చిత్రం: లవ్ ఇన్ సింగపూర్ (1980)
సంగీతం: శంకర్ - గణేష్
సాహిత్యం: సినారె
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: రంగనాథ్ , చిరంజీవి , లత సేతుపతి
దర్శకత్వం: ఓ.యస్.ఆర్
నిర్మాత: యమ్.వెంకటరమణకుమార్
విడుదల తేది: 29.09.1980
పల్లవి:
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
చ..చ..చచ...చ..చచ...
ఈ ముద్దు తొలి ముద్దు ఇంకెప్పుడు ఆపద్దు
ఇవ్వాలి ఏ పొద్దు ఇలాగే...
నా పెదవి ముద్దంటే... నీ పెదవి వద్దంటే
ఆ పైనా రామాహరే....
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
చరణం: 1
చినికి చినికి గాలి వాన ఐనట్టు
నీ చిలిపి మనసు చేరింది పై మెట్టు
ఇప్పుడేమైనది... ఇంక ముందున్నది
ఇప్పుడేమైనది... ఇంక ముందున్నది
చెప్పమంటావా భామా హరే...
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
చ..చ..చ....
ఈ ముద్దు తొలి ముద్దు ఇంకెప్పుడు ఆపద్దు
ఇవ్వాలి ఏ పొద్దు ఇలాగే...
నా పెదవి ముద్దంటే... నీ పెదవి వద్దంటే
ఆ పైనా రామాహరే....
చరణం: 2
గోడెగిత్త చేని వెంట పడినట్టు...
నా వేడి వయసు ఉరుకుతుంది నీ చుట్టు
కోడె పొగరుంటేమీ... వేడి వయసైతేమీ
కోడె పొగరుంటేమీ... వేడి వయసైతేమీ
కట్టి వేస్తాను భామా హరే...
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
చ..చ..చచ...చ..చచ...
ఈ ముద్దు తొలి ముద్దు ఇంకెప్పుడు ఆపద్దు
ఇవ్వాలి ఏ పొద్దు ఇలాగే...
నా పెదవి ముద్దంటే... నీ పెదవి వద్దంటే
ఆ పైనా రామాహరే....
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
చ..చ..చచ...చ..చచ...
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛా ..
******** ******** *******
చిత్రం: లవ్ ఇన్ సింగపూర్ (1980)
సంగీతం: శంకర్ - గణేష్
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
పల్లవి:
పరువాల పందిట్లో... సరసాల సందిట్లో
నీ పడుచు కౌగిట్లో... నా ముద్దుముచ్చట్లు
ఆ ముద్దుముచట్లో.. గడవాలి నా పొద్దు
ఆ ముద్దుముచట్లో.. గడవాలి నా పొద్దు
చలిగాలి కుంపట్లో... చెలిగాడి గుప్పెట్లో
ఏడెక్కే ఎన్నెట్లో... డీడిక్కి అన్నట్టు
డీడిక్కి అన్నట్లే... గడవాలి నా పొద్దు
డీడిక్కి అన్నట్లే... గడవాలి నా పొద్దు
పరువాల పందిట్లో... సరసాల సందిట్లో
చరణం: 1
జాజులు రువ్విన జాబిలి ఎండల్లో... లాలలల
విరజాజులు విరిసిన నా చెలి గుండెల్లో... లాలలలాల
దాచిన దాగని నీ చలి మోజుల్లో... లాలలలల
తొలి వెచ్చని కౌగిట వేసవి రోజుల్లో... లాలలలల
కౌవ్వింతే ఒక రవ్వంత... లలలల
కలిగింది ఒక రాత్రంతా... లలలల
పులకింతే మణిపూసంతా... లలలల
మిగలాలి మన జన్మంతా... లలలల
చల్లరిపోదంట... తెల్లారనీదంట... ఈ మంట ఇప్పట్లో
చల్లరిపోదంట... తెల్లారనీదంట... ఈ మంట ఇప్పట్లో
పరువాల పందిట్లో... సరసాల సందిట్లో
నీ పడుచు కౌగిట్లో... నా ముద్దుముచ్చట్లు
డీడిక్కి అన్నట్లే... గడవాలి నా పొద్దు
డీడిక్కి అన్నట్లే... గడవాలి నా పొద్దు
చరణం: 2
కోయిల పాడిన తీయని పాటల్లో... లలలల
మది లోయల ఊయల ఊగిన వయసుల్లో... లలలల
అల్లరి కోరికలల్లిన తోటల్లో... లలలల
మరు నిద్దర మరచిన ఇద్దరి మనసుల్లో... లలలల
ఒళ్లంత ఒక తుళ్ళింతా... లలలల
పలికింత తొలి గిలిగింతా... లలలల
వయసెంతో.. ఇక మనసంతా... లలలల
విరిసంతే మన వయసంతా... లలలల
అల్లారు ముద్దంట.. ఆగేది కాదంట.. ఈ గంట ఇప్పట్లో
అల్లారు ముద్దంట.. ఆగేది కాదంట.. ఈ గంట ఇప్పట్లో
చలిగాలి కుంపట్లో... చెలిగాడి గుప్పెట్లో
ఏడెక్కే ఎన్నెట్లో... డీడిక్కి అన్నట్టు
ఆ ముద్దుముచట్లో.. గడవాలి నా పొద్దు
ఆ ముద్దుముచట్లో.. గడవాలి నా పొద్దు