పరంధామా చరణం: 2 సాకేతపురాధిప రామా సీతామనోహరా శ్రీరామా (2) అరవిందలోచన సుందర సురుచిర ఇందీవరా శ్యామా శ్రీరామ పరంధామా జయరామ పరంధామా రఘురామ రామ రణరంగభీమ జగదేక సార్వభౌమ శ్రీరామ పరంధామా జయరామ పరంధామా జయజయరాం జయరఘురాం జయజయరాం జయరఘురాం జయజయరాం...
రామస్వామి పదాంబుజంబ (పద్యం) సాహిత్యం
చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల సాహిత్యం: కంకంటి పాపరాజు గానం: పి. సుశీల శా॥ రామస్వామి పదాంబుజంబు లేద నారాధింతునేనిన్ సదా రామాజ్ఞిన్ జరియింతునేని దగు జాగ్రత్స్వప్న సుప్త్యాదులన్ రామున్ దప్పని దాననౌటయు యధార్థంలేని నా తల్లి యో భూమీ, యీయెడ ద్రోవజూపి ననుఁ గొంపోవమ్మ నీలోనికిన్